ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు
పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని పంచాయితీ రాజ్ చట్టం 1994 ద్వారా చట్టబద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి స్థానిక సంస్థల ఎన్నికలు 2020 లో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.
చరిత్ర[మార్చు]
భారత స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత 1950 లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం (1920) అమలులోకి వచ్చింది. ఆ తరువాత సమైక్య ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీ చట్టం 1964 చట్టం 1964 జనవరి 18 న అమలులోకి వచ్చింది. 1986లో మండల ప్రజాపరిషత్తులు,జిల్లా ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రణాళిక ఆభివృద్ధి సమీక్ష మండళ్లు ఆక్ట్ (Act no 310 of 1986) తయారైంది. 1994 లో మండ పరిషత్తు నిర్మాణంలో స్వల్ప సవరణలతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీ ఆక్ట్ 1994 గా రూపొందింది.[1] దీని ప్రకారం 1995, 2000–01, 2005–06, 2013-2014 లో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 13 జిల్లాల్లో 1835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎకగ్రీవాలయ్యాయి. వాటికి ప్రోత్సాహకాలుగా రూ. 128.45 కోట్లను 2015 ఏప్రిల్ 23న నాటి ప్రభుత్వం విడుదల చేసింది.[2]
2020-2021 గ్రామ పంచాయితీ ఎన్నికలు[మార్చు]
2018 లో స్థానిక సంస్థల గడువు ముగియగా, వివిధ కారణాల వలన ఎన్నికలు జరపడంలో ఆలస్యం అయింది. 2020 మార్చి 7 లో MPTC/ZPTC ఎన్నికలు ప్రారంభమయ్యాయి.[3] తొలిదశ నామినేషన్ల ఘట్టం ముగిసాక, కరోనా వైరస్ కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు నిరవధికంగా వాయిదా వేయబడ్డాయి.[4] నిమ్మగడ్డ పునర్నియామకం తర్వాత గతంలో తేదీలు ప్రకటించని పంచాయితీ ఎన్నికలకు తేదీలు జనవరి 23 న ప్రకటించారు.[5] ప్రభుత్వంతో విభేదాలు, సుప్రీంకోర్టుకు చేరడంతో, సుప్రీంకోర్టు ప్రక్రియను ఆపడానికి నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.[6] ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తాజాపరచడంలో పంచాయితీరాజ్ శాఖ విఫలమైనందున 1.1.2019 నాటి ఓటర్ల జాబితాలను వాటికి 7.3.2020 నాటికి చేసిన సవరణలతో వాడటానికి కమీషనర్ నిర్ణయించాడు.[7] పంచాయతీ ఎన్నికల తొలిదశకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనందున రాష్ట్ర ఎన్నికల సంఘం 2021 జనవరి 23 నాటి ఎన్నికల ప్రకటనను సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.[8]
వివరం | 1 దశ | 2 దశ | 3 దశ | 4 దశ |
---|---|---|---|---|
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం | 2021-01-29 | 2021-02-02 | 2021-02-06 | 2021-02-10 |
నామినేషన్ల స్వీకరణ ముగింపు | 2021-02-31 | 2021-02-04 | 2021-02-08 | 2021-02-12 |
నామినేషన్ల పరిశీలన | 2021-02-01 | 2021-02-05 | 2021-02-09 | 2021-02-13 |
నామినేషన్ల అభ్యంతరాల పరిశీలన | 2021-02-02 | 2021-02-06 | 2021-02-10 | 2021-02-14 |
నామినేషన్ల అభ్యంతరాల పరిశీలన తుదినిర్ణయం | 2021-02-03 | 2021-02-07 | 2021-02-11 | 2021-02-15 |
నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు | 2021-02-04 | 2021-02-08 | 2021-02-12 | 2021-02-16 |
పోలింగ్ | 2021-02-09 | 2021-02-13 | 2021-02-17 | 2021-02-21 |
ఓట్ల లెక్కింపు ప్రారంభం (సాయంత్రం 4:00) | 2021-02-09 | 2021-02-13 | 2021-02-17 | 2021-02-21 |
జిల్లా వారీగా ఎన్నికలు[మార్చు]
జిల్లా వారీగా ఎన్నికలు జరిగే రెవిన్యూ డివిజన్లు, మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి.[9] స్థానిక అధికారులు అభ్యర్ధనను బట్టి కమిషన్ స్వల్ప మార్పులు ప్రకటించారు.[10]
2021-01-28 వరకు జరిగిన సవరణలతో క్రింది జాబితా సవరించబడినది
శ్రీకాకుళం జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ
మండలాలు: ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: శ్రీకాకుళం, టెక్కలి
మండలాలు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: శ్రీకాకుళం, టెక్కలి
మండలాలు: ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టాం, సీతంపేట, రేగిడి ఆమదాలవలస
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ
మండలాలు: శ్రీకాకుళం ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట
విజయనగరం జిల్లా[మార్చు]
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: పార్వతీపురం
మండలాలు: బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్లాం
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: విజయనగరం
మండలాలు: భోగాపురం,, చీపురుపల్లి,, డెంకాడ,, గరివిడి, గుర్ల, ఎల్.కోట,, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ,, విజయనగరం
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: విజయనగరం
మండలాలు: గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి, గంట్యాడ, జామి, శృంగవరపుకోట, ఎల్ కోట, వేపాడు, కొత్తవలస
విశాఖపట్నం జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: అనకాపల్లి
మండలాలు: అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: నర్సీపట్నం
మండలాలు: నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం, గొలుగొండ, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: పాడేరు
మండలాలు: అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, డుంబ్రిగూడ, జి.మాడుగుల, జి.కె.వీధి, హుకుంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: విశాఖపట్నం
మండలాలు: భీముని పట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ
తూర్పుగోదావరి జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: కాకినాడ, పెద్దాపురం
మండలాలు: గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: రాజమహేంద్రవరం
మండలాలు: ఆలమూరు, గోకవరం, కడియం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం
రెవెన్యూ డివిజన్: రామచంద్రాపురం
మండలాలు: కాజులూరు, అనపర్తి, బిక్కవోలు, కె.గంగవరం, కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రాపురం, రాయవరం
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: రంపచోడవరం
మండలాలు: అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై.రామవరం
రెవెన్యూ డివిజన్: ఏటపాక
మండలాలు: చింతూరు, కూనవరం, వి.ఆర్‌పురం, ఏటపాక
పశ్చిమగోదావరి జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: నర్సాపురం
మండలాలు: ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: కొవ్వూరు
మండలాలు: అత్తిలి, చాగల్లు, దేవరాపల్లి, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, పెనుమంత్ర, పెరవలి, తాళ్లపూడి, తణుకు, ఉండ్రాజవరం
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: జంగారెడ్డిగూడెం, కుక్కునూరు
మండలాలు: బుట్టాయగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు
రెవెన్యూ డివిజన్: ఏలూరు
చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: ఏలూరు
మండలాలు: భీమడోలు,, దెందులూరు, ద్వారకా తిరుమల, ఏలూరు, గణపవరం, నల్లజెర్ల, నిడమర్రు, పెదపాడు,పెదవేగి, పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు
కృష్ణా జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: విజయవాడ
మండలాలు: చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: గుడివాడ
మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి, ముదినేపల్లి
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: మచిలీపట్నం
మండలాలు: అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడురు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: నూజివీడు
మండలాలు: ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు,నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు విసన్నపేట, ఉయ్యూరు
గుంటూరు జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: తెనాలి
మండలాలు: అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: నరసరావుపేట
మండలాలు: బొల్లాపల్లి, చిలకలూరిపేట, ఎడ్లపాడు, ఈపూరు, నాదెండ్ల, నరసరావుపేట, నకిరేకల్లు, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: గురజాల
మండలాలు: దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: గుంటూరు
మండలాలు: అమరావతి, అచ్చెంపేట, బెల్లకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ల, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరు
ప్రకాశం జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: ఒంగోలు
