Jump to content

తమిళ సినిమా

వికీపీడియా నుండి
(Tamil cinema నుండి దారిమార్పు చెందింది)
ఎ.వి.యం.స్టూడియో,భారతదేశపు తొలితరం స్టూడియో

తమిళ సినిమా లేదా కోలీవుడ్ కోడంబాకం కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలో ఒక భాగము. కోడంబాకం, హాలీవుడ్ పదాలను స్వీకరించి తమిళ సినిమా పరిశ్రమ కోలీవుడ్‌గా పిలువబడుతున్నది. దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో ఆర్.నటరాజ మొదలియార్‌ నిర్మించాడు.[1] భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలం ఆరా విడుదలయిన ఏడు నెలలకే అంటే 1931 అక్టోబరు 31న మొట్టమొదటి తమిళ టాకీ (బహుభాషా చిత్రం) కాళిదాస్ విడుదయ్యింది.[2][3]

1939లో మద్రాస్ స్టేట్ వినోదపు పన్ను చట్టాన్ని అమలు చేసింది. చెన్నైను బాలీవుడ్ కు, దక్షిణ భారతీయ భాషా చిత్రాలకు, శ్రీలంక సినిమాకు రెండవ కేంద్రంగా మలచడంలో తమిళ సినిమా తన ప్రభావాన్ని చూపింది.[4][5] మలేసియా, సింగపూర్, పశ్చిమ దేశాలలోని తమిళప్రజల చలనచిత్ర నిర్మాణానికి తమిళ సినిమా పరిశ్రమ ప్రేరణగా నిలిచింది.[6]

2022 ఫిబ్రవరి 27న జరిగిన తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలలో దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి మరోమారు అధ్యక్షుడిగా విజయం సాధించారు.[7]తమిళ సినిమా హాస్యనటుడు మనోబాల 2023 మే 3న మరణించారు.

చరిత్ర

[మార్చు]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

నటులు

[మార్చు]

నటీమణులు

[మార్చు]

దర్శకులు

[మార్చు]
  • బాలచందర్
  • మణిరత్నం
  • బాల
  • కె. యస్. రవికుమార్
  • యస్. శంకర్
  • కె. భాగ్యరాజ్
  • ఏ. ఆర్. మురుగదాస్
  • మిస్కిన్
  • పా. రంజిత్
  • లోకేశ్ కనగరాజ్

సంగీత దర్శకులు

[మార్చు]
  • ఇళయరాజా
  • ఏ. ఆర్. రహమాన్
  • దేవా
  • విద్యా సాగర్
  • అనిరుధ్ రవిచందర్
  • యువన్ శంకర్ రాజా

రచయితలు

[మార్చు]

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

[మార్చు]

