బాంద్రా గొండియా లోక్‌సభ నియోజకవర్గం
(బాంద్రా గొండియా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
బాంద్రా గొండియా లోకసభ నియోజకవర్గం (Bhandara-Gondiya Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఆవిర్భవించింది.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]
- తుమ్సార్
- భాంద్రా
- సకోలి
- అర్జుని మోర్గాన్
- టిరోరా
- గోండియా
విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
- 2009: ప్రపుల్ పాటెల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు[మార్చు]
2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రపుల్ పాటెల్ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీచేసిన నానాపటోలె పై 2,51,915 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ప్రపుల్ పాటెల్‌కు 4,89,814 ఓట్లు రాగా, నానాపటోలెకు 2,37,899 ఓట్లు లభించాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శిశుపాల్ పాట్లెకు 1,58,938 ఓట్లు వచ్చాయి. నాల్గవస్థానంలో వచ్చిన బీఎస్పీ అభ్యర్థి వీరేంద్రకుమార్ జైస్వాల్‌కు 68,246 లభించాయి.