వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 41
← పాత చర్చ 40 | పాత చర్చ 41 | పాత చర్చ 42 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 ఏప్రిల్ 15 - 2015 ఏప్రిల్ 28
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
గ్రామ వ్యాసాల్లో ఖాళీ విభాగాలు
[మార్చు]ఇటీవల నేను కొన్ని గ్రామ వ్యాసాలలో కొంత సమాచారం చేర్చుతున్నాను. అయితే మొలక స్థాయి వ్యాసాలుగా అనుకొన్న కొన్ని వ్యాసాలు 2కెబి దాటిన వ్యాసాలుగా చూపిస్తున్నాయి. కారణాలు చూస్తే అందులో కల ఖాళీ విభాగాల వలన అలా అవి కనిపిస్తున్నాయి అనేది తెలుస్తున్నది. దీని వలన తెవికీలో మొలకల స్థాయి వ్యాసాలు తగ్గినట్టుగా అనిపిస్తున్నాయి కాని నిజానికి ఇవన్నీ మొలక స్థాయి వ్యాసాలే. కనుక ఇకపై కఠినంగానైనా ఇలాంటి వ్యాసాల అసలు నాణ్యత తెలుసుకొనేటందుకు ప్రయత్నం చేయాలి. నేను ఇటీవల వికీ అవగాహనా కార్యక్రమాల ద్వారా కొత్త వాడుకరులకు వారి వారి ఊళ్ళలో సమాచారం రాయిస్తున్నపుడు వాళ్లకు తెలిసిన సమాచారం వీటిలో ఎలా పెట్టాలో, ఎందులో పెట్టాలో తెలియక తికమక పడుతున్నారు. తెలిసిన సమాచారం ఎక్కడో ఒక చోట రాయగలిగితే తరువాత ఆ సమాచారం బట్టి విభాగాలు సృష్టించుకోవచ్చు. ఈ విధంగా వ్యాస నాణ్యత పెరుగుతుంది. నేను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో చాలా వరకూ గ్రామాల సమాచారం చేర్చుతున్నాను కనుక ఇకపై ఈ జిల్లాలలో ఉన్న ఖాళీ విభాగాలను తొలగించాలనుకొంటూన్నాను. ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకొని కృషిచేస్తున్న వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:C.Chandra Kanth Rao గార్లు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుస్తున్నది.....--విశ్వనాధ్ (చర్చ) 06:25, 15 ఏప్రిల్ 2015 (UTC)
- దాదాపు 9 మాసాల క్రిందటే సభ్యులు ఖాళీ విభాగాలను చేర్చుతున్నప్పుడు అవి అవసరం లేవని సూచించిననూ, హెచ్చరించిననూ వారు దిద్దుబాట్లను ఆపలేరు. ఇతరులు కూడా పట్టించుకోలేరు. వారు గ్రామ వ్యాసాలపై దండయాత్ర కొనసాగిస్తూ దిద్దుబాట్ల జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తిచేశారు! అలాంటి సునాయాస మరియు అనవసర దిద్దుబాట్లతో వారి దిద్దుబాట్ల "లక్ష"ము నెరవేరుతున్ననూ తెవికీకి ఆ దిద్దుబాట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండుటయే కాకుండా అనవసర భారంగా మారింది. ఆ ఖాళీ విభాగాలు చేర్చే అవసరం ఏమిటో తెలియదు కాని సభ్యుల ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. ఎవరో, ఎప్పుడో ఆ ఖాళీ విభాగాలను భర్తీ చేస్తారని కాకుండా సమాచారం లభ్యమైనప్పుడే విభాగాలు ఏర్పర్చడం సమంజసంగా ఉంటుంది. తెవికీ యొక్క ముఖ్య లక్ష్యం పాఠకులకు సమాచారం అందించడమే, కాని వారి నుంచి సమాచారం ఆశించడం కాదు కదా! సమాచారం చేర్చేవారు ఎలాగూ చేరుస్తారు, కాని సమాచారం చేర్చాలని ఖాళీ విభాగాలను పెట్టడం వ్యాసాలకే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇక ముందైనా ఇలాంటి వాటిని అడ్డుకోవడం అవసరమే. ఆరేడేళ్ళ క్రితం నియోజకవర్గాల వ్యాసాలలో కూడా ఇదే విధంగా ఖాళీ విభాగాలు పెడుతున్న సభ్యునికి (ఇప్పుడు నిర్వాహకుడు) సూచిస్తే వెంటనే ఆపివేశారు కాని ఇప్పుడు మాత్రం కొందరు సభ్యులు చర్చలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:04, 15 ఏప్రిల్ 2015 (UTC)
మన కంఠశోష - వృధా అనవసర ఆయాసం
[మార్చు]- మన కంఠశోష తప్ప, వృధా అనవసర ఆయాసం తప్ప, ఇటువంటి అనవసర పనులు ప్రోత్సహించేవారు మన గోడు వినరు, పనికి రాని సమాచారం ఎక్కిస్తున్న వారు అర్థం చేసుకోరు. ఇటువంటి వారు ఎవరో అందరికీ తెలుసు, ఒక్కొక్కరు అమెరికా ప్రెసిడెంటులా ఫీలవుతారు. ఇంక నుండి పిచ్చి పనులు చేసే వారికి, మొండి వారికి, చెత్త రాతలు వ్రాసే వారికి ఘాటుగానే వ్రాస్తాను. ఇన్నాళ్ళూ మంచితనముతో, పోనిలే పెద్ద (వయసు)వాళ్ళు, ఏదో కాలక్షేపము చేస్తున్నారు, ఏనాటికైనా అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను.
