చంద్రశేఖర్
చంద్రశేఖర్ | |||
చంద్రశేఖర్ సింగ్ | |||
8వ భారతదేశ ప్రధానమంత్రి
| |||
పదవీ కాలం 10 నవంబరు 1990 – 21 జూన్ 1991 | |||
రాష్ట్రపతి | ఆర్.వెంకట్రామన్ | ||
---|---|---|---|
డిప్యూటీ | చౌదరి దేవీలాల్ | ||
ముందు | వి.పి.సింగ్ | ||
తరువాత | పి.వి.నరసింహారావు | ||
భారతదేశ హోం మంత్రి
| |||
పదవీ కాలం 10 నవంబరు 1990 – 21 జూన్ 1991 | |||
ముందు | ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ | ||
తరువాత | శంకర్రావు చవాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇబ్రహీం పట్టి, బల్లియా , యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) | 1927 జూలై 1||
మరణం | 2007 జూలై 8 న్యూఢిల్లీ, భారతదేశం | (వయసు 80)||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాదీ జనతా పార్టీ (1990–2007) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ (1964కు ముందు) భారత జాతీయ కాంగ్రెస్ (1964–75) స్వతంత్రుడు (1975–77) జనతా పార్టీ (1977–88) జనతాదళ్ (1988–90) | ||
పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం | ||
సంతకం |
చంద్రశేఖర్ సింగ్ ( 1927 జులై 1 - 2007 జులై 8) భారతదేశ రాజకీయనాయకుడు, భారత దేశపు 11వ ప్రధానమంత్రి. అతను ప్రధానమంత్రిగా 1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు తన సేవలనందించాడు.
ప్రారంభ జీవితం, విద్య
చంద్రశేఖర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని బల్లియా జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్టి గ్రామంలో 1927 ఏప్రిల్ 17న రైతు కుటుంబంలో జన్మించాడు. [1]అతను సతీష్ చంద్ర పి.జి. కళాశాల నుండి బి.ఎ చేసాడు. 1951లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పి.జి. చేసాడు.[2] అతను విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా డా.రాంమనోహర్ లోహియా తో కలసి రాజకీయ జీవితం ప్రారంభించాడు. విద్యార్థి స్థాయి రాజకీయాల్లో ఎంతో చురుకైనవాడుగా పేరుతెచ్చుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను సోషలిస్టు రాజకీయ రంగ ప్రవెశం చేసాడు.[3] అతను దుజా దేవిని వివాహం చేసుకున్నాడు.[4]
రాజకీయ జీవితం
ప్రారంభ దశలో
అతను సోషలిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాంతం పనిచేసిన రాజకీయ యోధుడు చంద్రశేఖర్. పాదయాత్ర ద్వారా దేశ ప్రజలను ఆకర్షించి చివరి వరకు ప్రజాసమస్యల కోసమే పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతను సోషలిస్టు ఉద్యమంలో ప్రజా సోషలిస్టు పార్టీ (PSP) కి సెక్రటరీ గా నియమితుడయ్యాడు. అతను ఉత్తరప్రదేశ్ లోని పి.ఎస్.పి రాష్ట్ర విభాగంలో జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. 1956-57లో అతను ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 1962 నుండి 1967 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు ఆచార్య నరేంద్రదేవ్ సారధ్యంలో పనిచేసాడు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినపుడు అతను అతను కాంగ్రెస్ పార్టీ రాజకీయవేత్త అయినప్పటికీ అరెస్టు కాబడి పాటియాలా జైలులో ఉన్నాడు. [5] జైలు జీవితం గడిపి కేంద్రంలో తొలి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రముఖపాత్ర వహించాడు. దేశ పరిస్థితులను తెలుసుకోగోరుతున్నానని తెలిపి 1983 లో దేశవ్యాప్తంగా పాదయాత్రను చేసాడు. ఇది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వణుకు తెప్పించింది. పలుమార్లు ముక్కుసూటితనం ప్రదర్శించి యాంగ్రీ యంగ్ టర్క్ గా గుర్తింపు పొందాడు.
కాంగ్రెస్ లో చేరిక
అతను సోషలిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాంతం పనిచేసిన రాజకీయ యోధుడు. అతను బ్యాంకుల జాతీయీకరణలో కీలకపాత్ర పోషించాడు. రాజాభరణాల రద్దులో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అతను 1964లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. ప్రజా సోషలిస్టు పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి జవహర్ లాల్ నెహ్రూకు అండగా నిలబడి, ఆ తర్వాత ఇందిరా గాంధీకి పలు పర్యాయాలు క్లిష్ట సమయాల్లో మద్దతుగా నిల్చి ఇందిర వ్యక్తి ఆరాధన పెరుగుతున్న సమయంలో దానిని సూటిగా ఖండించడం చంద్రశేఖర్ కే చెల్లింది. 1962 నుండి 1967 వరకు రాజ్యసభ సభ్యునిగా తన సేవలనందించాడు. 1967 లో భారత లోక్‌సభ సభ్యునిగా మొదటి సారిగా పార్లెమెంటులో అడుగుపెట్టాడు. స్వార్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాటంలో విశ్వాసం, ధైర్యం కారణంగా అతను యంగ్ టర్క్ గా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ లో సమానత్వ విధానాలకు పోరాటం చేయడానికి ఇతర "యంగ్ టర్క్" లు అంతా కలసి "జింజర్ గ్రూపు" ను ప్రారంభించారు. [6] అందులో ఫిరోజ్ గాంధీ, సంత్యేంద్రనారాయణ సిన్హా, మోహన్ ధరియా, రామ్ ధన్ లు ఉన్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ జయప్రకాశ్ నారాయణ్ కు ఆథిత్యం ఇచ్చి ఇందిర ఆగ్రహానికి గురైనాడు. జయప్రకాశ్ నారాయణతో సయోధ్య కుదుర్చుకోమని ఇందిరకే సలహా ఇచ్చి దేశ రాజకీయవేత్తలనే ఆశ్చర్యపర్చాడు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, అతను 1975 లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థినిని ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఇతర "యంగ్ టర్క్" లతోపాటు జైలు శిక్షను అనుభవించాడు.[7] ఎమర్జెన్సీ తరువాత అతను 1977లో స్థాపించబడిన జనతా పార్టీలోనికి చేరి ఆ పార్టీకి అధ్యక్షుడైనాడు. అతను భారతదేశంలో తొలి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రముఖపాత్ర వహించాడు.
జనతా పార్టీలో
ఎమర్జెన్సీ తరువాత అతను జనతా పార్టీ అధ్యక్షుడైనాడు. పార్లమెంటు ఎన్నికలలో, జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1988 అక్టోబరు 11 న వాస్తవమైన జనతాపార్టీ సంకీర్ణం నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీని వ్యతిరేకించే పార్టీలైన జనమోర్చా, జనతాపార్టీ, లోక్‌దళ్, కాంగ్రెస్ (ఎస్) పార్టీలను కలిపి జనతాదళ్ పార్టీని విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ స్థాపించాడు. జనతాదళ్ పార్టీ ద్రవిడ మున్నేట్ర ఖగజం, తెలుగుదేశం పార్టీ, అసోం గణపరిషత్ వంటి ప్రాంతీయ పార్టీలతో కలసి జనతాదళ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ పేరుతో సంకీర్ణ దళం ఏర్పడినది. దీనికి వి.పి.సింగ్ కన్వీనరుగాను, ఎన్.టి.రామారావు అధ్యక్షునిగాను, పర్వతనేని ఉపేంద్ర జనరల్ సెక్రటరీగాను నియమితులయ్యారు.[8] 1989 సార్వత్రిక ఎన్నికలలో నేషనల్ ఫ్రంటు కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలైన భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీల (రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను)తో కలసి సీట్ల సర్దుబాటు చేసుకొని పోటీ చేసింది. నేషనల్ ఫ్రంటు వారి మిత్ర పక్షాలతో కలసి కనీస మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వంటి వామపక్షాలు ప్రభుత్వం బయటి నుండి మద్దతు యివ్వడంలో ప్రభుత్వం ఏర్పడింది. 1989లో రెండవ సారి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడటంలో అతను కీలక పాత్ర పోషించాడు. ప్రధాన మంత్రి పీఠానికి అతి సమీపంలోకి వచ్చినా దేవీలాల్ తదితర నేతల వల్ల ఆ అవకాశం కోల్పోయాడు. వి.పి.సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో [9] లోక్‌సభలో వి.పి.సింగ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని విశ్వాస పరీక్షలో నెగ్గలేక 1990 నవంబరు 7 న తన పదవికి రాజీనామా చేసాడు.[10]
వి.పి.సింగ్ స్థానంలో చేరిక
