Jump to content

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

వికీపీడియా నుండి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
Chairpersonరేవంత్ రెడ్డి (ముఖ్యమంత్రి)
స్థాపన తేదీ11 మార్చి 2014
ప్రధాన కార్యాలయంగాంధీభవన్, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ
యువత విభాగంతెలంగాణ యువజన కాంగ్రెస్
మహిళా విభాగంతెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ
రాజకీయ విధానం
  • సెక్యులరిజం
  • పాపులిజం
  • సామాజిక ఉదారవాదం
  • ప్రజాస్వామ్య సోషలిజం
  • సామాజిక ప్రజాస్వామ్యం
కూటమిభారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి
లోక్‌సభలో సీట్లు
3 / 17
రాజ్యసభలో సీట్లు
0 / 7
శాసనసభలో సీట్లు
64 / 119
Election symbol
Website
https://inctelangana.org

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం..[1] పొన్నాల లక్ష్మయ్య దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పార్టీ విభాగం ప్రస్తుత అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి . ఈ పార్టీ నుండి ప్రస్తుతం దేశం లోని అతి పెద్ద పార్లమెంటు స్థానమైన భువనగిరి నుండి కోమటిరడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రధాన కార్యాలయం

[మార్చు]

ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 2021 జూన్ 26న జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. రేవంత్ రెడ్డి 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన కార్యాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లికి సమీపంలో ఉన్న గాంధీభవన్ వద్ద ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు ఫోటో నియోజకవర్గం/జిల్లా పదం
1. పొన్నాల లక్ష్మయ్య జనగాం 2014 మార్చి 11 - 2015 మార్చి 2
2. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ 2015 మార్చి 2 - 2021 జూన్ 26
3. రేవంత్ రెడ్డి కొడంగల్ 2021 జూన్ 26[2] - 2024 జులై 7
4. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌ 2024 సెప్టెంబరు 6 - ప్రస్తుతం[3]

ఎన్నికల చరిత్ర

[మార్చు]

తెలంగాణ శాసనసభ

[మార్చు]
సంవత్సరం ఫోటో ఫ్లోర్ లీడర్ సీట్లు గెలుచుకున్నారు సీట్లలో మార్పు ఓటు భాగస్వామ్యం స్వింగ్ జనాదరణ పొందిన ఓటు ఫలితం
2014 కుందూరు జానా రెడ్డి 21 / 119 29 25.0% 8.1 4,864,808 ప్రతిపక్షం
2018 మల్లు భట్టి విక్రమార్క 19 / 119 2 28.43% 3.43 5,883,111 ప్రతిపక్షం
2023 ఎనుముల రేవంత్ రెడ్డి 64 / 119 46 39.40% 10.97 9,235,792 ప్రభుత్వం

ఏఐసీసీ ఇంచార్జ్‌ల జాబితా

[మార్చు]
వ.సంఖ్య ఇన్​ఛార్జ్ ఫోటో పదం
1. దిగ్విజయ్ సింగ్ 11 మార్చి 2014 1 ఆగస్టు 2017 3 సంవత్సరాలు, 143 రోజులు
2. రామచంద్ర ఖుంటియా 1 ఆగస్టు 2017 12 సెప్టెంబర్ 2020 3 సంవత్సరాలు, 42 రోజులు
3. మాణికం ఠాగూర్ 12 సెప్టెంబర్ 2020 4 జనవరి 2023 2 సంవత్సరాలు, 114 రోజులు
4. మాణిక్రావ్ ఠాక్రే 5 జనవరి 2023 24 డిసెంబర్ 2023 353 రోజులు
5. దీపా దాస్మున్సి 24 డిసెంబర్ 2023 అధికారంలో ఉంది 308 రోజులు

మాజీ ఎమ్మెల్సీలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Congress names PCC chiefs for Seemandhra, Telangana - Economic Times". Economictimes.indiatimes.com. Retrieved 2014-03-13.
  2. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  3. "టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ | Congress Senior Leader Mahesh Goud As TPCC Chief | Sakshi". web.archive.org. 2024-09-06. Archived from the original on 2024-09-06. Retrieved 2024-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]