నాకూ సమావేశాలలో ప్రతి విషయము కూలంకషముగా చర్చించి కడిగి పారేయాలని ఉంది. నాకు అవకాశము దొరికితే మీ అందరితో కూర్చుని, నా మాటలకు అడ్డుపడకుండా వినగలిగే ఓపిక ఉంటే, చెప్పినమాట చెప్పకుండా ఎన్ని గంటలైనా ఎన్ని విషయాల మీదనయినా ఏమాత్రం తడుముకోకుండా మాట్లాడగలను. అసలు నా అలవాట్లు,ఇష్టాలలో మాట్లాడము, చదవడము, వ్రాయడము.........నాతో వాదన చేసే వాళ్ళు ఎవరో తేల్చుకోండి. మరి జీవితంలో ఇక నాతో వాదనకు రాకుండా నోరు, చేతులు మూసుకుంటారు. కొత్త్తగా గత మూడు సంవత్సరములుగా (మించి) రాజకీయ ముఠా, మాఫియా, రౌడీ, గూండా, గ్రూపులు లాంటి తత్వాలు పెంచి పోషిద్దామనుకుంటున్నారు. ఇంక మీ పద్ధతులు మార్చుకోండి. జీవితం ఆశాశ్వతము, ఇక్కడ ఏదీ సొంతం కాదు, ఎవరికీ ఏమీ చెందవు, ఏదీ మనది కాదు, ఎంతో మంది వచ్చారు, వెళ్ళారు, వెళ్ళుతున్నారు, వస్తున్నారు, ఎవరినీ ఎవరూ అంతగా గుర్తు పెట్టుకునే అవసరము భవిష్యత్తు వారికి ఉండదు. కాకపోతే, మనము ఏదైనా మంచి పనులు, చేస్తే అవి ఏమైనా ఎప్పుడైనా వెలుగులోకి వచ్చిన సందర్భాలేమైనా ఉంటే, ఆ భవిష్యత్తులోని వాడుకరులు తెలుసుకునే ప్రయత్నము ఉంటుంది. గుడికి వచ్చాము, వెళ్ళాము అన్నట్ట్లు ఇక్కడ కూడా అదే దోరణి మనసుతో ఉండాలి. (సశేషం) JVRKPRASAD (చర్చ) 01:26, 16 ఏప్రిల్ 2015 (UTC)
- సముదాయం కోరితే ఖాళీ విభాగాలను నేను బాటుతో తీసెయ్యగలను --వైజాసత్య (చర్చ) 01:34, 16 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారు, తీసిపారెయ్యండి. ఎవరా సముదాయపు వారు ? ఎక్కడున్నారు ? ఇలాంటి చెత్తపనులు ప్రోత్సహించేవారే సముదాయము లోని కొందరు. ఈ చెత్త పని చేసేటప్పుడు ఎవరిని అడిగి చేశారు ? ఎక్కడైనా దొంగలకు పదవులిస్తే మంచివారికి చోటుండదు. గ్రామాలలో చాలా సమస్యలుగా ఉన్నాయి. ప్రక్క ప్రక్క నున్న గ్రామాలు ఒకదానికి వివరాలు ఉంటాయి. మిగతావి అన్నీ ఖాళీ. దీని వల్ల భూమి రేట్లు, గ్రామములో వసతులు అన్నీ ఉన్నా, ఇక్కడ వికీలో మాత్రము అన్నీ ఖాళీ. వెంటనే అన్ని(ఇతర) వ్యాసాలలోని అది ఏదయినా మీరు అన్నీ విభాగాలు బాటుతో వెనువెంటనే తొలగించండి. ఎవరయినా విషయాలను విభాగాలుగా చేస్తారు. విభాగాలు సృష్టిస్తే కొత్త వారు ఇంక విషయాలు చేర్చరు. అయితే నేను ఒక లక్ష వర్గాలు చేర్చుతాను. మీరందరూ వ్యాసాలు వ్రాయండి. లేదా కొత్తగా తెలుగులో ఒక లక్ష వ్యాసాల పేర్లు వ్రాస్తాను. వ్యాసాలు వ్రాయండి. మరొకటి ఒక లక్ష ఆంగ్ల వ్యాసాలు మక్కీకిమక్కీ తెలుగులోకి దించేస్తాను. మీరందరూ తెలుగు అనువాదములు చేయండి. చేసేవారున్నారా ? ఇదికూడా అంతే. ఇంకా వ్రాస్తాను. (సశేషం) JVRKPRASAD (చర్చ) 02:03, 16 ఏప్రిల్ 2015 (UTC)
- సముదాయం కోరితే ఖాళీ విభాగాలను నేను బాటుతో తీసెయ్యగలను --వైజాసత్య (చర్చ) 01:34, 16 ఏప్రిల్ 2015 (UTC)
గమనిక: మీరందరూ అనే పదం సముదాయం అని అర్థం.
- వైజాసత్య గారూ, గ్రామ వ్యాసాలలో ఖాళీల వలన ఆయా వ్యాసాల నాణ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఈ విభాగాలను తొలగించి, వీలైతే హెచ్చరిక మూస లాంటిది (బాటు ద్వారానే) చేర్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:37, 16 ఏప్రిల్ 2015 (UTC)
కాపీ చెయ్యి - అతికించు
[మార్చు]కాపీ చెయ్యి - అతికించు అనే పద్దతిలో గత కొన్ని సంవత్సరాలుగా వేలకువేలు పనులు నిరాఘాటంగా జరిగి పోతున్నాయి. అందుకు బాగా ప్రోత్సహించేవారు ప్రోత్సహిస్తునే ఉన్నారు. పోనీ కాపీచేసి అతికించే వారు కనీసం అక్షరం లేదా అరముక్క కూడా మార్చకుండా యథాతథంగా మక్కీకిమకీగా దించిపారేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆ విషయము ఏమిటో, మనం చేసే పని అర్థవంతముగా ఉందా లేదా అని కనీస అవగాహన కొరవడుతోంది. ఒకరిని ప్రోత్సహిస్తే అదే వరస బాణిలోనే పనులన్నీ కొత్తగా వచ్చే వారు కూడా అదే విధానాన్ని అదో వేదమంత్రంలా పాటిస్తూ పనులు చేసేస్తున్నారు. ఏమిటీ విపరీత వింత పోకడలు అని ప్రశ్నిస్తే వారిని వెలి వేయడం జరుగుతోంది. ఇంకనైనా ఇలాంటి పిచ్చిపనులు మానుకోండి. JVRKPRASAD (చర్చ) 01:40, 16 ఏప్రిల్ 2015 (UTC)
నేనే - ఆధ్యుడు - సమర్థుడు
[మార్చు]నేనే - ఆధ్యుడు - సమర్థుడు ఈ పిచ్చి ఎక్కువయింది. లెక్కలు తీస్తే ఎవరు ముందు, వెనకా ఏ పనులు ఎప్పుడు చేశారో, ఏమేమి చేశారో గణాంకాలు, కంప్యూటర్లు నిజాలు చెబుతాయి. ఎవరు ఏమి మాట్లాడినా, వ్రాశినా చరిత్ర చెరిగిపోదు, చిరిగిపోదు, మాసిపోదు, మార్చలేరు. వ్యక్తిస్వార్థము మానుకోండి. గ్రూపులు ప్రోత్సహించకండి. ఎవరు ఎంత సమర్థులు, ఏ పనులకు ఎవరు ఆద్యులు అనేవి వివరాలు తేలికగా తీసుకోవచ్చు. ఎవరి సమర్థత ఏమిటో తెలుసుకోవచ్చు. (సశేషం) JVRKPRASAD (చర్చ) 01:47, 16 ఏప్రిల్ 2015 (UTC)
మర్యాద - పని - పద్ధతి
