ధీరశంకరాభరణం రాగము
వికీపీడియా నుండి
ధీరశంకరాభరణం రాగము (ఆంగ్లం: Dheerashankarābharanam; సంస్కృతం: धीरशँकराभरणम्), కర్ణాటక సంగీతంలో 29వ మేళకర్త రాగము.[1] దీనిని శంకరాభరణం రాగము అని కూడా పిలుస్తారు. హిందుస్థానీ సంగీతంలో బిలావల్ రాగం, పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ దీనితో సమానమైనవి.
విషయ సూచిక |
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R2 G3 M1 P D2 N3 S)
-
-
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N3 D2 P M1 G3 R2 S)
-
-
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము. ఇది 65 వ మేళకర్త రాగమైన మేచకళ్యాణి కి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ఉదాహరణలు [మార్చు]
- దశరధరామ గోవింద నన్ను- దయజూడు పాహి ముకుంద - రామదాసు కీర్తన.
- ఇతడేనా ఈ లోకములో గల - రామదాసు కీర్తన.
- తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు - రామదాసు కీర్తన.
- రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె - రామదాసు కీర్తన.
- ఎంతో మహానుభావుడవు నీవు - రామదాసు కీర్తన.
- రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా - రామదాసు కీర్తన.
- నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ - రామదాసు కీర్తన.
ధీరశంకరాభరణం జన్యరాగాలు [మార్చు]
శంకరాభరణం రాగంలో చాలా జన్య రాగాలు వున్నాయి. వీటిలో కొన్ని ఆరభి, అఠాణా, కురింజి, కేదారం, నాగధ్వని, బిళహరి, దేవగాంధారి, హంసధ్వని, కదనకుతూహలం మరియు శుద్ధ సావేరి.
బేగడ రాగము [మార్చు]
- ఉదాహరణలు
- సకలేంద్రియము లార సమయముగాదు - రామదాసు కీర్తన.
- ఏలాగు తాళుదు నేమి సేతురా రామా - రామదాసు కీర్తన.
ఆరభి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ - రామదాసు కీర్తన.
బిళహరి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- s:భావయే పవమాన నందనం - రామదాసు కీర్తన.
- ఎవరు దూషించిన నేమివచ్చె మరి - రామదాసు కీర్తన.
- రక్షించే దొరవని నమ్మితి నిన్ను - రామదాసు కీర్తన.
- రామయ్య భద్రాచలధామా శ్రీరామ - రామదాసు కీర్తన.
కేదార రాగము [మార్చు]
- ఉదాహరణలు
- భజరే శ్రీరామం హే మానస - రామదాసు కీర్తన.
నవరోజు రాగము [మార్చు]
- ఉదాహరణలు
- జో అచ్యుతానంద - త్యాగరాజు కీర్తన.
- భజరే మానస రామం - రామదాసు కీర్తన.
కురింజి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని _ అన్నమాచార్య కీర్తన
మూలాలు [మార్చు]
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||