హనుమతోడి రాగము
హనుమతోడి రాగమ అనునది తోడి రాగంగా ప్రసిద్ధి పొందినది., (సంస్కృతం: हनुमतोडि, కన్నడ: ಹನುಮತೋಡಿ, Telugu: హనుమతోడి, తమిళం: ஹனுமத்தோடி, செவ்வழியாள்) ఇది కర్ణాటక సంగీతం లో 72 జనక రాగాలలో 8వ మేళకర్త రాగము.[1] .యిది సంగీత కచేరీలలో తరచుగా పాడే రాగము.ఈ రాగంలో దాదాపు అందరు వాగ్గేయకారులు రచనలు చేశారు. యిది ముత్తుస్వామి దీక్షితుల సంగీత పాఠశాలలో జనతోడి రాగంగా పిలువబడుతుంది..[2]
రాగం కర్ణాటక సంగీతంలో తోడి రాగం హిందుస్థానీ సంగీతం లో తోడి(థాట్) రాగానికి భిన్నమైనది. తోడి రాగానికి సమానమైన రాగం కర్ణాటక సంగీతంలో శుభపంతువరాళి రాగం( 45 వ మేళకర్త రాగం).[1][3] The equivalent of Carnatic Todi in Hindustani is Bhairavi thaat.[1]
విషయ సూచిక |
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R1 G2 M1 P D1 N2 S)
-
-
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N2 D1 P M1 G2 R1 S)
-
-
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము మరియు కైశికి నిషాధము. ఇది 44 మేళకర్త భావప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు [మార్చు]
- కాదను వారికి, దాసు కావలెనా మరియు గతి నీవని - త్యాగరాజు కీర్తనలు
- రామ దైవశిఖామణి సురరాజ మహోజ్వల భూమణి - రామదాసు కీర్తన.
హనుమతోడి జన్యరాగాలు [మార్చు]
హనుమతోడి రాగంలోని కొన్ని జన్య రాగాలు: అసావేరి, భూపాళం, ధన్యాసి, పున్నాగవరాళి మరియు శుద్ధ సీమంధిని.
ధన్యాసి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- తారకమంత్రము కోరిన దొరికెను - రామదాసు కీర్తన.
- హరి హరి రామ నన్నరమర జూడకు - రామదాసు కీర్తన.
- కోదండరాములు మముగన్న వారు - రామదాసు కీర్తన.
- రామా దయ జూడవే భద్రాచల - రామదాసు కీర్తన.
అసావేరి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- రామచంద్రులు నాపై చలము చేసినారు - రామదాసు కీర్తన.
- ఉన్నాడో లేడో భద్రాద్రియందు - రామదాసు కీర్తన.
- నా తప్పులన్ని క్షమియించుమీ - రామదాసు కీర్తన.
- రామా నామనవిని చేకొనుమా - రామదాసు కీర్తన.
పున్నాగవరాళి రాగము [మార్చు]
- ఉదాహరణలు
- గంధము పుయ్యరుగా - త్యాగరాజ స్వామి కీర్తన
- రక్షించు దీనుని రామ రామ - రామదాసు కీర్తన.
- ఏల దయ రాదో రామయ్య - రామదాసు కీర్తన.
మూలాలు [మార్చు]
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||