Jump to content

ఇండోర్

అక్షాంశ రేఖాంశాలు: 22°43′0″N 75°50′50″E / 22.71667°N 75.84722°E / 22.71667; 75.84722
వికీపీడియా నుండి
(ఇందౌర్ నుండి దారిమార్పు చెందింది)
ఇండోర్
మెట్రోపాలిటన్ నగరం
పైనుండి సవ్యదిశలో:మంగళ్ ప్రాంతం (విజయ్ నగర్), రాజ్‌వాడా ప్యాలెస్, డాలీ కాలేజి, అటల్ బిహారీ వాజపేయీ ప్రాంతీయ పార్కు, పాతాళపానీ జలపాతం
పైనుండి సవ్యదిశలో:మంగళ్ ప్రాంతం (విజయ్ నగర్), రాజ్‌వాడా ప్యాలెస్, డాలీ కాలేజి, అటల్ బిహారీ వాజపేయీ ప్రాంతీయ పార్కు, పాతాళపానీ జలపాతం
ఇండోర్ is located in Madhya Pradesh
ఇండోర్
ఇండోర్
మధ్య ప్రదేశ్ ఓటంలో నగర స్థానం
Coordinates: 22°43′0″N 75°50′50″E / 22.71667°N 75.84722°E / 22.71667; 75.84722
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ప్రాంతంమాళ్వా
జిల్లాఇండోర్
Government
 • Typeమునిసిపల్ కార్పొరేషను
విస్తీర్ణం
 • మెట్రోపాలిటన్ నగరం530 కి.మీ2 (200 చ. మై)
 • Metro
1,200 కి.మీ2 (500 చ. మై)
 • Rank8
Elevation
550 మీ (1,800 అ.)
జనాభా
 (2011)
 • మెట్రోపాలిటన్ నగరం19,94,397
 • జనసాంద్రత3,800/కి.మీ2 (9,700/చ. మై.)
 • Metro21,70,295
PIN
4520XX
టెలిఫోన్ కోడ్0731
Vehicle registrationMP-09
అధికారిక భాషహిందీ[6]
అక్షరాస్యత80.63%[7]

ఇండోర్, మధ్యప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం. [9] ఇది ఇండోర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇండోర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. ఇది విద్యా కేంద్రం కూడా. ప్రసిద్ధ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థలు రెండూ ఇక్కడ ఉన్నాయి. [10] ఇండోర్ నగరం,మాళ్వా పీఠభూమికి దక్షిణపు టంచున, సముద్ర మట్టం నుండి 553 మీటర్ల ఎత్తున ఉంది. [11] ఇది మధ్య భారతదేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా అత్యధిక ఎత్తున ఉన్న నగరం. ఇండోర్, రాష్ట్ర రాజధాని భోపాల్ కు పశ్చిమాన 190 కి.మీ. దూరంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 19,94,397 [12] ఇండోర్ పట్టణ సముదాయం జనాభా 21,70,295. [4] నగరం 530 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

16 వ శతాబ్దంలో దక్కనుకు, ఢిల్లీకీ మధ్య ఒక వాణిజ్య కేంద్రంగా ఇండోర్ స్థాపించబడింది. పీష్వా మొదటి బాజీ రావు మాళ్వాపై పూర్తి నియంత్రణ సాధించడంతో 1724 మే 17 న నగరం, దాని పరిసర ప్రాంతాలూ మరాఠా సామ్రాజ్యం పరిధిలోకి వచ్చాయి. బ్రిటిషు పాలనా కాలంలో, ఇండోర్ సంస్థానానికి 19 -గన్ సెల్యూట్ (స్థానికంగా 21) సంస్థాన హోదా (అరుదైన ఉన్నత హోదా) ఉండేది. మరాఠా హోల్కర్ రాజవంశీకులు ఈ సంస్థానం భారతదేశంలో కలిసే వరకు పాలించారు. [13] ఇండోర్ 1950 నుండి 1956 వరకు మధ్య భారత్ రాష్ట్రానికి వేసవి రాజధానిగా ఉండేది.

ఇండోర్ నగర కేంద్రంలో ఉన్న ఆర్థిక ప్రాంతం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉంది. ఇక్కడే మధ్యప్రదేశ్ స్టాక్ ఎక్స్ఛేంజి ఉంది.

