Jump to content

తీగలపహాడ్

అక్షాంశ రేఖాంశాలు: 19°40′00″N 78°32′00″E / 19.6667°N 78.5333°E / 19.6667; 78.5333
వికీపీడియా నుండి
తీగలపహాడ్
తీగలపహాడ్ is located in Telangana
తీగలపహాడ్
తీగలపహాడ్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
తీగలపహాడ్ is located in India
తీగలపహాడ్
తీగలపహాడ్
తీగలపహాడ్ (India)
Coordinates: 19°40′00″N 78°32′00″E / 19.6667°N 78.5333°E / 19.6667; 78.5333
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల జిల్లా
విస్తీర్ణం
 • Total2.80 కి.మీ2 (1.08 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total12,656
 • జనసాంద్రత4,500/కి.మీ2 (12,000/చ. మై.)
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationటిఎస్

తీగలపహాడ్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[2] ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[3]

భౌగోళికం

[మార్చు]

తీగలపహాడ్ పట్టణ విస్తీర్ణం 2.80 కి.మీ2 (1.08 చ. మై) గా ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో నస్పూర్, తిలక్ నగర్, మంచిర్యాల, శ్రీశ్రీ నగర్, ర్యాలి, నాగారం, గద్‌పూర్, గుడిపేట, సుబ్బపల్లి, పెద్దంపేట, దొనబండ, కర్ణమామిడి, కొండేపల్లి, రాపల్లి, హాజీపూర్, చందనాపూర్, వేంపల్లి గ్రామాలు ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] తీగలపహాడ్ పట్టణంలో 33,070 మంది జనాభా ఉన్నారు. అందులో పురుషులు 51% మంది కాగా స్త్రీలు 49% మంది ఉన్నారు. తీగలపహాడ్ సగటు అక్షరాస్యత రేటు 64% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 71% కాగా, స్త్రీల అక్షరాస్యత 55%గా ఉంది. తీగలపహాడ్‌లోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు ఉన్నారు.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • పోచమ్మ దేవాలయం
  • శ్రీ సిద్ధి వినాయక దేవాలయం
  • జామ్ మసీదు
  • నూరి మసీదు

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తీగల్‌పహాడ్‌కు రోడ్డు కనెక్టివిటీ ఉంది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "నస్పూర్ మున్సిపాలిటీ పరిధి లో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు". www.publicvibe.com. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  4. "తీగలపహాడ్(CT)(గ్రామము) | INS Media". www.ins.media (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  6. "Teegalpahad Village". www.onefivenine.com. Retrieved 2021-10-27.

వెలుపలి లంకెలు

[మార్చు]