మండలాలు: చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్.మాగులూరు, ఎస్.ఎన్.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్:, కందుకూరు
మండలాలు: దర్శి, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, మర్రిపాడు
రెవెన్యూ డివిజన్: ఒంగోలు
మండలాలు: జె.పంగులూరు,, కొరిసపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: కందుకూరు
మండలాలు: కందుకూరు, వీవీపాలెం, లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు, ఎస్ కొండ, కనిగిరి, పీసీపల్లి, వెలిగండ్ల, హెచ్‌ఎం పాడు, సీఎస్ పురం, పామూరు, పొన్నలూరు, కొండెపి, జరుగుమల్లి
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: మార్కాపురం మండలాలు: అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెదారవడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: కావలి
మండలాలు: అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: ఆత్మకూరు
మండలాలు: అనంతసాగరం, ఏఎస్ పేట, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, మర్రిపాడు, సంగం, సీతారామపురం, ఉదయగిరి, వింజమూరు
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: గూడూరు, నాయుడు పేట
మండలాలు: బాలాయపల్లి, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, గూడూరు, కోట, సైదాపురం, వాకాడు, వెంకటగిరి, డి.వి.సత్రం, నాయుడు పేట, ఓజిలి, పెల్లకూరు, సూళ్లూరు పేట, తడ
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: నెల్లూరు
మండలాలు: బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, టి.పి.గూడూరు, వెంకటాచలం, విడవలూరు
కర్నూలు జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: నంద్యాల, కర్నూలు
మండలాలు: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యావాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు
రెండోె విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: నంద్యాల, కర్నూలు
మండలాలు: బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజమాల, గడివేముల, పాణ్యం, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, గూడూరు, కోడుమూరు, కర్నూలు
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: ఆదోని, కర్నూలు
మండలాలు: మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచెర్ల, డోన్, పీపల్లి, కృష్ణగిరి, వెల్దుర్తి
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: ఆదోని
మండలాలు: ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హలహర్వి, హోలగూడ, ఆస్పరి, కోసిగి, కౌతాలం, మంత్రాలయం, పెద్ద కడుబూర్, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు
అనంతపురం
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: కదిరి
మండలాలు: ఆమడగూర్, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి కుంట, నల్లచెరువు, నల్లమడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: ధర్మవరం, కళ్యాణదుర్గం
మండలాలు: రాప్తాడు, బత్తలపల్లి, చెన్నేకొతపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, తాడిమర్రి, ముదిగుబ్బ, బెలుగుప్ప, బొమ్మనహళ్, బ్రహ్మసముద్రం, డి. హీరేహల్, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, కంబదూర్, కనేకల్, కుందిర్పి, రాయదుర్గం, సెట్టూరు
మూడో విడత
రెవెన్యూ డివిజన్: అనంతపురం
మండలాలు: అనంతపురం, ఆత్మకూరు, బి.కె. సముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్, కూడేరు, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపానకాల్, యాడికి, ఎల్లనూరు
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: పెనుకొండ
మండలాలు: ఆగలి, అమరాపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుదిబండ, హిందూపురం, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దాం, రోళ్ళ, సోమందేపల్లి
వైయస్సార్ కడప జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: జమ్మలమడుగు, కడప, రాజంపేట
మండలాలు: చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్.ఎ.కె. ఎన్, కలసపాడు, బి.మఠం
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: కడప
మండలాలు: రాయచోటి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, కమలాపురం, వి.ఎన్ పల్లి, పెండ్లిమర్రి, సి.కె.దిన్నె, వల్లూరు, చెన్నూరు
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: రాజంపేట, కడప
