యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్
స్థాపన తేదీజూలై 20, 1947 (1947-07-20)
రద్దైన తేదీ1955 (1955)
విభజనమిజో యూనియన్
విలీనంఈస్ట్రన్ ఇండియన్ ట్రైబల్ యూనియన్
రాజకీయ విధానంబర్మాతో లుషాయ్ హిల్స్ ఏకీకరణ

యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ అనేది మిజోరంలోని రాజకీయ పార్టీ. యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ 1947, జూలై 20న స్థాపించబడింది.[1] మిజో యూనియన్ నుండి విడిపోయింది.[2] భారత స్వాతంత్ర్యం సమయంలో, యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్ద రాజకీయ శక్తి.

లుషాయ్ కొండలను బర్మాతో ఏకం చేయడం అనేది యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ డిమాండ్ గా ఉండేది.

1952 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో (ఆ సమయంలో లుషాయ్ హిల్స్ ఇందులో భాగంగా ఉంది), యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది, వారిలో ఎవరూ ఎన్నిక కాలేదు. మొత్తంగా, పార్టీకి 9070 ఓట్లు (ఆ మూడు నియోజకవర్గాల్లో 23.76% ఓట్లు) వచ్చాయి.[3]

1955లో యునైటెడ్ మిజో ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ ఈస్టర్న్ ఇండియన్ ట్రైబల్ యూనియన్‌లో విలీనమైంది.

మూలాలు

[మార్చు]
  1. S.K. Chaube (1999). Hill Politics in North-east India. Orient Longman. ISBN 9788125016953.
  2. Venkataraghavan Subha Srinivasan (27 October 2021). "The birth of Mizoram: This book details the history of how each of India's states was formed". Retrieved 30 March 2022.
  3. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Assam" (PDF). Election Commission of India. Retrieved 2014-10-13.