వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పటములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిల్లా సమాచారపెట్టెలను Infobox settlement తో తాజాచేయటం[మార్చు]

YesY సహాయం అందించబడింది

కొత్త మూస {{Infobox settlement}} తెలుగు వికీలో కొన్ని చోట్ల వాడడమైనది. {{భారత స్థల సమాచారపెట్టె}} కు బదులుగా కొత్త మూస వాడిన వారు వారి అనుభవాలను పంచుకోమని కోరడమైనది.నేను పరిశీలించితే పూర్తి స్థానికీకరణ ఇంకా కానట్లుంది. అది తెలంగాణకు సంబంధించి పటము (pushpin map) హద్దులను మరియు మేప్ ను ఏ విధంగా తీసుకుంటుందో అర్ధం కాలేదు.తెలంగాణా లో స్థానం సరిగా చూపెడుతుందా? User:వైజాసత్య, User:C.Chandra Kanth Rao ఇంకావాడినవారెవరైనా స్పందించవలసినది.--అర్జున (చర్చ) 12:58, 18 మార్చి 2015 (UTC)మూసలను

నగరానికి ఉదాహరణ నల్గొండ. --అర్జున (చర్చ) 13:13, 18 మార్చి 2015 (UTC)
అర్జునరావుగారూ, నగరాలలో ఉన్న తెలంగాణ pushpin map బాగానే ఉంది కాని జిల్లాలలో బేస్‌మ్యాప్ లో స్థానం సరిగా చూపించడం లేదు. (ఉదా: మెదక్ జిల్లా) వాటిని సరిచేయగలరా. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:09, 18 మార్చి 2015 (UTC)
@అర్జున, @User:C.Chandra Kanth Rao, ప్రామణీకరణలో భాగంగా ఆంగ్లవికీలో {{భారత స్థల సమాచారపెట్టె}} మూసలన్నింటినీ {{Infobox settlement}} మూసలకు మార్చేస్తున్నారు. నేను ఇటీవల సృష్టించిన ఈ దారిమార్పు పేజీ వళ్ళ మూస:Location map India తెలంగాణ, మరియు ఈ మార్పు వళ్ళ మండలాల్లో, గ్రామాల్లో తెలంగాణ పటాలకున్న సమస్య తీరిపోయింది. కానీ ఇవన్నీ {{సమాచారపెట్టె ఆవాసము}} పై ఆధారపడి ఉన్నవి. ఇంకా నేనేం చేశానో సరిగా గుర్తిచేసుకొని ఇంకాకొంత వ్రాస్తాను --వైజాసత్య (చర్చ) 22:02, 18 మార్చి 2015 (UTC)
@User:C.Chandra Kanth Rao, తెలంగాణ జిల్లాల పేజీల్లో పటాలు - జిల్లాల్లో ఉన్నవి మామూలు పటాలు, ప్రదేశసూచికా పటాలు కాదు. అందువళ్ల సరైన స్థానంలో చూపించడం లేదు. పటంలో జిల్లాను రంగుతో గుర్తిస్తూ, అదే పటంపై జిల్లా కేంద్రాన్ని సూదిగుచ్చి చూపించాలంటే, File:Location_map_India_Telangana_(blank).svg పటాన్ని ఆధారంగా చేసుకొని వివిధ జిల్లాలకు పటాలు తయారుచెయ్యాలి. వ్యాసం జిల్లా గురించి అయినందున, జిల్లా కేంద్రాన్ని ఆంగ్ల వికీలో సాధారణంగా సూదిగుచ్చి చూపించలేదు. --వైజాసత్య (చర్చ) 02:59, 19 మార్చి 2015 (UTC)
2013లో చాలామటుకు పేజీలు {{భారత స్థల సమాచారపెట్టె}} పై ఆధారపడకుండా చేసేందుకు నేను {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం}} తయారు చేసి అన్ని మండలాల్లో భారత స్థల సమాచారపెట్టెను తొలగించాను. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రకాంతరావు గారు అదే పద్ధతిన {{సమాచారపెట్టె తెలంగాణ మండలం}} తయారుచేశారు. ఇదే విధంగా గ్రామాలకు కూడా సమాచారపెట్టె తయారుచేసే ప్రయత్నం ఇక్కడ మరియు ఇక్కడ ప్రారంభించాను. ఆ ప్రయత్నాలు పూర్తి కాక ముందే కొందరు దాన్ని గ్రామాల వ్యాసాల్లో చేర్చటం ప్రారంభించారు (ఉదా: [1], [2] ). {{సమాచారపెట్టె ఆవాసము}} అనేది {{Infobox settlement}} మూసనే కాకపోతే చాలాపాత కూర్పు అనుకుంటాను. 2008లో మున్ముందు అప్డేట్ల గురించి పెద్దగా ఆలోచించలేదు. 2013లో అందుకే గ్రామాల సమాచారపెట్టెను కొత్తకూర్పుతో నిర్మించే ప్రయత్నం చేశాను. మొత్తానికి నా ధృక్కోణం కథ మొత్తం మళ్ళీ గుర్తుతెచ్చుకొని చెప్పేశాను..హమ్మయ్య --వైజాసత్య (చర్చ) 03:22, 19 మార్చి 2015 (UTC)