మండలాలు: కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పెనగలూరు, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, టి. సుండుపల్లి, వీరబల్లి
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: జమ్మలమడుగు, కడప
మండలాలు: పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల, లింగాల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం, చక్రాయపేట, యర్రగుంట్ల
చిత్తూరు జిల్లా[మార్చు]
తొలి విడత (09-02-2021)
రెవెన్యూ డివిజన్: చిత్తూరు
మండలాలు: బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్.సి.పురం, ఎస్.ఆర్ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి
రెండో విడత (13-02-2021)
రెవెన్యూ డివిజన్: మదనపల్లె
మండలాలు: చిన్నఒట్టిగల్లు, యర్రావారిపాలెం, మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి. కొత్తకోట, కురబలకోట, ములకలచెరువు, పి.టి.యం, పెద్దమండ్యం, తంబళ్లపల్లి
మూడో విడత (17-02-2021)
రెవెన్యూ డివిజన్: మదనపల్లె
మండలాలు: గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచెర్ల, సోదాం, సోమల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, వి.కోట
నాలుగో విడత (21-02-2021)
రెవెన్యూ డివిజన్: తిరుపతి
మండలాలు: బి.ఎన్ కండ్రిగ, చంద్రగిరి, కె.వి.బి. పురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాలెం, ఏర్పేడు
ఏకగ్రీవాలకు ప్రోత్సాహాలు[మార్చు]
ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించటానికి జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేసింది. గతంలో 2013 నాటి జీవో నెం. 1274ని సవరించింది. దాని ప్రకారం రెండు కొత్త విభాగాలను చేర్చటంతో పాటు, ప్రోత్సాహకాలను పెంచింది.[2]
పంచాయితీ జనాభా | ప్రోత్సాహకం | వ్యాఖ్య |
---|---|---|
2000లోపు | 5 లక్షలు | కొత్త ప్రోత్సాహకం |
2001-5000 | 10 లక్షలు | |
5001-10000 | 15 లక్షలు | |
10001- | 20 లక్షలు |
ఫలితాలు[మార్చు]
13,371 గ్రామపంచాయితీలకు గాను 13097 పంచాయితీలకు నాలుగు దశల్లో జరిగిన ఎన్నికలలో, 2196 (16.7%) పంచాయితీ సర్పంచ్ స్థానాలు, 47463 (36.22%) వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.[11]
వివాదాలు[మార్చు]
ఏకగ్రీవాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం మాధ్యమాలలో విడుదల చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదమైంది.[12]
2020-2021 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు[మార్చు]
2021 మార్చి 10న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత సంవత్సరంలో నిలిచిన ప్రక్రియ కొనసాగించబడుతున్నది. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు మార్చి 2 నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా, మార్చి 14 ఓట్ల లెక్కింపుగా నిర్ణయించారు.[13]
కాకినాడలో పాలకవర్గం గడువు పూర్తికానందున ఎన్నికలు జరగవు. కోర్టు కేసుల వలన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు లలో ఎన్నికలు జరుగుటలేదు. కోర్టు కేసులు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయకపోవడం వలన రాజాం, ఆమదాలవలస, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు, భీమవరం, గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, గురజాల, దాచేపల్లి, దర్శి, కందుకూరు, కావలి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, బేతంచెర్ల, శ్రీకాళహస్తి, కుప్పం, రాజంపేట, కమలాపురం, పామిడి, పెనుకొండల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు.[13]
ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం 75 మున్సిపాలిటీలకు గాను 72 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లకు గాను 11 కార్పొరేషన్లలో వైసిపి అధిక్యత కనబడగా, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీలలో టీడీపీ అత్యధిక వార్డులు గెలిచింది.[14]
2020-2021 మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు[మార్చు]
