టి. ఎన్. శేషన్
టి.ఎన్.శేషన్ | |||
| |||
10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనర్
| |||
పదవీ కాలం 12 డిసెంబరు 1990 – 11 డిసెంబరు 1996 | |||
ప్రధాన మంత్రి | వి.పి.సింగ్ చంద్రశేఖర్ పి.వి.నరసింహరావు అటల్ బిహారీ వాజపేయి హెచ్.డి.దేవెగౌడ | ||
---|---|---|---|
ముందు | వి.ఎస్.రమాదేవి | ||
తరువాత | ఎం.ఎస్.గిల్ | ||
18వ భారత కేబినెట్ సెక్రటరీ
| |||
పదవీ కాలం 27 మార్చి 1989 – 23 డిసెంబరు 1989 | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
ముందు | బి.జి.దేశ్‌ముఖ్ | ||
తరువాత | వి.సి.పాండే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాలక్కాడు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళ, భారతదేశము) | 1932 డిసెంబరు 15||
మరణం | 2019 నవంబరు 10 | (వయసు 86)||
నివాసం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | మద్రాసు క్రిస్టియన్ కళాశాల హార్వార్డ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ | ||
పురస్కారాలు | రామన్ మెగసెసే పురస్కారం (in 1996) |
తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ (టి.ఎన్.శేషన్ గా సుపరిచితుడు) పదవీవిరమణ చేసిన భారతదేశానికి చెందిన తమిళనాడు కేడరులోని 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ అధికారి. అతను భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా సుపరిచితుడు.[1][2] అతను 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనరుగా (1990–96) ఉన్నాడు.[3][4][5] ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను 1989 లో 18వ భారత కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేసాడు. అతను ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు గ్రహీత.[6] ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టాడు.
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబరు 15న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన తిరునెళ్ళై గ్రామంలో జన్మించాడు. అతను "బేసెల్ ఎవాంజెలిచల్ మిషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల"లో పాఠశాల విద్యను పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ ను పాలక్కాడ్ లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో చదివాడు. అతను మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతను ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో మూడు సంవత్సరాలు డిమానిస్ట్రేటర్ గా పనిచేసాడు. తరువాత అతను హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఎడ్వర్డ్ ఎస్. మాసన్ ఫెలోషిప్ పొందాడు. అక్కడ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీని పొందాడు.
టి.ఎన్.శేషన్, ఎ.శ్రీధరన్ లు బి.ఇ.ఎం పాఠసాల, విక్టోరియా కళాశాలలో సహాద్యాయులు. వీరిద్దరూ కాకినాడ లోని ఇంజనీరింగ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం) కు ఎంపిక కాబడ్డారు. అయినప్పటికీ ఇ.శ్రీధరన్ దానిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు కానీ శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నాడు.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1959లో దిండిగల్ సబ్ కలెక్టరుగా సేవలనందించే సమయంలో అతను జయలక్ష్మిని వివాహమాడాడు. ఆమె కేరళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఆర్.ఎస్. కృష్ణన్ కుమార్తె. పదవీ విరమణ చేసిన తరువాత శేషన్ పిల్లలు లేని కారణంగా కొద్దికాలంగా తన భార్యతో సహా వృద్ధాశ్రమంలోనే నివసిస్తూ వచ్చాడు. ఆమె 2018 మార్చి 31 న మరణించింది.[8]
జీవితం
[మార్చు]శేషన్ తన సోదరుడు టి.ఎన్.లక్ష్మీనారాయణన్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు మొదటి బ్యాచ్ వ్యక్తి) వలెనే సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. 1953లో శేషన్ ఐ.ఎ.ఎస్ కు హాజరగుటకు తక్కువ వయస్సు కలిగి ఉన్నాడు. తన సామర్ధ్యాలను పరీక్షించేందుకు, అతను ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం పరీక్షకు హాజరయ్యాడు. 1954 బ్యాచ్ భారతదేశంలో మొదటి స్థానం పొందాడు. తరువాత సంవత్సరం అతను 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ కు హాజరయ్యాడు మంచి ర్యాంకు సంపాదించాడు.
ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖలలో సెక్రటరీగా తన సేవలనందించాడు. అతను కేబినెట్ సెక్రటరీగా, సివిల్ సర్వీసులో సీనియర్ గా, భారత దేశ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా కూడా పనిచేసాడు. తరువాత భారత ప్రధాన ఎన్నికల అధికారిగా తన సేవలనందించాడు. అతను 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కె.ఆర్. నారాయణన్కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[9]
2012 అక్టోబరు 17 న మద్రాసు హైకోర్టు అతనిని చెన్నై లోని పచ్చయప్ప ట్రస్టుకు తాత్కాలిక నిర్వాహకునిగా ఉండవలసినదిగా నియమించింది.[10]
ప్రధాన ఎన్నికల కమీషనర్
[మార్చు]10 వ ముఖ్య ఎన్నికల కమిషనరుగా శేషన్ పేరు పారదర్శకత, సమర్థతకు పర్యాయపదంగా మారింది.[3] స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడం ద్వారా అతను దేశ ఎన్నికల వ్యవస్థపై తన అధికారాన్ని ముద్రించగలిగాడు. "చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు."[11][12] అతనిచే ప్రవేశపెట్టిన ఎన్నికలలో మార్పులు రాజకీయ వర్గాలు, వారి మీడియా మధ్య పరస్పరం వ్యతిరేకించాయి, అతనిని కూడా వ్యతిరేకించారు, "ఎలక్షన్ వాచ్ డాగ్"గా పేరుపెట్టాయి. తరువాత "Al-Seshan (Alsatian)" [13][14] అభివర్ణించాయి. ఎంతగా అంటే, ఎన్నికల 'పోరాటాలు' గా "శేషన్ వెర్సస్ నేషన్"గా పిలవబడేటంతగా పేరు పొందాడు.[15]
ప్రధాన విజయాలు
[మార్చు]ఎన్నికల ప్రక్రియలో చట్టం అమలు :
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలుపరచడానికి పరికరాలు.
