ఇంద్రజ
ఇంద్రజ | |
---|---|
జననం | రాజాతి జూన్ 30 చెన్నై |
వృత్తి | సినీ నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1993-2007, 2014-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అబ్సర్ |
ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమా నటి.[1] ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు.[2]
ఆమె అసలు పేరు రజతి. పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి ఆలీ హీరోగా తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
వివాహం
[మార్చు]ఇంద్రజ 2005లో వ్యాపారవేత్త అబ్సర్‌ని వివాహం చేసుకుంది.[3]
ఇంద్రజ 2005లో తమిళఛానెల్ జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథ కు యాంకరుగా కూడా పనిచేసింది.[4] ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవి సీరియల్ వల్లిలో నటిస్తుంది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
1993 | ఉజైప్పాలి | యువ శ్రీ విద్య | తమిళం | |
1993 | పురుష లక్షణమ్ | సినిమా నటి | తమిళం | |
1994 | నమస్తే అన్నయ్య | ఆమెనే | తెలుగు | "కన్నెపెట్ట రో" పాటలో ప్రత్యేక ప్రదర్శన |
1994 | జంతర్ మంతర్ | ఇంద్రజ | తెలుగు | |
1994 | యమలీల | లిల్లీ | తెలుగు | |
1994 | అమైధి పాడై | తాయమ్మ స్నేహితురాలు | తమిళం | |
1995 | సొగసు చూడతరమా | నీలు (నీలిమా దేవి) | తెలుగు | ప్రతిపాదన- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు |
1995 | అమ్మ దొంగ | మోహన / కల్యాణి | తెలుగు | |
1995 | రాజవిన్ పర్వైయిలే | గౌరీ | తమిళం | |
1995 | బాలరాజు బంగారు పెళ్లాం | నాగమణి | తెలుగు | |
1995 | ఆస్తి మూరెడు ఆశ బారెడు | నర్తకి | తెలుగు | |
1995 | వద్దు బావ తప్పు | ప్రియా | తెలుగు | |
1995 | సర్వర్ సుందరంగారి అబ్బాయి | హీరోయిన్ | తెలుగు | |
1995 | ఎర్రోడు | సీతాలు | తెలుగు | |
1995 | ప్రేమ ఆట | ఇందు | తెలుగు | |
1995 | శుభమస్తు | సరోజ | తెలుగు | |
1995 | భర్త సింహం | ప్రత్యేక ప్రదర్శన | తెలుగు | |
1995 | వజ్రం | తెలుగు | ||
1995 | మిస్ 420 | తెలుగు | ||
1996 | మమ్మీ మీ ఆయనొచ్చాడు | శారద | తెలుగు | |
1996 | సంప్రదాయం | గీత | తెలుగు | |
1996 | పిట్టల దొర | నిక్కి | తెలుగు | |
1996 | ఇంకొక సారి | కల్యాణి | తెలుగు | |
1996 | నల్ల పూసలు | రేవతి | తెలుగు | |
1996 | జగదేక వీరుడు | లబ్బు | తెలుగు | |
1996 | బొబ్బిలి బొల్లుడు | రథని | తెలుగు | |
1997 | తాడయం | దేవి | తమిళం | |
1997 | ఒక చిన్న మాట | గీతా | తెలుగు | |
1997 | జై భజరంగబలి | రమ్య | తెలుగు | |
1997 | చిలక్కొట్టుడు | ఇంద్రజ | తెలుగు | |
1997 | పెద్దన్నయ్య | శ్రావణి | తెలుగు | |
1997 | చిన్నబ్బాయి | లలిత | తెలుగు | అతిధి పాత్ర |
1997 | ఇల్లాలు | తెలుగు | ||
1998 | వేలై | చారులత | తమిళం | |
1998 | కలవారి చెల్లెలు కనక మహా లక్ష్మి | విజయ | తెలుగు | |
1998 | గడిబిడి కృష్ణ | సీత | కన్నడ | |
1998 | ఓ పనై పోతుంది బాబూ | తెలుగు | ||
1999 | సూర్య పుత్రిక | గాయత్రి | తెలుగు | |
1999 | ది గాడ్ మాన్ | ముంతాస్ | మలయాళం | |
1999 | ఉస్తాద్ | క్షమా | మలయాళం | |
1999 | స్వాతంత్ర్యం | సిందూ | మలయాళం | |
1999 | FIR | లైలా | మలయాళం | |
1999 | పిచ్చోడి చేతిలో రాయి | ఇందు | తెలుగు | |
1999 | చిన్ని చిన్ని ఆశ | ఆశ | తెలుగు | |
1999 | కూలీ రాజా | సుమా | కన్నడ | |
1999 | హంతకుడు | సీత | కన్నడ | |
1999 | ఉన్నరుగే నాన్ ఇరుంధాల్ | నర్తకి | తమిళం | అంశం సంఖ్య |
1999 | ప్రత్యర్థ | కన్నడ | ||
1999 | అవలే నాన్న హుడుగీ | కన్నడ | ||
1999 | తెలంగాణ | తెలుగు | ||
2000 | సమ్మక్క సారక్క | అతిథి పాత్ర | తెలుగు | |
2000 | సుందర పురుష | హీరోయిన్ ఇర్వసి | కన్నడ | |
