జనతా పార్టీ (సెక్యులర్)
Jump to navigation
Jump to search
జనతా పార్టీ | |
---|---|
స్థాపకులు | రాజ్ నారాయణ్ |
స్థాపన తేదీ | 1979 జూలై |
జనతా పార్టీ (సెక్యులర్) అనేది 1979 జూలైలో రాజ్ నారాయణ్ చే స్థాపించబడిన రాజకీయ పార్టీ. 1979 జూలై 16న, చరణ్ సింగ్ దాని నాయకత్వాన్ని స్వీకరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ (I) మద్దతుతో 1979, జూలై 28న భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే వారి మద్దతు ఉపసంహరణ తర్వాత 1979, ఆగస్టు 20న రాజీనామా చేశాడు. చరణ్ సింగ్ నేతృత్వంలోని జనతా పార్టీ 1980 భారత సాధారణ ఎన్నికలకు ముందు లోక్ దళ్గా పేరు మార్చబడింది.[1] కానీ అధికారికంగా దాని మునుపటి పేరుతోనే ఎన్నికలలో పోటీచేసింది. 1980లో 7వ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో, పార్టీ 41 స్థానాలను గెలుచుకుంది, మొత్తం పోలైన ఓట్లలో 9.39% పొందింది.[2]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of The Low Castes in North Indian Politics. Delhi: Orient Longman. p. 327. ISBN 81-7824-080-7.
- ↑ "Statistical Report on General elections, 1980 to the 7th Lok Sabha, Volume I" (PDF). Election Commission of India website. p. 83. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 12 April 2010.