[మార్చు]వాడుకరులు ఎవరయిననూ వారి మర్యాద, చేసే పనులలో నిలబెట్టుకోవాలంటే పద్ధతిగా పని చేయండి. ఆ తరువాత మర్యాద లేకుండా వ్రాస్తున్నారు, మాట్లాడుతున్నారు అని పీలింగులు పెట్టుకోకండి. ఒకటికి రెండుసార్లు నా వరకు చెబుతాను, ఆ తరువాత వదిలి పెట్టే సమస్యే లేదు. చెత్త పనులు చేసే వారిని తగిన గుణపాఠం నేర్చుకునే వరకు వెంటాడి, వేటాడే పద్ధతులలో పదాలు వ్రాస్తునే ఉంటాను. ఎవరైనా పనికి వచ్చే మంచి పనులు చేస్తే చేయండి, లేదా మూసుకుని మానుకోండి. నేను చెత్త పనులు చేసినా చెప్పండి. వెంటనే ఆపేస్తాను. కాని నాకు సరయినా సమర్థవంతమయిన సూచనతో ఉండాలి కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో చెప్పే సలహాలు నేను పాటించను. పిచ్చిపనులు, ఆలోచనలు చేసేవారికి, వారికే కష్టం, నష్టం తప్ప ఎవరికీ వెంట్రుక కూడా (ఎక్కువగా వెంట్రుకలు లేని వారితోనే సమస్యలు అన్నీ అర్థం) ఊడదు. (సశేషం) JVRKPRASAD (చర్చ) 02:49, 16 ఏప్రిల్ 2015 (UTC)
మార్పులు - వ్యసనం
[మార్చు]ఈ మధ్యన వాడుకరులకు మార్పులు బాగా బంకలా ఊడని ఫెవికాలో, లీకేజీలకు వేసే ఎమ్-సీల్ లాగా వ్యసనం పట్టి పీడిస్తున్నది. ఏదో ఒక అక్షరం నుంచి తమకు తోచిన విధంగా మార్పులు చేస్తూ వారి అంకెలు పెంచుకునేందుకు తెగ తాపత్రయం పడుతున్నారు. ఆ తరువాత అటువంటి వారు పెద్ద మేధావులు అయినట్ట్లు అందరికీ ఉచిత సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కేవలం మార్పులు కోసం తాపత్రయ పడేవారు వారి మేధస్సునంతా పోగొట్టుకుంటున్నారు అని వారు ఏమాత్రం గ్రహించటము లేదు. ఈ మార్పులు వల్ల ఒనగూడే ప్రయోజనము ఏమీ లేకపోగా, ఒక వ్యాసము వ్రాసేందుకు లేదా ఒక పని చేసేందుకు మనము ఎన్ని మార్పులు చేస్తున్నామో తెలియజెప్పే అంకెలు, మన తెలివి తక్కువ తన్నాన్ని స్పష్టంగా బయట పెడుతాయి అని వారెవరూ గ్రహించుట లేదు. కాకాపోగా, చిన్న చిన్న అక్షరమార్పులు చేసేవారిని ప్రోత్సహించుట వలన మాలాంటి వారు కూడా అలాగే చేయాలని సూచనలు మరియు సలహాలు ఇస్తున్నట్లుగా ఉండటమే కాకుండా, అలా చేయకపోతే మాకూ మనుగడ ఇక్కడ ఉండదని సుస్పష్టంగా తెలియజేస్తున్నట్లుంది. మీరు చేసేపని నందు తప్పు కనపడనప్పుడు మేము అదే పని చేస్తే మాలాంటి వారికి తప్పు అని ఎత్తి చూపుతూ ఇలాంటి తప్పుడు ప్రచారం వారు చేస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉంది. మార్పులు వ్యసనం మానుకోండి. మీ మేధస్సుకు పదును పెట్టండి. JVRKPRASAD (చర్చ) 04:20, 16 ఏప్రిల్ 2015 (UTC)
వాడుకరి - గురువు - చదువరి
[మార్చు]ఒక వాడుకరిగా వికీల్లో తనకు తెలిసిన పదములు, వాక్యములు, వ్యాసములు, మరే ఏదైనా విషయాన్ని చేర్చుతున్నప్పుడు, తను ఒక గురువు ఆనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తను వ్రాసినది ఏదైనా చదువరి చదువుకునేటప్పుడు ఎంతో కొంత చదువుకునే వారికి నేర్చుకునేటట్లు, అది అతనకు ఉపయోగపడేటట్లు ఉండాలి. వికీ అనేది ఒక జ్ఞానదేవాలయం అనే భావంతో వాడుకరి పని చేయాలి. JVRKPRASAD (చర్చ) 00:42, 19 ఏప్రిల్ 2015 (UTC)
శాశ్వతంగా వుండని తెలుగు మాధ్యమాల వెబ్ పేజీలను వికీపీడియాలో మూలాలుగా వాడడం
[మార్చు]వేబేక్ మెషీన్ సహకారంతో శాశ్వతనిల్వ చేయుటకు అనుకూలపడే వెబ్ సైట్లు (ఉదా:ఈనాడు) ని మీరు వికీపీడియాలో మూలంగా వాడాలంటే ఇలా చేయండి. ఆర్కీవ్.ఆర్గ్ వెబ్ పేజీ కు వెళ్లి మీరు శాశ్వత నిల్వచేయదలచుకున్న వెబ్ పేజీ చిరునామాను Save Page Now అనే విభాగంలో నింపి, భద్రపరచనబడినతరువాత వేబేక్ మెషీన్ చూపే వెబ్ చిరునామాను మీ రు మూలంగా పేర్కొనండి. ఉదాహరణగా మూలపు లింకు {{cite web|last1=పాణిగ్రహి|first1=శ్యాంసుందర్|title=ఏడుకొండలవాడి అన్న ప్రసాదం|url=http://web.archive.org/web/20150416050857/http://archives.eenadu.net/04-12-2015/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=16 April 2015|language=te}} మూలం లింకు, ఉదాహరణ వ్యాసం తిరుమల నిత్యాన్నదాన పథకము. శాశ్వతంగా వుండే వెబ్సైట్లు, నాణ్యత పెంచడానికి ఉపయోగపడే వనరులకు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ చూడండి.--అర్జున (చర్చ) 05:27, 16 ఏప్రిల్ 2015 (UTC)
- అర్జున గారికి ధన్యవాదాలు. ఈ పద్ధతి బాగుంది. చాలా ఉపయోగకరమైనది --వైజాసత్య (చర్చ) 08:03, 19 ఏప్రిల్ 2015 (UTC)
తెవికీ అభివృద్ధికి సూచనలు
[మార్చు]- వాడుకరి సభ్యపేజీలలో పాత వాడుకరులకు కూడా ఇన్ఫోబాక్సులు పెట్టాలి. కొత్త వాడుకరుల సభ్యపేజీలతో పోలిస్తే పాత వాడుకరుల పేజీలు (ఆ పేజీలు సభ్యులు అస్సలు ఉపయోగించక పోయిననూ) బోసిపోవడం సమంజసం కాదు. ఇదే సమయంలో సభ్యుల దిద్దుబాట్లు పెరుగుతాయి మరియు తెవికీ దిద్దుబాట్లు కూడా పెరుగుతాయి. తద్వారా తెవికీ పరిమాణాత్మకంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. దీనివలన 40 వేల దిద్దుబాట్లు అధికమౌతాయి. వ్యాసేతర పేజీలలో దిద్దుబాట్లు పెరిగితే తెవికీ డెప్త్ కూడా పెరుగుతుంది.
- రోజూ తెవికీ సమావేశాలు జరగాలి. ప్రతి నిర్ణయం సమావేశంలోనే తీసుకోవాలి. దీనికోసం గ్రాంటులు పొందాలి. తెవికీలో చర్చా పేజీలు అవసరం లేదనుకుంటాను. దీనివల్ల సమయం వృధా. చర్చాపేజీల వల్ల ఎలాంటి నిర్ణయమూ తీసుకోజాలమని ప్రతి ఒక్కరికీ అనుభవమైన విషయమే. అన్ని చర్చలు అర్థాంతరంగా ఆగిపోవడం, తెవికీ కుంటుపడటం కంటే సమావేశాలలో ఏకపక్షంగా తీసుకోవడమే ఉత్తమం!