2000 | ఖడ్గ | గాయత్రి | కన్నడ | |
2000 | శ్రద్ధ | సుధ | మలయాళం | |
2000 | ముందైతే ఊర హబ్బా | కన్నడ | ||
2001 | ఉన్నతంగళిల్ | హెలెన్ | మలయాళం | |
2002 | కృష్ణ గోపాలకృష్ణ | భామ | మలయాళం | |
2003 | చేరి | అరుంధతి | మలయాళం | |
2003 | ఆచంటే కొచ్చుమోల్ | డైసీ | మలయాళం | |
2003 | క్రానిక్ బ్యాచిలర్ | భవానీ రాజశేఖరన్ | మలయాళం | |
2003 | వార్ అండ్ లవ్ | కెప్టెన్ హేమ వర్మ | మలయాళం | |
2003 | రిలాక్స్ అవ్వండి | చిత్ర | మలయాళం | |
2004 | తాళమేళం | అమ్ముకుట్టి | మలయాళం | |
2004 | అగ్నినక్షత్రం | అమ్ము | మలయాళం | |
2004 | ఎంగల్ అన్నా | భవానీ | తమిళం | |
2004 | మాయిలాట్టం | మీనాక్షి | మలయాళం | |
2005 | లోకనాథన్ IAS | మలయాళం | ||
2005 | బెన్ జాన్సన్ | గౌరీ | మలయాళం | |
2006 | హైవే పోలీస్ | రంజిని | మలయాళం | |
2006 | నరకాసురన్ | నీనా విశ్వనాథన్ | మలయాళం | |
2007 | ఇంద్రజిత్ | షాహినా | మలయాళం | |
2014 | దిక్కులు చూడకు రామయ్య | భవానీ | తెలుగు | |
2015 | బుడుగు | డాక్టర్ గీతారెడ్డి | తెలుగు | |
2015 | సింహం | సీబీఐ డిప్యూటీ చీఫ్ ఇంద్రాణి | తెలుగు | |
2017 | శతమానం భవతి | ఝాన్సీ | తెలుగు | |
2017 | శమంతకమణి | భానుమతి | తెలుగు | |
2018 | అజ్ఞాతవాసి | కృష్ణవేణి భార్గవ్ | తెలుగు | |
2018 | హ్యాపీ వెడ్డింగ్ | నీరజ | తెలుగు | |
2019 | అక్కడొకడుంటాడు | మమత | తెలుగు | |
2019 | సాఫ్ట్‌వేర్ సుధీర్ | చందు తల్లి | తెలుగు | |
2021 | అల్లుడు అదుర్స్ | శ్రీను తల్లి | తెలుగు | |
2021 | స్టాండప్ రాహుల్ | రాహుల్ తల్లి | తెలుగు | |
2022 | అనంతం | మరగతం | తమిళం | |
2022 | మాచర్ల నియోజకవర్గం | సిద్ధు తల్లి | తెలుగు | |
2022 | 12C | ఆశా పై | మలయాళం | చిత్రీకరణ |
2022 | తాజా వార్తలు | తమిళం | చిత్రీకరణ | |
2022 | ఇది నా జీవితం | చిత్రీకరణ | ||
2023 | ఉగ్రం | డాక్టర్ మానస | ||
2023 | స్కంద | |||
2024 | రజాకార్: హైదరాబాద్ సైలెంట్ జెనోసైడ్ | తెలుగు | ||
బొమ్మక్ క్రియేషన్స్ | [5] | |||
2024 | బూట్ కట్ బాలరాజు | తెలుగు | ||
ప్రతినిధి 2 | ||||
మారుతి నగర్ సుబ్రమణ్యం |
టెలివిజన్
[మార్చు]కార్యక్రమం | భాష | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|
సుందరకాండ | తెలుగు | జెమినీ టీవీ | పవిత్ర |
పాసం | తమిళం | సన్ టీవీ | జానకి |
ఆణ్ పావం | |||
భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్ | ప్రత్యేక ప్రదర్శన | ||
వల్లి | మధుమిత సుబ్బు | ||
ప్రేమానురాగం - నానా | తెలుగు | ||
గెట్ రెడీ | తెలుగు | ఈటీవీ | |
వావ్ 2 | తెలుగు | ||
కాష్ | తెలుగు | ||
జబర్దస్త్ | తెలుగు | 1 ఏప్రిల్ 2021 నుండి 20 మే 2021 వరకు న్యాయమూర్తి | |
శ్రీదేవి డ్రామా కంపెనీ | తెలుగు | ||
సిక్స్త్ సెన్స్ | తెలుగు | ||
తగ్గేదెలే | తెలుగు | ||
అలితో సరదాగా | తెలుగు | ||
పెళ్లాం వద్దు పార్టీ ముద్దు | తెలుగు | ||
JB జంక్షన్ | మలయాళం | కైరాలి టీవీ | |
కామెడీ సూపర్ నైట్ | మలయాళం | ఫ్లవర్స్ టీవీ | |
ఠక ధీమి థాక జానూ | తమిళం | జయ టీవీ | |
సంగీత భార్య గ్రాండ్ ఫినాలే | మలయాళం | ఫ్లవర్స్ టీవీ |
మూలాలు
[మార్చు]- ↑ "కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!". eenadu.net. Archived from the original on 13 March 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-07. Retrieved 2009-04-20.
- ↑ Namasthe Telangana (17 May 2021). "నాకు సాయం చేయరూ అంటూ ఇంద్రజ రిక్వెస్ట్..!". Namasthe Telangana. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-29. Retrieved 2009-04-20.
- ↑ HMTV (28 December 2021). "అద్దంకి దయాకర్ హీరోగా పాన్ ఇండియా మూవీ.. హీరోయిన్ గా ఇంద్రజ..." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇంద్రజ పేజీ