స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన 100 భారతీయ నగరాల్లో ఇండోర్ ఒకటి. [14] ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ కు చెందిన మొదటి రౌండుకు అర్హత సాధించింది. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయబడిన మొదటి ఇరవై నగరాల్లో ఒకటిగా ఎంపికైంది. [15] స్వచ్ఛ సర్వేక్షణ్ మొదలైనప్పటి నుండి ఇండోర్ అందులో భాగంగా ఉంది. 2016 లో ఇది 25 వ స్థానంలో నిలిచింది. [16] 2017, 2018, 2019, 2020 లలో, వరుసగా నాలుగు సంవత్సరాల పాటు జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ లలో ఇది భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. [17] [18] [19] [20]

స్వాతంత్య్రానంతర చరిత్ర

[మార్చు]

1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, హోల్కర్ రాష్ట్రం, అనేక పొరుగు రాచరిక రాష్ట్రాలతో పాటు, భారతదేశంలో కలిసిపోయింది. 1948 లో, మధ్య భారత్ ఏర్పడటంతో, ఇండోర్ కొత్త రాష్ట్రానికి వేసవి రాజధానిగా మారింది. 1956 నవంబరు 1 న, మధ్య భారత్ మధ్యప్రదేశ్‌లో విలీనం అయినప్పుడు, రాష్ట్ర రాజధాని భోపాల్‌కు మారింది. ఇండోర్, ఈ రోజు దాదాపు 45 లక్షల (2018) జనాభాతో, సాంప్రదాయిక వాణిజ్య కేంద్ర స్థాయి నుండి రాష్ట్ర ఆధునిక డైనమిక్ వాణిజ్య రాజధానిగా రూపాంతరం చెందింది.

జనాభా వివరాలు

[మార్చు]

ఇండోర్, మధ్యప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం. మధ్య భారతదేశంలో ఇది అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇండోర్ నగర జనాభా 19,94,397. [12] ఇండోర్ మహానగర జనాభా (పట్టణ సముదాయం) 21,70,295. [4] 2011 లో నగర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 9,718. మధ్యప్రదేశ్‌లో 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని పట్టణాల్లోకీ ఇండోర్‌లో అత్యధిక జనసాంద్రత ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇండోర్ నగర సగటు అక్షరాస్యత 87.38%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 91.84%, స్త్రీల అక్షరాస్యత 82.55% [21] ఇండోర్‌ జనాభాలో 12.72% మంది, ఆరేళ్ళ లోపు పిల్లలు.

2001 - 2011 మధ్య నగర జనాభాలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.85%. మతం వారీగా, 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇండోర్ మొత్తం జనాభాలో హిందువులు 80.18%, ముస్లింలు 14.09%, జైనులు 3.25%, ఇతరులు 2.48% ఉన్నారు. 

2012 గణాంకాల ప్రకారం, నగరంలో 6,000 మంది పాకిస్తానీ హిందూ కాందిశీకులు నివసిస్తున్నారు (రాష్ట్రంలో మొత్తం 10,000 మంది ఉన్నారు). [22] వీరిలో ఎక్కువ మంది సింధీ ప్రజలు

శీతోష్ణస్థితి

[మార్చు]

ఇండోర్‌ శీతోష్ణస్థితి తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితికి ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa), ఉష్ణమండల సవన్నా శీతోష్ణస్థితికీ (Aw) మధ్య సరిహద్దు రేఖపై ఉంటుంది. బాగా ఎత్తున ఉండడం, బాగా అంతర్గత భూభాగంలో ఉన్నందున, అత్యంత వేడి నెలలలో కూడా రాత్రులు చాలా చల్లగా ఉంటాయి, దీనిని షాబ్-ఎ-మాళ్వా అని పిలుస్తారు. [23] ఇండోర్‌లో వేసవి, రుతుపవనాలు, శీతాకాలం అనే మూడు విభిన్న ఋతువులను గమనించవచ్చు. 1936 జనవరి లో అతి శీతల ఉష్ణోగ్రత 1.1 °C (34.0 °F) నమోదైంది. [24]

