రోజా సెల్వమణి

వికీపీడియా నుండి
(రోజా (నటి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆర్కే రోజా
రోజా సెల్వమణి

రోజా సెల్వమణి


ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 ఏప్రిల్ 2022

శాసనసభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
19 జూన్ 2014
ముందు గాలి ముద్దుకృష్ణమ నాయుడు
నియోజకవర్గం నగరి

వైస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015

తెలుగు మహిళా అధ్యక్షురాలు
పదవీ కాలం
1999 – 2009

పదవీ కాలం
9 జులై 2019 – 17 జులై 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1972-11-17) 1972 నవంబరు 17 (వయసు 51)
తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు నాగరాజా రెడ్డి, లలిత
జీవిత భాగస్వామి [1]
సంతానం అన్షు మాలిక, కృష్ణ కౌశిక్
వృత్తి
 • నటి
 • రాజకీయ నాయకురాలు
 • టీవీ వ్యాఖ్యాత‌
 • చిత్ర నిర్మాత

రోజా సెల్వమణి గా పేరు గాంచిన శ్రీలతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3][4][5] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక, క్రీడలు, యువజన మంత్రిగా నియమితులయ్యారు, మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యనని ప్రకటించారు.[6][7] ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి.[8]

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా ఆర్కే రోజాకు 2023 జనవరి 30న చోటు లభించింది. దీంతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాయ్ కి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.[9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రోజా 1972 నవంబరు 17లో చిత్తూరు జిల్లా, తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు జన్మించింది. ఈమెకు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అని ఇరువురు సోదరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది. ప్రస్తుతం హైదరాబాద్లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది.

2002 ఆగస్టు 21న రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్ళిచేసుకుంది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.

రాజకీయ జీవితం

[మార్చు]

2004,2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.

2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు, ఆమె 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి [10], 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి[3], ఏప్రిల్ 13న పదవీ బాధ్యతలు చేపట్టింది.[11]

నట జీవితం

[మార్చు]

రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేసింది. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. తరువాత, సినీ నిర్మాతగా కూడా వ్యవహరించింది.

తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడు ఆర్.కె.సెల్వమణి చెంబరుతి చిత్రం ద్వారా రోజాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగించింది. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్ (ఈ టీవి), బతుకు జట్కాబండి (జీ తెలుగు), రంగస్థలం (జెమిని టి.వి) వంటి కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించింది.

చిత్ర సమాహారం

[మార్చు]

తెలుగు

[మార్చు]

తమిళం

[మార్చు]
 • చెంబ‌రూతి
 • వీరా
 • సొల్లామలై

కన్నడ

[మార్చు]
 • కలావిడ
 • గడిబిడి గండ

మలయాళం

[మార్చు]
 • గంగోత్రి

బుల్లితెర

[మార్చు]
ఏడాది కార్యక్రమం ఛానల్
2010–2013 మోడ్రన్ మహాలక్ష్ములు మా టీవీ
2014-2015 రేస్ జీ తెలుగు
2013 జబర్దస్త్ ఈ టీవి
2014 ఎక్షట్రా జబర్దస్త్ ఈ టీవి
2016 రచ్చబండ జెమినీ టీవీ

మూలాలు

[మార్చు]
 1. "Tamil Cinema news – 90's favourite tamil actress, she is famous in red clothe movie... Tamil Movies – Cinema seithigal". Maalaimalar.com. Retrieved 24 April 2017.
 2. Sakshi (10 April 2022). "రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌.. ఆమెకు సరిలేరు". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 3. 3.0 3.1 Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
 4. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. "AP Cabinet: ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. కొలువుదీరిన కొత్త కేబినెట్‌". EENADU. Retrieved 2022-04-11.
 6. "మంత్రి వర్గంలో చోటు.. కెరీర్‌పై ఆర్కే రోజా కీలక నిర్ణయం". Sakshi. 2022-04-11. Retrieved 2022-04-11.
 7. Extra Jabardasth Latest Promo | Coming Soon | Sudigali Sudheer, Rashmi, Roja, Aamani | ETV Telugu, retrieved 2022-04-14
 8. Sakshi (30 September 2020). "సినిమాల కోసం పేరు మార్చుకున్న స్టార్‌ హీరోయిన్లు". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 9. "P minister Roja appointed as a member in Sports Authority Of India | Vaartha". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 10. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
 11. Prajasakti (13 April 2022). "పర్యాటక శాఖ మంత్రిగా ఆర్‌కె రోజా బాధ్యతలు స్వీకరణ". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 12. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 October 2016. Retrieved 28 July 2019.

బయటి లింకులు

[మార్చు]

మూస:TamilNaduStateAwardForBestActress