ఈ పరిస్థితిని చంద్రశేఖర్ తనకనుకూలంగా మలచుకొని తన మద్దతుదారులైన దేవీలాల్, జ్ఞానేశ్వర్ మిశ్రా, హెచ్.డి.దేవెగౌడ, మేనకా గాంధీ, అశోక్ కుమార్ సేన్, సుబోధ్ కాంత్ సహాయ్, ఓం ప్రకాష్ చౌతాలా, హుకుమ్‌సింగ్, నిమన్‌భాయ్ పటేల్, ములాయం సింగ్ యాదవ్, యశ్వంత్ సిన్హా, వి.సి.శుక్లా, సంజయ్ సింగ్ లతో పాటుగా జనతాదళ్ పార్టీని విడిచి వెలుపలికి వచ్చాడు. వారితో కలసి సమాజ్‌వాదీ జనతా పార్టీ/జనతాదళ్ (సోషలిస్టు) పార్టీని ఏర్పరచాడు. [11] చంద్రశేఖర్ కు సుమారు 64 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నందున ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీతో మద్దతు తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను లోక్‌సభ విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నెగ్గి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించాడు.[12] స్పీకర్ రబీరే ఎనిమిది మంది జనతాదళ్ పార్లమెంటు సభ్యులు విశ్వస పరీక్షలో ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటించగా, రాజీవ్ గాంధీ తన మద్దతును ఉపసంహరించుకోవడానికి కొన్ని నెలల ముందే పదవిని కోల్పోయాడు. అతను చివరి నిమిషంలో వరకు మద్దతు పొందడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఏ పక్షానికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం లేనందున మరలా ఎన్నికలు జరిగాయి. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి అతి తక్కువ కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తనకు బలం లేకపోయినా పూర్తి బలం ఉన్న తరహాలో ప్రభుత్వాన్ని కొనసాగించడం విశేషం.
ప్రధానమంత్రిగా
చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా ఉన్నా కాలం 7 నెలలు. ఇది చరణ్ సింగ్ తరువాత అతి తక్కువ కాలంలో ఉన్న ప్రధానమంత్రి పదవి. అతను రక్షణ, హోం శాఖలకు మంత్రిగా ఉన్నాడు. అతని ప్రభుత్వం 1990-91 గల్ఫ్ యుద్ధం ప్రారంభం, పోరాటం జరిగిన కాలంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నందున ఆ సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. 1991 సంవత్సరంలో, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒక కొత్త ఎన్నికను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కాంగ్రెసు మద్దతు కోల్పోయిన తరువాత 1991 మార్చి 6న రాజీనామా చేశాడు. ఆ తరువాతి సంవత్సరంలో ఎన్నికలు జరిగేంత వరకు ప్రధానిగా కొనసాగాడు. [13] పార్లమెంటులో ఉన్న సమయంలో చక్కటి నడవడిక కలిగి ప్రవర్తించినందున, 1995వ సంవత్సరపు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును గెలుపొందాడు.
ప్రధాని పదవి తరువాత
దేశంలో పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధానమంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టాక చంద్రశేఖర్ ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. అయినప్పటికీ చాలా సంవత్సరాల పాటు తన లోక్‌సభ తన సీటును నిలబెట్టుకోగలిగాడు. అతను దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారత్ యాత్రా కేంద్రాలను స్థాపించాడు. హర్యానాలోని గుర్గావ్ లోని గ్రాండియా గ్రామంలో గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేసాడు. అతను పచ్చకామెర్ల వ్యాధితో మరణించాడు.
మరణం
2007 జూలై 8 నాడు 80ఏళ్ళ వయసులో న్యూఢిల్లీలో తన జన్మదినం జరిగిన వారం రోజుల తరువాత మరణించాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[14]
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాల నాయకులు అతనికి నివాళులర్పించారు.[15] భారత ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. [14] అతని దహన సంస్కారాలు జూలై 10న ప్రభుత్వ లాంచనాలతో సాంప్రదాయ పద్ధతులలో యమునా నది ఒడ్డున జన్నయక్ స్థల్ వద్ద జరిగాయి. [16][17] ఆగస్టులోఅతని చితాభస్మాన్ని సిరువాణి నదిలో కలిపారు.[18]
మూలాలు
- ↑ Chand, Attar (1991). The Long March: Profile of Prime Minister Chandra Shekhar. Mittal. p. 59. ISBN 978-8-17099-272-1.
- ↑ Dubey, Scharada (2009). Movers and Shakers Prime Minister of India. Westland. Retrieved 7 June 2015.