ఇండోర్‌లో 700 - 800 మి.మీ. వార్షిక వర్షపాతం ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Indore (1981–2010, extremes 1949–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.9
(93.0)
37.9
(100.2)
41.1
(106.0)
44.6
(112.3)
46.0
(114.8)
45.8
(114.4)
39.9
(103.8)
35.8
(96.4)
37.4
(99.3)
37.8
(100.0)
37.1
(98.8)
32.9
(91.2)
46.0
(114.8)
సగటు అధిక °C (°F) 26.8
(80.2)
29.5
(85.1)
34.7
(94.5)
38.8
(101.8)
40.5
(104.9)
36.7
(98.1)
30.6
(87.1)
28.7
(83.7)
30.9
(87.6)
32.7
(90.9)
30.3
(86.5)
27.6
(81.7)
32.3
(90.1)
సగటు అల్ప °C (°F) 10.3
(50.5)
12.1
(53.8)
16.7
(62.1)
21.1
(70.0)
24.6
(76.3)
24.5
(76.1)
22.8
(73.0)
22.1
(71.8)
21.1
(70.0)
17.9
(64.2)
14.2
(57.6)
11.1
(52.0)
18.2
(64.8)
అత్యల్ప రికార్డు °C (°F) −1.1
(30.0)
−2.8
(27.0)
5.0
(41.0)
7.8
(46.0)
16.7
(62.1)
18.9
(66.0)
18.9
(66.0)
18.6
(65.5)
9.0
(48.2)
6.2
(43.2)
5.6
(42.1)
1.1
(34.0)
−2.8
(27.0)
సగటు వర్షపాతం mm (inches) 5.6
(0.22)
2.3
(0.09)
2.8
(0.11)
3.0
(0.12)
13.5
(0.53)
137.6
(5.42)
269.2
(10.60)
272.7
(10.74)
177.0
(6.97)
43.4
(1.71)
15.8
(0.62)
4.4
(0.17)
947.4
(37.30)
సగటు వర్షపాతపు రోజులు 0.4 0.4 0.4 0.3 1.3 6.3 12.0 12.9 7.4 2.7 1.0 0.2 45.4
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 34 25 16 14 20 44 70 78 65 40 35 36 40
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 289.0 275.6 287.6 305.9 326.9 208.6 104.1 79.9 180.6 270.8 274.0 281.3 2,884.3
Source 1: India Meteorological Department[25][26]
Source 2: NOAA (sun 1971–1990)[27]

రవాణా

[మార్చు]

విమాన సేవలు

[మార్చు]
దేవి అహిల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఇండోర్‌కు దేవి అహిల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తోంది. ఇది నగరం నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. 22,69,971 మంది ప్రయాణికులు, 10,851 టన్నుల సరుకుతో ఏప్రిల్ 2017- మార్చి 2018 వరకు ఇది, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా నిలిచింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 20 లక్షల లోపు వార్షిక ప్రయాణీకుల సంఖ్య కలిగిన విభాగంలో ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ) వారి విమానాశ్రయ సేవా నాణ్యత (ఎఎస్‌క్యూ) ర్యాంకింగుల‌లో 2017 సంవత్సరానికి ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. [28]

రైలు

[మార్చు]
ఇండోర్ జంక్షన్ తూర్పు ద్వారం
ఇండోర్ జంక్షన్ పశ్చిమ ప్రవేశం

ఇండోర్ జంక్షన్, ఎ -1 గ్రేడ్ రైల్వే స్టేషను. దీని వార్షికాదాయం 50 కోట్ల రూపాయల పైబడి ఉంది. ఈ స్టేషను పశ్చిమ రైల్వే లోని రత్లాం డివిజన్ పరిధిలోకి వస్తుంది.

ఇండోర్– దేవాస్ - ఉజ్జయిని విద్యుదీకరణ 2012 జూన్‌లో పూర్తయింది. రత్లాం - ఇండోర్ బ్రాడ్ గేజ్ మార్పిడి 2014 సెప్టెంబరులో పూర్తయింది. [29] ఇండోర్– మౌ విభాగాన్ని 2016 లో బ్రాడ్ గేజ్‌కు ఉన్నతీకరించారు. 2017 లో దీన్ని విద్యుదీకరించారు. [30]

రోడ్లు

[మార్చు]

ఇండోర్ నుండి జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.

