వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అశ్వని నక్షత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేషరాశిలో అశ్వని నక్షత్రము

నక్షత్రములలో ఇది మొదటిది.

అశ్విని నక్షత్రము గుణగణాలు[మార్చు]

అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధార్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.

నవాంశ ఆధారిత గుణాలు[మార్చు]

  • అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు.
  • అశ్వినీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యధిపతి శుక్రుడు

ఈ నక్షత్రం వారి గుణ గణాలు[మార్చు]

అశ్వని నక్షత్రము ఏపాదంలో జన్మించినవారైనా అందం పెంపొదించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు.

అశ్వినీ నక్షత్ర జాతకులకు తారాఫలాలు[మార్చు]

తార నామం తారలు ఫలం
జన్మ తార అశ్విని, మఖ, మూల శరీరశ్రమ
సంపత్తార భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ ధన లాభం
విపత్తార కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ కార్యహాని
క్షేమత్తార రోహిణి, హస్త, శ్రవణం క్షేమం
ప్రత్యక్ తార మృగశిర, చిత్త, ధనిష్ట ప్రయత్న భంగం
సాధన తార ఆరుద్ర, స్వాతి, శతభిష కార్య సిద్ధి, శుభం
నైధన తార పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర బంధనం
మిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర సుఖం
పరమ మిత్ర తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి సుఖం, లాభం

అశ్వని నక్షత్రము కొన్ని వివరణలు[మార్చు]

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
అశ్విని కేతువు దేవ పురుష అడ్డరస గుర్రం ఆది గరుడ అశ్వినీదేవతలు మేషం

అశ్విని నక్షత్రము నవాంశ[మార్చు]

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.
  • నక్షత్రానికి ఉన్న గుణలు కలిగిఉన్నా నవాంశని అనుసరించి నాలుగు పాదాల వారికి ప్రత్యేక గుణలు కొన్ని ఉంటాయి.
  • అశ్వినీ నక్షత్రము మొదటి పాదములో పుట్టిన వారు క్రీడాకారులుగా రాణిస్తారు. వీరు వీరవైద్యల అమ్దు ఆసక్తి కలిగి ఉంటారు.
  • అశ్వినీ నక్షత్రము రెండవ పాదములో పుట్టిన వారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంభందించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధవహిస్తారు.
  • అశ్వినీ నక్షత్రము మూడవపాదములో పుట్టిన వారు విద్యలయందు అసక్తి కలిగి ఉంటారు.
  • అశ్విణీ నక్షత్రము నాల్గవ పాదములో పుట్టిన వారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధతయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు.

అశ్విని నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు[మార్చు]

సంఖ్యలు[మార్చు]

  • 1, 4, 5, 9

మణి[మార్చు]

వారములు[మార్చు]

ఫలములు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

చిత్ర మాలిక[మార్చు]