Jump to content

శ్రీ గంగానగర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 29°55′N 73°53′E / 29.92°N 73.88°E / 29.92; 73.88
వికీపీడియా నుండి
శ్రీ గంగానగర్
జిల్లా
రావ్లా మండిలో కాలువ దృశ్యం
రావ్లా మండిలో కాలువ దృశ్యం
శ్రీ గంగానగర్ is located in Rajasthan
శ్రీ గంగానగర్
శ్రీ గంగానగర్
భారతదేశ పటంలో రాజస్థాన్ స్థానం
శ్రీ గంగానగర్ is located in India
శ్రీ గంగానగర్
శ్రీ గంగానగర్
శ్రీ గంగానగర్ (India)
Coordinates: 29°55′N 73°53′E / 29.92°N 73.88°E / 29.92; 73.88
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
పరిపాలనా ప్రధానకేంద్రంశ్రీ గంగానగర్
Founded byమహారాజా గంగా సింగ్
Government
 • Typeమునిసిపల్ కౌన్సిల్
 • Bodyనగరపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total225 కి.మీ2 (87 చ. మై)
Elevation
178 మీ (584 అ.)
జనాభా
 (2011)
 • Total2,54,760
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,900/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
 • ప్రాంతీయ భాషలు బాగ్రి, పంజాబీ , ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
335001
ప్రాంతీయ ఫోన్‌కోడ్0154
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-13
లింగ నిష్పత్తి(పురుషులు) 1000: 887 (స్త్రీలు)

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో గంగానగర్ జిల్లా ఒకటి.ఇది రాజస్థాన్ ధాన్యాగారంగా కీర్తించబడుతుంది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతానికి బికనీర్ మహారాజా గంగా సింగ్ పేరు పెట్టబడింది. శ్రీగంగానగర్ జిల్లా బికనీర్ రాజాస్థానంలో భాగంగా ఉండేది. జిల్లా అధికభూభాగం జనావాస రహితం.1899-1900 లలో కరువు సంభవించినప్పుడు కరువు నివారణ కొరకు మహారాజా బృహత్తర ప్రణాళిక ద్వారా భవిష్యత్తు సమృద్ధిని ఊహించి గంగాకాలువ త్రవ్వకానికి రూపకల్పన చేసాడు. 1927 నాటికి 89 మైళ్ళ పొడవైన కాలువను నిర్మించి సటైజ్ నదీ జలాలను ఈ ప్రాంతంలో ప్రవహింపజేసి ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసాడు.[1] ఈ ప్రాంతం ఒకప్పుడు బహవాల్పూర్ రాజాస్థానం ఆధీనంలో ఉండేది. నిర్జనమైన బహిరంగ ప్రదేశానికి తగిన రక్షణ లేకుండా ఉండేది. గంగామహారాజు మిత్రులలో ఒకడైన హిందూ మల్ దీనిని అనుకూలంగా చేసుకుని, దక్షిణంలోని సూరత్‌గర్ నుండి, ఉత్తరంలో ఉన్న హిందూమల్‌కోట వరకు ఈ ప్రాంతపు సరిహద్దులలో ఉన్న స్తంభాలను మార్చి భూభాగ విస్తరణ చేసాడు. తరువాత హిందూమల్, గంగామహారాజుకు తన విజయం గురించి వర్తమానం అందించాడు. తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన గంగా మహారాజు ఈ ప్రాంతానికి హిందూమల్‌కోట అని నామకరణం చేసాడు.

భౌగోళికం

[మార్చు]
Ghaggar river in September month, near Anoopgarh, Rajasthan (India)
సెప్టెంబరు నెలలో అనూప్‌గఢ్ సమీపంలో ఘగ్గర్ నది.

ప్రాంత వివరణ

[మార్చు]

శ్రీ గంగానగర్ జిల్లా 28.4 నుండి 30.6 డిగ్రీల అక్షాంశం, 72.2 నుండి 75.3 డిగ్రీల రేఖాంశంలో ఉంది.[2] జిల్లా వైశాల్యం 11,154.66 చ.హెక్టార్లు.జిల్లా తూర్పు సరిహద్దులలో హనుమాన్‌గఢ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో బికనీర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులలో పాకిస్థాన్ దేశంలోని భావనగర్ జిల్లా, ఉత్తర సరిహద్దులలో పంజాబు ఉన్నాయి.

నైసర్గికం

[మార్చు]
Ganganagar Gharsana tehsil desert
నీటిపారుదల గంగానగర్‌ను పచ్చగా మార్చింది, కాని ఇసుక దిబ్బలను ఇప్పటికీ చూడవచ్చు. ఘర్సానా తహసీల్‌లో తీసిన ఫోటో.
Rawla Mandi canal
నీటిపారుదల  ప్రధాన వనరు IGNP కాలువ అనుప్‌గఢ్ దక్షిణ తహసీల్‌లో తీసిన ఫోటో.

గంగానగర్ జిల్లా థార్ ఎడారిలో ఉన్నప్పటికీ జిల్లాలో గంగాకాలువ, ఐ.జి.పి కాలువ ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఈ కాలువలు జిల్లా వృక్షజాలం, జంతుజాలంలో మార్పు తీసుకువచ్చాయి.

  • ఈ ప్రాంతం గాంగాకాలువ, భక్రాకాలువల ద్వారా జిల్లాలోని 75% వ్యవసాయ భూములకు అవసరమైన జలాలను అందుకుంటూ పంజాబు సారవంతమైన పంట భూములను తలపింపజేస్తుంది. రైసింగ్‌నగర్, విజయనగర్ తాలూకాలలో మాత్రం ఏడారి వాతావరణం నెలకొని ఉంది.
  • ఈ ప్రాంతంలో ఐ.జి.ఎన్.పి కాలువకు చెందిన సూరత్గర్ శాఖ నుండి జలాలను అందుకుంటుంది.
  • ఈ ప్రాంతంలో ఐ.జి.ఎన్.పి కాలువకు చెందిన అనూప్‌గర్ శాఖ: అనూప్‌గర్, ఘర్సన తాలూకాలకు నీరు అందుతుంది. జిల్లా దక్షిణ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం కాలువ ద్వారా సారవంతం అయినప్పటికీ ఇసుక తిన్నెలు మాత్రం అలానే ఉన్నాయి.
  • నాలి బెల్ట్: ఇది సన్నని ఘగ్గర్ నదీ మైదానం. జిల్లాలో ప్రవహిస్తున్న ఏకైక నది ఇదే. ఈ నది వర్షాధారంగా ప్రవహిస్తుంది. ఇది సూరత్‌ఘఢ్ వద్ద జిల్లాలో ప్రవేశిస్తుంది.

తరువాత జైత్సర్, విజయనగర్, అనూప్గర్ ద్వారా ఇండో పాకిస్థాన్ సరిహద్దును చేరుకుంటుంది.

  • ఊంచా తిబ్బ:- సూరత్‌గర్ తాలూకా ప్రాంతంలో ఎత్తైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఇక్కడ నీరు లభించడం అరుదు. ఈ ప్రాంతం నిజమైన ఎడారిగా ఉంటుంది. ఈ ప్రాంతపు ప్రజలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు.

తాలూకాలు , పట్టణాలు

[మార్చు]

గంగానగర్ తాలుకాలు

[మార్చు]

గంగానగర్ జిల్లాలో తొమ్మిది తాలుకాలు ఉన్నాయి.