నగరం గుండా వెళుతున్న జాతీయ రహదారులు:

  • జాతీయ రహదారి 52 (NH 52): ఇందులో పూర్వపు జాతీయ రహదారి 3 (ఆగ్రా బొంబాయి రోడ్) యొక్క భాగాలు ఉన్నాయి. ఇది పంజాబ్ లోని సంగ్రూర్ వద్ద మొదలై జైపూర్, రాజస్థాన్, ఇండోర్, ధూలే గుండా వెళ్ళి కర్ణాటకలోని అకోలా వద్ద ముగుస్తుంది.
  • జాతీయ రహదారి 47 గుజరాత్ లోని బామన్బోర్ లో మొదలై అహ్మదాబాద్ మీదుగా ఇండోర్ చేరుకుంటుంది.
  • నేషనల్ హైవే 3 ను ఆగ్రా-బొంబాయి రోడ్ లేదా ఎబి రోడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండోర్‌ను ఆగ్రాను ముంబై లకు కలుపుతుంది.
  • జాతీయ రహదారి 59 అహ్మదాబాద్ నుండి గోద్రా, ఇండోర్, రాయ్పూర్, బ్రహ్మపూర్ మీదుగా గోపాల్పూర్-ఆన్-సీ వరకు వెళ్తుంది. దీని శాఖ అయిన జాతీయ రహదారి 59A, ఇండోర్, బేతుల్ లను కలుపుతుంది.

నగరం గుండా వెళుతున్న రాష్ట్ర రహదారులు:

  • మధ్య ప్రదేశ్ రాష్ట్ర రహదారి 27 రాజస్థాన్ లోని ఝలావర్ వద్ద మొదలై, ఉజ్జయినీ, ఇండోర్, బుర్హాన్‌పూర్ ల గుండా వెళ్ళి మహారాష్ట్ర లోని మల్కాపూర్, బుల్దానా వద్ద ముగుస్తుంది.
  • మధ్య ప్రదేశ్ రాష్ట్ర రహదారి 31 ( నీముచ్ - రత్లాం - ధార్ )

ఇండోర్ BRTS (iBUS) - ఇండోర్ బిఆర్‌టిఎస్ అనేది 53 ఎయిర్ కండిషన్డ్ [31] బస్సులతో కూడిన వేగవంతమైన బస్సు రవాణా వ్యవస్థ. ఇందులో GPS, IVR వంటి సేవలను ఉంటాయి. వీటిద్వారా బస్సుస్టాపుల వద్ద ప్రదర్శించే సమాచారంతో ప్రయాణీకులు, బస్సు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు.

ఇండోర్ మెట్రో అనేది వేగవంతమైన రవాణా వ్యవస్థ, ప్రస్తుతం దీని మొదటి దశ నిర్మాణంలో ఉంది. [32]

నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరొక ప్రజా రవాణా వ్యవస్థగా ఇండోర్ కేబుల్ కారును 2021 జనవరిలో ప్రకటించారు. రద్దీగా ఉండే వీధుల్లో పనిచేసే కేబుల్ కారు వ్యవస్థ, భారతదేశంలో ఇదే మొదటిది అవుతుంది. [33]

దేవాలయాలు

[మార్చు]