- అర్హత గల ఓటర్లకు ఓటరు ID లను జారీ చేయడం
- అతడు / ఆమె ఎన్నికలలో అభ్యర్థుల వ్యయంపై పరిమితి
- ప్రగతిశీలమైన, స్వతంత్ర ఎన్నికల కమిషన్ యంత్రాలు. ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల నుండి ఎన్నికల అధికారులను రూపొందించడం.[16]
అంతకు ముందు గల అనేక దుష్పరిమాణాల తొలగింపు :[17]
- ఓటర్లకు లంచం లేదా భయపెట్టడం
- ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ.
- ప్రచారం కోసం అధికారిక యంత్రాల వినియోగం.
- ఓటర్ల కుల లేదా మతపరమైన భావాలకు విజ్ఞప్తి.
- ప్రచారానికి ప్రార్థనా స్థలాల ఉపయోగం.
- ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్, అధిక శబ్దంతో సంగీతం వినియోగం.
మరణం
[మార్చు]ఎన్నికల సంస్కర్తగా పేరు గడించిన టి.ఎన్.శేషన్ తన 87వయేట 2019, నవంబర్ 10 ఆదివారం చెన్నై నగరం అడయార్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచాడు[18].
మూలాలు
[మార్చు]- ↑ Das, Sanjib Kumar (1 May 2014). "The man who cleaned up India's elections". Gulf News. Retrieved 10 August 2016.
- ↑ Narasimhan, T. E. (12 May 2012). "'The more you kick me...'". Business Standard. Retrieved 9 August 2016.
- ↑ 3.0 3.1 Srivastava, Ritesh K.(The Observer) (5 March 2012). "Empowering the EC". Zee News. Archived from the original on 19 డిసెంబరు 2014. Retrieved 19 December 2014.
- ↑ "Election Commission's neutrality: Will Zaidi fit in Seshan's shoes?".
- ↑ Anand, R. K. (20 June 2012). "Time to 'Seshan' the EC". Suara Sarawak. (Baru Bian, Malaysia). Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 17 December 2014.
- ↑ Ramon Magsaysay Award Foundation http://www.rmaf.org.ph/index.php?task=4&year=1990 Archived 2012-02-07 at the Wayback Machine
- ↑ "Man of Tomorrow". The Hindu Newspaper.
- ↑ "భార్య మరణిస్తే ఆయన్నే చంపేశారు...!". Archived from the original on 2018-05-06. Retrieved 2018-05-18.
- ↑ Sardesai, Rajdeep (5 October 2012). "Will Arvind Kejriwal succeed where TN Seshan failed?". News18. Retrieved 2016-08-09.
- ↑ Seshan to take care of Pachaiyappa’s trust http://newindianexpress.com/cities/chennai/article1303162.ece Archived 2016-03-14 at the Wayback Machine
- ↑ Gilmartin, David (North Carolina State Univ.). "'One Day's Sultan': T. N. Seshan and the Reform of the Election Commission in the 1990s". Retrieved 17 December 2014.
- ↑ McGirk, Tim (28 April 1996). "India's scourge of money, muscle and ministers". The Independent (U.K.). Archived from the original on 22 డిసెంబరు 2014. Retrieved 17 December 2014.
- ↑ Kaw, M K. "Seshan the Alsatian". GFiles-Inside the Government. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 11 August 2016.
- ↑ Shekhar, G. C. (7 April 2014). "Autum of Al-Seshan". The Telegraph (Calcutta). Retrieved 17 December 2014.
- ↑ Verma, Nalin (1 December 2012). "Minds unite in crisis times". The Telegraph (Calcutta). Retrieved 17 December 2014.
- ↑ Sumit Ganguly; Rahul Mukherji (1 August 2011). India Since 1980. Cambridge University Press. p. 179. ISBN 978-1-139-49866-1. Retrieved 17 December 2014.
- ↑ "CEC T.N. Seshan tightens electoral reform screws to clean up entire election process". India Today Portal. 15 December 1994.
- ↑ విలేకరి (11 November 2019). "ఎన్నికల సంస్కర్త టి.ఎన్.శేషన్ కన్నుమూత". ఈనాడు. Archived from the original on 13 నవంబరు 2019. Retrieved 13 November 2019.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు
[మార్చు]- Biography Ramon Magsaysay Award website.
- G. C. Shekhar. "Autumn of Al-Seshan". The Telegraph (India). April 7, 2014.
- Govindan Kutty. "Seshan: An Intimate Story 1994"