- ↑ The Hindu, "Former Prime Minister Chandra Shekhar dies" July 8, 2007
- ↑ Chand, Attar (1991). The Long March: Profile of Prime Minister Chandra Shekhar. Mittal. p. 13. ISBN 978-8-17099-272-1.
- ↑ Movers and Shakers Prime Minister of India by Scharada Dubey – 2009 When Emergency was declared, Chandra Shekhar was among the very few individuals within the ruling Congress party to be sent to jail.
- ↑ http://www.sjpchandrashekhar.org/samajwadijantaparty-founder-chandra-shekhar/
- ↑ Kapoor, Coomi (2015). The Emergency: A Personal History, Chapter 4. Penguin/Viking. ISBN 9789352141197. Retrieved 9 May 2017.
- ↑ New Opposition Front in India Stages Lively Rally. New York Times. (18 September 1988). Retrieved 14 September 2011.
- ↑ India's Prime Minister Loses His Parliamentary Majority in Temple Dispute. New York Times. (24 October 1990). Retrieved 14 September 2011.
- ↑ "V.P. Singh". Encyclopædia Britannica. Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2014. Web. 8 May. 2014 <http://www.britannica.com/EBchecked/topic/545849/VP-Singh>.
- ↑ Dissidents Split Indian Prime Minister's Party. New York Times. (6 November 1990). Retrieved 14 September 2011.
- ↑ Rival of Singh Becomes India Premier. New York Times. (10 November 1990). Retrieved 14 September 2011.
- ↑ "Chandra Shekhar critical". The Hindu. 8 July 2007. Retrieved 11 December 2014.
- ↑ 14.0 14.1 "Chandra Shekhar dead". The Hindu. 9 July 2007. Retrieved 11 December 2014.
- ↑ "Leaders mourn Chandra Shekhar's death". The Hindu. 9 July 2007. Retrieved 11 December 2014.
- ↑ "Former PM Chandrashekhar's samadhi to be called Jannayak Sthal". The Times of India.
- ↑ "Dignitaries bid adieu to Chandra Shekhar". The Hindu. 10 July 2007. Retrieved 11 December 2014.
- ↑ "Chandra Shekhar's ashes immersed in Siruvani". The Hindu. 13 August 2007. Retrieved 11 December 2014.
ఇతర పఠనాలు
- Khare, Harish (9 July 2007). "The quintessential Congressman". The Hindu. Retrieved 11 December 2014.
- Chand, Attar (1991). The Long March: Profile of Prime Minister Chandra Shekhar. Mittal Publications. ISBN 978-8-17099-272-1.
- "The State As Charade: V.P. Singh, Chandr Shekhar and the Rest" by Arun Shourie, Publisher: South Asia Books
బయటి లింకులు
- భారత పార్లమెంటు నుండి అధికారిక వెబ్సైటు
- Khare, Harish (9 July 2007). "The quintessential Congressman". The Hindu. Retrieved 11 December 2014.
- Chand, Attar (1991). The Long March: Profile of Prime Minister Chandra Shekhar. Mittal Publications. ISBN 978-8-17099-272-1.
- "The State As Charade: V.P. Singh, Chandr Shekhar and the Rest" by Arun Shourie, Publisher: South Asia Books
రాజకీయ కార్యాలయాలు | ||
---|---|---|
అంతకు ముందువారు విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ |
భారతదేశ ప్రధానమంత్రి 1990–91 |
తరువాత వారు పి.వి.నరసింహరావు |
భారత రక్షణమంత్రి 1990–91 |
తరువాత వారు శరద్ పవార్ | |
అంతకు ముందువారు ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ |
భారత హోం మంత్రి 1990–91 |
తరువాత వారు శంకర్రావు చవాన్ |
- Commons category link is on Wikidata
- భారత ప్రధానమంత్రులు
- రక్షణ మంత్రులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1927 జననాలు
- 2007 మరణాలు
- 6వ లోక్‌సభ సభ్యులు
- 7వ లోక్‌సభ సభ్యులు
- 9వ లోక్‌సభ సభ్యులు
- 10వ లోక్‌సభ సభ్యులు
- 11వ లోక్‌సభ సభ్యులు
- 12వ లోక్‌సభ సభ్యులు
- 13వ లోక్‌సభ సభ్యులు
- 14వ లోక్‌సభ సభ్యులు
- అలహాబాదు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు
- ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
- జనతా పార్టీ రాజకీయ నాయకులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- జనతాదళ్ రాజకీయ నాయకులు
- సమతా పార్టీ రాజకీయ నాయకులు