వాచస్పతి రాగము

వికీపీడియా నుండి

వాచస్పతి రాగము (Vachaspati; pronounced Vāchaspati, సంస్కృతం: वाचस्पति, తమిళం: வாசஸ்பதி) కర్ణాటక సంగీతంలో 64వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు పద్ధతి ప్రకారం దీనిని భూషవతి అని పిలుస్తారు.[1][2],[1][3]

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

Vachaspati scale with shadjam at C


               S R2 G3 M2 P D2 N2 S
                 S N2 D2 P M2 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్త్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి ధైవతం మరియు కైశికి నిషాధం. ఇదొక సంపూర్ణ రాగం. ఇది 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

ఉదాహరణలు [మార్చు]

  • కంటజూడుమీ - త్యాగరాజు కీర్తన
  • పరాత్పర - పాపనాశనం శివన్
  • సహస్రాకార మండితే - ముత్తుస్వామి దీక్షితులు
  • ఎన్నడు నీ కృప - పట్నం సుబ్రమణ్య అయ్యర్

జన్య రాగాలు [మార్చు]

దీనికి చాలా జన్య రాగాలు ఉన్నాయి. వానిలో భూషావళి మరియు సరస్వతి ముఖ్యమైనవి.

సరస్వతి రాగము [మార్చు]

ఉదాహరణ 

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  2. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  3. Carnatic music – a complete system from "The Hindu" newspaper.