సుబ్రహ్మణ్య శివ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబ్రహ్మణ్య శివ
Subramaniya Siva.png
సుబ్రహ్మణ్య శివ
జననంఅక్టోబర్ 4, 1884[1]
మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1925 జూలై 23 (1925-07-23)(వయసు 40)[2]
పప్పరపట్టి, మద్రాస్ ప్రెసిడెన్సీ, భారతదేశం
మరణానికి కారణంకుష్టు వ్యాధి
జాతీయతభారతీయుడు

సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 - జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రచయిత.[3]

జననం[మార్చు]

సుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమం లో చేరాడు.

ఉద్యమంలో[మార్చు]

ఈయన్ని 1908లో బ్రిటీష్ వారు అరెస్టు చేశారు. మద్రాసు జైలులో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను సేలం జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు రైలులో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ మరియు మాధవ విజయం పుస్తకాలు రచించాడు.[3]

గౌరవాలు[మార్చు]

సుబ్రహ్మణ్య శివ మరణానాంతరం దిండుగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తియాగి సుబ్రమణ్య శివ మాళిగైగా పేరు పెట్టబడింది. ధర్మపురి జిల్లా పెన్నగడం సమీపంలోని పప్పరపట్టి వద్ద ఒక స్మారక చిహ్నం స్థాపించబడింది.[4]

మరణం[మార్చు]

1925, జూలై 23న కుష్టువ్యాధితో చనిపోయాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Subramania Siva". tamilnation.co. Retrieved 15 August 2018.
  2. "125th Birth anniversary of Subramaniya Siva celebrated". The Hindu. 15 October 2008.
  3. 3.0 3.1 "Eminent personalities - Dharmapuri district". Government of Tamil Nadu. Retrieved 15 August 2018.
  4. "Memorial for Subramania Siva". The Hindu. 10 February 2010.