Jump to content

హస్త నక్షత్రము

వికీపీడియా నుండి
(హస్త నుండి దారిమార్పు చెందింది)

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు

[మార్చు]

హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, రాస్యాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి (గేదె). ఈ నక్షత్రజాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధము చేసుకుంటారు. అడగ గనే సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు.వివాహం కొంత ఆలస్యమవచ్చు. వ్యుహాలు రహస్యము అయినా కొదరికి మాత్రము చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూరప్రాత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితములో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింప్పుకు కొంత కాలము వేచి ఉండాలి.జీవితంలో కొన్ని సంఘటనలు వలన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడము వలన వైవాహిక జీవితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.మనము ఒకటి తలచితే దైవము ఇంకొకటి తలుస్తుంది అన్నట్లు వీరికి చాలా మేరకు కలిసి రాకపోవచ్చు. సహోదరీ వర్గము పటత్ల అభిమానము కలిగి ఉంటారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. సంతానము పేరు ప్రతిష్తలు తెస్తారు.

హస్తా నక్షత్ర వివరాలు

[మార్చు]

నక్షత్రములలో ఇది 13వ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
హస్త చంద్రుడు దేవ పురుష మహిషము కుంకుడు ఆది గద్ద సూర్యుడు కన్య

హస్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార రోహిణి, హస్త, శ్రవణం శరీరశ్రమ
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ ధన లాభం
విపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్యహాని
సంపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర క్షేమం
ప్రత్యక్ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ప్రయత్న భంగం
సాధన తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్య సిద్ధి, శుభం
నైత్య తార అశ్విని, మఖ, మూల బంధనం
మిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం
అతిమిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం, లాభం

హస్థనక్షత్రము నవాంశ

[మార్చు]
  • 1 వ పాదము - Kanya raasi
  • 2 వ పాదము - Kanya raasi
  • 3 వ పాదమ - Kanya raasi
  • 4 వ పాదము - Kanya raasi

ఇతర వనరులు

[మార్చు]