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

[మార్చు]
పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరం పేరు బొమ్మ వివరణ
1982 ఎల్.వి.ప్రసాద్ 1931లో విడుదలైన తొలి తమిళ టాకీ కాళిదాస్‌లో నటించాడు. 1965లో ప్రసాద్ స్టూడియోస్, 1976లో ప్రసాద్ కలర్ లాబొరేటరీస్ స్థాపించి 150కు పైగా సినిమాలను నిర్మించాడు.
1996 శివాజీ గణేశన్ 1953లో పరాశక్తి సినిమాతో వెండితెరపై తొలిసారిగా కనిపించి 300లకు పైగా సినిమాలలో నటించాడు.
2010 కె.బాలచందర్ నీర్కుమిళి సినిమాతో రంగప్రవేశం చేసిన దర్శకుడు. 100 సినిమాలను కవితాలయ బ్యానర్‌పై వివిధభాషలలో తీశాడు.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం విభాగము సినిమా నిర్మాత దర్శకుడు నటుడు/నటి బహుమతి
1990 ఉత్తమ చలనచిత్రం మరుపక్కం నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కె.ఎస్.సేతుమాధవన్ స్వర్ణ కమలం
2007 ఉత్తమ చలనచిత్రం కంచీవరం పర్స్‌పెక్ట్ పిక్చర్ కంపెనీ ప్రియదర్శన్ స్వర్ణ కమలం
2014 ఉత్తమ బాలల చిత్రం కాకా ముత్తై ధనుష్, వెట్రిమారన్ ఎం.మణికందన్ స్వర్ణ కమలం
1996 ఉత్తమ దర్శకుడు కాదై కొట్టై అగతియాన్ స్వర్ణ కమలం
2001 ఉత్తమ దర్శకుడు ఊరుకు నూరుపెర్ బి.లెనిన్ స్వర్ణ కమలం
2008 ఉత్తమ దర్శకుడు నాన్ కాడవుల్ బాల స్వర్ణ కమలం
2010 ఉత్తమ దర్శకుడు ఆడుకలామ్ వెట్రిమారన్ స్వర్ణ కమలం
1982 దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం కణ్ శివందాల్ మన్ శివక్కుమ్ ఆర్.వెంకట్రామన్ శ్రీధర్‌రాజన్ స్వర్ణ కమలం
1984 దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం మీందమ్‌ ఒరు కాదల్ కథై రాధిక ప్రతాప్ పోతన్ స్వర్ణ కమలం
1994 దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం మొగముల్ జె.ధర్మంబాళ్ జ్ఞానరాజశేఖరన్ స్వర్ణ కమలం
2011 దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం అరణ్యకాండం ఎస్.పి.బి.చరణ్ త్యాగరాజన్ కుమారరాజా స్వర్ణ కమలం
1986 ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా సంసారం అధు మింసారం ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ విసు స్వర్ణ కమలం
2000 ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా వానథైప్పొలా వేణు రవిచంద్రన్ విక్రమన్ స్వర్ణ కమలం
2004 ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా ఆటోగాఫ్ చరణ్ చరణ్ స్వర్ణ కమలం
2011 ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా అళగర్ సామియిన్ కుదురై పి.మదన్ సుశీంద్రన్ స్వర్ణ కమలం
2007 ఉత్తమ ఏనిమేషన్ సినిమా ఇనిమే నంగథాన్ ఎస్.శ్రీదేవి వెంకిబాబు స్వర్ణ కమలం
1971 ఉత్తమ నటుడు రిక్షాకరన్ ఎం.జి.రామచంద్రన్ రజత కమలం
1982 ఉత్తమ నటుడు మూండ్రం పిరై కమల్ హసన్ రజత కమలం
1987 ఉత్తమ నటుడు నాయగన్ కమల్ హసన్ రజత కమలం
1996 ఉత్తమ నటుడు ఇండియన్ కమల్ హసన్ రజత కమలం
2003 ఉత్తమ నటుడు పితామగన్ విక్రమ్ రజత కమలం
2007 ఉత్తమ నటుడు కంచీవరం ప్రకాష్ రాజ్ రజత కమలం
2010 ఉత్తమ నటుడు ఆడుకలామ్ ధనుష్ రజత కమలం
1976 ఉత్తమ నటి శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లక్ష్మి రజత కమలం
1979 ఉత్తమ నటి పాశి శోభ రజత కమలం
1985 ఉత్తమ నటి సింధుభైరవి సుహాసిని రజత కమలం
1987 ఉత్తమ నటి వీడు అర్చన రజత కమలం
2006 ఉత్తమ నటి పరుత్తివీరన్ ప్రియమణి రజత కమలం
2010 ఉత్తమ నటి తెన్ మెరుక్కు పరువకాట్రు శరణ్య రజత కమలం
1994 ఉత్తమ సహాయనటుడు నమ్మవర్ నగేష్ రజత కమలం
1997 ఉత్తమ సహాయనటుడు ఇరువర్ ప్రకాష్ రాజ్ రజత కమలం
2002 ఉత్తమ సహాయనటుడు నాన్‌బా నాన్‌బా చంద్రశేఖర్ రజత కమలం
2010 ఉత్తమ సహాయనటుడు మైనా తంబి రామయ్య రజత కమలం
2011 ఉత్తమ సహాయనటుడు అళగర్ సామియిన్ కుదురై అప్పుకుట్టి రజత కమలం
2014 ఉత్తమ సహాయనటుడు జిగర్ థండా బాబీ సింహా రజత కమలం
2015 ఉత్తమ సహాయనటుడు విసరణై చాముత్తిరకణి రజత కమలం
1982 ఉత్తమ సహాయనటి పుధే పాధై మనోరమ రజత కమలం
1992 ఉత్తమ సహాయనటి దేవర్ మగన్ రేవతి రజత కమలం
2010 ఉత్తమ సహాయనటి నమ్మగ్రామమ్ సుకుమారి రజత కమలం

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Metro Plus Chennai / Madras Miscellany : The pioneer'Tamil' film-maker". The Hindu. Chennai, India. 7 September 2009. Archived from the original on 12 సెప్టెంబరు 2009. Retrieved 29 June 2011.
  2. Velayutham, Selvaraj. Tamil cinema: the cultural politics of India's other film industry. p. 2.
  3. "Interesting Facts About Tamil Cinema to Witness its Greatness". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "THE TAMIL NADU ENTERTAINMENTS TAX ACT, 1939" (PDF). Government of Tamil Nadu. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2011. Retrieved 26 September 2011.
  5. Indian Cinema: The World’s Biggest And Most Diverse Film Industry (page 5) Archived 2011-07-25 at the Wayback Machine Written by Roy Stafford
  6. "SYMPOSIUM: SRI LANKA'S CULTURAL EXPERIENCE". Chennai, India: Frontline. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 26 September 2011.
  7. "తమిళ దర్శకుల సంఘ అధ్యక్షుడిగా ఆర్‌కె. సెల్వమణి". chitrajyothy. Archived from the original on 2022-03-01. Retrieved 2022-03-01.

వనరులు

[మార్చు]