@User:వైజాసత్య, @User:C.Chandra Kanth Rao మీ స్పందనలకు ధన్యవాదాలు.నాకు ఇప్పుడు కొంచెం అర్ధమైంది. ఆంధ్ర ప్రదేశ్ విభజనతో ఇవన్నీ తాజాచేయాల్సిన అవసరం ఏర్పడింది. ముందు ఏకరూపత సాధించాలంటే అన్నింటిని నేటి {{Infobox Settlement}} తాజాకూర్పుకు మార్చడం మంచిదేనా, బాట్ తో చేయగలిగే అవకాశాన్ని పరిశీలించారా? ఇంకొన్ని నెలలలో విభజన పూర్తయి సంవత్సరం కాబోతున్నందున, ఈ కార్యక్రమము అత్యంత ప్రాధాన్యత ది గా చేసి మరికొంతమంది సహకారం తీసుకొంటే బాగుంటుందా.మీ అభిప్రాయాలు తెలియచేయండి.--అర్జున (చర్చ) 04:32, 19 మార్చి 2015 (UTC)
{{IIJ/P}}లో తగిన మార్పులు చేసాను. మెదక్ జిల్లా మరియు అదిలాబాద్ జిల్లా లలో base_map తొలగించితే ప్రదేశ సూచిక మెరుగయినట్లుంది. అది నచ్చితే అలాగే తెలంగాణ జిల్లాలలో తగిన మార్పులు చేయాలి. అలాగే కొత్త ఆంధ్రప్రదేశ్ పటము వాడే చోట్ల కు తగిన మార్పులు చేశాను ఉదా:చిత్తూరు జిల్లా.ఇలా చేస్తే ప్రస్తుతానికి వికీమొత్తం మూస ఏకరూపత లేకుండా పటములు సరిగా వుంటాయి అనుకుంటున్నాను.మీ అభిప్రాయం తెలపండి.--అర్జున (చర్చ) 06:43, 19 మార్చి 2015 (UTC)
జిల్లా వ్యాసాలలో సమస్య చక్కదిద్దినందుకు వైజాసత్య, అర్జున గారికి కృతజ్~తలు. అలాగే మండల వ్యాసాలలో తెలంగాణ పటంలో మండల కేంద్రాల స్థానంలో తేడా ఉన్నట్లుగా గమనించాను. ఉదా:కు కోడంగల్_మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో వాయువ్యాన కర్ణాటక సరిహద్దులో ఉండగా, పటంలో మాత్రం రంగారెడ్డి జిల్లాలోకి చొచ్చుకువెళ్ళింది. అక్షాంశ-రేఖాంశాలు కూడ సరైనవే కాబట్టి పటంలో తేడా ఉండవచ్చని భావిస్తున్నాను. మరో ఉదా: తెలంగాణలో అతి పశ్చిమాన ఉన్న మాగనూరు_మండలం కొద్దిగా కుడివైపుకు సూచిస్తున్నది. బొంరాస్‌పేట్_మండలం పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళ్ళింది. ఈ స్వల్పతేడాలు రావడానికి కారణం location mapలో అక్షాంశరేఖాంశాల కేంద్రస్థానంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా నా వద్ద ఉన్న సమాచారంతో పోల్చిచూశాను. తూర్పు రేఖాంశం మరియు ఉత్తర అక్షాంశ సరిహద్దును కొద్దిగా తగ్గిస్తే సమస్య తీరవచ్చని అనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:34, 19 మార్చి 2015 (UTC)
{{IIJ/P}} అలియాస్ {{భారత స్థల సమాచారపెట్టె}}కు సపోర్టు లేదు. ఆంగ్ల వికీలో అన్నింటినీ {{Infobox settlement}}కి తరలించి మార్చి మూసనే ఏకంగా తొలగించారు [3]. నేను భారత స్థల సమాచారపెట్టెను చాలామటుకు స్థానికరించాను, కానీ భవిష్యత్తులో దాని మీద ఆధారపడటం అంతమంచిది కాదు ఎందుకంటే దాన్ని లూవా మాడ్యూల్లతో ఆధునీకరించాలి. అంత సమయం మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతేస్థాయిలో {{Infobox Settlement}}ను స్థానీకరించే ప్రయత్నమే {{Infobox Settlement/sandbox}}. ఆంగ్లంలో బాటుతో ఈ మూస మార్పిడి పనిచేయించారు. మనమూ అదే పనిచెయ్యవచ్చు.--వైజాసత్య (చర్చ) 19:00, 19 మార్చి 2015 (UTC)

