హుజూరాబాద్
Huzurabad | |
---|---|
Coordinates: 18°12′N 79°25′E / 18.20°N 79.42°E | |
Country | India |
State | Telangana |
District | Karimnagar |
Government | |
• Body | Municipal council |
• MLA | Etela Rajender |
• MP | Bandi Sanjay Kumar |
విస్తీర్ణం | |
• Total | 32.24 కి.మీ2 (12.45 చ. మై) |
Elevation | 271 మీ (889 అ.) |
జనాభా (2011)[3] | |
• Total | 37,656 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
Languages | |
• Official | Telugu, Urdu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 505468 |
Telephone code | 91-8727 |
Vehicle registration | TS-02 |
Lok Sabha | Karimnagar |
Assembly constituency | Huzurabad |
హుజూరాబాద్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలానికి చెందిన గ్రామం.[4] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [5][6] ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలలో ఒకటి.ఇక్కడినుండి కరీంనగర్ 40 కి.మీ. దూరంలోను, హనుమకొండ 30 కి.మీ. హుజురాబాద్ వయా హన్మకొండ హైదరాబాద్ 170 కి.మీ.,హుజురాబాద్ వయా హుస్నాబాద్ హైదరాబాద్ 177 కి.మీ. హుజురాబాద్ వయా కరీంనగర్ హైదరాబాద్ 200 కి. మీ.దూరంలో ఉన్నాయి. ఇది 2011 హుజూరాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9717 ఇళ్లతో, 37665 జనాభాతో 3229 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 19208, ఆడవారి సంఖ్య 18457. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 6560 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 351. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 572648.[7] పిన్ కోడ్: 505468.
చరిత్ర
[మార్చు]రంగనాయకుల గుట్ట చుట్టూ పూర్వపు హుజురాబాద్ గ్రామం ఉంది. సుమారుగా 80 ఎకరాల పాటి మీద అని పిలిచే ఎత్తైన మట్టి దిబ్బ ఉంది.ఇంత విశాలమైన పాటి గడ్డ చాలా అరుదు.. ఇక్కడ పూర్వం ఇప్పుడు ఉన్నట్లే అప్పుడు కూడా అన్ని వృత్తుల వారితో కలిసి జీవించిన పెద్ద గ్రామం ఉండేదని తెలుస్తుంది. దీనినే స్థానికులు ఏదులాపురం ఆని పిలుచుకుంటారు. ఇంత పెద్ద గ్రామానికి తాగు నీరు సాగు నీరు అందించిన పల్లె ఏరు ప్రవాహం పాటి మీది నుండి ప్రవహిస్తుంది.సమీపంలో నాగుల చెఱువు ఉంది.
కనుగొనబడిన పురావస్తు సామాగ్రి
[మార్చు]వైద్యం కోసం ఉపయోగించిన రోళ్లు
[మార్చు]అనేక వృత్తులు వారితో ఉన్న పెద్దగ్రామానికి వైద్యులు అవసరం .అందుకే ఇక్కడ సాధారణంగా పరుపు బండల పై కనిపించే రోళ్ళకు బిన్నంగా వరుసగా మూడు రోళ్లు ఉన్నాయి. ఇవి లోతు తక్కువగా ఉండడంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయి . వీటిని బట్టి ఆయుర్వేద వైద్యం కోసం మందులు నూరడానికి ఉపయోగించి ఉండవచ్చను.నూరడానికి, దంచడానికి ఉపయోగించిన రోకలి బండ ఒకటి పరిశోధకునికి లభించింది.ఇటువంటి రోళ్లు గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గతంలో రెడ్డి రత్నాకర్ రెడ్డి గుర్తించాడు.
ఇనుం పరిశ్రమ
[మార్చు]పాటి మీద చిట్టెపు రాళ్ళు దండిగ కనిపిస్తాయి. ఇనుం సంగ్రహించగ, ఇనుం పోత పోసేటప్పుడ మిగిలిన వ్యర్థ పదార్థాలను చిట్టేపు రాళ్ళు అంటారు. ఈ ప్రాంతంలో రెండు వేల కిందటే ఇనుం ఉక్కు పరిశ్రమ ఉందని చెప్పవచ్చు.
కుండల పరిశ్రమ
[మార్చు]వ్యవసాయం సాగు చేసి పంటలు పండించడంతో పాటు పండిన ధాన్యం నిల్వ చేసిన పెద్ద పెద్ద కాగులు లభించాయి. చక్రం మీద తయారు చేసే బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద రంగు, గోధుమరంగు,మట్టి పాత్రలు విస్తారంగా కనిపించాయి.
అలంకరణ పరిశ్రమ
[మార్చు]ఇక్కడ మంచిఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్ళు కనిపించాయి. పెద్ద రాతి యుగం నాటి నుండి మొదలు ప్రజలు అలంకార ప్రియులనీ తెలుస్తుంది.
పెద్ద ఇటుకలు
[మార్చు]పాటి మీద బరువైన పెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారు. పై కప్పుకు గూన పెంకులు ఉపయోగించారు. వీటితో పాటు తేలికైన ఇటుకలు కనిపించాయి.
వీరుల ఆరాధన
[మార్చు]హనుమాన్ గుడి పక్కన పొలంలో వీరుడిని చెక్కిన విగ్రహం ఉంది. కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది.
భైరవ శిల్పం
[మార్చు]పాటి మీద పూర్వపు శిథిల దేవాలయం, హనుమాన్ గుడి ఉంది. గుట్ట వెనుక నుండి వెళ్లే తోవ పక్కన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పం ఉంది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో గతంలో సింగిరెడ్డి రాజి రెడ్డి యాజమాన్యంలోని సర్వే నెంబర్ 1140 / డిలో భూమిని సమం చేస్తున్నప్పుడు ఆదివారం ఒక కుండను వెలికి తీశారు. సోమవారం, అసిస్టెంట్ డైరెక్టర్ డి గంగా దేవి నేతృత్వంలోని పురావస్తు అధికారులు ఈ పరికరాలను సేకరించి తదుపరి పరీక్ష కోసం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రెండు కుండలను తొలగించేటప్పుడు, వారు జగ్, ఇటుకలు, మట్టి క్రౌబార్, విరిగిన కుండ పెంకులను కనుగొన్నారు. ఇప్పటికీ పాటిగడ్డ అనేక చారిత్రక ఆధారాలతో నిండి ఉంది. పురావస్తు త్రవ్వకాలు జరిపితే ఎంతో చరిత్ర బయటపడుతుంది. ఇక్కడ సమీపమలో బిజగీర్ దర్గా ప్రసిద్ధి చెందింది.హుజురాబాద్ ప్రజలు తెలుగు, ఉర్దుభాషను (యాస) మాట్లాడుతుంటారు. ప్రజలు సంప్రదాయమైన చీరె, ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు. ప్రతీ రెండేళ్ళ కొకసారి జుపాకలో జరిగే సమ్మక్క-సారక్క జాతర జరుగుతుంది,హుజురాబాద్ లో గుట్ట చుట్టుపక్కల తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని భక్తులు ఈ జాతర జరుపుకుంటారు.హుజురాబాద్ నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా, సౌది అరేబియా దేశాలలో ఉన్నారు.భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదివినవాడు. 2014 శాసనసభ ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయం సాధించారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నాడు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]చుట్టుప్రక్కల గ్రామాలకు ఇది విద్యా కేంద్రం, మండలంలోని గ్రామములతో పాటు ఎల్కతుర్తి, సైదాపూర్, శంకరపట్నం, కమలాపూర్ మండలాలలోని విద్యార్థులు కూడా ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలతో పలు ప్రైవేటు పాఠశాలలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల,శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల, మాతృశ్రీ డిగ్రీ కళాశాల, హుజూరాబాద్ పట్టణానికి 3 కి.మీ. దూరంలో గల కే.సి. క్యాంప్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పట్టణంలో ఐ.టి.ఐ., బి.ఇ.డి., ఎమ్.బి.ఎ. కళాశాలలు, 5 కి.మీ. దూరంలో ఉన్న సింగాపూర్ గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల, 7 కి.మీ. దూరంలో ఉన్న వల్బాపూర్ గ్రామంలో ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో 10 ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 16, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 23, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 16 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 8 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, 3 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల సింగాపూర్లో ఉంది. సమీప మేనేజిమెంటు కళాశాల హుజూరాబాద్లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]హుజూరాబద్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో20 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 8 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 40 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]హుజూరాబద్లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]హుజూరాబద్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 866 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 165 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