ఇక్కడ బిజాసన్ మాతా దేవాలయం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Indore City – Indore municipal corporation". Archived from the original on 2021-07-18. Retrieved 2021-01-11.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; villages అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "इंदौर बनेगा महानगर:मेट्रोपॉलिटन से मेट्राे ट्रेन पर ठहरा प्रोजेक्ट; 2000 किमी का होना था इंदौर, अब 1200 वर्ग किमी में होगा". Dainik Bhaskar. Retrieved 20 November 2020.
  4. 4.0 4.1 4.2 "Presentation on Towns and Urban Agglomerations". Census of India 2011. Archived from the original on 14 March 2016. Retrieved 13 March 2016.
  5. "INDIA STATS : Million plus cities in India as per Census 2011". Archived from the original on 20 June 2018. Retrieved 13 September 2018.
  6. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 17 March 2019.
  7. "literacy rate". Census Population 2015 Data. Archived from the original on 28 డిసెంబరు 2016. Retrieved 14 జూలై 2016.
  8. "Indore Ward List" (PDF). Indore Municipal Corporation. Archived (PDF) from the original on 16 June 2016. Retrieved 3 March 2016.
  9. List of cities in Madhya Pradesh by population
  10. Duttagupta, Ishani (17 August 2015). "How Indore's unique IIT-IIM blend is spurring entrepreneurship". The Economic Times. Archived from the original on 17 August 2015. Retrieved 18 August 2015.
  11. "About District | District Indore,Government Of Madhya Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 March 2020.
  12. 12.0 12.1 "Census of India 2011" (PDF). censusindia.gov. Directory of Census Operations. 2011. Archived (PDF) from the original on 31 May 2016. Retrieved 13 March 2016.
  13. (India), Indore (1946). Report on the Administration of Holkar State for 1944 - Indore (India) - Google Books. Retrieved 4 April 2014.
  14. "Why only 98 cities instead of 100 announced: All questions answered about smart cities project". firstpost.com. 28 August 2015. Archived from the original on 19 January 2017. Retrieved 25 November 2016.
  15. Desk, Internet (28 January 2016). "List of first 20 smart cities under Smart Cities Mission". The Hindu. Archived from the original on 22 February 2016. Retrieved 16 February 2016.
  16. "Swachh Survekshan Awards 2019" (PDF). Archived from the original (PDF) on 7 మార్చి 2020. Retrieved 9 January 2020.
  17. Swachh Survekshan 2017 cleanest cities Archived 5 మే 2017 at the Wayback Machine. ndtv.com. Retrieved 5 May 2017.
  18. "Swachh Survekshan Awards 2019: Indore judged cleanest city in India for third time in a row". www.businesstoday.in. Retrieved 16 June 2019.
  19. Ahuja, Aastha (1 January 2020). "Swachh Survekshan League 2020: Indore Tops The Chart, Again, Adjudged Cleanest City Of India for the Fourth Time in a Row | News". NDTV-Dettol Banega Swasth Swachh India. Retrieved 11 January 2020.
  20. Bhatia, Anisha; Bhaskar, Sonia (10 January 2020). "India's Cleanest City For Fourth Time in a Row - Indore Earns ₹4 Crore Annually Through Proper Waste Management | Swachh Survekshan". NDTV-Dettol Banega Swasth Swachh India. Retrieved 11 January 2020.
  21. Statistics of Indore Archived 13 మే 2012 at the Wayback Machine. District Administration of Indore. Retrieved 16 August 2009
  22. "1,000 Pakistani Hindus migrate to Indore". The Times of India. Archived from the original on 24 May 2013. Retrieved 14 December 2012.
  23. Omkareshwar and Maheshwar: Travel Guide. Goodearth Publications. 2011. p. 79. ISBN 9789380262246. Archived from the original on 8 October 2017. Retrieved 8 October 2017.
  24. Indore, Bhopal temperatures dip to lowest in decade Archived 12 మార్చి 2016 at the Wayback Machine (recorded in 1936)
  25. "Station: Indore (A) Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 337–338. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
  26. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M120. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
  27. "Indore Climate Normals 1971-1990". National Oceanic and Atmospheric Administration. Retrieved 17 April 2015.
  28. "Indore: City airport best in service quality in Asia Pacific region". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 12 March 2020.
  29. "Indore Ratlam Broad Gauge". Free Press Journal. Archived from the original on 27 June 2015.
  30. Staff Reporter (17 March 2017). "Indore-Mhow rail electrification completed". Hindustan Times. Archived from the original on 23 January 2018.
  31. "AiCTSL". aictslportal.infinium.management. Archived from the original on 11 December 2018. Retrieved 10 December 2018.
  32. "Metro project designed to ensure minimum impact on private land". The Times of India (in ఇంగ్లీష్). 9 December 2019. Retrieved 4 March 2020.
  33. "Indore to get Cable Car". Free Press Journal (in ఇంగ్లీష్). 6 January 2021. Retrieved 8 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇండోర్&oldid=3916370" నుండి వెలికితీశారు