ఏక్‌నాథ్ షిండే
ఏక్‌నాథ్ షిండే | |||
| |||
మహారాష్ట్ర ముఖ్యమంత్రి (20వ)
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 డిసెంబరు 5 – 2019 నవంబరు 12 | |||
గవర్నరు | * సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | - | ||
తరువాత | * రాజేష్ తోప్
| ||
థానే & గడ్చిరోలి జిల్లాల ఇన్చార్జి మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2020 జనవరి 09 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
నియోజకవర్గం | కోప్రి - పచ్చపాఖాది | ||
25వ మహారాష్ట్ర శాసనసభాప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 2014 నవంబరు 12 – 2014 డిసెంబరు 5 | |||
గవర్నరు | * సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | ఏక్‌నాథ్ ఖడ్సే | ||
తరువాత | రాధాకృష్ణ విఖే పాటిల్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 | |||
నియోజకవర్గం | కోప్రి -పచ్చపాఖాది | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 ఫిబ్రవరి 9 దారే, సతారా, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
తల్లిదండ్రులు | శంభాజీ షిండే | ||
సంతానం | శ్రీకాంత్ షిండే[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. షిండే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు. రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిగా, అతను మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9న జన్మించాడు. అతను యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.[4]
వివాహం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే లతా షిండేతో వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో చనిపోయారు. ఏక్ నాథ్ షిండే మరో కొడుకు శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్. అతను కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
రాజకీయ జీవితం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి - పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఏక్‌నాథ్ షిండే ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసి[6] శివసేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు.[7][8]
ఏక్‌నాథ్ షిండే 2022 జూన్ 30న మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్నాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Shrikant Eknath Shinde". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Sakshi (21 June 2022). "మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్ షిండే?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Eenadu (21 June 2022). "'మహా' రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్ షిండే..?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ V6 Velugu (21 June 2022). "ఎవరీ ఏక్‌నాథ్ షిండే ?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (30 June 2022). "ఆటో డ్రైవర్ సీట్ టూ సీఎం సీట్.. షిండే జీవితంలో విషాదకరమైన రోజు అదే." Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
- ↑ telugu (21 June 2022). "ఎవరీ ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్రలో ఎవరి బలమెంత?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ "శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే సస్పెన్షన్". 21 June 2022. Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Andhra Jyothy (21 June 2022). "ఏక్‌నాథ్ షిండే పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ 10TV (30 June 2022). "మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్" (in telugu). Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
- CS1 maint: unrecognized language
- మహారాష్ట్ర రాజకీయ నాయకులు
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2004–2009
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2009–2014
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2014–2019
- శివసేన రాజకీయ నాయకులు
- మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు
- మరాఠీ రాజకీయ నాయకులు
- 1964 జననాలు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రులు
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2019–2024
- మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు