వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 263: పంక్తి 263:
:::: తెలుగు విక్షనరి = తెలుగు భాషా నిఘంటువు + సామాన్య నిఘంటువు (science dictionary) + వైద్యపదకోశం (medical dictionary) + సాంకేతిక శాస్త్ర నిఘంటువు (technology dictionary) +++. మెదటి విభాగ దృశ్యా, రజశేఖర్ గారు మొదట కాదని అనిఉండవచ్చు. మీ పదాలు, రెండవ విభాగానికి చెందుతాయి. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 05:57, 19 నవంబర్ 2013 (UTC)
:::: తెలుగు విక్షనరి = తెలుగు భాషా నిఘంటువు + సామాన్య నిఘంటువు (science dictionary) + వైద్యపదకోశం (medical dictionary) + సాంకేతిక శాస్త్ర నిఘంటువు (technology dictionary) +++. మెదటి విభాగ దృశ్యా, రజశేఖర్ గారు మొదట కాదని అనిఉండవచ్చు. మీ పదాలు, రెండవ విభాగానికి చెందుతాయి. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 05:57, 19 నవంబర్ 2013 (UTC)
::::: [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] గారు, ఏ సభ్యులకయినా, సలహాలు, సంప్రదింపులు, సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, ఇల్లా ఎన్నైనా చెప్పుకుంటూ........ఆ సభ్యునకు అర్థవంతముగా చర్చలలో వివరించగలగాలి ఏ వాడుకరి అయినా లేదా అధికారమున్న (అధికారులు) వారు అయినా సరే. నాకు కొంతమంది ఇచ్చే పోస్టింగ్స్ చూడండి. ప్రత్యేకంగా, నా మీద దాడి అన్నట్లు ఉంటాయి. మనసుకి కష్టం కలిగే విధముగా ఉంటాయి. అసలు తెలుగు వికీలలో ఏ విషయాలు ఉండాలో కొత్తగా కొత్త విషయాలు చేర్చుతున్నప్పుడు అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మీరన్నట్లు ఏ (అంతిమ) విభాగానికి చెందినవి అయినా ఆ సభ్యునకు సరి అయినా ప్రోత్సాహము మనమందరము ఇవ్వాలి. విమర్శలు ఉండాలి. మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇంతకన్నా మీతో చర్చింటానికి మీరు ఇంకేమి విషయాలు పెద్దగా పొందు పరచలేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. [[ప్రత్యేక:Contributions/49.238.51.161|49.238.51.161]] 07:17, 19 నవంబర్ 2013 (UTC) [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:20, 19 నవంబర్ 2013 (UTC)
::::: [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] గారు, ఏ సభ్యులకయినా, సలహాలు, సంప్రదింపులు, సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, ఇల్లా ఎన్నైనా చెప్పుకుంటూ........ఆ సభ్యునకు అర్థవంతముగా చర్చలలో వివరించగలగాలి ఏ వాడుకరి అయినా లేదా అధికారమున్న (అధికారులు) వారు అయినా సరే. నాకు కొంతమంది ఇచ్చే పోస్టింగ్స్ చూడండి. ప్రత్యేకంగా, నా మీద దాడి అన్నట్లు ఉంటాయి. మనసుకి కష్టం కలిగే విధముగా ఉంటాయి. అసలు తెలుగు వికీలలో ఏ విషయాలు ఉండాలో కొత్తగా కొత్త విషయాలు చేర్చుతున్నప్పుడు అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మీరన్నట్లు ఏ (అంతిమ) విభాగానికి చెందినవి అయినా ఆ సభ్యునకు సరి అయినా ప్రోత్సాహము మనమందరము ఇవ్వాలి. విమర్శలు ఉండాలి. మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇంతకన్నా మీతో చర్చింటానికి మీరు ఇంకేమి విషయాలు పెద్దగా పొందు పరచలేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. [[ప్రత్యేక:Contributions/49.238.51.161|49.238.51.161]] 07:17, 19 నవంబర్ 2013 (UTC) [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:20, 19 నవంబర్ 2013 (UTC)
:::::: జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు, మనందరం తెవికి సమావేశంలో కలుసుకున్నాము. మనందరిది ఒకే కుటుంబం. మనలో ఏ ఒక్కరూ, ఒక్కపైసా ఆశించి పనిచేయడంలేదు. మనందరం సహృదయంతో, ఒకే పనిని పంచుకొని ఒకరికి ఒకరం తోడ్పడుతున్నాము. ఏడు గుర్రాల రధంలో ఏ ఒక్క గుర్రం వెనక పడాలని మిగిలిన ఏ గుర్రం అనుకోదు. అలా అనుకుంటే రధం ముందుకు వెళ్ళదు. నిజం చెప్పాలంటే, ఈ చర్చ జరిగే వరకు, నా దృష్టిలో తెలుగు విక్షనరి, తెలుగు భాషా నిఘాంటువు మాత్రమే. రాజశేఖర్ గారి "తొలగించ వలసినదిగా మనవి" అన్న వ్యాఖ్య నాకు సరియైనది అనిపించింది. ఎందుకంటే, అది తెలుగు భాషా నిఘంటువు (సి పి బ్రౌను గారి ది వంటి)లో ఉండదగిన పదంకాదు కాబట్టి. తరువాత, మీరు ఆంగ్లభాష విక్షనరి నుండి ఉదాహరణ ప్రస్తావించిన తరువాత, నేను పునరాలోచనలో పడినాను. అప్పుడు గ్రహించినాను, తెలుగు విక్షనరి తెలుగు భాషా నిఘంటువు మాత్రమే కాదని. నా కొత్త అవగాహనని రచ్చబండలో వెంటనే మిగిలిన కుటుంబసభ్యులతో రచ్చబండలో పంచుకున్నాను. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 05:31, 21 నవంబర్ 2013 (UTC)


== మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ? ==
== మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ? ==

05:31, 21 నవంబరు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..



<br=clear all>


దీపావళి శుభాకాంక్షలు

దీపావళి సంస్కృతి.

వికీపీడియనులందరికీ దీపావళి శుభాకాంక్షలు, దీవాలి ఈద్ ముబారక్. అహ్మద్ నిసార్ (చర్చ) 11:06, 2 నవంబర్ 2013 (UTC)

గ్రామాల గణాంకాలు - సంబంధిత మూస

గ్రామాల ప్రాజెక్టు రెండవ విడతగా గణాంకాలు, మూసలు చేర్చే ప్రయత్నం ప్రారంభించబోతున్నాను. చంద్రకాంతరావు గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2011 గణాంకాలు నాకందించారు. వీటి ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లాతో పని ప్రారంభిస్తాను. గ్రామాల వ్యాసాలకు సమాచారపెట్టెలు తయారుచేసేందుకు అనువుగా భారతీయ స్థల సమాచారపెట్టెలో కొన్ని మార్పులు చేస్తున్నాయి. గ్రామాల మూస మొదటి ప్రతి ఇక్కడ ఉన్నది. దీన్ని చూచి మీ సూచనలు, సలహాలు, మార్పులు చేర్చులు సూచించగలరు. --వైజాసత్య (చర్చ) 08:18, 3 నవంబర్ 2013 (UTC)

బాటు గణాంకాల ఆధారంగా ఒకటి లేదా రెండు గణాంకాలు పొదిగిన వాక్యాలతో వ్యాసంలో గణాంకాలు అనే విభాగాన్ని కూడా సృష్టిస్తుంది. ఆంగ్ల వికీలో చాలా ఏళ్ళక్రితం రాం‌బాట్ చేసిన పనిలాంటిదన్నమాట. అప్పట్లో అదో పెద్ద దుమారం లేపింది :-) --వైజాసత్య (చర్చ) 08:22, 3 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారూ, గ్రామాలలో కూడా సమాచార పెట్టె పెట్టాలనుకోవడం చాలా బాగుంటుంది. అయితే గ్రామాలను సూచించడానికి ఆంధ్రప్రదేశ్ పటం కాకుండా ఆయా జిల్లాల పటాలు పెట్టడం బాగుంటుందని నా అభిప్రాయం. నా బ్లాగులో వలె మండల పటంలో గ్రామాలు సూచిస్తే పాఠకులకు మరింత సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక మండలంలోని గ్రామ స్థానపు స్వల్పతేడాను గుర్తించజాలము. అదే విధంగా వ్యాస సమాచారంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి చాలా మండలాలలో గణాంకాల విభాగం ఉంది. మరో కొత్త విభాగం కాకుండా అందులోనే 2001 జనాభా వివరాల క్రిందుగా చేర్చేటట్లు బాటు తయారు చేయండి. ఒక గ్రామానికి సంబంధించి గణాంకాలు చేర్చితే నేను పరిశీలించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:36, 3 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారు ధన్యవాదాలు. ఎప్పటి నుండో మన ఆలోచనల్లోని కలని మీరు నిజం చేయబోతున్నారు. మూసలో2011 గణాంకాలు చేర్చితే సరిపోతుంది. కానీ 2001 గణాంకాలు ఉన్న గ్రామాలకు అది వ్యాసంలో గణాంకాలు అనే విభాగాన్ని సృష్టించి గణాంక వివరాలు కూడా తెలియజేస్తుంది అన్నారు. బాగుంది. భవిష్యత్తులో మరొక దశాబ్దపు జనాభా గణాంకాలు దొరికితే వాటిని కూడా అక్కడ పొందుపరిచేటట్లు ఉంటే బాగుంటుంది. చంద్రకాంతరావు గారు చెప్పినట్లు గ్రామ పేజీ మూసలో ఆంధ్ర ప్రదేశ్ పటం కాకుండా ఆయా జిల్లాల పటాలు వాడుకొని అక్షాంశ రేఖాంశాల మూలంగా ఆ పటంలో నిర్ధిష్టమైన గ్రామాన్ని గుర్తిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 12:02, 3 నవంబర్ 2013 (UTC)
గ్రామాలకు మండలాల పటం, పట్టణాలకు మరియు నగరాలకు జిల్లాల పటం మహానగరాలకు ఆంధ్ర ప్రదేశ్ పటం చేర్చితేనే బావుంటుంది అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:15, 3 నవంబర్ 2013 (UTC)
మూస చర్చా పేజీలో నా స్పందన తెలిపాను. మండల పటంలో గ్రామ స్థానం చూపెట్టటంబాగుంటుంది. దీనికి ఈక్విరెక్టాంగులర్ ప్రొజెక్షన్ గల మండల పటాలు అందుబాటులో వుంటే ప్రతి ఒక్క గ్రామాన్ని సులభంగా వేరే పొరగా చూపెట్టవచ్చు. పటముల నాణ్యతను పెంచడానికి ప్రస్తుతం వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు అప్లికేషన్ ప్రతిపాదించబడింది. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు చూడండి. --అర్జున (చర్చ) 04:36, 4 నవంబర్ 2013 (UTC)
మీరందరూ అభిలషిస్తున్నట్టే నాకూ వీలైతే మండలాల పటాలు చూపాలని ఉంది కానీ అవి తయారుచేయటం అంత సులభమైన పని కాదు. పైగా జీ.ఐ.ఎస్ పరిజ్ఞానమున్న సభ్యులెవరూ తెవికీలో లేనట్టున్నారు. ఆంగ్ల వికీలో కొన్నేళ్ళ క్రితం అరుణ్ ప్లేన్‌మాడ్ ను ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటాలు చేయమని అడిగాను. కానీ అది చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆయన నిరాకరించారు. చూస్తుంటే వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు ద్వారా జిల్లాల స్థాయి పటాలు 2014 చివరి లోపల సమకూర్చే ప్రతిపాదన ఉన్నట్టుంది. ఇక మండలాల స్థాయి ఫోటోలుపటాలు మనలో ఎవరైనా బాగా శ్రమదానం చేస్తే కానీ తయారవవు. ప్రభుత్వ సంస్థల (జిల్లా కార్యాలయాల్లాంటివి కాకుండా జి.ఐ.ఎస్ బాగా తెలిసినవి) మద్దతు తీసుకొంటే పని సులభంగా జరిగిపోవచ్చు?? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పటమే ఉంటుంది. కానీ ఆయా జిల్లాల పటాలు లభ్యమవగానే వాటికి మారుస్తాయి. ఈ పటం కూడా ఆయా గ్రామాల యొక్క అక్షాంశరేఖాంశాలుంటేనే మూస ఆ పటాన్ని చూపుతుంది --వైజాసత్య (చర్చ) 05:22, 4 నవంబర్ 2013 (UTC)
నేను మండలాలలో గ్రామస్థానాన్ని సూచించే బొమ్మలు తయారుచేయగలను. ఇదివరకు తాండూరు, గండీడ్, యాలాల తదితర మండలాలకు సంబంధించిన గ్రామాలలో పటాలు తయారుచేసి అతికించాను కూడా. అయితే ఆ తర్వాత సెలవులోకి వెళ్ళడంతో ఆ పని అర్థాంతరంగా ఆగిపోయింది. ఉదా: గండీడ్ మండలంలోని సల్కర్‌పేట్ గ్రామం, దస్త్రం:Agganur, Yalal Mandal.PNG చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:49, 4 నవంబర్ 2013 (UTC)
చంద్రకాంత రావు గారూ, మీరు చేసిన పద్ధతిలో అయితే ప్రతి గ్రామానికి ఒక బొమ్మ చేయవలసి వస్తుంది. అదే ఈ స్థానసూచిక పటాలుంటే, ఒక్కో మండలానికి ఒకే పటముంటుంది కానీ అక్షాంశరేఖాంశాల ఆధారంగా మండల పటంపై ఆటోమేట్టిగ్గా గ్రామం యొక్క స్థానాన్ని సూచిస్తాయి. కాస్త సమయం పట్టినా, ఈ స్థానసూచిక పటాలను తయారుచేసే పద్ధతిని నేర్చుకొని మనం మండలాల పటాలను తయారుచేసుకోవటం మంచిది. ఒకసారి ఈ మూల పటాలను చేసుకొంటే ఇంక మనకు కావలసిన విధంగా అనేక రకాల పటాలను తయారుచేసుకొనే వీలుంటుంది. పైగా ఆంగ్ల వికీలో పటాలను తయారుచేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తున్నట్టున్నారు. --వైజాసత్య (చర్చ) 09:08, 4 నవంబర్ 2013 (UTC)
నిజమే మీరు చెపింది సరైనదే. మండలపటం తయారైతే ప్రతి గ్రామానికి ఒక పటం తయారుచేయడం కష్టమేమీ కాదు (చుక్క పెట్టి పేరువ్రాయడమే) కాని వేల పటాలను అప్లోడ్ చేయవలసివస్తుంది. మీరు చెప్పినట్లు అక్షాంశ-రేఖాంశాల ఆధారంగా పనిచేసే జిల్లా పటాన్ని తయారుచేయడానికి ప్రయత్నిస్తాను. సమాచారపెట్టెలో సర్పంచి వివరణ ఇవ్వడం బాగుంది. 2006, 2013 సర్పంచి వివరాలు కూడా నావద్ద ఉన్నాయి (నోట్స్ రూపంలో). అలాగే గ్రామ వైశాల్యము కూడా పెట్టెలో చేర్చవచ్చు. అడవులు, పంటలు, వార్డుల సంఖ్య వివరాలు కూడా చేర్చడానికి సమాచారపెట్టెలో స్థానం కల్పిస్తే బాగుంటుంది. గ్రామవ్యాసాలలో సమాచారం వృద్ధిచెందితే తెవికీకి మంచిపేరు వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:13, 4 నవంబర్ 2013 (UTC)
మీరు తయారుచేసిన సమాచారపెట్టె ప్రయోగాత్మకంగా కోకట్ గ్రామంలో వాడిచూశాను. గ్రామస్థానం అసలు కంటె కొద్దిగా పశ్చిమానికి చూపిస్తుంది. సర్పంచి పేరుకు లింకును తొలిగించిననూ లింకు వస్తోంది. సర్పంచి పేర్లకు లింకులు అవసరమైతేనే ఇచ్చేటట్లుగా చేయండి. లేనిచో ఎర్రలింకులు ఏర్పడటం లేదా వేరే వ్యాసాలకు దారితీయడం జరుగవచ్చు (కోకట్ వ్యాసంలో విజయలక్ష్మి పేరు విజయలక్ష్మి దేవతకు దారితీసింది). సి. చంద్ర కాంత రావు- చర్చ 13:19, 4 నవంబర్ 2013 (UTC)
మీరు సూచించినట్టుగా సర్పంచి పేరుకు లింకును తొలగించాను. గ్రామస్థానం పశ్చిమంగా కనిపిస్తుందంటే అక్షాంశ రేఖాంశాలైనా తప్పుండాలి లేదా ఈ సూచికాబిందువు చాలా బొద్దుగా ఉండటం వళ్ళ అలా కనిపిస్తూ అయినా ఉండాలి. జిల్లా/మండల స్థాయి పటాలుంటే మరింత ఖచ్చితంగా గ్రామాన్ని పటంపై చూపించవచ్చు. అడవులు, పంటలు, వార్డుల సంఖ్యల వివరాలు చేర్చటానికి తగిన మార్పులు త్వరలోనే చేస్తాను --వైజాసత్య (చర్చ) 05:24, 6 నవంబర్ 2013 (UTC)

వాడుకరి మూసలు

వాడుకరి పెట్టెలు వాడుకరి ఔన్నత్యాన్ని ప్రతిబించేటట్లు ఉండాలి. ఈ మధ్య కొన్ని పెట్టెలు నిజ జీవితంలొ చేసే ప్రతి కృత్యానికి తయారుచేయటం వలన వారికి తెలియజేయుటకు అలా చేశాను. క్షమించండి.

ఇలా ఐపీ అడ్రస్ తో వ్రాయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్ తెవికీలో చురుకైన సభ్యులలో ఇద్దరికి వస్తుంది. రెండో వ్యక్తి ఎవరనేది నాకు తెలుసు. రోజూ అన్ని రచనలు పరిశీలించే వారికి ఇది తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. చెప్పేది ధైర్యంగా సభ్యనామంతోనే చెప్పడం మంచి పద్దతి. పొరపాటున లాగిన్ కాకుండా ఐపీ అడ్రస్‌తో వ్రాయడం వేరు, ఉద్దేశ్యపూర్వకంగా వ్రాయడం వేరు. 10 మాసాల క్రితం రచ్చబండలో కూడా ఈ సభ్యుడే 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్‌తో దిద్దుబాట్లు చేసిన సంగతి విదితమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:03, 1 నవంబర్ 2013 (UTC)
ఏ దుశ్చర్య చేయకపోయినా తెవికీపై గౌరవం కొద్దీ క్షమాపణ అడిగినపుడు మధ్యలోనికి వచ్చి ఆరా తీయటం ఎంతవరకు సబబు? అజ్ఞాత సభ్యులు చర్చించరాదా?106.207.16.102 11:41, 2 నవంబర్ 2013 (UTC)
మీ ప్రైవసీని గౌరవిస్తాను, మీరు చెప్పదలచుకున్నది నాకు అర్ధం అయ్యింది. అందుకనే మీ ప్రతిస్పందనా మూసలు చూడగానే నాకో పది నిమిషాల పాటు కళ్ళలో నీళ్లొచ్చేంతగా నవ్వొచ్చింది. ధన్యవాదాలు. అజ్ఞాతసభ్యులకూ చర్చించే హక్కు భేషుగ్గా ఉన్నది. ఇక ఈ నిత్యకృత్యాలకు సంబంధించిన పెట్టెల విషయానికొస్తే ఒక సభ్యుడు ముచ్చట పడ్డాడు సరదాగా వదిలెయ్యండి. అలాంటి వాడుకరి మూసలు తయారుచేసుకోవటం వికీనియమాల ఉల్లంఘణ ఏమాత్రం కాదు. కాకపోతే అవసరమా? అన్న ప్రశ్నను మాత్రం మనం వేసుకోవచ్చు. ఆ సభ్యుడికి అవసరమనిపించింది. అసభ్యత, అశ్లీలం లేనంత వరకు నాకేం అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 22:25, 2 నవంబర్ 2013 (UTC)
మరికొంత వివరణ ఇవ్వాలనిపించింది. వాడుకరి మూసలు పచ్చబొట్లలాంటివి. కొందరికి అవి ససేమిరా ఇష్టమిండదు, మరికొందరికవి వ్యసనం; పర్సనాలిటీ ఎక్స్‌ప్రెషన్ (వ్యక్తిత్వ ప్రదర్శన). ఇవి వాడుకరి పేజీల్లోనే వాడతారు కాబట్టి పెద్దగా నియంత్రించే అవసరం లేదు. ఇక అజ్ఞాతత్వం గురించి - సాధారణంగా లాగిన్ ఉన్నవారు ఉద్దేశ్యపూర్వకంగా అజ్ఞాతులుగా వ్యాఖ్యలు చేయటం సముదాయం హర్షించదు. కానీ మీ concern కూడా నాకర్ధం అయ్యింది. మీరు విమర్శిస్తే ఆ తర్వాత ఆ సభ్యునితో కలిసి సరిగా పనిచేయలేకపోవచ్చని మీకనిపించి ఉండవచ్చు. అది కొంచెం కష్టమైనా, మనం ఒక పద్ధతిని, ఆలోచనను, ఒక దిద్దుబాటును విమర్శిస్తున్నాం కానీ వ్యక్తులను విమర్శించడం లేదని అందరూ అర్ధం చేసుకోవాలి. ఇక్కడ చర్చలూ, విమర్శలూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగత విమర్శలు, దూషణలను మాత్రం వికీ సహించదు. --వైజాసత్య (చర్చ) 22:44, 2 నవంబర్ 2013 (UTC)
లెస్స పరికితిరి. మీ పేరు "Why? जा...సత్య" లోనే మూడు భాషలతో కూడిన తాత్విక సందేశం ఉంది. "అనవసర విషయాలెందుకు?సత్యాన్వేషణ కోసం వెళ్ళండి" అని. సత్యానికి కట్టుబడే వారికి అంతిమ విజయం ప్రాప్తించినప్పటికీ హరిశ్చంద్రునిలా కొన్ని కష్టాలు తప్పవు. నేటి సమాజంలో "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ,నబ్రూయాత్ సత్య మప్రియం..." అనేది సరిపోతుంది. అంటే అప్రియమైన సత్యం కంటే ప్రియమైన అసత్యం ఎదుటి వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. అందువల్ల సత్యాన్ని నేరుగా చెప్పి సభ్యుల మనోభావాలను గాయపర్చరాదని పరోక్షంగా రెండు మూసలు తయారుచేసి యివికూడా మూసలేనా? అన్నట్లు సందేవశాన్నిచ్చాను. ఏమీ అనుకోవద్దు.223.177.7.130 01:43, 3 నవంబర్ 2013 (UTC)
ఐపీ అడ్రస్‌తో వ్రాయడం తప్పేమీ కాదు, చేసింది దుశ్చర్య కాదు కాని దాదాపు అదే ఐపీ ఉన్న తోటి సభ్యులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది. దాదాపు ఐదున్నర సంవత్సరాల క్రితం ఇలా ఐపీ అడ్రస్ మరియు మారుపేర్లతో ప్రారంభమైన చిన్న ఉదంతం చివరకి తెవికీలో ఎంత దుమారం లేపిందో అప్పటివాళ్ళకే తెలుసు. ఈ చర్యలతో ఏ మాత్రం సంబంధం లేకున్నా దేవా అనే సాంకేతికంగా నిపుణత ఉన్న సభ్యుడిని మనం కోల్పోవడానికి సరిగ్గా ఇలాంటి చర్యే కారణమైంది. ఎవరో చేసిన తప్పుకు దేవాగారు నిర్వాహకహోదానే వదులుకున్నారు. ఇప్పుడు ఈ 106తో ప్రారంభమయ్యే ఐపీ నాకూ వస్తుంది కాబట్టి నేను అభ్యంతరపర్చాను. ఆ సభ్యులతో కలిసి పనిచేయలేకపోతామని భావించి అందరూ ఇలా ఐపీ తో చెప్పడం ప్రారంభిస్తే తెవికీలో కొత్త దుస్సంప్రదాయానికి దారితీసినట్లవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:51, 3 నవంబర్ 2013 (UTC)
మీకు 106 ఐ.పి సంఖ్య కలదని ఆ సంఖ్య గల వేలాది మంది సభ్యులు చేసే చర్చలకు మీరెలా బాద్యులవుతారు? లాగిన్ ఐన వారందరూ జ్ఞాత సభ్యులేనా?ఈ చర్చను నేను ముగించినప్పటికీ ఇంకా చర్చను రచ్చ చేస్తున్నారు.నేనేమి చేస్తే మీరు శాంతిస్తారు? 223.177.68.193 06:59, 3 నవంబర్ 2013 (UTC)
నేను అశాంతిగా ఏమీలేను. ఏదేని విషయం సభ్యుల దృష్టికి తేవడానికి చర్చలలో మన అభిప్రాయాలు చెప్పడం అవసరమే. పైన ఈ రోజు నేను చెప్పిన విషయాలు ఏ ఒకరికో కాకుండా తెవికీ సమాజానికి ఉద్దేశించి చెప్పాను. రచ్చకు చర్చకు తేడా తెలుసుకోకపోవడం శోచనీయం సి. చంద్ర కాంత రావు- చర్చ 07:05, 3 నవంబర్ 2013 (UTC)

నాస్పందన

చర్చ చేయటానికి రచ్చబండ వేదిక ఉంది. నేను ఈ సభ్యుని పేజీలో చర్చ ప్రారంభించలేధు.వివరణ మాత్రమే ఇచ్చాను. ఈ పేజీలో చంద్రకాంతరావు గారి జోక్యం అనవసరం. ఆయన హుందాగా వ్యవహరించాలి. 106.206.177.180
ఇది నా చర్చా పేజీ అయినా, ఇక్కడి చర్చలోనే ఇతరులు పాల్గొనకూడదన్న నియమేమీ లేదు. ఇదివరకు జరిగిన కొన్ని సంఘటనలవల్ల చంద్రకాంతరావు గారు అప్రమత్తతో వ్యవహించారని అనుకొంటాను. ఇందులో ఇక చర్చించవలసినదేమీ లేనట్టు నాకు తోచింది. ఏదేమైనా చర్చను రచ్చబండకు తరలిస్తున్నాను. కావలంటే ఇక అక్కడ కొనసాగించగలరు. --వైజాసత్య (చర్చ) 08:34, 3 నవంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా - లోకజ్ఞాన సమాచారము

తెవికీ లో లోకజ్ఞాన సమాచారము (జనరల్ నాలెడ్జ్ బిట్స్) చేర్చుటకు విభాగాలవారీగా (కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్, క్రీడలు, సినిమా, వగైరా) అవకాశము ఉన్నదా? విద్యా ఉపాధి ప్రాజెక్టులో అవకాశము ఉన్నదనుకుంటాను. దయచేసి ఎలా చేర్చాలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:58, 5 నవంబర్ 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారి సందేహానికి నా స్పందన ఏమిటంటే, వికీపీడియా విజ్ఞానసర్వస్వం కాబట్టి ఏది కావాలనుకున్నా దీనిలో దొరకాలి.అయితే జనరల్ నాలెడ్జి బిట్స్ గా అందించటానికి వికీపీడియా:చరిత్రలో ఈ రోజు శీర్షిక లేక క్యాలెండర్ ప్రకారం సంబంధిత రోజు (ఉదా:) లాంటివి ఉపయోగపడతాయి. విద్య,ఉపాధి ప్రాజెక్టులో సంబంధించిన విజ్ఞానసర్వస్వ వ్యాసాలను అభివృద్ధి చేయటమే బాగుంటుంది. అంతేకాక బిట్ బ్యాంకు చేయటానికి విపీడియా సాఫ్ట్వేర్ అయిన మీడియావికీ అమరిక అంత అనువైనది కాదు. చంద్రకాంత రావు గారు బిట్ బ్యాంక్ దిశగా చాలాకృషి చేశారు. వారి సలహాలు కూడా ఉపయోగపడవచ్చు.--అర్జున (చర్చ) 08:33, 6 నవంబర్ 2013 (UTC)
తెవికీలో జికె బిట్స్ చేర్చడానికి అవకాశం లేదనుకుంటాను. విజ్ఞానసర్వస్వములో వ్యాసాలు మాత్రమే ఉండాలి కదా! అయితే పట్టికలకు, కేలండర్ వ్యాసాలకు మాత్రం మినహాయింపు ఉంది. నా ఆసక్తికొద్ది ప్రారంభంలో నేను భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు వ్యాసం (!) ప్రారంభించి ఇలాంటి వ్యాసాలకు ఇక్కడ స్థానం లేదని మానుకున్నాను. వికీకి అనుబంధంగా బిట్స్ కొరకు మరో కొత్త ప్రాజెక్టు వస్తే చెప్పలేము కాని అంతవరకు అర్జునరావు గారు చెప్పినట్లు విజ్ఞానసర్వస్వ వ్యాసాలను అభివృద్ధి చేయటమే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:51, 6 నవంబర్ 2013 (UTC)
"మీకు తెలుసా?" శీర్షికను మరియు ఆ శీర్షిక భండారాన్ని మనం జనరల్ నాలెడ్జి బిట్స్‌గా పాఠకులకు ఉపయోగపడేటట్లుగా చేయవచ్చు. ఉదా:కు ఇది చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 6 నవంబర్ 2013 (UTC)
ధన్యవాదాలండీ అర్జునరావుగారూ, చంద్రకాంతరావు గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:41, 11 నవంబర్ 2013 (UTC)

CIS-A2K Grant Report September 2012-June 2013

(Apologies for writing in English. You are welcome to translate this message)

Greetings! As many of you know that the Wikimedia Foundation approved a 22 month grant to the CIS-A2K. The aim of the grant is to support the growth of Wikimedia movement in India.
Please find the Grant Report for the first 10 months period here.
CIS-A2K will be happy to receive your feedback. Please let us know if you have any suggestions, questions and concerns about the report and our work. We would be glad to have this feedback here.
We are thankful to the Wikimedia community in India, Wikimedia India Chapter and the Wikimedia Foundation for actively engaging with our work. We will continue to work upon our deficiencies, failures and successes. Thanks! --Hindustanilanguage (చర్చ) 06:46, 6 నవంబర్ 2013 (UTC)

కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ పరీక్ష

ఫైల్ ఎక్కింపు విజర్డు పనిచేస్తున్నది. దీనిని పరీక్షించి మీ అనుభవాలు, దోషాలు దాని చర్చా పేజీలో ఒకవారంలోగా తెలపండి. దోషాలు తొలగించి ముందు ముందు దీనిని ప్రక్కపట్టీనుండి వాడేటట్లుగా చేయటానికి సహకరించండి. --అర్జున (చర్చ) 13:36, 6 నవంబర్ 2013 (UTC)

పరీక్ష పూర్తయినందున ప్రక్క పట్టీలో చేతనం చేయడానికి బగ్ నివేదించడమైనది.--అర్జున (చర్చ) 00:47, 14 నవంబర్ 2013 (UTC)
చేతనమైనది. --అర్జున (చర్చ) 22:01, 19 నవంబర్ 2013 (UTC)

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం పరిణామాలు

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శనను చూసి వికీపీడియా గురించి మరింత తెలుసుకునేందుకు ఐఐఐటీ-ఆర్జీయూకేటీ ఉపకులపతి రాజకుమార్ గారు నన్ను వారి కచేరీకి ఆహ్వానించారు. వారికి యూనికోడ్ మీద ఉన్న కొన్ని సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఆపైన నూజివీడులోని క్యాంపస్ లో వికీఅకాడెమీ కోసం నేను అభ్యర్థన చేసాను. దానికి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు విభాగానికి ఇంచార్జి కుసుమా రెడ్డి గారిని ఈ విషయమై సంప్రదించమన్నారు. నిన్ననే ఆవిడను కలవటం జరిగింది. వారు వికీఅకాడెమీతో పాటుగా తెలుగు యూనికోడ్ పైన విద్యార్థులకు ఒక శిక్షణ లాంటిది ఇవ్వమన్నారు. దీనికి నేను ఇక్కడ చర్చించాక జవాబు ఇస్తానని చెప్పాను. అలానే వాళ్ళు యూనికోడ్ వాడకం మీద కొన్ని పాఠ్యాంశాలు రూపొందించి ఇవ్వమని కూడా అడిగారు. మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, డీఎల్ఐలో ఉన్న పుస్తకాలన్నీ అధిక శ్రమతో తిరిగి పీడీఎఫ్ లు గా మార్చే బదులు ఐఐఐటీలో స్కాన్ చేసిన పుస్తకాలన్నీ నేరుగా ఇస్తామనీ, వికీసోర్స్ లో జరుగుతున్న సమిష్టి కృషిలో పాలు పంచుకుంటామని కుసుమా రెడ్డి గారు తెలిపారు. అర్జున, వీవెన్, విష్ణు, రవి వైజాసత్య, చంద్రకాంత రావ్, రాజశేఖర్, పాలగిరి, సుజాత , విశ్వనాధ్, జేవీఆర్కే ప్రసాద్, మరియు ఇతర అనుభవజ్ఞులు ఈ విషయమై ఎలా ముందుకు సాగవచ్చో మీ ఆలోచనలు పంచుకోగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 05:57, 7 నవంబర్ 2013 (UTC)

చాలా ప్రగతి సాధించారు. ధన్యవాదాలు. మన దశమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని రూపొందించడానికి మార్గం సుగమం అయింది. డి.ఎల్.ఐ లోని పుస్తకాల సాఫ్ట్ కాపీ మనకి ఇస్తే మనం అప్లోడ్ చేయాలా లేదా వారినే నేరుగా అప్లోడ్ చేయమంటే బాగుంటుందా చూడండి. వారే గనుక నేరుగా అప్లోడ్ చేస్తామంటే మనం వారిలో కొందరు విద్యార్ధులకు గాని, స్టాఫ్ కిగాని అప్లోడ్ చేసే పద్ధతి ని నేర్పించవచ్చును. వారితో టచ్ లో వుండి అవన్ని వికీసోర్సులో చేరినట్లు చూడాలి.Rajasekhar1961 (చర్చ) 07:35, 7 నవంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ సంతోషకరమైన వార్త చెప్పారు. ధన్యావాదాలు. తెలుగు వికీలో పనిచేయడమే యూనికోడ్ లో పనిచేయడం. మొదట తెలుగు వికీ అవగాహన సదస్సు నిర్వహించి తదుపరి స్పందనను బట్టి ముందు కార్యక్రమము ఖరారు చేసుకోవచ్చు. ఇది సాంకేతిక విద్యాసంస్థకాబట్టి తెలుగు వికీకి అవసరమైన రకరకాల ప్రోగ్రాములను (Wikipedia:Twinkle, గణాంకాలు, విశ్లేషణ ప్రోగ్రాములు లాంటివి) వారి విద్యార్ధులతో చేయిస్తే విద్యార్ధుల నైపుణ్యము పెరగటంతోపాటు మన తెవికీ అభివృద్ధికి చాలా ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 09:28, 7 నవంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వ్యక్తిగతంగానే కాకుండా తెవికీకి కూడా మంచి పేరు వస్తుంది. తెలుగు యూనికోడ్‌పై శిక్షణ ఇవ్వడం వల్ల అంతర్జాలంలో తెలుగులో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే తెలుగు యూనికోడ్‌పై వివరణలు, అభిప్రాయాలు వ్రాయడం అదో పుస్తకం అవుతుంది. యూనికోడ్ అనేది కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా చాలా భాషలకు వర్తిస్తుంది. అసలు యూనికోడ్ అంటే ఏమిటి? దాని అవసరం ఏమిటి? యూనికోడ్ ప్రవేశపెట్టడానికి ముందు పరిస్థితి ఏమిటి? ఎప్పుడు ప్రారంభమైంది? దాని వల్ల లాభాలేమిటి? లోపాలేమిటి? తెలుగు యూనికోడ్‌కు-ఇతర తెలుగు ఫాంట్లకు తేడా ఏమిటి? ఇంకనూ చేయాల్సిన మార్పులేమిటి? తదితరాలు శిక్షణలో చెప్పవచ్చు. తెలుగు యూనికోడ్ అంటే కేవలం తెవికీకి మాత్రమే కాదు, బ్లాగులు, వెబ్‌సైట్లు తదితర అంతర్జాల అవసరాలకూ కాదు, ఇంకనూ దీని విస్తృతి చాలాచాలా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా 4వ ప్రపంచ తెలుగుమహాసభల అనంతరం యూనికోడ్ ఉపయోగం బాగా పెరిగింది. విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలలో కూడా యూనికోడ్ వాడకం ఊపందుకుంటున్న వేళ విద్యార్థులకు ఈ విషయంలో అవగాహన కల్పించే అవకాశం రావడం సంతోషకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:10, 7 నవంబర్ 2013 (UTC)
  • తెలుగు యూనికోడ్ అంటే కేవలం ఖతులకు పరిమితం కాదు. సాంకేతికంగా తెలుగులో చేయాల్సినదేదయినా, అది మాట నుండి పాఠ్యం(speech to text), పాఠ్యం నుండి మాట(text to speech), మొ॥ చేయటానికి తెలుగు యూనికోడ్ మాత్రమే ప్రత్యామ్నాయాలు లేని వనరు. చాలా భాషలు కాదు-ప్రపంచ భాషలన్నీను! ప్రభుత్వ కార్యాలయాల్లో యూనికోడ్ ఉపయోగం పెరిగింది అని చెప్పలేము. ఈ మధ్య నేను వెళ్ళిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా లీప్ ఆఫీస్ లాంటి ఉపకరణాలే వాడుకలో ఉన్నవి. ఖతులను ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన సిలికానాంధ్ర లేక సమాచార సాంకేతిక శాఖ ఆ ఖతులని ఇప్పటి వరకూ వారు వాడే ముద్రణలలో ఎక్కడా వాడటం లేదు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:21, 7 నవంబర్ 2013 (UTC)
  • తెలుగు యూనికోడ్ అనేది ఫాంట్లకే పరిమితం కాదు కాని యూనికోడ్ కంటే ముందే "మాట-పాఠ్య-మాట"లు బదలాయించడం జరిగేది, ఇది కొంత క్లిష్టమైనదే కాకుండా ఒక భాష నుంచి మరో భాషకు మాత్రం బదలాయింపు అవకాశం లేకుండేది. అయితే ప్రస్తుతం యూనికోడ్ అనేది ప్రపంచంలోని అన్ని భాషలలో లేదు, అసలు చాలా భాషలకు లిపులు కూడా లేవు, కాకుంటే దాదాపు అన్ని ప్రధాన భాషలలో యూనికోడ్ ఉన్నట్లు చెప్పవచ్చు. (మనదేశంలో 1600 పైగా భాషలుంటే అందులో యూనికోడ్ ఉన్న భాషలు సుమారు ఒక్క శాతమే) ప్రభుత్వ కార్యాలయాలలో యూనికోడ్ వినియోగం నేను ప్రత్యక్షంగా పరిశీలించిన విషయమే తెలిపాను (విధినిర్వహణలో భాగంగా నేను రోజూ అనేక ప్రభుత్వ కార్యాలయాలకు నిధుల తనిఖీకై వెళుతుంటాను). సి. చంద్ర కాంత రావు- చర్చ 16:30, 8 నవంబర్ 2013 (UTC)
  • చంద్రకాంత రావు గారు, మీరు చెప్పిన దానికి ఒక చిన్న సవరణ, యూనికోడ్ భాషలకు కాదు -లిపులకు. భారతదేశంలో లిపిగా గుర్తించబడినవన్నీ యూనికోడ్ లో ఉన్నవి (ధ్వనుల సమానత వలన దగ్గరిగా ఉన్న లిపిలోకి రాత మారి, ఆ లిపినే ఈ భాషకు ఆపాదించుకుంటున్నయి), మాట-పాఠ్యం-మాట అనేది ఉన్నది ఆస్కీ ఆధారిత భాషలకి, అవి యూనికోడ్ లో అంతర్భాగాలు. మన దేశంలో 1800 భాషలున్నవా లేక 1800 లిపులున్నవా? తెలియచేయగలరు. యూనికోడ్ ఈ మధ్య రాలేదు, 95 కు ముందునుండే ఉంది. 95 లో జావా వాడకం ఎక్కువవటం వలన మరింత ప్రాచుర్యం పొందింది. రహ్మానుద్దీన్ (చర్చ) 16:45, 8 నవంబర్ 2013 (UTC)
  • యూనికోడ్ అనేది లిపికే కాని భాషకు కాదు కదా! మీరు "చాలా భాషలు కాదు-ప్రపంచ భాషలన్నీను!" అంటే అన్ని భాషలకు లేదన్నాను. దాదాపు అన్ని లిపులకు ఉన్నాయంటే నేనూ ఒప్పుకుంటాను. దేశంలో 1600పైగా ఉన్నవి భాషలే అని పైన స్పష్టంగానే చెప్పాను కదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 16:54, 8 నవంబర్ 2013 (UTC)
  • మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో చూసిన మార్పు చాలా ఆనందదాయకం.ఇవిఅంతర్గతాలవటం వలన నా దృషికి రాకపోయి ఉండవచ్చు. కానీ నేను పరిశీలించిన కొన్ని విషయాలౌ మీతో పంచుకుంటున్నాను:

1. తెలుగు యూనివర్సిటీ కంపారిటివ్ స్టడీస్ విభాగం (ప్రముఖ భాషావేత్త మృణాళిని గారి కచేరీ) లో ఇంకా లీప్ ఆఫీస్ వాడటం, యూనికోడ్ వాడకంపై వారికొక వివరణ ఇస్తే, దానిని వారు సరిగా పట్టించుకోకపోవడం! తెలుగు వర్సిటీ ప్రచురణలు మరియు అమ్మకాల విభాగం వారి యూనికోడ్ కై పూర్తి విముఖత.
2. హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రెరీ, చిక్కడ్ పల్లి వారిని తెలుగు యూనికోడ్ విషయమై సంప్రదిస్తే విముఖత.
3. సెంట్రల్ యూనివర్సిటీలో ఈనాటికీ ఏమయినా తెలుగు విషయం రాయాలంటే కాంపోజింగ్ కి అను వాడకం.
4. రేషన్ కార్డుల పంపిణీ, మరియు వోటర్ గుర్తింపు కార్డ్ పంపిణీకి తెలుగు యూనికోడ్ వాడకపోవటం.
5. ఆధార్ గుర్తింపు కార్డుల లో కూడా పూర్తి స్థాయి యూనికోడ్ వాడకపోవటం.
6. మేము యూనికోడ్ మాత్రమే వాదుతున్నాం అని చెబుతున్న కొన్ని సంస్థలు, (వార్తా సంస్థలు కావచ్చు. ప్రచురణవి కావచ్చు) అను లో టైపు చేసుకొని యూనికోడ్ కి మార్చే సాధనాలను వాడి, వచ్చిన యూనికోడ్ పాఠ్యం సరి చూసుకోకుండా ప్రచురించి వేయడం. రహ్మానుద్దీన్ (చర్చ) 16:56, 8 నవంబర్ 2013 (UTC)

  • మీరు సంస్థలను పరిశీలించారు, నేను ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించాను. వీటిలోనూ ప్రాంతాలను బట్టి తేడాలుండవచ్చు. మీరు పైన తెలిపిన సంస్థలలో యూనికోడ్ పట్టించుకోవడం లేదనే విషయం ఇక్కడ పరిశీలించిననూ నిజమే కావచ్చు. దానికి చాలా కారణాలుండవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలలో (ఇక్కడి సంగతి మాత్రమే) మాత్రం గత డిసెంబరు నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని ఆదేశాలు జారీచేసి, ప్రతి కార్యాలయంలో యూనికోడ్ సాఫ్ట్‌వేర్ కూడా అందించారు, కంప్యూటర్ వాడేవారికి శిక్షణకూడా ఇచ్చారు. రాష్ట్ర ఆడిటు శాఖ వెబ్‌సైట్‌లో కూడా సాఫ్ట్‌వేరు ఉంచారు. అన్ని నివేదికలు (పాతవికూడా) ఖచ్చితంగా యూనికోడ్‌లోనే సమర్పించి వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి విషయాలను పరిశీలించడానికి నేను కూడా పాలమూరు విశ్వవిద్యాలయం సంప్రదించాలనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 8 నవంబర్ 2013 (UTC)
చాలా బాగుంది. మీరు చక్కని బాటలు వేస్తున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకునే దిశగా కొన్ని ప్రశ్నలు - డీ.ఎల్.ఐ పుస్తకాలు డిజేవియూ పద్ధతిలో?? ఉన్నాయి కదా వాటినీ నేరుగా పీడిఎఫ్ చేసే సాఫ్టువేరు ఏమీ లేదా? యూనీకోడ్ విశిష్టత, సౌలభ్యం తదితర అంశాలు వివరిస్తూ కొంత సమాచారం జతచేసుకోండి. రచ్చబండ, తెలుగు బ్లాగు, తెలుగు యూనీకోడ్ మొదలైన గూగుల్ గుంపుల్లో మీకు కావలసిన సమాచారం లభిస్తుంది. తెలుగు వికీ వారికి సాధనాస్థలంలాగా ఉపయోగపడుతుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ యుగంలో ప్రభుత్వరంగ సంస్థలు ఇంకా యూనీకోడు వాడకం గురించి మొరాయించడం శోచనీయం. మనం సాంకేతికతను ఎత్తిచూపకుండా ఉపయోగ్యతను బాగా ఎత్తిచూపాలనుకుంటా. అనూఫాంటులోనో, లీప్ లోనో ట్వీట్ చెయ్యగలరా? మనం యువత నుండి మొదలుపెడితే ఆ పైన వాళ్ళు దిగిరావటానికి అట్టేకాలం పట్టదు --వైజాసత్య (చర్చ) 03:29, 9 నవంబర్ 2013 (UTC)

నిర్వాహకత్వాన్ని అస్పృశ్యం చెయ్యొద్దు ప్లీజ్

ఇటీవల నిర్వాహకులను దెప్పిపొడవటం, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించటం చూస్తున్నాను. నిర్వహణ సరిగా జరగటం లేదు, తగినంతమంది నిర్వాహకులు లేరు అని చంద్రకాంతరావుగారిలాంటి వాళ్లు ఘోషిస్తున్న తరుణంలో నిర్వాహకులపై ఇలాంటి ఆరోపణలు చేయటం శుభసూచకం కాదు. నిర్వాహకులు తప్పులు చేయరు అని కాదు. నిర్వాహకులు కూడా సభ్యులే అని మరవరాదు. నిర్వాహకులు చేసే పనులని నిర్వాహకత్వ అధికారమధాంధకార దర్పణంలోని చూడొద్దు. అసలు ఒక సభ్యుడు నిర్వాహకుడవటంవలన ఆ సభ్యుని అభిప్రాయాలకు గానీ, ఆలోచనలకు గానీ ప్రత్యేకత ఇవ్వబడదు. నిర్వాహకులకు ఒక వ్యాసాన్ని తొలగించే వీలువంటి కొన్ని అదనపు సదుపాయాలుంటాయి. అంత మాత్రంచేత నిర్వాహకుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఉదాహరణకు ఒక వ్యాసం యొక్క తొలగింపుకు సముదాయం అంగీకరించకపోతే నిర్వాహకుడు తొలగించగలిగే సదుపాయమున్నా, ఏమీ చెయ్యలేరు. నిర్వాహకుల మొదటి కర్తవ్యం సముదాయం కోరిన పనులు చెయ్యటం. ఒక సభ్యుడు నిర్వాహకుడవగానే తనకు సభ్యునిగా ఉన్న హక్కులను కోల్పోడు. నిర్వాహకుడు కేవలం నిర్వాహకహోదాలో తీసుకునే నిర్ణయాలేవీ లేవు. నిర్వాహకులు సముదాయపు నిర్ణయాలను అమలుపరిచేందుకే ఉంటారు, నిర్ణయాలు తీసుకునేందుకు కాదు. మరో మాటలో చెప్పాలంటే సాధారణ సభ్యుడు నిర్ణయించలేని విషయాలంటూ వికీలో ఏమీ లేవు. కేవలం నిర్వాహకులు మాత్రమే నిర్ణయించే విషయాలు ఏమీ లేవు. అంతగా మీకు నిర్వాహకత్వం ఏదో ఒక హోదాగా అనిపించి, నిర్వాహకులకేవో ప్రత్యేకమైన శక్తులున్నాయనిపిస్తే తప్పకుండా నిర్వాహకత్వపు బాధ్యతలు స్వీకరించి చూడండి. అందుకు అందరూ సదా ఆహ్వానితులు. దయచేసి నిర్వాహకత్యం మాకొద్దు బాబోయ్ అనేట్టు చేయవద్దు ప్లీజ్. నేను అధికార హోదా తొలగించుకున్నది. వికీని ప్రభావితం చేయటానికి అధికారే కానవసరం లేదనే సందేశం ఇవ్వటానికే కానీ, అధికారం "భారం" అయ్యి మాత్రం కాదు. (అయినా అందులో అధికారం ఏమీ లేదు). సముదాయం ఫలానా సభ్యున్ని నిర్వాహకుడో, అధికారో చేయాలని నిర్ణయిస్తే అధికారి ఆ ఆజ్ఞను అమలుపరచగలడు. అదే అధికారులకున్న పెద్ద "అధికారం". కొంత మంది సభ్యులు సముదాయాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారంటే అది నిర్వాహకుడవటం వల్లనో, అధికారి అవటం వల్లనో వచ్చిన అధికారమో, హోదానో, హక్కో కాదు. సంవత్సరాల తరబడి తెలుగు వికీ శ్రేయస్సు కోరి ఇతర సభ్యులతో కలిసిమెలిసి పనిచేసి నలుగురి నుండి సంపాదించుకున్న అనుభవంతో కూడిన గౌరవమే కానీ లాంఛనప్రాయంగా వచ్చిన మరే అధికారం కాదు. --వైజాసత్య (చర్చ) 03:04, 9 నవంబర్ 2013 (UTC)

  • వికీపీడియాలో నిర్వాహకులచిహ్నం
    వైజాసత్య గారు చెప్పినదాన్ని ఒక్క చూపులో చెప్పే ఆంగ్ల వికీలో వాడుతున్న బొమ్మని తెలుగులోఇక్కడ చూపెట్టటంతో పాటు సంబంధిత పేజీలో చేర్చాను. అయితే అనుభవం ఎక్కువగా వున్నవారు, వికీపీడియాపై ఆకర్షణ ఎక్కువగావున్నవారు, ఎక్కువగా పనిచేసేవా‌‌‌‌‌ళ్లు నిర్వాహకునిగా లేక సభ్యునిగా చొరవతో కొన్ని పనులు చేసినప్పుడు అవి నచ్చనపుడు సౌహార్ద్ర వాతావరణంలోవారి దృష్టికి తీసుకువెళ్లితే తగిన పరిష్కారము దొరకటం సులభమవుతుంది. అలాగే ఒక నిర్వాహకుని చర్యలు సభ్యులకు ఇబ్బందిగా మారితే ఆ నిర్వాహకుని తప్పుకోమని కోరవచ్చు. వీటన్నిటికి తెవికీలో తగిన విధానాలు చేయటం కష్టంకాబట్టి (చాలా తక్కువ మంది పాల్గొంటున్నారు కాబట్టి) ఆంగ్ల వికీ విధానాలనే (మనకు ఇబ్బంది కలిగి మన స్వంతంగా విధానాలు ఏర్పాటుచేసుకొనేవరకు) వాడడం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 03:55, 9 నవంబర్ 2013 (UTC)
  • పాలగిరి-రమణ గార్ల విషయం చాలా చిన్నది. అయితే ఇద్దరి వద్దా తమ పేరే సరైనదనే ఆధారం ఉంది కాబట్టి చర్చ కొనసాగింది. ఇందులో నిర్వహణకు సంబంధించి ఎలాంటి లోపం లేదు. వ్యాసంపేరును తరలించిన పిదప ఏర్పడిన దారిమార్పు పేజీలో పాలగిరి గారు పేజీ ఖాళీచేసి సమాచారం చేర్చారు. ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. వ్యాసచరితం బాగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. వ్యాసాన్ని మళ్ళీ పాతపేరుకు తరలిస్తే సరిపోయేది. (ఇలా చేయాలంటే ముందు పాతపేరు ఉన్న పేజీ తొలిగించాలి, ఇది మాత్రం నిర్వాహకులకే సాధ్యం). పాలగిరి గారు అలా చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు కూడా, కాని పాత పేజీ తొలిగించనిదే ఆ పేరుకు తరలించడానికి వీలుకాదు. పాలగిరి గారు దారిమార్పు పేజీలో సమాచారం చేర్చడం వల్ల ఈ వ్యాసం ఇప్పుడు రమణగారే ప్రారంభించినట్లు, ఓలియిక్ ఆమ్లం పేజీని పాలగిరి గారు ప్రారంభించినట్లు ఉంది (ఏదేని వ్యాసాన్ని తరలించిననూ చరితం మొత్తం కొత్త పేరు వ్యాసానికే తరలుతుంది. దారిమార్పు పేజీ మాత్రం తరలించిన వారిపేరిట ఏర్పడుతుంది. ఆ దారిమార్పు పేజీలోనే పాలగిరి గారు సమాచారం చేర్చినట్టు చరితం ప్రకారం తెలుస్తుంది) పాలగిరిగారు నిర్వహణపై విరుచుకుపడడానికి కారణం ఇలా వ్యాస ప్రారంభకుల పేర్లను నిర్వాహకులు తమపేరిట చేర్చుకునే అవకాశం ఉన్నదనే అనుమానం మాత్రమే కావచ్చు. ఇక నిర్వహణ గురించి చెప్పాలంటే నేను ఇదివరకే చెప్పినట్లు నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఎంత పటిష్టంగా, ఆలోచించి చేసిననూ నిర్వాహకులను నిరంకుశులుగా పేర్కొన్న విషయం ఇదివరకు నాకూ అనుభవమైంది. ఇలాంటి కారణాల వల్లే నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదేమో! "అడ్డదిడ్దమైన రచనలను చేసె వారిని నిర్వహకులు ఏమి అనరు,ఏమి చెయ్యరు. ఏమి చెయ్యలేరు." అని పాలగిరి గారు చెప్పిన విషయాన్ని మాత్రం మనం ఆలోచించాలి. ఇటీవలి కాలంలో మనం ఎన్ని చర్చలు జరిపినా ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు కాని "గంటల తరబడి నిద్రలేకుండా రచనలు చేసే వారికి" మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం పాలగిరి గారి మాటల్లో వ్యక్తమైంది. చర్చలు జరపడంలో తప్పులేదు కాని వ్యవస్థపై నిందలువేయడం/తప్పుపట్టడం మాత్రం చేయకుంటే బాగుండేది. ఇక్కడ మనం కృషిచేసేది వ్యవస్థ కోసం మరియు పాఠకుల కోసం అనేది దృష్టిలో ఉంచుకొని తెవికీ అభివృద్ధికి పాలగిరిగారు తెవికీలో రచనలు కొనసాగిస్తారనే భావిస్తున్నాను. అలాగే వైజాసత్య గారు చెప్పినట్లు తెవికీలో ఎవరైనా చేర్చిన సమాచారాన్ని మరెవరైనా మార్చవచ్చు (నిబంధనలకు లోబడి) దీనిపై అభ్యంతరాలుంటే చర్చాపేజీలో తప్పకుండా తెలుపవచ్చు. మరోవిషయం ఏమిటంటే ఏదేని వ్యాసం యొక్క పేరు మార్చాలన్ననూ ఆ వ్యాసం యొక్క రచయితను మాత్రమే కాకుండా సభ్యుల మెజారిటీ నిర్ణయమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. అంటే ఇక్కడ ఏ వ్యాసమైనా, ఎవరు ప్రారంభించినా, ఎవరు పొడిగించినా లేదా ఏ ఒక్కరి వల్లే అభివృద్ధిచెందిననూ దానిపై అధికారం మాత్రం అందరికీ ఉంటుదన్నమాట. ఈ విషయాలన్నీ మనం స్పష్టంగా సభ్యులకు తెలుసుకొనే అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి వాదవివాదాలు చాలా వరకు తగ్గుతాయి అదే సమయంలో నిర్వహణ చేసేవారి ఇబ్బందులూ తగ్గుతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:08, 9 నవంబర్ 2013 (UTC)
  • వెంకటరమణ గారు చర్చాపేజీలో చర్చించకుండా తరలించడం తప్పు అయింది, దానికి ఆయన క్షమించమని అడిగారు. అయినా పేరు గురించిన వివాదం పూర్తి కాలేదు. వారివురూ పేరు విషయంలో రాజీ పడేదానికి మనం ఏమైనా సూచనలు ఇవ్వగలిగితే బావుంటుంది, తద్వారా పాలగిరి గారిని సంతృప్తి పరచగలమేమో.(నేను ఇక్కడ ప్రొనోసేషన్ లింక్ ఇస్తున్నా, [1],
    ఒలిక్ ఆమ్లం
    ..విశ్వనాధ్ (చర్చ) 06:16, 10 నవంబర్ 2013 (UTC)
చక్కగా పరిస్థితిని విశ్లేషించిన చంద్రకాంతుల వారికి ధన్యవాదాలు. విశ్వనాథ్ గారూ, ఆ వ్యాసాన్ని రమణ గారు దారిమార్పు చేసినప్పుడు అందులో పెద్ద విషయమేమీ లేదండి. అందుకే వారికి చర్చించవలసిన అవసరం కనిపించకపోయి ఉండవచ్చు. ఇక అసలు విషయానికొస్తే రెండూ సరిగానే తోస్తున్నాయి. అరువు పదాల ఉఛ్ఛారణలో ఇలాంటి తారతమ్యాలు ఉండటం సహజమే. ఏదో ఒక దాన్ని దారిమార్పు గాను, ఒకదాన్ని ప్రధానవ్యాసంగాను చేస్తే సరిపోతుంది. ఇదివరకు ఈఫిల్ టవర్ విషయంలో ఇలాంటి చర్చ ఒకటి జరిగింది. వేమూరి వారు ప్రపంచంలో చాలామందికి ఐఫిల్ టవర్ గా పరిచయమన్నారు. ఆంధ్రులు మాకు ఈఫిల్ టవర్ గానే తెలుసన్నారు. ఫ్రెంచి వాళ్ళు తూరా దె ఎఫెల్ అన్నారు :-) --వైజాసత్య (చర్చ) 08:13, 10 నవంబర్ 2013 (UTC)
నా Palagiri/sand Box లో 11,798 బైట్ల వ్యాసం వ్రాసి,దానిని ప్రధాన వ్యాస పుటకు తరలించాను, నా palagiri/sand Box కూర్పుల చరితం చూడండి.పాలగిరి (చర్చ) 09:11, 10 నవంబర్ 2013 (UTC)
అంతకు ముందు రోజు ఇలాగే ప్రొపెన్(propene)అనే శీర్షికతో నేను వ్రాసిన వ్యాసాన్ని ఫ్రొపేను గా వ్యాసంలోని పేరుతో సహా మార్చారు.అదికుడా 20కిలో బైట్ల వ్యాసం,రెండో రోజు ఈ వ్యాసం.వరుసగా రెండు వ్యాసాలను మార్చితే కోపం రావడం తప్పని నేననుకోలేదు.అందుకే అలా స్పందించా.పాలగిరి (చర్చ) 09:31, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారి శాండ్ బాక్స్ చరిత్ర చూస్తే వారి మార్పులు చూడవచ్చు. ఆ వ్యాసాన్ని తరలించక మీరు సమాచారాన్ని నకలు చేసి అతికించేసరికి మీ కృషి వ్యాస పేరుబరిలో ఒక్క మార్పుగా నమోదయింది. మీ మార్పులు లెక్క వ్యాసేతరములలో అలానే వుంటుంది. ఇకముందు వాడుకరి పేరుబరినుండి వ్యాసం పేరుబరికి తరలించి చూడండి అప్పుడు చరిత్రకూడా పూర్తిగా కనబడుతుందనుకుంటా.--అర్జున (చర్చ) 09:42, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారు నవంబరు 6న సమయం 20:13కు శాండ్‌బాక్స్ నుంచి 11798 బైట్ల సమాచారం కట్ చేసి ఒలిక్ ఆమ్లం పేజీ సృష్టించి అందులో అతికించారు. పాలగిరి గారు 18 దిద్దుబాట్ల ద్వారా వ్యాస పరిమాణాన్ని 21996 బైట్లకు చేర్చిన పిదప నవంబరు 7న సమయం 2:50న రమణగారు ఓలియిక్ ఆమ్లంకు తరలించారు. పాలగిరి గారు అదేరోజు సమయం 3:55న వ్యాసాన్ని ఓలిక్ ఆమ్లంకు తరలించారు. అదే రోజు సమయం 4:33కి సమాచారం మొత్తం తొలిగించి ఒలిక్ ఆమ్లంలో అతికించారు. వాస్తవానికి ఇది దారిమార్పు పేజీ కావడంతో చరితం మొత్తం తారుమారు అయింది. ఇప్పుడు నేను చరితాన్ని అసలు పేజీకి తీసుకువచ్చి ఒలిక్ ఆమ్లం పేజీని పాలగిరి గారే ప్రారంభించినట్లు చేశాను (చూడండి). కాని సమాచారం మాత్రం ఓలిక్ ఆమ్లం పేజీలో ఉంది. అదికూడా నేనే చేస్తే అన్ని బైట్ల సమాచారం నేనే చేర్చినట్లు నా పేరిట వస్తుంది కాబట్టి వదిలివేశాను. ఆ పని పాలగిరి గారే చేయాలి. వ్యాసం పేరును మళ్ళీ తరలించిననూ ఇప్పుడు సమస్య ఉండదు. చరితం మొత్తం కొత్త పేరుకే బదిలీ అవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:09, 10 నవంబర్ 2013 (UTC)
చరితం వచ్చింది కాబట్టి వెనక్కి వెళ్ళి ఒలిక్ వ్యాస పాతకూర్పులను కూడా పునఃస్థాపితం చేసే అవకాశం ఉంది కాని ఇక్కడి నుంచి కట్ పేస్ట్ చేసిన పిదప వేరే పేజీలో చేసిన మార్పులు ఇందులో చేరవు కాబట్టి అక్కడి వ్యాసాన్నే పాలగిరి గారి ద్వారానే అతికించడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారు ఒలిక్ ఆమ్లంలో సమాచారం కూడా చేర్చారు కాబట్టి ఇప్పుడు ఒలిక్ ఆమ్లం వ్యాస చరితం సమస్య తొలిగిపోయింది. ఓలిక్ ఆమ్లం, ఓలియిక్ ఆమ్లం పేజీలు దారిమార్పులుగా ఉన్నాయి. కాబట్టి వ్యాసాలలో ఎవరి ఒక్క దిద్దుబాటుకు కూడా భంగం కలగలేదు. చరితం సమస్య సుఖాంతమైంది ఇక వ్యాసం పేరుపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాత్రం ఆ వ్యాస చర్చాపేజీలో కొనసాగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:00, 10 నవంబర్ 2013 (UTC)

సమస్యను మంచిగా పరిష్కరించారు. చంద్ర కాంత రావు గారికి అభినందనలు...విశ్వనాధ్ (చర్చ) 06:35, 11 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారూ, ప్రొపెన్ వ్యాసాన్ని తరలించినప్పుడు మీకు అభ్యంతరం ఉంటే దాని చర్చా పేజీలో వ్రాయవలసినది. మీరు ఊరకుంటే మీకా మార్పు అంగీకారమే అని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే, వికీలో ప్రతి మార్పును ఇతరల అనుమతి తీసుకొని చెయ్యటం అసాధ్యం. ఇరవై కేబీలున్న వ్యాసాన్ని దారిమార్పు చెయ్యకూడదని ఎమీలేదు. మీరు వికీలో పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాస్తూ చక్కని కృషి చేస్తున్నారు. విషయంపై చర్చించకుండా, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని మాత్రమే ఎత్తిచూపాను. అయినా మీరు ఇసుకపెట్టెలో వ్రాసి ఎందుకు తరలిస్తున్నారు? అలా తరలించవలసిన అవసరం ఉండకూడదు. పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాయటమంటే ఒకేసారి ఇరవై కేబీలు వ్రాయటం కాదు. ఒక వ్యాసాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా సమగ్రంగా తీర్చిదిద్దటం. ఎదైనా మార్పు సరైనది కాదనిపిస్తే తప్పకుండా దాన్ని చర్చించండి. విమర్శనాత్మక దృష్టిలేకపోతే వికీ తప్పులతడకైపోతుంది. అదే పద్ధతిన ఎవరు వ్రాసిన వ్యాసాన్నైనా ఇతరులు దిద్దేందుకు జంకకూడదు. ఈ ప్రక్రియలో వాగ్వివాదాలు మామూలే, కాకపోతే విమర్శలు వ్యక్తిగతం కాకుండా, అవతలి వాళ్ళు మనలాగే వికీ శ్రేయస్సు కొరకై కృషిచేస్తున్నారని ఆలోచించాలి --వైజాసత్య (చర్చ) 07:18, 15 నవంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక

వికీపీడియా:రచ్చబండ#తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణ లో చర్చించినట్లు, కొత్త సంచిక తయారీలో వికీపీడియన్ ఛాయాచిత్రం వాడబోతున్నారు. ఆంగ్లానికి ఎడ్రియేన్ వాడెవిట్జ్ ఎంపిక చేశారు. ఛాయాచిత్రనిపుణుడు తీసిన ఇంకొన్ని చిత్రాలు సూచించారు కాని వాటిలో తెలుగు వారు లేరు. మన తెలుగు పుస్తకంకొరకు ఏ వికీపీడియన్ ఫొటో ఎంపికచేస్తే బాగుంటుందో ఇప్పటికే వికీలో వున్న ఉదాహరణ ఫోటో లింకును ఒక వారంలోగా (20 నవంబర్ 2013 లోగా)సూచించండి మరియు చర్చించండి. (పూర్తి సందర్భం కొరకు చూడండి. సరియైన నాణ్యత గల ఫోటో లేకపోతే వృత్తి నిపుణుడైన ఛాయచిత్రకారుడుతో తగిన ఫోటో తీయించి పంపవచ్చు కూడా.--అర్జున (చర్చ) 04:53, 13 నవంబర్ 2013 (UTC)

నా ఫోటో పెట్టడానికి పెద్దలు ప్రయత్నిస్తే నాకు అభ్యంతరము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 13 నవంబర్ 2013 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి స్పందనకు ధన్యవాదాలు. అనుమతికూడా ముఖ్యమైనదే. కాని ఎంపికకు కొలబద్దగా వుండవలసినవేమిటన్నవికూడా చర్చించి, అలాగే ప్రతిపాదనలు చేసేటప్పుడు స్వంతపేరుని ప్రతిపాదించడంతో పాటు, ఇతరుల పేర్లను కూడా ప్రతిపాదించి, అలా ప్రతిపాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా పేర్కొంటే ఈ చర్చను అర్ధవంతంగా చేయటానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 06:25, 13 నవంబర్ 2013 (UTC)

అర్జున గారు, చర్చకు విషయము వస్తుందని ముందుగా వ్రాశాను. తదుపరి,

  • ముందు ఫోటోల ప్రదర్శనకు అభ్యంతరము లేని ఆశించే వారి జాబితా తయారు చేసుకోవాలి. వారి వారి అనుమతి తప్పనిసరి.
  • తెలుగు పుస్తకం కొరకు మొత్తం తెలుగు వారే ఉండాలి.
  • ఫోటోలు యొక్క పరిమాణము, ప్రమాణములు పొందు పరచాలి
  • ప్రతి అభ్యంతరము వాడుకరికి వెనువెంటనే తెలియజేస్తూ, తగిన సమయము ఇస్తూ, గడువు తేదీ ప్రకటించాలి.
  • ఏ వికీపీడియన్ ఛాయాచిత్రం అయినా ఖాయం అయిన తదుపరి సభ్యులకు తెలియజేస్తే మంచిది.
  • ఫోటోల ప్రదర్శన తదుపరి ఆ ఫోటోలను ఏవిధంగా నయిననూ దుర్వినియోగ పరచినట్లయిన వికీపీడియాకు ఎటువంటి బాధ్యత ఉండదు.
  • వికీపీడియన్ ఛాయాచిత్రం ఎంపికలో వారివారి కృషి, సేవలు, వరిశ్టులు, ఇలా అనేక అంశలు పరిగణనలోనికి తీసుకోవాలి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి సూచనలకుధన్యవాదాలు. అన్ని తెలుగు వికీప్రాజెక్టులు, కామన్స్ లకు ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో ని కృషిని పరిగణించితే బాగుంటుంది. ఇక అనుమతి ముందు తీసుకోవాలా లేక పొట్టిఎంపిక జాబితా చేసిన తరువాత తీసుకోవాల అనికూడా ఆలోచించవచ్చు. ఫోటోలు నాణ్యతగా వుండాలి. అవసరమైతే ప్రత్యేకించి ఛాయాచిత్రనిపుణుడిచే తీయించాలి. వీటికి ఏమైనా ధనం అవసరమైతే తగిన రసీదుతీసుకొని ఆసభ్యునికి చెల్లించవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 13 నవంబర్ 2013 (UTC)
బ్రోచర్ రెండు పేజీలుగా ఉన్నది. బొమ్మ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది తెలుపగలరా?. .విశ్వనాధ్ (చర్చ) 07:28, 13 నవంబర్ 2013 (UTC)
నేనంటున్నది వికీపీడియా స్వయంశిక్షణ పుస్తకం గురించి. కొత్త సంచిక చిత్తుప్రతి పేజీ చూడండి. ఇది 16 పేజీలుమించి వుంటుంది.--అర్జున (చర్చ) 07:43, 13 నవంబర్ 2013 (UTC)
విధానం

2011లోవిశిష్ట వికీమీడియన్ గుర్తింపు విధానం దీనికి అవలంబించవచ్చేమో పరిశీలించి సూచనలు చేయండి. దేనికైనా కనీసం ముగ్గురు సభ్యుల ఎంపిక మండలిని నిర్ణయిస్తే ఎంపిక సమర్ధవంతంగా చేయటం వీలవుతుంది. --అర్జున (చర్చ) 08:26, 13 నవంబర్ 2013 (UTC)

బావుంటుంది కాని అందరూ తమ బొమ్మ పెట్టడానికి ఇష్టపడనప్పుడు. ఇష్టపడిన వారి బొమ్మలు పెట్టడం ఉత్తమం. ఎక్కువమంది ముందుకు వస్తే మీరన్న పద్దతిలో ఎక్కువగా కృషి చేస్తున్న వారిలో నుండి ఎన్నుకోవడం చేయవచ్చును...విశ్వనాధ్ (చర్చ) 10:35, 13 నవంబర్ 2013 (UTC)
మనము దీనిని పదిమందికి విశిష్ట గుర్తింపు కు ఎంపిక చేయడానికి విస్తరించవచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఇప్పటివరకు పనిచేసిన దాదాపు 600 మందిలో 10మందిని గుర్తించలేకపోతే అర్ధ రహితం అనుకుంటాను. అప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు తమ ఫోటో వాడుకకు అనుమతి ఇస్తారనుకుంటాను. ఈ న్యాయ నిర్ణేతల మండలిలో సభ్యత్వాని కి ప్రతిపాదనలు కావాలి. ఇప్పటికే గుర్తింపువున్న వారు మరియు /లేక తెవికీలో చాలాకాలం పనిచేసిన వారు ముందుకు వస్తే బాగుంటుంది. (అంటే దీని పర్యవసానం ఈ న్యాయనిర్ణేతల మండలి లోనిముగ్గురు సభ్యులు ఈ కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు మరియు గుర్తింపుకి సభ్యులను ప్రతిపాదించడానికి వీలుండదు.) నా వరకు నేను స్వచ్ఛందంగా ఈ మండలి సభ్యత్వానికి ప్రతిపాదన చేస్తున్నాను. అభ్యంతరాలేవైనా తెలపండి. మీరు కూడా దీనిలో వుండవలసిన సభ్యులపేర్లను స్వచ్ఛందంగా స్వంత ప్రతిపాదనను లేక వేరే వాళ్లను ప్రతిపాదించవచ్చు. ఎక్కువ ప్రతిపాదనలుంటే అభ్యంతరాలేవైనా పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:51, 13 నవంబర్ 2013 (UTC)
అర్జునరావుగారి ప్రతిపాదనలలు సమంజసంగా ఉన్నాయి. 10 సంవత్సరాల వికీపీడియా చరిత్రలో 10 మందిని గుర్తించడం సులువే. న్యాయనిర్ణేతల మండలిలో అర్జునరావుగారు ఉండడానికి అనుమతించడం ముదావహం. --t.sujatha (చర్చ) 05:47, 14 నవంబర్ 2013 (UTC)
అర్జునరావుగారితో పాటు మరికొందరు రాజశేఖర్, చంద్రకాంతరావు, లాంటి సీనియర్ సభ్యులు కొందరు కూడా ఉంటే బావుంటుది, నా వ్యక్తిగత చిత్రం ఉపయోగించడానికి నేను కూడా ముందుకు వస్తున్నను.....విశ్వనాధ్ (చర్చ) 12:48, 14 నవంబర్ 2013 (UTC)
ఈ భారత దేశంలో అన్ని విభాగాలలో ఉన్నట్ట్లే, మన తెలుగు వికీపీడియాలో కూడా ఆస్థాన వాడుకరులు సంఖ్య బాగానే ఉన్నారు. వారినే ఒక జాబితా తయారు చేస్తే, అందులోనే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు పొందు పరుచుతారు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా తేలిక. తదుపరి, ఆశావహులు మాత్రం బహుస్వల్పం, అవకాశము అంతంత మాత్రము కావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:20, 14 నవంబర్ 2013 (UTC)
t.sujatha , విశ్వనాధ్, జె.వి.ఆర్.కె.ప్రసాద్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--అర్జున (చర్చ) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
ఎంపిక సంఘం సభ్యుడిగా ఉండటానికి నాకే అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 06:58, 15 నవంబర్ 2013 (UTC)
నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. నా అసమ్మతిని పెద్ద మనసుతో క్షమించగలరు.రాధాక్రిష్ణ (చర్చ) 10:35, 15 నవంబర్ 2013 (UTC)
ఎంపిక కోసం నిర్ణయించే సంఘంలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను. మన తెవికీలో పదిమంది కృషీవలుల్ని గుర్తించి సన్మానించడం చాలా మంచిపని. ఇది మిగిలినవారికి ప్రోత్సాహకంగా కూడా వుంటుంది. ప్రైజ్ మనీ రూ. 10,000 వేలకు తక్కువకాకుండా ఉండాలి. అంటే పదిమందికి ఒక లక్ష రూపాయలు అవసరం అవుతాయి. వాటికి దాతల్ని గుర్తించి వారిని సంప్రదించాలి. ఆ ధనాన్ని మనం తేగలం అనుకుంటేనే ముందుకు పోవాలి. లేకపోతే సభ్యుల్ని నిరుత్సాహ పరచినట్లుగా భావించే ప్రమాదం ఉంది. నామినేషన్ ఇవరైనా వికీపీడియను ముగ్గురు సహ సభ్యుల్ని ఈ ప్రోత్సాహకాలకు ప్రతిపాదించవచ్చును. అలా వచ్చిన ప్రతిపాదనల నుండి ఎంపిక సంఘ సభ్యులు పదిమందిని గుర్తించిన పిదప; సమావేశం ద్వారా అందరము అభినందిస్తాము.Rajasekhar1961 (చర్చ) 11:00, 15 నవంబర్ 2013 (UTC)
రాధాకృష్ణగారి అభిప్రాయమే నా అభిప్రాయం. వైజాసత్యగారికి, అర్జునరావుగారికి విశిష్ఠ వికీపీడీయాన్ అర్హత లేకపోవడం వారిద్దరిని ప్రతిపాదించలేకపోవడం నేను అంగీకరించలేను. జ్యూరీసభ్యులను కూడా ఇతర సభ్యులు ప్రతిపాదించడానికి వీలుపడేలా నియమాలను సవరించాలని కోరుకుంటున్నాను. --t.sujatha (చర్చ) 12:28, 15 నవంబర్ 2013 (UTC)
సుజాత గారి అభిప్రాయాన్ని నేను సమర్ధిస్తున్నాను. గుర్తింపు కృషిచేసిన అందరికీ లభించాలి. జ్యూరీ సభ్యులుగా మినహాయింపు కావడం సరిగాదు. ఎన్నికకు మరేవైనా మార్గాలుంటే సూచించగలరు...విశ్వనాధ్ (చర్చ) 12:54, 15 నవంబర్ 2013 (UTC)
చర్చ ప్రారంభమైంది సంచిక కొరకు ఒక్క వాడుకరి ఫోటో ఉపయోగించడానికే కాబట్టి మనం ఆ దిశగా మాత్రమే అడుగులేసి ఒక్క సభ్యుడిని గుర్తిస్తే సరిపోతుందనుకుంటున్నాను. పదేళ్ళ తెవికీ చరిత్రలో ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి, లక్షకుపైగా విలువైన దిద్దుబాట్లతోనే కాకుండా నిర్వహణలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచి, అందరి మన్ననలందుకున్న వైజాసత్య గారి పేరును నేను ప్రతిపాదిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:27, 15 నవంబర్ 2013 (UTC)
  • రాధాక్రిష్ణ, t.sujatha , విశ్వనాధ్,Rajasekhar1961 , చంద్రకాంతరావు గారి స్పందనలకు ధన్యవాదాలు. తెవికీలో కృషి చేసిన అనుభవమున్న వారు ఎంపిక మండలి లో వుండడం చాలా ముఖ్యం, దానికి వైజాసత్య గారు, Rajasekhar1961 గారు ముందుకు రావడం హర్షణీయం. నా సేవలకు వికీపీడియా సందర్భంలో ఎంతో కొంత గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా సహ వికీసభ్యులను గుర్తించడానికి అవకాశమే నాకొక పెద్ద గుర్తింపుగా భావిస్తాను. ఇంకా మీరందరు మరీ మరీ కోరితే పురస్కార సభలో అభినందన మాటలు ఒకటీ రెండుచాలు. ఇంకెవరైనా ఎంపిక మండలిలో వుండదలిస్తే ఆది వారంలోపల తెలియచేయమని మనవి. అప్పుడు త్వరగా నియమాలు రూపొందించుకొని ముందుకు కొనసాగవచ్చు. పురస్కారం లో భాగంగా నగదు వుంటే మంచిదే, ఒక వేళ ఏకారణంచేతనైనా లేకపోయినా గుర్తింపు కి విలువ ఏమీ తగ్గదు. రాజశేఖర్ కు మరియు సుజాత గార్లకు వికీమీడియా భారతదేశ సమావేశంలో ధృవపత్రాలు మాత్రమే అందచేశాము కదా అయినా వారి గుర్తింపు ఏమీ తగ్గలేదుకదా. --అర్జున (చర్చ) 13:33, 15 నవంబర్ 2013 (UTC)
వికీపీడియా శిక్షణ పుస్తకం మీద వైజాసత్యగారి చాయాచిత్రం ఉపయోగించడాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. వారు అంగీకరిస్తే నేను హర్షిస్తాను. నగదుపురస్కారం వీలైతే మంచిదే . నగదు కంటే ధృవపత్రాలు విలువైనవి. --t.sujatha (చర్చ) 14:55, 15 నవంబర్ 2013 (UTC)
రాధాకృష్ణ గారు, సుజాత గారు, చంద్రకాంతరావు గారు, అర్జున గారు, విశ్వనాథ్ గార్లతో ఏకీవభవిస్తూ, వైజాసత్య గారి పేరునే నేనూ ప్రతిపాతిస్తున్నాను. అన్ని కోణాలనుండీ వైజా గారిపేరే సరైనదని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:47, 15 నవంబర్ 2013 (UTC)
రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..విశ్వనాధ్ (చర్చ) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, రహ్మనుద్దీన్ (నాని), కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.-- రాధాకృష్ణ, 2013-11-16 మరియు 2013-11-19
రాధాకృష్ణ గారి ఔదార్యము మెచ్చదగినది.--అర్జున (చర్చ) 01:19, 20 నవంబర్ 2013 (UTC)
నా ఫోటో ఉంచాలని అభిలషించిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అభిమానమే నాకు పది లక్షలు. నేను పూర్వపరంలో చేసిన కృషికి చాలానే గుర్తింపబడ్డాను, నా చిత్రం ఈనాడు పత్రికలో ఐదేళ్ళ క్రితమే వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను మన్నించి ఈ గుర్తింపును ఇప్పటివరకు సరైన విధంగా గుర్తించబడని తెవికీ సభ్యులకు చెందనివ్వండి. తెవికీలో విశేషకృషి చేసి బయటి ప్రపంచంలో గుర్తింపబడిన వాళ్ళు చాలానే ఉన్నారు. వారిపై స్పాట్‌లైటు పెట్టి వాళ్ళ కృషిని అందరికి తెలియజేసి, వారి కృషికి జోహార్లు అర్పించవలసిన సమయమిది. కాబట్టి నేను, అర్జున గారు, రాజశేఖర్ గారు నిర్ణయసంఘంగా అభ్యర్ధనలు పరిశీలించి నిర్ణయించగలము. నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు పరిగణించబడవు. --వైజాసత్య (చర్చ) 23:14, 16 నవంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు, నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు వుండరాదు. అయితే, కాసుబాబు, చంద్రకాంతరావు, విశ్వనాథ్ గార్ల పేర్లు ప్రతిపాదనకొరకు పరిశీలించవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 03:47, 19 నవంబర్ 2013 (UTC)
అహమ్మద్ నిస్సార్ గారి అభిప్రాయంతో ఏకూభవిస్తున్నాను. పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. --t.sujatha (చర్చ) 07:28, 19 నవంబర్ 2013 (UTC)
శాన్ ఫ్రాన్సిస్కో నుండి తాజాసమాచారము

నేను ఇక్కడ ఈ కొత్త పుస్తకం తయారీలో క్రియాశీలంగా వున్న ఫౌండేషన్ ఉద్యోగులు లియన్నా మరియు సేజ్ తో మాట్లాడాను. సంతోషకరమైన సంగతి ఏమిటంటే ఛాయాచిత్రాలు ఒకటి కంటే ఎక్కువ వాడుకోవచ్చు. పుస్తకం రూపలావణ్యం మొదలైంది. మొదటి చిత్తు ప్రతి నాకు చూపించారు. పాఠ్యం చాలా వరకు ఖరారైనట్లే కాని ఆంగ్ల సంచిక జనవరిలో మాత్రమే పూర్తవవచ్చు అని చెెప్పారు. అడోబీ ఇన్ డిజైన్ తీరు దస్త్రం డిసెంబరు నెలలో అందుబాటులోకి రావొచ్చు. కామన్స్ లో బొమ్మల ఎక్కింపు గురించి కొత్త పుస్తకం ప్రతి ఇచ్చారు. ఇంతకముందల వాడిన ఒక పేజీ కరపత్రము కంటే ఇది మెరుగైనదని చెప్పారు. దీనిని కూడా తెలుగు అనువాదం చేయటానికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 22:12, 19 నవంబర్ 2013 (UTC)

వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి

వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి మరియు ఇల్లస్ట్రేటింగ్ వికీపీడియా పై బ్లాగ్ పోస్టు చూడండి.--అర్జున (చర్చ) 01:11, 20 నవంబర్ 2013 (UTC)

ఇతర గుర్తింపుల సమాచారం

వికీమీడియా జర్మనీ గుర్తింపు విధానం గురించి ఆంగ్లానువాదము (గూగుల్) చూడండి.--అర్జున (చర్చ) 15:47, 20 నవంబర్ 2013 (UTC)

రసాయనిక ఫార్ములా - విక్షనరీ పుటలు

రసాయనిక ఫార్ములాలతో పేజీలు తయారుచేయవద్దని మనవి. అవి ఏ భాషకు చెందిన పదాలు కావు. దయచేసి గమనించి వాటిని తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 14:26, 14 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు [2] చూడండి. "అవి ఏ భాషకు చెందిన పదాలు కావు", అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి, ఉన్న పేజీలను తొలగించే అధికారము విక్షనరీలో నాకు లేదని కొన్ని సంవత్సరాలు, నెలలుగా చెబుతునే ఉన్నాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు, అర్థం చేసుకోవటము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:15, 17 నవంబర్ 2013 (UTC)
ఫార్ములా కూడా ఆంగ్లంలో ఉన్నందున ఆంగ్లం వికీ లో ఆ వ్యాసానికి శీర్షికగా ఉంచవచ్చునేమో! మన వికీలో H2O వ్యాసానికి "హైడ్రోజన్ మొనాక్సైడ్" అనీ, Hcl కు "ఉదజహరికామ్లం" వంటి శీర్షికలు ఉంటే బాగుంటుంది.--కె.వెంకటరమణ (చర్చ) 12:03, 17 నవంబర్ 2013 (UTC)
కె.వెంకటరమణ'గారు, అసలు సమస్య మీరు అనుకున్నట్లు వ్యాసాలు గురించి కాదు. విక్షనరీలో Hcl, H2O అనే పుటలు ఉండకూడదు అని రాజశేఖర్ గారు అంటున్నారు. విక్షనరీ ఇంగ్లీషులో ఉన్నాయి కదా !

A

   AsH₃

C

   C2H2
   C2H4
   CH3COOH
   CH4
   CH₃COOH
   CH₄
   Cl₂
   CO
   CO₂
   C₂H₂
   C₂H₄
   C₂H₆

D

   DH
   DHO
   D₂
   D₂O

H

   H2SO3


H

   HCl
   HF
   HgS
   HNO₂
   HNO₃
   H₂
   H₂CO₃
   H₂O
   H₂O₂
   H₂S
   H₂SO₃
   H₂SO₄
   H₃PO₃
   H₃PO₄

M

   MgO

N

   NaCl
   NH₃
   NO


N

   NO₂
   N₂
   N₂O

O

   O₂
   O₃

P

   PbO
   PH3

S

   Si2H6
   SiH4
   SiH₄
   SiO
   SiO2
   SiO₂
   Si₂H₆
   SO₂

T

   T₂

Z

మరి అటువంటి పై పేజీలు ఉండకూడదని మన తెలుగు అధికారి అంటున్నారు. తోటి సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:52, 17 నవంబర్ 2013 (UTC)

పై ఫార్ములాలకు సంబంధించిన రసాయన పదార్ధాల వ్యాసాలను చేర్చి అందులో ఒక విభాగాలుగా ఫార్ములా, తెలుగులో సాధారణ నామం,సంయోజకత, లోహ అలోహ థర్మం వంటి విషయాలను చేర్చిన బాగుంటుందని నా అభిప్రాయం--కె.వెంకటరమణ (చర్చ) 13:46, 17 నవంబర్ 2013 (UTC)
ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:00, 17 నవంబర్ 2013 (UTC)
తెలుగు విక్షనరి = తెలుగు భాషా నిఘంటువు + సామాన్య నిఘంటువు (science dictionary) + వైద్యపదకోశం (medical dictionary) + సాంకేతిక శాస్త్ర నిఘంటువు (technology dictionary) +++. మెదటి విభాగ దృశ్యా, రజశేఖర్ గారు మొదట కాదని అనిఉండవచ్చు. మీ పదాలు, రెండవ విభాగానికి చెందుతాయి. రాధాక్రిష్ణ (చర్చ) 05:57, 19 నవంబర్ 2013 (UTC)
రాధాక్రిష్ణ గారు, ఏ సభ్యులకయినా, సలహాలు, సంప్రదింపులు, సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, ఇల్లా ఎన్నైనా చెప్పుకుంటూ........ఆ సభ్యునకు అర్థవంతముగా చర్చలలో వివరించగలగాలి ఏ వాడుకరి అయినా లేదా అధికారమున్న (అధికారులు) వారు అయినా సరే. నాకు కొంతమంది ఇచ్చే పోస్టింగ్స్ చూడండి. ప్రత్యేకంగా, నా మీద దాడి అన్నట్లు ఉంటాయి. మనసుకి కష్టం కలిగే విధముగా ఉంటాయి. అసలు తెలుగు వికీలలో ఏ విషయాలు ఉండాలో కొత్తగా కొత్త విషయాలు చేర్చుతున్నప్పుడు అవగాహన అందరికీ ఉండకపోవచ్చు. మీరన్నట్లు ఏ (అంతిమ) విభాగానికి చెందినవి అయినా ఆ సభ్యునకు సరి అయినా ప్రోత్సాహము మనమందరము ఇవ్వాలి. విమర్శలు ఉండాలి. మన తప్పులు మనకు తెలుస్తాయి. ఇంతకన్నా మీతో చర్చింటానికి మీరు ఇంకేమి విషయాలు పెద్దగా పొందు పరచలేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. 49.238.51.161 07:17, 19 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:20, 19 నవంబర్ 2013 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు, మనందరం తెవికి సమావేశంలో కలుసుకున్నాము. మనందరిది ఒకే కుటుంబం. మనలో ఏ ఒక్కరూ, ఒక్కపైసా ఆశించి పనిచేయడంలేదు. మనందరం సహృదయంతో, ఒకే పనిని పంచుకొని ఒకరికి ఒకరం తోడ్పడుతున్నాము. ఏడు గుర్రాల రధంలో ఏ ఒక్క గుర్రం వెనక పడాలని మిగిలిన ఏ గుర్రం అనుకోదు. అలా అనుకుంటే రధం ముందుకు వెళ్ళదు. నిజం చెప్పాలంటే, ఈ చర్చ జరిగే వరకు, నా దృష్టిలో తెలుగు విక్షనరి, తెలుగు భాషా నిఘాంటువు మాత్రమే. రాజశేఖర్ గారి "తొలగించ వలసినదిగా మనవి" అన్న వ్యాఖ్య నాకు సరియైనది అనిపించింది. ఎందుకంటే, అది తెలుగు భాషా నిఘంటువు (సి పి బ్రౌను గారి ది వంటి)లో ఉండదగిన పదంకాదు కాబట్టి. తరువాత, మీరు ఆంగ్లభాష విక్షనరి నుండి ఉదాహరణ ప్రస్తావించిన తరువాత, నేను పునరాలోచనలో పడినాను. అప్పుడు గ్రహించినాను, తెలుగు విక్షనరి తెలుగు భాషా నిఘంటువు మాత్రమే కాదని. నా కొత్త అవగాహనని రచ్చబండలో వెంటనే మిగిలిన కుటుంబసభ్యులతో రచ్చబండలో పంచుకున్నాను. రాధాక్రిష్ణ (చర్చ) 05:31, 21 నవంబర్ 2013 (UTC)

మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?

రమణగారు, మీరు తెలుగు విక్షనరీ [3] లో కూడా పని చూశారు. ప్రస్తుతం ఆ తెలుగు విక్షనరీలో 1,2,3,4,లు , ఆ,ఆ, ఇ ఏ లు, ఇలా ఏ పేజీలు అయినా కొత్తగా అక్కడ సృష్టించ వచ్చును. కాని పై వాటికి పేజీలు ఉండకూడదని మన తెలుగు అధికారి వ్యక్తిగత అభిప్రాయం. ఏ కారణంగా వద్దని అంటున్నారో పేర్కొనలేదు. చెప్పరు కూడా. వికీపీడియా, విక్షనరీలలో మన తెలుగు అధికారుల పని తీరు వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ చేసే పనిలో ఎక్కువ విలువ ఇస్తుంటే మాత్రం అది అంత సమంజసం కాదు, మంచిది కూడా కాదు. 13:55, 17 నవంబర్ 2013 (UTC)
తొలిగా, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయవలెనని అభ్యర్ధన, విక్షనరీలో అధికారులెవరూ లేరు. మీరు ఎవరిని ఉద్దేశిస్తున్నారో అర్ధం కాలేదు. వికీపీడియా, విక్షనరీ అనేవి రెండు ప్రత్యేక సముదాయాలు. మీరు కూడా అధికారి అయి ఉండి, మీ అభిప్రాయాన్ని అందరూ పాటిస్తే అప్పుడు సముదాయం మీ వ్యక్తిగతమైనట్టా?? సముదాయపు అభిప్రాయాలు సముదాయంలోని సభ్యులను బట్టి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. వీలైతే సముదాయపు అభిప్రాయాలని ప్రభావితం చేయటానికి కృషిచేయండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. అప్పుడప్పుడూ సముదాయపు నిర్ణయాలు మీకు నచ్చకపోయినా సముదాయం ఒక నిర్ణయం చేసినప్పుడు శిరసావహించక తప్పదు. మనం ఇతరుల అభిప్రాయాలను గౌరవించనప్పుడు, ఇతరులు మన అభిప్రాయాలని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగి తెలుసుకొండి. వికీప్రాజెక్టులన్నీ సభ్యులకు రెండే రెండు హక్కులను ఇస్తాయి. 1) నిష్క్రమించే హక్కు (Right to leave) 2) ఇక్కడి సమాచారం మొత్తం తీసుకొని వేరే కుంపటి పెట్టుకొనే హక్కు (Right to Fork). --వైజాసత్య (చర్చ) 05:10, 18 నవంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయాలి అని నేను అడిగాను. అక్కడకు అంతగా ఎవరూ రావడము లేదు. అందుకని వికీపీడియాలో చర్చ చేయమని పెద్దలు చెప్పారు. చర్చలు జరిగాయి. ఎక్కడయినా (వికీపీడియా, విక్షనరీ) కొన్ని కొన్ని విషయాలు సముదాయముతో చర్చలు జరపకుండానే నిర్ణయిస్తున్నారు. ఏ సముదాయముతో చర్చ చేశారో సభ్యులకు తెలిస్తే మంచిది. వ్రాత పూర్వక చర్చలు ఉంటే మరీ మంచిది. అభిప్రాయాలను గౌరవించటం అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. ఇంతకు ముందు చాలా పేజీలు (మహర్షి పేర్లు, ఇంకా ఇంకా) తొలగించారు. అడిగినా కూడా సరి అయిన సమాధానము తొలగించిన వారు ఇవ్వలేదు. సముదాయము అంటే ఏమిటో మరింత వివరంగా కూడా అందరూ తెలుసుకుంటే అందరకూ మంచిది. ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగినా, ఎందుకు తొలగిస్తున్నారో కూడా తెలియ పరచటము లేదు. నిష్క్రమించే హక్కు, వేరే కుంపటి పెట్టుకొనే హక్కు లాంటివి ఉన్నా, వికీ నియమ నిబంధనలు పాటించి నంతవరకు ఏ సభ్యుడి నయినా వెళ్ళగొట్టే హక్కు ఉందంటారా ? మీరన్నట్లు ఇక్కడి సమాచారము అంతా మనకు కావలసినది తీసుకుని, మనకి నచ్చిన విధముగా తయారు చేసుకోవటము కూడా చాలా బావుంటుంది. ఒకరి తప్పులను తప్పకుండా విమర్శించాలి. సమాధానము రాబట్టి అందరము తెలుసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలా పనిచేయాలి, నిరంకుశంగా కాదని, భజన పరులుగా కాకూడదని నా అభిప్రాయము. ఒకరిలాగా మరొకరు కూడా అలాగే ఉండటము, ఎదుటి వారు కోరుకున్నట్టు మాట్లాడము ఎక్కడా సాధ్యపడదు. మీరు పాత చర్చలు చదివే ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. సహేతుకంగా చర్చలు చేద్దాము. ప్రశ్నించండి. సమాధానము ఇస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:51, 18 నవంబర్ 2013 (UTC)
వికీ నియమనిబంధనలు పాటించినంతవరకు ఏ సభ్యుడిని వెల్లగొట్టే హక్కు, వికీ స్థాపకుడైన జింబో వేల్స్ గారికి కూడా లేదు. మీరు ఫలానా వ్యాసాలు అనుమతించకపోవటాన్ని విమర్శించటం వేరు. వ్యక్తిని, వ్యక్తులను విమర్శించటం వేరని మీకు అర్ధం కానిది కాదు. నిర్వాహకులు ఏదో అధికారంతో వ్యవహరిస్తున్నారని అనుకోవద్దు. ఒక వ్యక్తి (మీరైనా, ఇంకెవరైనా) కేవలం నిర్వాహకుడైనంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలకు ప్రత్యేకత చేకూరదు. సముదాయంలో ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకోవాలి కదా అలాగని రాజశేఖర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది సముదాయానికి సరికాదని కాదనిపిస్తే సహేతుకంగా చర్చించి, తత్ఫలితంగా తీసుకొన్న నిర్ణయం తాజా సముదాయపు నిర్ణయం అవుతుంది. మరికొన్నాళ్లకు సముదాయపు సభ్యులు మారి ఆ నిర్ణయాన్ని మరోసారి మార్చే అవకాశం కూడా ఉన్నది. సమాజం చిన్నదిగా ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలే సముదాయపు అభిప్రాయాలుగా చలామణీ అవుతాయి. కానీ సముదాయం పెరుగుతున్న కొద్ది ఆ నిర్ణయాలపై నిరంతరం పునరాలోచన జరుగుతుంది. ఇప్పుడు విక్షనరీ కూడా అదే ప్రక్రియలో ఉన్నది. ఇది సహజమైన ప్రక్రియ. విక్షనరీలో గణనీయమైన కృషిచేసిన మీరు, దాని నిర్ణయాల రూపకల్పనలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. దీనికి మీరు నిర్వాహకుడే కానక్కరలేదు. ఇదివరకున్న చాలా నిర్ణయాలను తప్పకుండా ప్రశ్నించి, తర్కించండి. కానీ వ్యక్తుల నిబద్ధతను ప్రశ్నించకండి. "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం" లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చర్చ జరగాల్సిన విషయంపై కాకుండా, ఇతర విషయాలపై చర్చకు దారితీస్తాయి. నిజానికి ఇప్పుడు తెలుగు విక్షనరీలో రసాయన సంజ్ఞలకు పేజీలు ఉండాలా, లేదా అన్న విషయం చర్చ జరగాల్సింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు అవతలి వ్యక్తుల తప్పకుండా స్పందించాలని ఎక్కడా నియమం లేదు. అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు, ఉండరు కూడా, కానీ వ్యక్తిగత ధూషణ వికీ సహించదు. నేను పాత చర్చలు కొన్ని చదివాను. ఎవరూ ఎక్కడా ఏదీ స్పష్టంగా వ్రాయలేదు. మిమ్మల్ని అడిగితే "నాకలా అనిపించింది" అన్నారు. ఇలాంటి ఫీలింగ్స్ అధారంగా ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోలేము. ఇప్పుడు కూడా, ఎక్కడ మీరడగిన ప్రశ్నలకు సమాధానం దొరకలేదో నాకు తెలియజేస్తే, నాకు తెలిసినంత వరకు నేను సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. --వైజాసత్య (చర్చ) 05:41, 20 నవంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు, వ్యక్తులే వ్యవస్థగా ఉన్నప్పుడు ఒక్కోసారి అది సముదాయము లోకి రాకుండా వ్యక్తిగతమవుతుంది సహజంగానే. మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం అనే భావన సముదాయము లేనప్పుడు కలగడానికి అవకాశము ఉంది. ఉదా: ఇంటిపేర్లు, ఒంటి (మనుష్యుల) పేర్లు, దేవుళ్ళ పేర్లు ఇలా ప్రత్యేక పేజీలు ఉన్నప్పుడు, మహర్షుల పేజీలు (విక్షనరీలో) కొంతకాలానికి తొలగించారు. ఎందుకో ఎక్కడా పొందు పరచలేదు. విమర్శని దూషణ అని అనుకుంటే దానికి సమాధానము ఏముంటుంది చెప్పండి ? నాదృష్టిలో విమర్శ, ఇతరులకు దూషణ. ఇది చర్చలకు అవసరము అనుకుంటే చర్చిద్దాము. నాకు ఎవరు సలహాలు, సూచనులు చేసినా నన్ను తప్పు పట్టేవిగా ఉంటున్నాయి. మరి నాకు అవి దూషణలు గానే అనిపిస్తున్నాయని చెప్పినా, వారి వారి పంథా మార్చుకోవటము లేదు కదండీ ! నాకు అనిపించింది అన్నట్లయితే అది నా బుద్దికి తోచినది అని మీరు అర్థము తీసుకొనక ఫీలింగ్స్ అని అంటే, ఏమని వ్రాయాలో చెప్పండి. ఇక్కడకు వచ్చేది ఒకరిని మరొకరు (నిరంకుశంగా) దూషించటానికో, భూషణలు అందుకోవడానికో మరే రకంగానో మనము రావడము లేదు. వ్యక్తుల (సముదాయము) పనులలో తప్పు ఉంటే (ఇప్పుడు మన చర్చ) విమర్శలుంటాయి. అవి సద్విమర్శలుగానే తీసుకుంటే ఫీలింగ్స్ రావు. బయట వ్యక్తి గత జీవనము వేరు, ఇక్కడ అంతా ఒక్కటే. మీ జవాబును బట్టే నా మర్యాద సమాధాన పత్రముంటుందని మనమందరకు తెలుసు, మనమేమీ చిన్న వాళ్ళము కాదు ఏ విషయములలో కూడా అని మీకు తెలుసు కదండీ ! 06:15, 20 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:20, 20 నవంబర్ 2013 (UTC),జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:39, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:41, 20 నవంబర్ 2013 (UTC)
ప్రసాద్ గారూ, ఫీలింగ్స్ అన్నది సరైన పదం కాకపోవచ్చు కానీ మీ బుద్ధికి తోచినదాన్ని నిరూపించలేమండి. ఉదాహరణకు చంద్రకాంతరావు గారు కొంతరు సభ్యులు దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే దిద్దుబాట్లు చేస్తున్నారని నాకనిపించింది అన్నారు. అక్కడ అది నిరూపించలేమని నేను చెప్పినట్టే, మీకనిపించినది కూడా ఇక్కడ నిరూపించలేము. సద్విమర్శలు చేయాలనిపించిన వారు "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?" అని శీర్షిక పెట్టి తీవ్రంగా వ్రాయరు. అది కూడా సదరు అధికారి ఆ విషయంపై క్షమాపన చెప్పిన తర్వాత కూడా. మీపై ఎవరైనా ధూషణ చేసినట్టు అనిపిస్తే ఆ సందర్భాలు ఎత్తిచూపండి నేను తప్పకుండా పరిశీలిస్తాను. అందరూ అందరితో చేసే చర్చలను నేను ప్రతిరోజూ గమనిస్తు ఉండటం అసాధ్యమైన పని. నిజానికి ఏ విషయములలో అనేది నాకు సరిగా తెలియదు. విక్షనరీలో ఎందుకంత రభస అయ్యిందో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. ఒక వ్యుత్పత్తి/ఉత్పత్తి విషయంపై పాలగిరి గారిని వివరణ అడిగాను, చివరి సారి నేను తొంగిచూసినప్పటికి ఆయన ఏ వివరణా ఇవ్వలేదు. మీకు ఒకేసారి శాశ్వత నిర్వాహకత్వం కాకుండా తాత్కాలిక నిర్వాహకత్వం ఇచ్చారో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. మీరు ఇతర సభ్యులు ఇంకా నిర్వాహకత్వం ఉందని అనుకొని, కాస్త తొలగింపు పనులు చేయమని అడిగినప్పుడు మీరు దాన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకుంటున్నారో కూడా సరిగా అర్ధం కాలేదు. అదికాకుండా చర్చాపేజీల్లో ఒకరు వ్రాసిన దానిపై మరొకరు దిద్దుబాట్లు, మార్పులు చేర్పులు కలగాపులగంగా చేయటం వలన ఎవరు ఎప్పుడు, ఏ విషయానికి స్పందిస్తూ ఏమి వ్రాశారో తెలియక పెద్ద గందరగోళంగా ఉంది. --వైజాసత్య (చర్చ) 06:51, 20 నవంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు, (1) బుద్ధికి తోచినదాన్ని, అనిపించిందాన్ని అంటే అభిప్రాయముగానే తీసుకుంటాము. "మన పని తెలుగు అధికారులు వ్యక్తిగతం ?" అని శీర్షిక భావములో నాకు పద తీవ్రత అంతగా ఉంటుందని నేను మాత్రం అనుకోవడము లేదు. సదరు అధికారి జవాబు తదుపరి ఎవరైనా నాతో చర్చలు చేస్తే వారి వారికి తగు విధమైన సమాధానములు ఖచ్చితంగా అందరి సమక్షములోనే ఇస్తునే ఉంటాను. (2) విక్షనరీలో రభస గురించి మనము చర్చ చేయడము వలన ఒనగూడే ప్రయోజనము ఉంటే చేయవచ్చును. కానీ ఇప్పుడు పెద్దగా ప్రయోజనము ఉండదు. (వి)భజన జరిగిన తదుపరి మరో భజన చేసినట్లవుతుంది. నాకు ఒకేసారి శాశ్వత నిర్వాహకత్వం కాకుండా తాత్కాలిక నిర్వాహకత్వం ఇచ్చారో బహుశః ప్రతిపాదించిన వారికి కూడా తెలియదేమో ? (3) నేను నిర్వాహకుడిని కాదు అని తాత్కాలిక నిర్వాహకత్వం ముగిసిన రోజు నుండే అక్కడకు ఎక్కువ కాలంగా వస్తున్న వారికి బాగా తెలుసు. నాకు తొలగించు అధికారము లేదని నేను ఎన్నోసార్లు లిఖిత జవాబులు ఇచ్చాను. ఆ చెప్పేవారు నాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. అప్పుడే అసలు రభస మొదలయ్యింది మీరాకతో ముగిసింది. ఉగాదికి మీటింగ్ లలో కూడా ప్రస్తావనకు వచ్చినాయి ఎన్నో విషయాలు. నా ఆస్థి, స్వార్జితం (నీతి,నిజాయితీ సంపాదన) లాంటిది పోయినట్లు, నేను దేన్నీ పెద్ద సమస్యగా తీసుకోను, నిజ జీవితములో విజయవాడలోని నా ఇల్లు అంతా ఆ ఉగాది రోజునే గుత్త మొత్తంగా ఖాళీ చేసి రోజుల తరబడి దోపిడి చేసినా పెద్ద సమస్యగా తీసుకోలేదు. పోవాలన్నా రావాలన్నా ఏవీ మన చేతుల్లో ఉండవు. వెళ్ళి పోవాల్సిన రోజు వేటికయినా వస్తే అవే వెళ్ళి పోతాయి, అదే నా సిద్ధాంతం. (4) చర్చలు కూడా మార్చుతున్నారు అని నేను కొంతమందితో ఫోన్ల ద్వారా, లిఖితముగా తెలియ జేశాను. ఎవరయినా చర్చ మొదలు పెట్టినప్పుడు, ఏ సభ్యుని యొక్క స్పందనలు అయినా ఆ చర్చలోనే ఉండాలి అని తెలిసినా, అలా కొందరు చేయడము లేదు. అందుకనే అసలు ప్రస్తుతం చర్చలు అనేవి చాలా పెద్ద గందరగోళంగా ఉంటున్నాయి. (5) ఏ చర్చలో అయినా నా మొదటి సమాధానము చదవండి. ఆయా చర్చలు ఎలా సాగుతాయో గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:34, 20 నవంబర్ 2013 (UTC), జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:41, 20 నవంబర్ 2013 (UTC)

Call for comments on draft trademark policy

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమ ప్రణాళిక

https://docs.google.com/document/d/1BCUoVZlN7FP-RCXLmE0HdgrAOCqaWBEGDJJy9__cmos/edit వద్ద లేదా వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు పేజీలో ఈ ప్రణాళికను రూపొందించడంలో సహకరించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 12:43, 20 నవంబర్ 2013 (UTC)

వికీ దశాబ్ది ఉత్సవం సందర్భంగా ప్రెస్ రిలీజ్.

https://docs.google.com/document/d/1OqkIRI1QzHPZY8jmCWPTzuphA3skoojWgb8q9iuTB0w/edit వద్ద ఉన్న ప్రెస్ రిలీజ్ ను రూపొందించడంలో సహకరించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 12:45, 20 నవంబర్ 2013 (UTC)