2020 మార్చిలో మండల పరిషత్, జిల్లా పరిషత్ నామినేషన్ల తర్వాత కరోనా వలన ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2021 మార్చి 31 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవికాలం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయడానికి కాలం సరిపోనందున, వీటిని నిర్వహించలేదు. ఏప్రిల్ 1 న రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ, అదేరోజు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తేదీ 8 ఏప్రిల్ గా ప్రకటించింది. మరుసటి రోజు పార్టీలను సమావేశపరచింది. ఇది సుప్రీంకోర్టు నాలుగు వారాలు గడువు ఇవ్వాలన్న నిర్ణయాన్ని పాలించలేదని, తెదేపా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశానికి హాజరు కాలేదు. వారు ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా 6 వతేదీన ఏకసభ్య ధర్మాసనం ఎన్నికలను నిలిపివేసింది. దీనిపై ఎన్నికల సంఘం అత్యవసరంగా ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా, త్రిసభ్య ధర్మాసనం, ఎన్నికలను 8 వతేదీ నిర్వహించటానికి అనుమతించి, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను చేయవద్దని, తుది నిర్ణయం ఏకసభ్య ధర్మాసనం చేస్తుందని తెలిపింది.[15]
2021 మే 21 నాడు, హైకోర్టు న్యాయమూర్తి ఎం. సత్యనారాయణమూర్తి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంఘ ప్రకటన ప్రకారం, సుప్రీంకోర్టు తెలిపినట్లు నెలరోజుల గడువు ఇవ్వనందున చట్టవ్యతిరేకమని రద్దుచేసింది. మరల ప్రకటన ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.[16] తీర్పుపై అప్పీలు చేసిన తరువాత, ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పుని రద్దు చేయటంతో ఎన్నికల ప్రక్రియకొనసాగింది. 19 సెప్టెంబరు 2021 నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభించి మరుసటిరోజుకు ఫలితాలు విడుదలయ్యాయి. వాటి ప్రకారం ఎన్నికలు జరిగిన 7,219 ఎంపీటీసీ స్థానాలలో వైకాపా 5998,తెదేపా 826 , జనసేన 177, భాజపా 28 సీపీఎం 15 ,సీపీఐ 8,స్వతంత్ర అభ్యర్ధులు 157 స్థానాలలో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన 515 జడ్పీటీసీ స్థానాలలో, వైకాపా 502 , తెదేపా 6, జనసేన 2, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్ధులు 1 స్థానం గెలుపొందారు. [17]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ కె నాగేశ్వరరావు, ed. (2008). ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి. తెలుగు అకాడమీ. pp. 557–559.
- ↑ 2.0 2.1 "ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం భారీ నజరానాలు... ప్రతిపక్షాలు ఏం చేస్తాయి?". బిబిసి. 2021-01-28. Retrieved 2021-01-28.
- ↑ "ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు". 10tv. 2020-03-07. Archived from the original on 2021-02-07. Retrieved 2021-01-28.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "Notification - Postponement of elections until further orders" (PDF). SEC. 2020-05-06. Retrieved 2021-01-26.[permanent dead link]
- ↑ "గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన" (PDF). SEC. 2020-01-23. Retrieved 2021-01-26.[permanent dead link]
- ↑ "ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే:సుప్రీం". ఈనాడు. Archived from the original on 2021-01-26. Retrieved 2021-01-26.
- ↑ "Direction on Electoral Rolls" (PDF). SEC. 2020-01-22. Retrieved 2021-01-26.
- ↑ "ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు". వన్ ఇండియా. 2021-01-25. Retrieved 2021-01-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "ఏపీలో విడతల వారీగా ఎన్నికలు". ఆంధ్రజ్యోతి. 2021-01-03. Retrieved 2021-01-28.
- ↑ "ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు.. ఈ మూడు జిల్లాల్లో మాత్రమే!". సమయం. 2021-01-29. Retrieved 2021-01-29.
- ↑ "2196 పంచాయతీలు ఏకగ్రీవం". ఈనాడు. Retrieved 2021-02-18.
- ↑ "ఇదేం 'ఏకగ్రీవం'?". ఆంధ్రజ్యోతి. 2021-01-27. Retrieved 2021-01-28.
- ↑ 13.0 13.1 "ఏపీలో ఇక పురపోరు". ఈనాడు. 2021-02-16.
- ↑ "వైసిపి ప్రభంజనం..72 మున్సిపాలిటీలు, 11 కార్పోరేషన్లు కైవసం". ప్రజాశక్తి. 2021-03-14. Retrieved 2021-03-15.
- ↑ "పోలింగుకు సరే." ఈనాడు. 2021-04-07. Retrieved 2021-04-08.
- ↑ "AP High Court:పరిషత్ ఎన్నికలు రద్దు". ఈనాడు. 2021-05-21. Retrieved 2021-05-22.
- ↑ "పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి.. ఫైనల్ లిస్ట్ ఇదే!". ఈనాడు. 2021-09-20. Retrieved 2021-09-25.