─────────────────────────

మీ స్పందనలకు ధన్యవాదాలు. తెలంగాణ పటము సరిదిద్దుటకు అభ్యర్ధన చేశాను. ఇక నేను ఎప్పటినుండో చేయాలనుకున్న తెలుగు రాష్ట్రాల భౌతిక పటము తయారైందని తెలుపుటకు సంతోషిస్తున్నాను. చూసి మీ అభిప్రాయాలు తెలపండి.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ భౌతిక పటము
మీరు చేసిన పటం చాలా బాగుంది. దీని వలన ఆయా ప్రాంతాల altitude తెలుసుకోవడానికి వీలుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:42, 20 మార్చి 2015 (UTC)
ధన్యవాదాలు. జిల్లాలలో ప్రదేశ సూచిక పటమును మార్చాను. కొత్త పటము అందినతరువాత తగిన మార్పులు చేస్తే అన్ని చోట్ల ప్రదేశ సూచిక సరిగా వుంటుంది.--అర్జున (చర్చ) 05:31, 21 మార్చి 2015 (UTC)
భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరికి ఉత్తరాన ఉంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం వ్యాసంలో జిల్లా మధ్యలో చూపిస్తోంది. ఆంగ్ల వ్యాసంలో కూడా సరైన స్థానంలో కాకుండా మనకంటే కొద్దిగా తూర్పున చూపిస్తుంది. పటాలలో లోపమున్నట్లుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:11, 28 మార్చి 2015 (UTC)

కొత్త తెలంగాణ పటము[మార్చు]

YesY సహాయం అందించబడింది

కొత్త సమదీర్ఘచతురస్ర తెలంగాణ పటము

ప్రక్కన చూపిన కొత్త పటాన్ని వాడి తగుమార్పులు చేసిన జిల్లాల పటము క్రింద ఇవ్వబడినది.

బొమ్మరాసుపేట ఇతరత్రా Locator map India తెలంగాణ వాడే చోట్ల అలాగే పాత సమాచారపెట్టి IIJ వాడే చోట్ల ఈ కొత్తబొమ్మ కనబడుతుంది. User:వైజాసత్య, User:C.Chandra Kanth Rao గార్లు మరియు ఇతర ఆసక్తిగల సభ్యులు పరిశీలించి స్పందించండి.--అర్జున (చర్చ) 06:53, 5 మే 2015 (UTC)

