అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
}} |
}} |
||
[[దస్త్రం:అంజలీ దేవి - పెద్దాపురం.jpg|250px|right|thumb|అంజలీదేవి చిత్రపటం]] |
[[దస్త్రం:అంజలీ దేవి - పెద్దాపురం.jpg|250px|right|thumb|అంజలీదేవి చిత్రపటం]] |
||
అభినవ సీతమ్మగా |
అభినవ సీతమ్మగా పేరొందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు 24]], [[1927]] - [[జనవరి 13]], [[2014]]) [[1950]]-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి, నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి|url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో సంగీత [[దర్శకుడు]]. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి [[2006]]లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, [[2007]]లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. |
||
==బాల్యం== |
==బాల్యం== |
02:18, 8 జూలై 2020 నాటి కూర్పు
అంజలీదేవి | |
జన్మ నామం | అంజనీ కుమారి |
జననం | ఆగష్టు 24, 1927 పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా | 1927 ఆగస్టు 24
మరణం | 2014 జనవరి 13 చెన్నై, తమిళనాడు | (వయసు 86)
భార్య/భర్త | పి.ఆదినారాయణరావు |
ప్రముఖ పాత్రలు | లవకుశ చెంచులక్ష్మి శ్రీ లక్ష్మమ్మ కథ |
అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత.[1][2]. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము[3], 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది[4].
బాల్యం
అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది [5]. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.[6]
చిత్ర సమాహారం
నటిగా
1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.[7] సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.
నిర్మాతగా
అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.
కుటుంబం
ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.
కొన్ని ముఖ్యమైన చిత్రాలు
సంవత్సరం | సినిమా పేరు | భాష | పోషించిన పాత్ర | విశేషాలు |
---|---|---|---|---|
1936 | రాజా హరిశ్చంద్ర | తెలుగు | లోహితాస్యుడు | అంజలీదేవి నటించిన మొదటి సినిమా |
1949 | కీలుగుర్రం | తెలుగు | మోహిని (రాక్షసి) | అక్కినేని మొదటి సినిమా. |
1950 | శ్రీ లక్ష్మమ్మ కథ | తెలుగు | లక్ష్మమ్మ | |
1950 | పల్లెటూరి పిల్ల | తెలుగు | శాంత | అక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా |
1953 | పక్కయింటి అమ్మాయి | తెలుగు | లీలాదేవి, పక్కింటమ్మాయి | రేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం. |
1954 | పెన్ | తమిళం | ||
1955 | అనార్కలి | తెలుగు | అనార్కలి | |
1957 | సువర్ణ సుందరి | తెలుగు | దేవకన్య సువర్ణసుందరి | |
1958 | చెంచులక్ష్మి | తెలుగు | చెంచులక్ష్మి/లక్ష్మీదేవి | |
1959 | జయభేరి | తెలుగు | మంజువాణి | మంచి సంగీతభరిత చిత్రం. |
1962 | భీష్మ | తెలుగు | అంబ | ఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ. |
1963 | లవకుశ | తెలుగు | సీతాదేవి | ఘనవిజయం సాధించిన చిత్రం. |
1967 | భక్త ప్రహ్లాద | తెలుగు | లీలావతి | రోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం |
1972 | బడిపంతులు | తెలుగు | ఎన్టీయార్ భార్య | ఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం |
1973 | తాతా మనవడు | తెలుగు | సీత, రంగయ్య భార్య | దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం. |
1975 | సోగ్గాడు | తెలుగు | శోభన్‌బాబు తల్లి | |
1976 | మహాకవి క్షేత్రయ్య | తెలుగు | ||
1978 | అన్నాదమ్ముల సవాల్ | తెలుగు | అన్నదమ్ముల తల్లి | కృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా. |
1980 | చండీప్రియ | తెలుగు | శోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం. | |
1985 | శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం | తెలుగు | బాయీజా బాయ్ | విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర. |
1992 | బృందావనం | తెలుగు | రాజేంద్రప్రసాద్ తల్లి | మంచి కుటుంబ కథాచిత్రం |
పురస్కారాలు
- ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
- ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
- ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
- ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
- రఘుపతి వెంకయ్య పురస్కారం - 2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత గురించి.
- రామినేని పురస్కారం - 2006.
- ANR జాతీయ పురస్కారం - 2008.
మరణం
అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు[8].
ఇవీ చూడండి
మూలాలు
- ↑ "అందాల మేటి నటి". సూర్య, ఆగష్టు 24, 2013. Retrieved 13జనవరి2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)[permanent dead link] - ↑ Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)
- ↑ Anjali Devi to be honoured (Ramineni Foundation)
- ↑ Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award[permanent dead link]
- ↑ "Anjali Devi". IMDB. Retrieved 8 December 2012.
- ↑ http://www.dnaindia.com/entertainment/report-i-feel-i-ve-lost-my-mother-chandramohan-on-anjali-devi-1950943
- ↑ http://www.thehindu.com/news/cities/chennai/veteran-actor-anjali-devi-dead/article5574548.ece
- ↑ "వెండితెర సీత అంజలి దేవి కన్నుమూత". వన్ ఇండియా. Retrieved 13జనవరి2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)
బయటి లింకులు
- "అంజలీదేవి". IMDB. Retrieved 8 December 2012.
- All articles with dead external links
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1927 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు కళాకారులు
- 2014 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు