శుభపంతువరాళి రాగం
వికీపీడియా నుండి
శుభపంతువరాళి రాగము కర్ణాటక సంగీతంలో 45వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D1 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D1 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 9వ మేళకర్త రాగమైన ధేనుక రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- ఎన్నాళ్ళు ఊరక - మిశ్రచాపు - త్యాగయ్య
- శ్రీ సత్యనారాయణ - ముత్తుస్వామి దీక్షితులు
- జప పశుపతీశ్వరం - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||