దులీప్ ట్రోఫి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దులీప్ ట్రోఫి
దేశాలుIndia India
నిర్వాహకుడుBCCI
ఫార్మాట్First-class cricket
తొలి టోర్నమెంటు1961–62
చివరి టోర్నమెంటు2016
టోర్నమెంటు ఫార్మాట్Knock out
జట్ల సంఖ్య5
ప్రస్తుత ఛాంపియన్Central Zone
అత్యంత విజయవంతమైన వారుNorth Zone and West Zone(18 titles)
వెబ్‌సైటుBCCI
2014–15 Duleep Trophy

భారతదేశంలో 5 జోన్ల మధ్య జరిగే దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌కే దులీప్ ట్రోఫి (Duleep Trophy) అని పేరు. ఇది దేశంలోని 5 భౌగోళిక జోన్ల మధ్య జరిగే దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంటు. దులీప్ సింహ్ జీ పేరుమీదుగా ఈ టొర్నమెంటును 1961-62 నుంచి నిర్వహించడం జరుగుతున్నది.

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో క్రికెట్‌ను పర్యవేక్షించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసీఇ) ఈ పోటీలను 1961-62 నుంచి నిర్వహిస్తున్నది. 1961-62లో నిర్వహించిన మొట్టమొదటి దులీప్ ట్రోఫీలో పశ్చిమ జోన్ (వెస్టర్న్ జోన్) సౌత్ జోన్‌ను 10వికెట్ల తేడాతో ఓడించి కప్ కైవసం చేసుకుంది.

2011-12 సంవత్సరానికి ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. దులీప్ ట్రోఫిని ఈస్ట్ జోన్ కైవసం చేసుకోవడం ఇదే మొదటి సారి. ఇండోర్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సెంట్రల్ జోన్ ఫై నెగ్గింది. వ్రుద్దిమాన్ సాహ 170 పరుగులతో మాన్ అఫ్ ది మ్యాచ్ గ నిలిచాడు. సేకరణ - K.మనోహర్ MCA

జోన్ల కూర్పు

[మార్చు]

దులీప్ ట్రోఫీలో ఆడే జోన్లు భౌగోళిక ప్రాతిపదికగా 5 భాగాలుగా విభజించారు.

నగదు బహుమతి

[మార్చు]

దులీఫి ట్రోఫీ విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.30 లక్షల నగదు బహుమతి కూడా ప్రధానం చేస్తారు. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.

ఎలైట్ టీములు

[మార్చు]

2002-03 నుంచి జోనల్ టీముల స్థానే ఎలైట్ టీములను బరిలోకి దించారు. ఎలైట్ ఏ, ఎలైట్ బి, ఎలైట్ సి, ప్లేట్ ఏ, ప్లేట్ బి అనే 5 టీములను ఏర్పాటు చేశారు. కాని ఈ కొత్త కూర్పు జట్ల మధ్య సమతూకం కొరవడటం వల్ల ఒక్క ఏడాది మాత్రమే కొనసాగింది.[1] మళ్ళీ పూర్వపు మాదిరిగానే 5 జోన్లు (అతిథి జట్టు కాకుండా) లీగ్ దశలో పోటీ పడుతున్నాయి. లీగ్ పోటీలు 193-94 నుంచి కొనసాగుతున్నాయి. అంతకు క్రితం నాకౌట్ పోటీలు జరిగేవి.

అతిథి జట్టు

[మార్చు]

2003-04 నుంచి దేశంలోని 5 జట్లతో పాటు మరో విదేశీ జట్టును కూడా పోటీకై ఆహ్వానించడం జరుగుతున్నది. ఈ జట్టుకు అతిథి జట్టుగా పిలుస్తారు. ఈ జట్టుతో పాటు మొత్తం 6 జట్లు ట్రోఫీకై పోటీలో ఉంటాయి.

సీజన్ అతిథి జట్టు
2003-04 ఇంగ్లాండు ఏ జట్టు
2004-05 బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు
2005-06 జింబాబ్వే క్రికెట్ యూనియన్ ప్రెసిడెంట్స్ XI
2006-07 శ్రీలంక ఏ జట్టు
2007-08 ఇంగ్లాండ్స్ లయన్స్ జట్టు

ఇప్పటి వరకు విజేతగా నిల్చిన జట్లు

[మార్చు]
సీజన్ విజేత
1961-62 పశ్చిమ జోన్
1962-63 పశ్చిమ జోన్
1963-64 పశ్చిమ జోన్ & దక్షిణ జోన్ (సంయుక్తంగా)
1964-65 పశ్చిమ జోన్
1965-66 దక్షిణ జోన్
1966-67 దక్షిణ జోన్
1967-68 దక్షిణ జోన్
1968-69 పశ్చిమ జోన్
1969-70 పశ్చిమ జోన్
1970-71 దక్షిణ జోన్
1971-72 సెంట్రల్ జోన్
1972-73 పశ్చిమ జోన్
1973-74 నార్త్ జోన్
1974-75 దక్షిణ జోన్
1975-76 దక్షిణ జోన్
1976-77 పశ్చిమ జోన్
1977-78 పశ్చిమ జోన్
1978-79 నార్త్ జోన్
1979-80 నార్త్ జోన్
1980-81 పశ్చిమ జోన్
1981-82 పశ్చిమ జోన్
1982-83 నార్త్ జోన్
1983-84 నార్త్ జోన్
1984-85 దక్షిణ జోన్
1985-86 పశ్చిమ జోన్
1986-87 దక్షిణ జోన్
1987-88 నార్త్ జోన్
1988-89 నార్త్ జోన్ & పశ్చిమ జోన్ (సంయుక్తంగా)
1989-90 దక్షిణ జోన్
1990-91 నార్త్ జోన్
1991-92 నార్త్ జోన్
1992-93 నార్త్ జోన్
1993-94 నార్త్ జోన్
1994-95 నార్త్ జోన్
1995-96 దక్షిణ జోన్
1996-97 సెంట్రల్ జోన్
1997-98 సెంట్రల్ జోన్ & పశ్చిమ జోన్ (సంయుక్తంగా)
1998-99 సెంట్రల్ జోన్
1999-00 నార్త్ జోన్
2000-01 నార్త్ జోన్
2001-02 నార్త్ జోన్
2002-03 ఎలైట్ సి
2003-04 నార్త్ జోన్
2004-05 సెంట్రల్ జోన్
2005-06 పశ్చిమ జోన్
2006-07 నార్త్ జోన్
2007-08 నార్త్ జోన్

ఇవి కూడా చూడండి

[మార్చు]


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్

మూలాలు

[మార్చు]
  1. "Duleep Trophy to revert back to old format". Cricinfo. 1 September 2003. Retrieved 2007-08-26.

బయటి లింకులు

[మార్చు]