- ఒకేసారి వందల వ్యాసాలలో ఒక మూస పెట్టి ఆ వ్యాసాల ప్రారంభకులుగా చేసేవారిని సన్మానించాలి. అలా చేయడం మన సంస్కృతి. ఉదా:కు బస్సు లేదా రైలు రాగానే కిటికీ నుంచి ఒక కర్చీఫ్ వేస్తే ఆ సీటు మనదౌతుంది. ఇలాంటి సంస్కృతిని తెవికీలో కొనసాగిస్తున్న వారి పేర్లు సాంస్కృతిక శాఖా వారికి నివేదించి వారికి మంచి పేరు వచ్చేట్టు చేయాలి. కనుమరుగౌతున్న మన సంస్కృతీ, సంప్రదాయాలను కనీసం తెవికీలోనైనా కొనసాగించడం భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే మంచి పరిణామమే.
- అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తెవికీలో ఎవరూ బాట్లు ఉపయోగించరాదు. బాటుల వల్ల కొందరి సభ్యుల దిద్దుబాట్ల హక్కులకు భంగం కలుగుతుంది. ఇది వికీ నియమానికే విరుద్ధం. బాటు ఉన్నవారు స్వచ్ఛందంగా బాటుహోదా విరమించుకోవడాని ప్రయత్నించాలి. ఇదివరకు ఇప్పుడున్నంత "చురుకైన" సభ్యులు లేరు కాబట్టి అప్పట్లో బాటు హోదా పొందారు. ప్రతి చిన్న దిద్దుబాటు కూడా యాంత్రికంగా బాటు ద్వారా చేయడం పాతపద్దతి. ఈ యాంత్రిక యుగంలో ఇప్పుడంతా హ్యూమన్ టచ్‌తోనే సాధించవచ్చు.
- తెవికీ అనేది స్వచ్ఛందంగా చేసే పని కాదని అందరికీ తెలియజేయాలి. ఇక్కడ పనిచేయడం వల్ల పలు లాభాలున్నాయని ప్రచారం చేయాలి. తెవికీలో చేరి కొన్ని దిద్దుబాట్లు చేయడం వల్ల సమావేశాలలో పాల్గొనే అవకాశం (రవాణా ఖర్చులు, ఇత్యాది పొందవచ్చు), వీలుంటే సమావేశాలు నిర్వహించే అవకాశం, స్కాలర్‌షిప్పులు, ఐ.ఇ.జి.నుంచి గ్రాంటులు పొందే అవకాశం, దిద్దుబాట్లు చేయడానికి కంప్యూటర్లు/లాప్‌టాప్లు, నెట్ ఖర్చులు కూడా పొందే అవకాశం, బొమ్మలు అప్లోడ్ చేసేవారికి కెమెరాలు, స్కానర్లు పొందే అవకాశం ఉందని ప్రచారం చేయించాలి. ఏటా అవార్డులు, ప్రైజ్ మనీ దీనికి అదనం. దీనివల్ల సభ్యుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వ్యాసం పేజీలలో కేవలం అరచేతి వ్రేళ్ళపై లెక్కించగలిగే దిద్దుబాట్లు చేసిన ఒక సభ్యుడికి కోల్‌కత వరకు పంపించామనే విషయం ప్రత్యేకంగా వివరించాలి.
- తెవికీలో ఎవరు ఏమి చేసిననూ మిగితావారు ఏమీ అభ్యంతరం చెప్పరాదు. తెవికిలో ప్రతి ఒక్కరికి ఏమైనా చేసుకోగలిగే సంపూర్ణ మరియు అపరిమిత స్వేచ్ఛ ఉంది. అనవసరంగా సభ్యుల మధ్యన వివాదాలు పెరగడం కంటే తెవికీకి తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా ఫర్వాలేదు. తెవికీ నాణ్యతకంటే సభ్యులే ప్రధానం. సభ్యులే లేకుంటే తెవికి మనజాలదు. నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే సభ్యులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు (లేదా కృషి తగ్గిస్తున్నారు). నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే వారు వెళ్ళిపోయిననూ గణాంకాలలో మార్పేమీ ఉండదు కాని గణాంకాలపైనే దృష్టిపెట్టే సభ్యులు వెళ్ళిపోతే తెవికీ చాలా నష్టపోతుంది. కాబట్టి ఆ భయానక పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తపడాలి.
- తెవికీ నాణ్యత దిగజారుతోందని, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇక్కడ స్థానం లేదని భావించి తెవికీ నుంచి దూరమయ్యే సభ్యుల గురించి అస్సలు పట్టింకోవద్దు. వచ్చేవారు వస్తారు, పోయే వారు పోతారు. పాతవారి కంటే కొత్తవారే దిద్దుబాట్లు అధికం చేస్తారనేది అందరికీ అనుభవమైన విషయమే. తెవికీ గుణాత్మకంగా కంటే పరిమాణాత్మకంగా అభివృద్ధి చెందాలంటే ఇది తప్పనిసరి. గణాంకాలలో గుణాత్మకానికి ఎలాంటి విలువ లేదనే విషయం మనకు తెలుసు. పాత నీరు పోయి కొత్త నీరు వస్తేనే బాగుపడుతుందని మన పెద్దలు చెప్పే నీతిని ఆచరించాలి.
- తెవికీ వృద్ధిని చూపేవి అన్నీ బాహ్య గణాంకాలే. వ్యాసాల నాణ్యతతో గణాంకాలకు అస్సలు సంబంధం లేదు. కాబట్టి సభ్యులు వ్యాస నాణ్యతను కాకుండా తెవికీ వృద్ధిని చూపే గణాంకాలపై మక్కువ చూపడం సమంజసమే. నాణ్యతపై దృష్టి పెడితే అది సమయం వృధాచేయడం కిందికే పరిగణించవల్సివస్తుంది! గణాంకాలపై దృష్టిపెట్టి దిద్దుబాటు చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. వారి వల్లే తెవికీ గణాంకాలు వృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని విస్మరించరాదు. పురస్కారాలన్నీ వారికే అందజేయాలి.
- ఇన్నేళ్ళు మొలక వ్యాసాలను మొలకస్థాయి నుంచి ఎలా దాటించాలనే విషయంపై తర్జనభర్జన పడిననూ ఏమీ చేయలేకపోయాము. ప్రతి మొలక వ్యాసంలో ఓ పది ఖాళీ విభాగాలను చేరిస్తే ఆటోమేటిగ్గా మొలకస్థాయి దాటుతుందనే విషయం ఇప్పుడిప్పుడే అవగతమౌతోంది. ఈ రహస్యాన్ని ఇతర భాషా వికీ వారికి తెలియజేయకుండా కాపాడుకుంటూ మన తెవికీలో మొలకవ్యాసాలు లేనట్టు చేసి పెద్ద క్రెడిట్ కొట్టేయవచ్చు. ఈ పద్దతి కొందరికి నచ్చకపోయినా ఫర్వాలేదు, మెజారిటి సభ్యులు గణాంకాల వృద్ధి వైపే ఉన్నారనే విషయం గుర్తించుకుంటే చాలు.
- పత్రికలు, వెబ్‌సైట్ల నుంచి కాపీ చేయడం వల్ల వ్యాసం త్వరితగతిన పూర్తవుతుంది. ఇది కాపీ హక్కుల ఉల్లంఘనగా ఎవరైనా సభ్యులు అభ్యంతరపరిస్తే వ్యాసాన్ని కొద్దిగా మారిస్తే చాలు, ఇక ఏ సమస్యా ఉండదు! ఇదివరకు సభ్యులు రాసినట్టు పలు గ్రంథాలు పోగేసుకొని మూలాలతో సహా కొంతకొంత సమాచారం రాసే పద్దతి వల్ల వ్యాసాలు త్వరితగతిన పూర్తికావు.
