వైద్య కళాశాల
వైద్య కళాశాల, (Medical Colleges) ప్రపంచ వ్యాప్తంగా వైద్య విద్య (Medical Education) ను అందించి, వైద్యుల్ని సుశిక్షితుల్ని చేసే విద్యాలయాలు (Educational Institutions). వీటిని అనుబంధంగా కొన్ని పెద్ద వైద్యశాలలు (Hospitals) ఉంటాయి.
సాధారణంగా వైద్య కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పి.హెచ్.డి. సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది. వైద్యవిద్యలో బోధించే కొన్ని విద్యావిభాగాలు (సబ్జెక్టులు) - హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్‌టెట్రిక్స్, గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం). ఇవే కాకుండా గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకై ప్రత్యేక విభాగాలుంటాయి.
ప్రవేశం
[మార్చు]ప్రపంచ వ్యాప్తంగా వైద్యకళాశాలలో ప్రవేశానికి అర్హతలు, ప్రవేశ విధానం, బోధనా విధానం, కోర్సు ప్రణాళిక వంటి విషయాలలో పెక్కు వైవిధ్యాలున్నాయి. ఏమైనా వైద్యకళాశాలలలో ప్రవేశం ప్రపంచమంతటా చాలా ఎక్కువ పోటీ కలిగి ఉంటుంది. ప్రవేశానికి ఎంసెట్, GAMSAT, MCAT, UMAT, NMAT, BMAT, UKCAT వంటి అనేక ప్రవేశ పరీక్షలు నిర్వహింపబడుతాయి. భారతదేశం, చైనా, మరికొన్ని దేశాలలో వైద్యకళాశాలలలో ప్రవేశం "ప్రి యూనివర్సిటీ కోర్సు" తరువాత జరుగుతుంది. అయితే అమెరికా, కెనడా వంటి దేశాలలో ఒక డిగ్రీ కోర్సు తరువాత వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ "గ్రాడ్యుయేట్ ఎంట్రీ విధానం" క్రమంగా ప్రవేశపెట్టబడుతున్నది. దాదాపు అన్ని దేశాలలోను వైద్య విద్య, వైద్యవృత్తులపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ ప్రబలంగా ఉంటుంది. వైద్య విద్య పూర్తి చేసినా గాని ప్రభుత్వం ప్రత్యేక లైసెన్సు ఇచ్చిన తరువాతనే వైద్యవృత్తి ప్రాక్టీసు అనుమతించబడుతుంది. వైద్య కళాశాలలు WHO Directory of Medical Schools లేదా FAIMER లేదా International Medical Education Directory వంటి ప్రామాణిక జాబితాలలో ఉండడం వాటి గుర్తింపుకు అవసరం.
భారతదేశంలో వైద్య కళాశాలలో ప్రవేశం సిబిఎస్ఇ లేదా ఇంటర్మీడియెట్ విద్యల తరువాత అనుమతించబడుతుంది. కాని ప్రవేశానికి గుర్తింపబడిన ప్రవేశపరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ పరీక్షలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. భారతదేశంలో వైద్యకళాశాలలు ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్. వంటి డిగ్రీలను ప్రదానం చేస్తాయి. భారతదేశంలో వైద్యవిద్య "మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా"చే నియంత్రింపబడుతుంది.[1]పిజి డిప్లొమా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా పొందవచ్చు.[2]
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలు
[మార్చు]- ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నం.
- ఉస్మానియా వైద్య కళాశాల, హైదరాబాదు.
- కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు.
- గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు.
- రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ.
- శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల, తిరుపతి.
- సిద్ధార్ధ వైద్య కళాశాల, విజయవాడ.
- ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.
- పిన్నమనేని సిద్దార్ధ వైద్య విజ్ఞాన సంస్థ, విజయవాడ.
- నారాయణ వైద్య కళాశాల, నెల్లూరు.
- కాటూరి వైద్య కళాశాల, గుంటూరు.
- మహారాజా వైద్య విజ్ఞాన సంస్థ, విజయనగరం.
- కోనసీమ వైద్య విజ్ఞాన సంస్థ, అమలాపురం.
- పి.ఇ.ఎస్. వైద్య విజ్ఞాన సంస్థ, కుప్పం.
- అల్లూరి సీతారామరాజు వైద్య విజ్ఞాన సంస్థ, ఏలూరు.
- జి.ఎస్.ఎల్. వైద్య కళాశాల, రాజమండ్రి.
తెలంగాణలో వైద్య కళాశాలలు
[మార్చు]- కాకతీయ వైద్య కళాశాల, వరంగల్.
- గాంధీ వైద్య కళాశాల, హైదరాబాదు.
- మమత వైద్య కళాశాల, ఖమ్మం.
- భాస్కర వైద్య కళాశాల, మొయినాబాద్
- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్), హైదరాబాదు.
- దక్కన్ వైద్య విజ్ఞాన కళాశాల, హైదరాబాదు.
- మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ, ఘనాపూర్.
- కామినేని వైద్య విజ్ఞాన సంస్థ, నార్కట్ పల్లి.
- ఎస్.వి.ఎస్. వైద్య కళాశాల, యెనుగొండ.
- ఎమ్.ఎన్.ఆర్. వైద్య కళాశాల, సంగారెడ్డి.
- ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, కరీంనగర్.
- క్రిష్టియన్ వైద్య కళాశాల, నిజామాబాదు.
- శాదన్ వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాదు.
- వర్ధమాన్ వైద్య కళాశాల, కరీంనగర్.
- ఉస్మానియా వైద్య కళాశాల
- తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి తెలంగాణ వైద్య విధాన పరిషత్తు
- మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల
- నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల
- సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల
- రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ
- ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల
కర్ణాటక వైద్య కళాశాలలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశంలో వైద్య విద్య
- భారతదేశంలో వైద్య కళాశాలలు
- వైద్యశాస్త్రం
- విద్య
- వైద్య విద్య
- వైద్యుడు
- ఆరోగ్యం
- సాయుధ దళాల వైద్య కళాశాల
మూలాలు
[మార్చు]- ↑ "Medical Council of India: Home Page". Archived from the original on 2009-11-03. Retrieved 2020-12-29.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-30. Retrieved 2009-04-01.
బయటి లింకులు
[మార్చు]- Association of American Medical Colleges
- American Association of Colleges of Osteopathic Medicine
- American Medical Student Association
- Medical College Admission Test[permanent dead link]
- US News & World Report 2008 Medical School Research Rankings
- UK Clinical Aptitude Test
- Medical School Interview Guide
- British Medical Association
- Russia medical education
- Council of Heads of UK Medical Schools
- UK Application Process
- IFMSA