- బంజరు భూమి: 518 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1673 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 518 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1673 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]హుజూరాబద్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 597 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 1076 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]హుజూరాబద్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]ప్రముఖవ్యక్తులు
[మార్చు]పి.వి.నరసింహారావు (మాజీ భారత ప్రధానమంత్రి), సింగాపురం రాజేశ్వర్ రావు (మాజీ రాష్ట్ర శాసన మండలి సభ్యులు), ఇనుగాల పెద్దిరెడ్డి (రాష్ట్ర మాజీ మంత్రి),కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు (రాష్ట్ర మాజీ మంత్రి),ఈటెల రాజేందర్ (తెలంగాణ తొలి ఆర్థిక శాఖా రాష్ట్ర మంత్రి), వకుళాభరణం కృష్ణమోహన్ రావు (సీనియర్ బీసీ కమిషన్ మెంబర్), ఇనుగాల భీమారావు (కేంద్ర ఎరువులు, రసాయనాల సలహా మండలి, భారత ఆహార సంస్థ సలహా కమిటీ మాజీ సభ్యులు) వడ్లూరి విజయ్ కుమార్ (తొలి మున్సిపల్ చెర్మెన్), రావుల అశోక్ (జాతీయ బీసీ సంక్షేమ సంగం మండల అధ్యక్షులు), వి.లక్ష్మీకాంత రావు రాజ్యసభ సభ్యుడు. బండా శ్రీనివాస్ (ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్)
ప్రభుత్వ కార్యాలయాలు
[మార్చు]- మండల పరిషత్ కార్యాలయం,
- మండల తహసిల్ కార్యాలయం,
- మెజీస్టృట్ కోర్ట్,
- డి.యస్.పి కార్యాలయం,
- పొలీస్ స్టేషను,
- పొస్ట్ ఆఫిసు,
- ఆసుపత్రి
- నీటి పారుదల కార్యాలయం,
- రీజిస్టేషను కార్యాలయం,
- ఆగ్నిమాపక కార్యాలయం,
- రోడ్డు రవాణా బస్సు డిపో
- విద్యుత్ కార్యాలయం
- టెలిఫొన్ కార్యలయం ఉన్నాయి
రోడ్డు రవాణా
[మార్చు]కరీంనగర్, వరంగల్ నగరంలకు మధ్యలో ఉండడం వలన రాష్ట్రంలోని ముఖ్య నగరాలతో పాటు ఇతర రాష్ట్రలకు కూడా రోడ్ రవాణా సంస్థ వవస్థ వుంది
రైలు రవాణా
[మార్చు]హుజూరాబాద్ లో రైల్వే స్టేషను లేకున్ననూ 14 కి.మీ. దూరంలో ఉన్న జమ్మికుంట, 11 కి.మీ. దూరంలో ఉప్పల్, 30 కి.మీ. దూరంలో వరంగల్, ఖాజీపేట స్టేషన్లు ఉన్నాయి.
బ్యాంకులు
[మార్చు]- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్.
- ఐ యన్ జి వైశ్య బ్యాంక్.
- ఆంధ్రా బ్యాంక్.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్
దేవాలయాలు
[మార్చు]- జుపాక సమ్మక్క సారలమ్మ
- వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం - (కస్తూరి నరేంద్రాచారి దేవాలయ అధ్యక్షులు)
- హనుమాన్ దేవాలయం (బుసారపు బాపురావు కరాటే)
- శివాలయాలు (అధ్యక్షులు ప్రతాప కృష్ణ)
- రామాలయము
- వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం
- అయ్యప్ప దేవాలయం
- సంతోషిమాత దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- నాగేంద్రస్వామి దేవాలయం
- పాటిమీద ఆజనేయస్వామి దేవాలయం
- రంగనాయకుల గుట్ట, కొండ రాయికి వెలసిన గణపతి దేవాలయం
- వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం (చుట్టుూ వరాహం ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేస్తు అందరినీ ఆకట్టుకుంది)
- కాకతీయుల కాలంనాటి శివాలయము. (ఒకే మండపానికి తూర్పు, ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉన్న మూడు గర్భ గుడులతో నిర్మిచబడింది), నంది, కోనేరు, అశ్వశాల.
- హుజూరాబాద్ పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న గొడిశాల గ్రామంలో ఉన్న శివాలయం
మసీదులు
[మార్చు]- జుమా మసీద్
- ఏక్ మినర్ మసీద్
- ఈద్-ఘా
ఇతరంలు
[మార్చు]కుల సంఘాలు
[మార్చు]- జాతీయ బీసీ సంక్షేమ సంఘం (అధ్యక్షులు: రావుల అశోక్)
- విశ్వబ్రాహ్మణ మను మయ మండల కమిటి (అధ్యక్షులు: బాణాల సదానందం)
- విశ్వబ్రాహ్మణ మనుమయ పట్టణ సంఘం (అధ్యక్షులు:రావుల వేణు)
- విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం (అధ్యక్షులు:మునిగంటి నాగరాజు)
- వీరబ్రహ్మేంద్రస్వామి స్వచ్ఛంద సేవ సంఘం (వ్యవస్థాపకులు:కస్తూరి నరేంద్రచారి)
మూలాలు
[మార్చు]- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
- ↑ "Elevation for Huzurabad". Veloroutes. Retrieved 28 April 2014.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 26 July 2014.
- ↑ http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2022-01-06. Retrieved 2023-10-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".