- గణాంకాల ప్రకారం చూస్తే బాగా హిట్టయ్యే వ్యాసాలలో ఏ సమాచారం లేదు. అంటే సమాచారం లేని వ్యాసాలకే పాఠకులు వస్తున్నారన్నమాట! కాబట్టి పెద్దపెద్ద వ్యాసాలు రచించడం కన్నా ఖాళీ వ్యాసాలు ఉంచడమే సరైనదని గణాంకాల ప్రకారం చెప్పవచ్చు. సమాచారం ఉండవచ్చనే ఊహతో పాఠకులు వస్తున్నారని అర్థంపర్థం లేకుండా ఆలోచించి సమయం వృధాచేసుకోవడం కన్నా ఖాళీ వ్యాసాలు సృష్టించి పాఠకులను ఆకట్టుకోవడమే సమంజసమని గణాంకాల సహితంగా చెప్పవచ్చు!
- చర్చలలో పాల్గొనేటప్పుడు సభ్యనామంతో ఎవరికైనా అభ్యంతర చెబితే సభ్యుల మధ్య సంబంధాలు క్షీణించవచ్చు. అలాంటప్పుడు ఐపీ అడ్రస్‌తో వ్రాయడమే ఉత్తమం. సభ్యులందరూ ఇదే విధానం పాటిస్తే కొత్త పద్దతికి నాంది పలికినట్టవుతుంది. అప్పుడు సభ్యుల మధ్య గొడవలేమీ ఉండవు, అన్నీ ఐపీ గొడవలే.
- జిల్లా వ్యాసాలనేవి తప్పులతడక అనీ, కేవలం ఐదారు వాక్యాల అతిచిన్న వ్యాసాలలో కూడా పదేసి తప్పులున్నాయని చెప్పిననూ మనం పట్టింకోవద్దు. ఆ మాత్రమైనా రాసినందుకు ప్రశంసించాలి. "విజ్ఞానసర్వస్వంలో వ్యాసం లేకుండుట కంటే తప్పు సమాచారం ఉండటం ప్రమాదం" అనే వాక్యాన్ని మనం తిరగరాయాలి (ప్రమాదం బదులు "మేలు" పదాన్ని ఉంచుకోవాలి). ఒకసారి అలాంటి వ్యాసాలు చూసినవారు మళ్ళీ జన్మలో తెవికినీ సందర్శించరనే వాదనను కూడా మనం అంగీకరించరాదు.
- తెవికీలో పనిచేయడానికి ఎలాంటి విజ్ఞానం అవసరం లేదు. నిర్వాహకులను నిర్వహణ గురించి పరిజ్ఞానమే కాదు అసలు నిర్వహణ అంటే ఏమిటో తెలియకున్నా ఫర్వాలేదు, అధికారులకు కనీస విధులు నిర్వహించే నైపుణ్యం కూడా అక్కర్లేదు అని కొత్తవారికి తెలియజేయాలి. ఇవి కేవలం అలంకారప్రాయ హోదాలే అని ప్రచారం చేస్తేచాలు. దీనివల్ల సభ్యుల సంఖ్య, నిర్వాహకులు, అధికారుల సంఖ్య మరింతగా పెరగవచ్చు.
- తెవికీ వ్యాసాలలోని చిన్న వ్యాసాలు, ఖాళీ విభాగాలు, నాణ్యత లేని వ్యాసాలు, అక్షరదోషాలు చూసి ఇదేనా మీ తెవికి ప్రగతి అని ఎవరైనా చెబితే మేము ఇదివరకటిలా గుణాత్మక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇతర భాషా వికీలతో పోటీపడడానికి పరిమాణాత్మక విలువలకే ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇలా అయితేనే తెవికీకి వికీ కమ్యూనిటి నుంచి ప్రోత్సాహం లభిస్తుందని వివరంగా అసలు విషయం తెలపాలి.
- అందరికీ అవసరమయ్యే వ్యాసాల కంటే అనవసర వ్యాసాలే ఈ మద్యకాలంలో అధికంగా సృష్టించబడుతున్నాయి. ఈ విధానం ఇలాగే కొనసాగించాలి. చాల వ్యాసాలకు ఎలాంటి హిట్లు కూడా లేవు. హిట్టయ్యే వ్యాసాలను రచిస్తే మన పని ఫట్టవుతుంది. మన పొరపాట్లు అందరికీ తెలుస్తాయి కాబట్టి ప్రస్తుత విధానమే సరైనది.
- ఇతర భాషలకు చెందిన వికీవారు తమ ప్రాంతానికి, తన వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని మనం ఎలాంటి పక్షపాతం లేకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాసాలను కూడా మక్కికిమక్కి తర్జుమా చేస్తున్నాము. ఆ పెద్ద వ్యాసాలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేకున్ననూ తెవికీ సభ్యులకు పక్షపాతం లేని విషయాన్ని మాత్రం విశదపరుస్తున్నాయి. తెవికీ సభ్యులు పక్షపాత రహితంగా వ్యవహరిస్తున్నారనే ప్రశంసలు లభిస్తే చాలు.
- సభ్యులు తెవికీలో వ్యాసాల అభివృద్ధి కంటే సభలు, సమావేశాలకే ప్రాధాన్యత అధికంగా ఇవ్వాలి. దీనివల్ల తెవికీకి మంచి ప్రచారం జరిగి అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొత్తగా వచ్చే సభ్యుల చేత వ్యాసాలు వ్రాయించుకోవచ్చు. సీనియర్ సభ్యులకు సమావేశాలు నిర్వహించుటకు అనువుగా ఉంటుంది.
- మనకు కనిపించిన ప్రతి పుస్తకంపై వ్యాసం వ్రాయాలి. ఆంగ్లవికీలోని వ్యాసాలు పరిశోధకులకు కూడా అవసరపడితే, తెవికీలో మాత్రం మనమే స్వయంగా పరిశోధన చేయాలి. ప్రతి పుస్తకానికి ప్రచారం కావించాలి.
- ప్రాజెక్టు పేజీలు తెవికిలో చాలాచాలా తక్కువగా ఉన్నాయి. కనీసం ఒక్కో సభ్యునికి సరాసరిన వంద అయినా ఉండాలి. కాబట్టి ప్రతి కాలేజీకి సంబంధించి కూడా ప్రాజెక్టు పేజీ ప్రారంభించడమే కాకుండా ఒక్కో జిల్లాపై ప్రాజెక్టులు, ఒక్కో మండలంపై ప్రాజెక్టులు, ఒక్కో నగరంపై ప్రాజెక్టులు ప్రారంభించడం అవసరం. ప్రాజెక్టు పేజీలు అవసరమా కాదా అనే దాన్ని పట్టింకోవద్దు. ఈ రోజు కాకున్నా మరో శతాబ్దికైనా అవి అవసరం రావచ్చు. తెవికీలో రచనలు అనేవి దీర్ఘకాలిక దృష్టితో చేయాలనే సూత్రానికి కట్టుబడినట్లు అవుతుంది.
