కళ్యాణి ఆనకట్ట
(కళ్యాణీ డ్యాము నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణి ఆనకట్ట | |
---|---|
అధికార నామం | కళ్యాణి ఆనకట్ట |
దేశం | భారత దేశం |
ప్రదేశం | తిరుపతి |
అక్షాంశ,రేఖాంశాలు | 13°39′27.5″N 79°16′9.4″E / 13.657639°N 79.269278°E |
ఆవశ్యకత | సాగునీరు, తాగునీరు |
యజమాని | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | గ్రావిటీ డ్యామ్ |
నిర్మించిన జలవనరు | కళ్యాణి నది |
జలాశయం | |
పరీవాహక ప్రాంతం | 48.56 కి.మీ2 (18.75 చ. మై.) |
కళ్యాణి ఆనకట్ట,తిరుపతికి దగ్గరలో కళ్యాణి నదిపై కట్టిన ఆనకట్ట. కళ్యాణి, సువర్ణముఖి నదికి ఉపనది. తిరుపతిలో ప్రధానంగా నీటి సరఫరా కళ్యాణి జలాశయం నుంచే జరుగుతుంది.[1] ప్రకృతి సుందరమైన ఈ అనకట్ట తిరుపతి- మదనపల్లె మార్గ మధ్యంలో రంగంపేట అడవుల్లో, తిరుపతి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. చుట్టుపక్కల గ్రామస్థులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆనకట్టను 1977 లో నిర్మించారు.[2]
కళ్యాణి నది పాలకొండ అడవుల్లో పుట్టింది. అనేక వాగులు వంకలూ అందులో కలుస్తాయి. వాటిలో ప్రధానమైనవి: మామిడ్లమానుకోన వంక, పగడగుండ్ల వంక, మొర్రావుకోన, తుంబకోన, రాగిమానుకోన, తేళ్ళబండకోన, అనుమకోన, చింతకుంటలకోన.
మూలాలు
[మార్చు]- ↑ "Two spillway gates of Kalyani Dam lifted". Retrieved 23 November 2015.
- ↑ "Geotechnical investigations at the Kalyani dam site, Chitoor District, Andhra Pradesh, India". సైన్స్ డైరెక్ట్. Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15.