పోల్చటానికి జనగణన వారి అవిభక్త ఆంధ్రప్రదేశ్ పటము .--అర్జున (చర్చ) 15:30, 5 మే 2015 (UTC)
తెలంగాణ నలుమూలలా ఉన్న కొన్ని మండలాలలో ఈ పట్టాన్ని పరిశీలించాను. మునపటి పటంతో పోలిస్తే ఇది చక్కటి స్థాన సూచికలు చూపిస్తోంది. దీనికై కృషిచేసిన అర్జునగారికి కృతజ్ఞతలు-- సి. చంద్ర కాంత రావు- చర్చ 17:27, 5 మే 2015 (UTC)
సభ్యుడు:C.Chandra Kanth Raoగారి స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:07, 5 మే 2015 (UTC)
పై బొమ్మ EPSG:4326 తో చేసినది, దోషాలు తక్కువేవున్నా, సరియైన సమదీర్ఘచతురస్ర పటము చేయాలి.--అర్జున (చర్చ) 11:34, 6 ఏప్రిల్ 2019 (UTC)
పై పటాలలో కొత్త సమదీర్ఘచతురస్ర తెలంగాణ పటము కొత్త సమదీర్ఘచతురస్ర తెలంగాణ పటము తో తాజా చేయబడినవి. --అర్జున (చర్చ) 09:46, 8 ఏప్రిల్ 2019 (UTC)
జిల్లా హద్దులు .png బొమ్మవి కావున, పై రంగు పారదర్శకము చేయబడి లేతగా వున్నది.--అర్జున (చర్చ) 09:48, 8 ఏప్రిల్ 2019 (UTC)

అంతు బట్టని పటముల రూపించడంలో లోపాలు[మార్చు]

Template:IIJ వాడే ఆంధ్రప్రదేశ్ వ్యాసాలలో ప్రదేశ సూచిక పటం కనబడడం ఆగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాలేదు. (కామన్స్ బొమ్మలతో లింకులున్నందుకేమో) స్థానికంగా File:Andhra Pradesh locator map.svg ఎక్కించి సరిచేశాను. --అర్జున (చర్చ) 11:52, 5 మే 2015 (UTC)

IIJ/P వాడితే దోషాలు[మార్చు]

మూస_చర్చ:IIJ/P చూడండి. IIJ కు కాలదోషం పట్టినందున తెలుగులో Template:Infobox Settlement తో మార్చాలి. కాని పని పూర్తవలేదు. --అర్జున (చర్చ) 00:55, 29 మార్చి 2019 (UTC)

జిల్లాల వ్యాసాలలో చేర్చిన OSM పటాల స్థితి[మార్చు]

అర్జునరావు గారూ జిల్లాల వ్యాసాలనందు చేర్చిన OSM పటాలు వ్యాసాలకు, కొంత పంథా తీసుకువచ్చినట్లుగా కనపడుతుంది.కాకపోతే నాదోక చిన్న సూచన.పటాలు పొందిక సరిగా లేదనిపిస్తుంది.వ్యాసాన్ని, సమాచారపెట్టను మింగి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాకాకుండా ఇంకొద్ది తక్కువ సైజుతో సమాచారపెట్టెకు పైభాగాన ఉంటే బాగుంటుంది.లేదా సమాచారపెట్టెకు ఇదే OSM పటాలు ఎడమవైపు అలా మధ్యలో కాకుండా ఎడమవైపు ఉన్నా బాగుంటుదని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 17:21, 17 జూన్ 2019 (UTC)

యర్రా రామారావు గారి స్పందనకు ధన్యవాదాలు. పటము పెద్ద పరిమాణంలో వుంటేనే పటంలోని కొన్ని ముఖ్యమైన పట్టణాలు, రహదారులు, కనబడే అవకాశం వుంది. ఇక ప్రస్తుత కూర్పు ప్రయోగాత్మకంగా చేశాను. మీకు మెరుగనిపించినదానికి మార్చవచ్చు. చాలామంది మొబైల్ వాడుకరులకు, మన కూర్పు యదాతథంగా కనబడదు. --అర్జున (చర్చ) 04:21, 5 జూలై 2019 (UTC)
అర్జునరావు గారూ OSM పటాలు ఏ మార్పులు చేయనవసరంలేకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాసంలో "జిల్లా భౌగోళిక స్థితి చూపించు మ్యాపు" అనే విభాగంలో చూపించాను.అ మాదిరిగా చూపించవచ్చు అనుకుంటున్నాను.పరిశీలించగలరు. --యర్రా రామారావు (చర్చ) 05:27, 5 జూలై 2019 (UTC)
యర్రా రామారావు గారి సవరణ బాగానేవుంది. అయితే ప్రత్యేక విభాగంగా కాకుండా వీలైన చోట్ల మ్యాపును భౌగోళిక వివరాలు చేర్చే విభాగంలో వుంచడం మంచిది. --అర్జున (చర్చ) 05:30, 5 జూలై 2019 (UTC)