- అంతర్జాలంలో మొత్తంపై చూస్తే అశ్లీల సైట్లు చూసేవారే అధికం. కాబట్టి తెవికీలో కూడా కనీసం "పెద్దలకు మాత్రమే" వ్యాసాలు అభివృద్ది చేస్తే సందర్శకుల సంఖ్యను పెంచుకోవచ్చు. దీనివలన తెవికీ గణాంకాలు పెరుగుతాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, నేటి యువకులు కొరే వ్యాసాలను వృద్ధి చేయడం సమంజసమే అనిపించుకుంటుంది.
- అనుభవజ్ఞఉలు, నియమనిబంధనలు క్షుణ్ణంగా తెలిసినవారిని తెవికీ నుంచి ఎలా వెళ్ళగొట్టాలి అని మనం ఆలోచించాలి. అలాంటి వారి వల్ల తెవికీ పరిమాణాత్మకంగా అభివృద్ధి చెందదు. అడుగడుగునా నియమనిబంధనలు చెప్పేవారివల్ల తెవికి ప్రగతి కుంటుపడుతుంది. అలాంటి వారిని చర్చల్లోకి రాకుండా చేసిననూ కొంత విజయం సాధించినట్లే. ఇలాంటి వారిపై చర్చలు సదరు సభ్యులకు తెలియకుండా సమావేశాల్లోనే జరగాలి.
- కొత్త సభ్యులకు మరియు సీనియర్ సభ్యులకు మధ్యన తప్పకుండా విచక్షణ చూపాలి. షేక్స్‌పియర్ చెప్పినట్లు అందరూ సమానమే కాని ఆర్వెల్ చెప్పినట్లు కొందరు అధిక సమానులు. లేకుంటే సీనియర్లకు విలువ ఇవ్వనట్లు అవుతుంది.
- ప్రధాన చర్చలు ఆన్‌వికీలో కాకుండా ఆఫ్‌వికీలోనే చేయడం ఉత్తమం. దీనివల్ల తెవికీ చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది తెవికీ చర్చలకు సంబంధించినదైనా సరే. ఆఫ్‌వికీ గొడవలు తెవికీ ఇతర సభ్యులకు అస్సలు తెలియనివ్వరాదు.
- వ్యాసాలు రాస్తున్నప్పుడు దిద్దుబాట్లు అనేవి చాలా వేగంగా చేయాలి. అక్షరదోషాలు చూస్తూ, నాణ్యతను పెంచుతూ పోతే మనం పరిమాణాత్మక లక్ష్యాలు సాధించలేము. అక్షరదోషాల వల్ల గూగుల్ సెర్చ్‌లో ఎవరైనా అక్షరదోషాలతో వెతికిననూ మన వ్యాసాలు తగులుతాయి. అక్షర దోషాల వల్ల మనకిది పెద్ద ప్లస్ పాయింట్.
- ఇతర భాషా వికీల నుంచి అంతర్వికీల ద్వారా వచ్చి ఇక్కడ ఆటోమేటిగ్గా సభ్యత్వం పొందిన తెలుగురాని వారికి కూడా తెలుగులో స్వాగతం చెప్పడం సరైనదే. వారికి తెలుగు వస్తుందా రాదా అనే విషయం ప్రక్కన పెడితే శ్రీకృష్ణదేవరాయలు పలికిన "దేశభాషలందు తెలుగు లెస్స" వాక్యాన్ని మనం "ప్రపంచ భాషలందు తెలుగు లెస్స"గా చేయడానికి కొంతైనా దోహదపడుతుంది.
గమనిక: దీన్ని ఏప్రిల్ ఫస్టు నాడే పోస్టు చేయాలనుకున్ననూ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనందులకు చింతిస్తున్నాను.
పై సూచనల వల్ల కొందరికి నవ్వు రావచ్చు, మరికొందరికి కోపం రావచ్చు, కాని తెవికీ ప్రస్తుత పరిస్థితుల వల్ల కొన్ని విషయాలు తెలపడం తప్పనిసరి అని భావించి ఇక్కడ పెడుతున్నాను. దీనిపై వ్యాఖ్యానించేవారు చర్చమధ్యలో కాకుండా చివరన మాత్రమే తమ అభిప్రాయం తెలుపగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:19, 17 ఏప్రిల్ 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. చాలా బాగా గురువింద గింజ రంగులా రాశారు. మధారాజ తథా ప్రజ. JVRKPRASAD (చర్చ) 00:54, 18 ఏప్రిల్ 2015 (UTC)
- పరిశీలనలో యధార్ధం రాసారు, తెవికీకి నిబద్దత కలిగిన నడవడికకంటే కూడా ప్రస్తుత స్థితి దృష్ట్యా లౌఖ్యం అవసరం. వికీలో అదే కొరవడింది. కొందరికి నచ్చకపోయినా పైన సెటైర్ అనుకొన్న కొన్ని అనవసరం అనుకొనే విషయాల ద్వారానే భవిష్యత్ మెరుగు కనిపిస్తుంది..రెండిటినీ సమన్‌వయం చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందవచ్చు..మీ కలానికి (కీబోర్డ్) పదును కొంటెతనం రెండూ పెరుగుతున్నాయి :) :) ----విశ్వనాధ్ (చర్చ) 05:12, 18 ఏప్రిల్ 2015 (UTC)
- ఏప్రిల్ ఫస్టు నాడు చేసినట్లైతే మీ వ్యాఖ్యలకు విలువ తగ్గేది.మీ వ్యాఖ్యలు బాగా నవ్వుతెప్పించాయి. తెవికీఆత్మ (వుందా?) పరిశీలనకు తప్పక ఉపయోగపడతాయి.--అర్జున (చర్చ) 05:50, 18 ఏప్రిల్ 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావుగారి సలహాలు నాకు పిచ్చపిచ్చగా నచ్చాయి.06:52, 18 ఏప్రిల్ 2015 (UTC) (సంతకం లేకుండా వ్యాఖ్యానించినది- పాలగిరి)
- చంద్రకాంతుల వారికి. అందుకోండి సాష్టాంగ నమస్కారాలు. అయ్యా, మీరు వ్రాసింది అక్షరాలా జరుగుతుండటం విచారకరం --వైజాసత్య (చర్చ) 08:02, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రస్తుత తెవికీ పరిస్థితిని గమనిస్తూ స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. నేను రాసినవి గురువింద గింజలా ఉన్నా, కొంటెతనంగా ఉన్నా, నవ్వు తెప్పిస్తున్నా, పిచ్చపిచ్చగా ఉన్నా, అక్షరాలా జరుగుతున్నా ... నేను నిమిత్తమాత్రుడిని, ఇందులో నా అభిప్రాయాలు-ఉద్దేశ్యాలు ఏమీ లేవు, తెవికీలో జరుగుతోన్న (దుస్)సంఘటనలనే కొత్త కోణంలో చూపించాను అంతే. దీనివల్ల తెవికీలో కొద్దిగానైనా మార్పు వస్తే ఈ ప్రయోగం ఫలించినట్లే. అలాగే వైజాసత్యగారు, క్షమాపణలంటూ, సాష్టాంగ నమస్కారాలంటూ వద్దండి. ఇక్కడ తెవికీ బృందంలో అందరూ సమానమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:32, 19 ఏప్రిల్ 2015 (UTC)