  • శ్రీ గంగానగర్ తాలూకా
  • శ్రీ కరంపుర్ తాలూకా
  • సాధుల్షహర్ తాలూకా
  • పదంపుర్ తాలూకా
  • రైసింగ్ నగర్ తాలూకా
  • సురత్గర్హ్ తాలూకా
  • ఆనూప్గర్ తాలూకా
  • విజయనగర తాలూకా
  • గరసన తాలూకా

ఇతర పట్టణాలు , గ్రామాలు

[మార్చు]

కెసరిసింగ్పుర్, గజ్సింగ్పుర్, రైసింగ్ నగర్, జైత్సర్, రవ్ల మండి మొదలైన ప్రధాన పట్టణాలు, వ్హెరేస్ లల్గర్హ్ జతన్, రిద్మల్సర్, రజీసర్, పత్రొద, సమెజ కొథి, చునవధ్, గనెష్గర్హ్, లధువల, హిందుమల్కొత్, బజువల, అంద్ బిర్మన విల్లగే బెల్వన, అరే స్మల్ల్ తౌన్స్, ఇతర గ్రామాలు.శ్రీ గంగనగర్‌ల్‌లో పలు పట్టణాలు బికనీర్ రాజవంశ కుంటుంబీకుల మరణం తరువాత వారి ఙాపకార్ధం నామకరణం చేయబడ్డాయి.

ఆర్ధికం

[మార్చు]
4 KLM Village
ఘర్సానా తహసీల్ గ్రామంలో ఆవాలు పంటచేను
Stps
సూరత్‌గఢ్ నగరానికి సమీపంలో ఉన్న ఒక సూపర్ థర్మల్ ప్లాంట్ స్టేషన్.
Paddy fields
సూరత్ ఘడ్ సమీపంలోని ఘరగర్ రివర్ బెల్ట్ లోని వరి పొలాలు, ఇటుక పరిశ్రమలు.
Gypsum rock
జిప్సం రాక్ దృశ్యం. జిప్సం ఖనిజం ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వబడుతుంది.

శ్రీగంగానగర్ జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధారిత నగరంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా గోధుమ, పత్తి, ఆవాలు, పప్పుధాన్యాలు, చెరకు పండిస్తారు. వ్యవసాయ దారుల మధ్య హార్టీకల్చర్ కూడా ఆసక్తికరంగా మారింది. హార్టీకల్చర్ ఉత్పత్తులలో పంటల్లో కిన్నో పండ్లు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. పుల్లని పండ్లరకాలకు చెందిన ఇతర పండ్లుకూడా పండిస్తారు. గంగానగర్ పరిశ్రమలు అన్నీ వ్యవసాయ ఆధారితమైనవి. జిల్లాలో కాటన్ జిన్నింగ్, ప్రెసింగ్, ఆవనూనె మిల్లులు, పిండిమరలు, షుగర్ మిల్లులు, టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు అధికంగా గంగానగర్ నగరం లోపల, వెలుపల ఉన్నాయి. బి.డి. అగర్వాల్ శ్రీగంగానగర్‌లో మెడికల్ కాలేజ్ నిర్మించడానికి 50 కోట్లు చందాగా ఇచ్చాడు. దాతృత్వంలో ఇది అత్యధిక మొత్తం అని గుర్తించబడుతుంది.

2011 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,969,520, [3]
ఇది దాదాపు. స్లొవేనియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 235 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 179 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.06%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 887:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.25%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

[మార్చు]

రాజస్థానీ భాషాకుటుంబానికి చెందిన బగ్రి భాష జిల్లాలో అత్యధికంగా వాడుకలో ఉంది.[5] బగ్రి భాష గంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు, పంజాబు, హర్యానా రాష్ట్రాలలోని కొన్ని తాలూకాలలో మాత్రమే వాడుకలో ఉంది. జిల్లాలోని ప్రజలలో ఎక్కువమంది హిందీ, సరైకి, సింధి, పంజాబీ ప్రజల బగ్రి భాష వాడుకలో ఉంది. జిల్లాలో హిందీ, ఆంగ్లభాషలు అధికారభాషలుగా ఉన్నాయి. జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలలో పంజాబీ భాష ఆప్షనల్ సబ్జెక్టుగా బోధించబడుతుంది. జిల్లాలో గంగానగర్ జిల్లాలో పంజాబీ సంగీతం అత్యధిక ప్రజాభిమానాన్ని కలిగి ఉంది. బగ్రి, పంజాబీ భాషలు రెండింటిలో సాధారణమైన పదాలు అనేకం ఉన్నాయి. సరైకి భాష అరోయా, రైసిఖ్స్, సరైకి ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ఉత్తర భూభాగంలో సరైకి భాష మరుగున పడుతుంది. సింధీ ప్రజలు సింధీభాషను మాట్లాడుతుంటారు. సింధీలు అధికంగా విజయనగర్, కేద్రిసింఘ్‌నగర్ అనుప్‌గర్‌లో వాడుకలో ఉంది.

సస్కృతి

[మార్చు]
Rural kutcha village
జానపద కళలతో కూడిన గ్రామీణ కుచా గృహాలను కొన్ని మారుమూల గ్రామాల్లో చూడవచ్చు.
Camel cart
ఒట్టెబండ్ల కొన్ని దక్షిణ గ్రామాల్లో సాధారణంగా కనిపించే చిత్రం.

ఒధిని ఎంబ్రాయిడరీ (అధికంగా ఎర్రని రంగులో ఉంటుంది) బగ్రీ స్త్రీలకు చిహ్నంగా ఉంది. పొడవైన షర్టు, ఘాఘ్రో (పొడవైన గౌను వంటిది), బ్రోలో (శిరోభూషణం) బంగ్రీ స్త్రీల సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. పంజాబీ స్త్రీలు సూట్, సల్వార్, చున్నీ దుస్తులను ధరిస్తుంటారు. ఇతర సమూహాలకు చెందిన స్త్రీలలో కూడా ఈ దుస్తులు ఆదరణ కలిగి ఉన్నాయి.హిందూ, ముస్లిం సరైకి స్త్రీలు కొందరు గాగ్రా (పొడవైన గౌను) ధరిస్తుంటారు. బగ్రీ స్త్రీలలో పరదా వాడుకలో ఉంది. పురుషులు సాధారణంగా ప్యాంటు, షర్టు, కుర్తా - పైజమా, ధోవతి (పంజాబీలు దీనీని చద్రా - కుర్తా అంటారు ) ధరిస్తుంటారు. సంప్రదాయ సిక్కు, రాజస్థాని భక్తి సంగీతం ప్రజాదరణ కలిగి ఉంది. ఇతర ఉత్తరభారతంలో ఉన్నట్లే హిందీ సినిమా పాటలు కూడా ప్రజాభిమానాన్ని చూరగొంటాయి. పంజాబీ, బగ్రీ సంప్రదాయాలు జిల్లాలో ఆధిక్యత కలిగి ఉన్నాయి.

ప్రజలలో అధికంగా హిందువులు, సిక్కులు ఉన్నారు. ప్రజలు గ్రామదేవతలైన రాందేవ్‌జి, గోగజిలను ఆరాధిస్తుంటారు. ప్రజలు అధికంగా పీర్లు, సన్యాసులపట్ల విశ్వాసం కలిగి ఉండి వారి ఖంఘాలకు (మందిరం) పోతుంటారు. కొంతమంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది సచ్చా - సౌదా, రాధా - సొయామి, నిరంకారి డెరా ప్రజలు డెరా - సంప్రదాయాన్ని అనుసరిస్తుంటరు.

మాధ్యమం

[మార్చు]

జిల్లాలో జైపూర్ నుండి రాష్ట్రస్థాయి వార్తాపత్రికలను గంగానగర్‌లో, రైసింగ్‌నగర్‌లలో పునఃప్రచురణ చేయబడుతున్నాయి. గంగానగర్‌లో " సీమా సందేశ్ " అనే హిందీ పత్రిక ముద్రించబడుతుంది.[6]

ఆకాశవాణి

[మార్చు]

జిల్లాలో " ఎయిర్ సురత్గర్ " అనే రేడియో స్టేషను ఉంది. ఇది హిందిక్, రాజస్థానీ, పంజాబీ భాషలలో ప్రసారాలు అందిస్తుంది. 1981లో స్థాపించబడ్జింది. ఫ్రీక్వెంసీ 918.[7]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  • చారిత్రాత్మక గురుద్వారా బుద్ధ జొహద్: ఇది గంగానగర్‌కు ఆగ్నేయంలో 85 కి.మీ దూరంలో ఉంది.
  • గురుద్వారా బుద్ధా జోహద్:- ఇది జిల్లా నైరుతీ భాగంలో గంగానగర్ నుండి 85 కి.మీ దూరంలో ఉన్న వశాలమైన గురుద్వార్‌గా గుర్తించబడుతుంది.1740 ఆగస్టు 11న ఇక్కడ భైసుఖ సింగ్, మెహ్తాబ్ సింగ్ "మస్సా రంగార్త్ " (అమృతసర్ ఆలయాన్ని అపవిత్రం చేసిన నేరానికి శిక్షిగా) తలను తీసుకువచ్చి చెట్టుకు వ్రేలాడతీసిన ప్రదేశం ఇదే.
  • బరార్:- పురాతత్వప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ సిధూనాగరికతకు సంబంధించిన శిథిలాలు కనుగొనబడ్డాయి. ఇక్కడ పురాతన టెర్రకోటా కేక్స్, స్లింగ్ బాల్స్, పూసలు, స్పేసర్, ఫైంస్ గవ్వల గాజులు మొదలైనవి లభించాయి. ఇది అనూపగ్రహ్ - రాంసింగ్పూర్ రహదారి సమీపంలో ఉంది.
  • విజయనగం పట్టణం వద్ద దాదా పంపారాం డేరా, బాబాపంపారాం సమాధి ఉన్నాయి.
  • లైలా - మంజుకీ మజర్ (సమాధి) :- ఇది బింజౌర్ గ్రామంలో ఉంది. ఇది అనూపగ్రహ్‌కు పశ్చిమంలో 6.6 కి.మీ దూరంలో ఉంది. ఇది గురుశిష్య సంబంధానికి చిహ్నంగా నిర్మించబడింది.
  • చనన - ధాం (చనన మందిరం) :- ఇక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంది. ఇది 1971లో నిర్మించబడింది.
  • సూరత్గర్ థర్మల్ పవర్ ప్లాంట్.
  • శ్రీ జగదాంబ అంధ్ - విద్యాలయలయం:- బధిరులకు, అంధుల కొరకు స్థాపించబడిన అతి పెద్ద విద్యాసంస్థలలో ఇది ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది గంగానగర్ నగరంలో ఉంది.
  • అనూపగ్రహ్ కోట:- ఈ కోట శిథిలావస్థలో ఉంది.
  • సురత్గర్:- జైత్సర్ స్టేట్ అగ్రికల్చర్ ఫాం.

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

జిల్లాలో నిర్మించబడిన కాలువలు జిల్లాలో వృక్షజాలం, జంతుజాలంలో తగినంత మార్పును తీసుకు వచ్చింది. జిల్లాలో పెంపుడు జతువులు, సాధారణ జంతువులలో ఆటవిక జంతువులు ఉన్నాయి. రోజ్, నీల్‌గాయ్ (బొసెలాఫస్ ట్రాగోకెమేల్స్) సాధారణ క్షీరదాలను ఫాంలలో, ఇసుక తిన్నెలలో కనిపిస్తుంటాయి. రైతులు వారి పొలాలను ఈ జంతువుల నుండి రక్షించుకోవలసిన అవసరం ఉంది. కొన్ని సార్లు నీల్గాయ్ రహదారి మీద సంచరిస్తూ ప్రమాదాలకు కారణం ఔతున్నాయి. పాములు, గోహ్, సంహా (సద్న), అడవి ఎలుకలు వంటి అడవి జంతువులు కనిపిస్తుంటాయి.

మూలాలు

[మార్చు]
  1. Garg, Balwant (July 27, 2003). "Suicide woes fill the 'food basket'". The Times Of India.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-19. Retrieved 2014-11-14.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  5. M. Paul Lewis, ed. (2009). "Bagri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. "Seema Sandesh". Archived from the original on 2014-10-12. Retrieved 2014-11-14.
  7. "Air Suratgarh". All India Radio.

సరిహద్దులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]