Jump to content

భూపేంద్ర పటేల్

వికీపీడియా నుండి
(భూపేంద్రభాయ్ పటేల్ నుండి దారిమార్పు చెందింది)
భూపేంద్ర పటేల్
భూపేంద్ర పటేల్


గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 సెప్టెంబరు 13
గవర్నరు ఆచార్య దేవవ్రత్
ముందు విజయ్ రూపానీ

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017
ముందు ఆనందీబెన్‌ పటేల్
నియోజకవర్గం ఘట్‌లోడియా

వ్యక్తిగత వివరాలు

జననం (1962-07-15) 1962 జూలై 15 (వయసు 62)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్
జీవిత భాగస్వామి హేటల్ పటేల్
నివాసం శిలాజ , అహ్మదాబాద్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు, సివిల్ ఇంజనీర్, బిల్డర్

భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2021 సెప్టెంబరు 13న గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పటేల్ 1962 జులై 15న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌ లోని కడవ పటిదార్ కుటుంబంలో జన్మించాడు. అహ్మదాబాద్‌ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 1982లో డిప్లొమా పూర్తి చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. 1999 నుంచి 2000 వరకు మేమ్‌నగర్‌ నగర పాలిక అధ్యక్షుడు
  2. 2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌
  3. 2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌లోని తల్తేజ్ వార్డు కౌన్సిలర్‌
  4. అహ్మద్‌బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌
  5. అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌
  6. పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ల ట్రస్టీ
  7. 2017 ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
  8. 13 సెప్టెంబర్ 2021న గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 September 2021). "గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
  2. Sakshi (13 September 2021). "గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌: ఆయనే ఎందుకు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. Andrajyothy (13 September 2021). "తొలిసారి ఎమ్మెల్యే.. గుజరాత్‌కు సీఎం". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.