- చంద్రకాంతుల వారికి. అందుకోండి సాష్టాంగ నమస్కారాలు. అయ్యా, మీరు వ్రాసింది అక్షరాలా జరుగుతుండటం విచారకరం --వైజాసత్య (చర్చ) 08:02, 19 ఏప్రిల్ 2015 (UTC)
- పరిశీలనలో యధార్ధం రాసారు, తెవికీకి నిబద్దత కలిగిన నడవడికకంటే కూడా ప్రస్తుత స్థితి దృష్ట్యా లౌఖ్యం అవసరం. వికీలో అదే కొరవడింది. కొందరికి నచ్చకపోయినా పైన సెటైర్ అనుకొన్న కొన్ని అనవసరం అనుకొనే విషయాల ద్వారానే భవిష్యత్ మెరుగు కనిపిస్తుంది..రెండిటినీ సమన్‌వయం చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందవచ్చు..మీ కలానికి (కీబోర్డ్) పదును కొంటెతనం రెండూ పెరుగుతున్నాయి :) :) ----విశ్వనాధ్ (చర్చ) 05:12, 18 ఏప్రిల్ 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. చాలా బాగా గురువింద గింజ రంగులా రాశారు. మధారాజ తథా ప్రజ. JVRKPRASAD (చర్చ) 00:54, 18 ఏప్రిల్ 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారూ మీరు చేసినది సామాన్యమైన వ్యాఖ్య కాదు.. అత్యంత పదునైన వ్యంగ్యం. ఇవి తీపి పూత పూసిన మాత్రలు, వీటికి జబ్బు తగ్గించగల గుణం వుంది. ఐతే అది కేవలం నోటితో కాకుండా వీలున్నంతవరకూ చేతలతో చెప్పాలని ప్రయత్నించే ఇంతవరకూ వ్యాఖ్యానించకుండా సంయమనం వహించాను. నావరకూ నేను ఆఫ్-వికీ చర్చలు, నిర్ణయాలు జరగుతున్నాయన్న విషయాన్నైనా వీలున్నంతలో ఆలోచించి పరిష్కరిద్దామన్న ప్రయత్నం చేశాను.. ఇక్కడ చూడండి. ముళ్ళపూడి, విశ్వనాథ, భమిడిపాటి, పతంజలి వంటివారి స్థాయిలో ప్రయోజనకరమైన వ్యంగ్యాన్ని వ్రాసినందుకు, మార్చే ప్రయత్నాలు చేస్తున్నందుకు అభినందనలు.--పవన్ సంతోష్ (చర్చ) 08:58, 20 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, నా ఉద్దేశ్యాన్ని బాగా గ్రహించినందుకు కృతజ్ఞతలు. పూర్తిగా ఊబిలోకి కూరుకుపోయిన తెవికీకి సంస్కరించడానికి ఇదో కొత్త ప్రయత్నం. కేవలం గణాంకాలను చూపి తెవికీ గొప్ప అభివృద్ధి సాధిస్తోందని చెప్పడం దారుణమైన విషయం. నాకు తెలుగు మహానుభావులతో పోల్చే అవసరం లేదు కాని మీలా సభ్యులందరు ఈ భావాలు గ్రహిస్తే చాలు. సభ్యపేజీలలో వాడుకరి పెట్టెలు పెట్టడం అధికమైందని ఆ విషయానికి అగ్రస్థానం ఇచ్చిననూ సభ్యులు గ్రహించడం లేదో, దిద్దుబాట్లు పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నారో కాని ఇలాంటి దిద్దుబాట్లు తెవికికీ ఏ మాత్రం ప్రయోజనం చేకూరవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:51, 20 ఏప్రిల్ 2015 (UTC)
ప్రాధాన్యత కలిగిన పుస్తకాల జాబితా
[మార్చు]గత రెండు, మూడు సంవత్సరాల నుంచి తెలుగు వికీపీడియాకు ఉపకరించేందుకు సీఐఎస్-ఎ2కె వారు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సంవత్సరం తెలుగు వికీపీడియాకే కాక వికీసోర్సుకు కూడా సీఐఎస్-ఎ2కె వారు వారి కార్యప్రణాళిక అమలుచేయనున్నారు. తత్సంబంధిత ప్రణాళిక ప్రస్తుతం కొద్దిరోజులుగా వికీసోర్సులో ఉంది. వికీసోర్సులోని కార్యప్రణాళికపై చర్చించినప్పుడు ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె వారు సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా అక్కడి విద్యార్థులకు వికీ శిక్షణ నిచ్చేందుకు వికీసోర్సును ఎంచుకుని పుస్తకాలని వారితో యూనీకోడీకరిస్తున్నారు, అలానే కాపీహక్కుల పరిధిలో ఉన్న పుస్తకాలను కాపీహక్కుదారులతో సంప్రదించి వారికి ఒప్పుదల అయితే స్వేచ్ఛానకలుహక్కుల్లో పునర్విడుదల చేయిస్తున్నారు. కాకుంటే వీటిని చుక్కానిలేని నావలా తోచినవిధంగా కాకుండా సముదాయం సూచనలతో జరుపవలసిందని చేసిన సూచనకు ప్రోగ్రాం డైరెక్టరుగా విష్ణు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ పేజీని వికీసోర్సు పేరుబరిలో ప్రారంభించాము. ఇప్పటికే తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్ వంటి వాటిలో పనిచేస్తున్నవారు ముందుకువచ్చి తమ వ్యక్తిగత కృషికి మూలాలుగా ఉపకరించే విలువైన పుస్తకాలను తెలపాలన్న ఉద్దేశంతో ఈ పేజీని ఏర్పరిచాము. పేజీ చర్చలో కాపీహక్కులు ఉన్నవైనా, లేనివైనా, సందేహం ఉన్నవైనా పుస్తకాలను వీలైనన్ని వివరాలతో తప్పనిసరిగా ఇతర వికీల్లో కృషికి (తమ కృషే కానక్కరలేదు) ఈ పుస్తకం ఎందుకు పనికివస్తుందో సవివరంగా ప్రతిపాదనలుగా చేరిస్తే వాటిని ఈ పట్టికలో చేర్చుకుందాం. ఇప్పటికే పట్టికలో చేరిన పుస్తకాలకు కూడా చర్చపేజీల్లో ఆయా వివరాలు ముందుగా ప్రతిపాదించి మాత్రమే చేశాము. ఈ ఆలోచనను మెరుగుపరచడానికి కానీ, ఆ పేజీలో తమకు తెలిసిన విలువైన పుస్తకాలు చేర్చేందుకు గాని సహసభ్యులు ముందుకువస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 04:20, 18 ఏప్రిల్ 2015 (UTC)
- చాలా సంతోషము. తప్పుకుండా తెలిసిన వాటికి తెలియజేస్తాను. JVRKPRASAD (చర్చ) 06:47, 18 ఏప్రిల్ 2015 (UTC)
నిషేధం ఎందుకు విధించకూడదు ?
