శనిగ్రహం(జ్యోతిషం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Shani.jpg

జ్యోతిష శాస్త్రంలో నవ గ్రహాలది ప్రధాన పాత్ర.ఈ జీవులజీవితంపై గ్రహాలు ప్రభావం చూపుతాయని శాస్త్ర భావన.సూర్యుణ్ణి జ్యోతిష శాస్త్రంలో రవిగా వ్యవహరిస్తారు.అలాగే ఛాయా గ్రహాలుగా భావించే రాహువు కేతువుకు జ్యోతిష శాస్త్రంలో గ్రహస్థానం కల్పించ బడింది .గ్రహాలకు నీచస్థితి ఉచ్చ స్థితి వక్ర స్థితి ఉండడం జ్యోష శాస్త్రంలో ఒక భాగమే.ఒక్కో గ్రహానికి ఒక్కోధాన్యం, వస్త్రం, వాహనం, జంతువులు, రత్నం ఉన్నట్లు వివరించబడింది. అలాగే గ్రహ కారకత్వం తల్లి,తండ్రి, అన్న,తమ్ముడు, కూతురు, మేనమామ లాంటి బందుత్వాలకు వృత్తులకు వస్తువులకు ప్రాతి పదికగా ఉంటాయి. రోగాలు, గ్రహాలననుసరించి నిర్ణయించబడతాయి. నవగ్రహాలకు జాతకచక్రంలో దశలు నిణయించబడతాయి.

శనిగ్రహం సంబధిత వివవరాలు[మార్చు]

శని భగవానుడి వాహనం కాకి

ఆకారం;- ప్రాచీన జ్యీతిషగ్రంధాలలో శని ముసలి వాడుగా వర్ణించబడ్డాడు.అంటే 90 సంవత్సరాల వృద్దుడు.రంగు నలుపు.నపుంసక గ్రహంగా శని వర్ణించబడ్డాడు.సన్నగా,పొడవుగా ఎముకల గుట్టగా నరాల పోగుగా ఉంటాడు.నూనెపూసిన శరీరం,ఇనుప కిరీటం,ఇనుప ఆభరణాలు,చేతిలో చీపురు ఉంటుంది.

  • వాహనం;- కాకి.
  • ఋతువు;- శిశిరం.
  • రుచి;- వగరు.
  • నివాసస్థలం;- అత్యంత మురికైన ప్రదేశాలు,శిధిల నిర్మాణాలు,చెత్తకుప్పలు,వసతులు లేని గ్రామాలు,శ్మశానాలు పనికిరాని వస్త్తువులని దాచే ప్రదేశం.
  • గుణం;- క్రూర గుణం.ప్రాణుల పాపఫలితాన్ని అందించే గ్రహంగా గుర్తించబడింది.ఇది పాపగ్రహంగా కూడా వర్ణించబడింది.
  • దశా కాలం;- 19 సంవత్సరాలు.
  • ఏలిననాటి శని;- జాతక చక్రంలో 12,1,2 స్థానాలలో శని సంచరించే కాలం ఏలిననాటి శని కాలం.ఇది జాతకుని అత్యంత కష్టాలపాలు చేస్తుందని విశ్వసించబడుతుంది.ఇది దాదాపు ఏడున్నర సంవత్సరముల కాలం.ఇది జాతకునికి నాలుగు సార్లు రావచ్చని భావన.పాద శని,పొంగు శని,మంగు శని 8 మరణశని.
  • శతృవు;-రవి,చంద్రుడు,కుజుడు శతృగ్రహాలుగా భావిస్తారు ఆకారణంగా రవి కారకత్వంగా కలిగిన తండ్రి చంద్రుడు కాతకత్వంగా కలిగిన తల్లి కుజుడు కారకత్వంగా కలిగిన సోదరులతో శని ఆదిపత్యం కలిగిన మకర మరియు కుంభ రాశుల వారికి పరస్పర వైరం ఉంటుందని భావిస్తారు.