Jump to content

మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ

వికీపీడియా నుండి
మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ
మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ
జననంమార్చి 10, 1884
అన్బెత, సహారన్పూర్, ఉత్తర్ ప్రదేశ్
మరణంజనవరి 11, 1946
జలాలాబాద్, నంగర్హార్, ఆఫ్ఘనిస్తాన్
యుగంబ్రిటీష్ రాజు
ప్రాంతంఇస్లామిక్ తత్వవేత్త/పండితుడు

మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ (మార్చి 10, 1884జనవరి 11, 1946) స్వాతంత్ర్య సమర యోధుడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మౌలానా మహ్మద్ అల్ హసన్ నాయకత్వంలోని పాన్-ఇస్లామిక్ ఉద్యమంలో పాల్గొన్నాడు.

జననం

[మార్చు]

మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ 1884, మార్చి 10న ఉత్తర్ ప్రదేశ్ లోని అన్బెతలో జన్మించాడు. తన తండ్రి హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న మద్రసా-ఇమన్బా అల్-ఉలంలో ప్రాథమిక విద్య చదివాడు. డార్ అల్-ఉలం నుండి పట్టభద్రుడయిన తరువాత వివిధ ప్రాంతాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

ఉద్యమంలో

[మార్చు]

1915 సెప్టెంబరులో మౌలానా ముహమ్మద్ హసన్ తో కలిసి హజజ్ కు వెళ్లి జమాట్ కి కోశాధికారిగా పనిచేశాడు. 1916, ఏప్రిల్ లో భారతదేశానికి తిరిగి వచ్చి, జూన్ లో భారతదేశంలోని స్వాతంత్ర్య సమరయోధులను కాబూల్ తీసుకువెళ్లాడు.[1] 1915 డిసెంబరులో కాబూల్ లో ఏర్పడిన భారత తాత్కాలిక ప్రభుత్వంలో చేరి యుద్ధ ముగిసేదాకా ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగాడు.

రష్యాకు వెళ్ళడంతోపాటు టర్కీలో రెండు సంవత్సరాలు గడిపాడు, అలాగే అనేక ఇతర దేశాలు తిరిగాడు. ముస్లిం మతాధికారులు నాయకత్వం వహించిన ఇస్లామిక్ పాఠశాల నుండి వచ్చిన మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు.

1946 లో భారత జాతీయ కాంగ్రెస్ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరడంతోపాటు బ్రిటీష్ రాజ్ అనుమతి కూడా లభించింది. కానీ అతను కాబుల్ లోనే ఉండి బోధనలు చేశాడు.

మరణం

[మార్చు]

ఇతను 1946, జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ లో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-08-12. Retrieved 2018-08-20.
  2. https://archive.org/stream/2VolumeBookOnTheHistoryOfDarAlUlumDeoband/HistoryOfTheDarulUloomDeoband-VolumeTwo1981_djvu.txt