ఆంధ్రప్రదేశ్ మండలాల వ్యాసాలకు OSM గతిశీల పటములు[మార్చు]

రచ్చబండలోని వ్యాఖ్యకు నకలు.. --అర్జున (చర్చ) 04:37, 29 డిసెంబరు 2019 (UTC)

తెలుగు పేర్లతో ఆంధ్రప్రదేశ్ మండలాల సమగ్ర భౌగోళిక గతిశీల పటము విడుదల[మార్చు]

ఆంధ్రప్రదేశ్ మండలాల పటము తెలుగు పేరులతో (గతిశీల చిత్రానికి తెరపట్టు)

ఆంధ్రప్రదేశ్ మండలాలు (సంఖ్య:670) ఓపెన్ స్ట్రీట్ మేప్ లో తెలుగు పేర్లతో చేర్చబడినవని తెలియచేయుటకు సంతసించున్నాను. ప్రస్తుతం మండలాల పేర్లు తెలుగులో కనబడుతాయి. వికీపీడియాలో ఇప్పటికే తెలుగు పేర్లు గల అంశాలతో అవి అందుబాటులో లేనిచోట ఆంగ్ల పేర్లతో కనబడతాయి (చూడండి వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు). ఇటువంటి పటాలు భారత సర్వే సంస్థల ద్వారా కాని, గూగుల్ ద్వారా కాని, రాష్ట్ర స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ద్వారా కాని ఇతర వాణిజ్య సంస్థల ద్వారాకాని ఇంతవరకు సమగ్రంగా తెలుగులో అందుబాటులోలేవు. మండలాల పటములను భారత మేప్స్ ఆధారంగా OSM సంపాదకుడు హేయిన్జ్ OSM లో చేర్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దానిని వికీడేటాతో అనుసంధానం, దానికి అవసరమైన తెలుగు వికీలో మార్పులు (గ్రామాల, మండలాల వ్యాసాలు అవసరమైనచోట సరిచేయడం) ఓవర్పాస్ టర్బో, వికీడేటా క్వెరీలు తయూరు చేయడం నేను చేశాను. ఈ కృషికి ఆధారం తెలుగు వికీలో గత 12 ఏళ్లకు పైగా భౌగోళిక విషయాలపైన కృషి చేసిన సోదర,సోదరీ సభ్యులు, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జియో పోర్టళ్లు, గూగుల్ మేప్ వంటి సంస్థల సేవలు. వారందరికి నా కృతజ్ఞతలు. పక్కన వున్న చిత్ర తెరపట్టు గతిశీల చిత్రం తెరపట్టు. వికీడేటా క్వెరీ తో ప్రతి మండలానికి తెలుగు వికీ లింకు, OSM link గల పట్టిక లేక/మరియు గతి శీల చిత్రం (ఆంధ్రప్రదేశ్ మొత్తం) మరియు చూసి మీ సొంత మండలం, లేక పరిచయంగల మండలాల వివరాలను పరిశీలించి దోషాలు, మెరుగుపరచడానికి సలహాలు తెలియచేయండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:45, 9 నవంబర్ 2019 (UTC)

  • ఆంధ్రప్రదేశ్ మండలాల వ్యాసాలన్నింటికి OSM గతిశీల పటము చేర్చబడినది. (ఉదా: అంబాజీపేట మండలం) ఏమైనా దోషాలున్నచో తెలియచేయండి. --అర్జున (చర్చ) 04:54, 28 డిసెంబరు 2019 (UTC)
  • ఉదాహరణకు పై మండలం రూపంలో తేడా గురించి OSM లో చర్చ చేర్చాను. --అర్జున (చర్చ) 06:02, 28 డిసెంబరు 2019 (UTC)