తిరుమల శ్రీవారి పాదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీవారి పాదాలు

శ్రీ వారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన ఉన్నాయి. ఇక్కడి ప్రయాణం చెయ్యడానికి సింగిల్ రోడ్డు కలదు, టాక్సీలో వెళ్ల వచ్చు. వంద నుండి రెండు వందల వరకూ చార్జి చేస్తారు. దారిలో చక్రతీర్థం, శిలా తోరణం కూడా దర్శించ వచ్చు. శ్రీ వారి పాదాల మండపము నుండి తిరుమల లోయ బహు సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి పైన్ వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటాయి.

మహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటాద్రికి దిగి వచ్చేప్పుడు మెదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనందనిలయంలో స్వామి వున్న ప్రదేశంలో పెట్టాడనీ చెబుతారు.