[మార్చు]నేను వాడుకరి:hydkarthik అనే వాడుకరి భారతీయ రైల్వేలు లోని కొన్ని వ్యాసాలలో తనకు తోచిన విధముగా మార్పులు చేస్తూ ఉంటే వివరాలు అడిగాను. సమాధానము చెప్పటం లెదు. ఎంతకీ, ఎన్నాళ్ళకీ సమాధానము రాక పోతే, ఫోనులో సంప్రదించి అడిగాను. తన తీరు మార్చుకొనక తిరిగి అవే మార్పులు చేస్తూ ఉండటము జరుగుతోంది. ఇతను గూగుల్ ట్రాంస్‌లేట్ నుండి తెలుగు అర్థము తీసుకుని వ్రాస్తున్నట్లుంది.
- తను ఎక్స్‌ప్రెస్ ఉన్న చోట వడిబండి లేదా ఒడిబండి అని మార్చటము జరుగుతోంది. ఈ విధముగా రైల్వే వారు ఎక్కడ మార్చారు అని అడిగితే సమాధానము లేదు.
- యశ్వంతపూర్ నకు యశ్వంతపుర అని ఉందా ?
- కాచిగూడ రైల్వేస్టేషను వ్యాసము నందు పెద్ద మొత్తములో వ్యాసభాగము తొలగించడము జరిగింది. ఇతను ఆడిగిన దానికి సమాధానములు చెప్పక, వ్రాయడము ఎందుకు ఆపాలి అని అడుగుతున్నాడు.
- బెంగుళూరు దండు రైల్వే స్టేషను అనేది ఎవరైనా చూశారా ? విన్నారా ? [1]
- ఆగ్రా కంటోన్మెంట్ అనే స్టేషనును ఆగ్రా దండు అని మార్చటం ఏ ప్రాతిపదికనో తెలియజేయాలి. ఈ విధముగా తను తోచిన రీతిలో మార్పులు చేస్తూ ఉంటే అందుకు మద్దతు కూడా మనవాళ్ళు ఇవ్వడము వింతగా ఉంది. తను రైల్వే పదములు ఏ విధముగా మార్చుతున్నది వెంటనే తెలియాల్సి ఉంది. JVRKPRASAD (చర్చ) 14:55, 18 ఏప్రిల్ 2015 (UTC)
మీరు అడిగిన వాటికి సమాధానములు: దండు అన్న పదము తెలుగు పదము. అందుచేతనే వాడాను. అది తెలుగు పదము కాదు అని మీరు నిరూపించగలరా? బెంగుళూరు దండు రైల్వే స్టెషనును మీరు విన్నారా కన్నారా? అని అడిగారు మీరు. బెంగుళూరు నగర రైల్వే స్టేషను మాత్రం విన్నారా? కన్నారా? చెప్పండి దానికి ఒప్పుకున్న మీరు దీనికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? బెంగుళూరు సిటి అన్న పదానికి బెంగుళూరు నగరము అన్నది సమానార్థకమైనట్లుగానే బెంగుళూరు కంటోన్మెంట్ కు బెంగుళూరు దండు అన్నది తెలుగు సమానార్థకము. గమనించగలరు. అది కన్నడ పదము మాత్రమే కాదు. తెలుగు పదము కూడాను. [2] ఈ ఫోటోలో తెలుగులో కూడా బెంగుళూరు దండు అని వ్రాసియున్నది గమనింపగలరు. దయచేసి ఆలోచించుము.
కాచిగూడ స్టేషను పుటలో ఎం.ఎం.టీ.ఎస్ పరీవాహక ప్రాంతాలు అని ఊళ్ళో ఉన్న అన్ని రైల్వే స్టేషనుల పేర్లు జత చేశారు. అవి అక్కడ ఉండడం అవసరము లేదు అని నాకు అనిపించింది. కనుక తీసివేశాను. ఒక వేళ అవి అక్కడ ఉండడమే సబబు అని మీకు తోస్తే తిరిగి పెట్టచ్చుగా . ఆ మాత్రమునకు నిషేధమా? ఇది వికి మూల సూత్రాలకు వ్యతిరేకము.
- కార్తీక్ గారూ, వడిబండి, దండు లాంటివి అచ్చతెలుగు మాటలైనా, ఆవి ఇలాంటి వాడుక (ఢిల్లీ వడిబండి, ఆగ్రా దండు)లో నాకు తెలిసి ఇతర మాధ్యమాల్లో ఎక్కడా ప్రామాణికంగా వాడబడలేదు. వికీపీడియా వ్యాసాల్లోని వీలైనంతగా ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న భాషని ఉపయోగించాలి. కొత్త పదాలను, వాడుకలను చేయకూడదు. ఎందుకంటే వికీ భాషోద్ధరణ ఉద్యమం కాదు. కొత్త పదాలు, వాడుకలు జనంలో పుడతాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్, అచ్చు మాధ్యమాలు, గ్రంధాలకు చేరతాయి. ఆ తర్వాతే వికీకి వస్తాయి. --వైజాసత్య (చర్చ) 07:49, 19 ఏప్రిల్ 2015 (UTC)
- తెలుగు వికీపీడియా తెలుగు భాషకు సహకారి అయినా తెలుగు భాషోద్యమకారుల లక్ష్యాలకు వికీపీడియా లక్ష్యాలు వందశాతం సరిపోలవు. తెలుగు వారికి అర్థమయ్యేమేరకు వాడుక పదాలను ఇక్కడ వాడడమే సంప్రదాయం కానీ ప్రతి ఆంగ్ల పదాన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసరంలేదు. అది అటుంచితే నామవాచకాల్లోని ఇతరభాషా పదాలను తెనిగించడం తెలుగు భాషావేత్తలు కూడా అంగీకరించే మార్పు కాదు. ఢిల్లీ అనే పదానికి ద్వారం అని అర్థం వస్తుందని ఓ భాషావేత్త పేర్కొన్నారు. అంతమాత్రాన దాన్ని ద్వారమని అనువదించడం అసంబద్ధం కాదూ. అలానే బెంగళూరు సిటీ స్టేషన్, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ కూడా అనువాదానికి లొంగవు. అనువదించడం సరికాదనే నా అభిప్రాయం.--పవన్ సంతోష్ (చర్చ) 08:26, 19 ఏప్రిల్ 2015 (UTC)
- కార్తీక్ గారూ, వడిబండి, దండు లాంటివి అచ్చతెలుగు మాటలైనా, ఆవి ఇలాంటి వాడుక (ఢిల్లీ వడిబండి, ఆగ్రా దండు)లో నాకు తెలిసి ఇతర మాధ్యమాల్లో ఎక్కడా ప్రామాణికంగా వాడబడలేదు. వికీపీడియా వ్యాసాల్లోని వీలైనంతగా ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న భాషని ఉపయోగించాలి. కొత్త పదాలను, వాడుకలను చేయకూడదు. ఎందుకంటే వికీ భాషోద్ధరణ ఉద్యమం కాదు. కొత్త పదాలు, వాడుకలు జనంలో పుడతాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్, అచ్చు మాధ్యమాలు, గ్రంధాలకు చేరతాయి. ఆ తర్వాతే వికీకి వస్తాయి. --వైజాసత్య (చర్చ) 07:49, 19 ఏప్రిల్ 2015 (UTC)
స్రెబ్రెనిత్స మరియు జెప యొక్క పతనం
[మార్చు]Hi! July 11, 2015 will be the 20th anniversary of the fall of Srebrenica, but your Wikipedia does not have an article on this topic yet. Please help translate my text Fall of Srebrenica and Žepa and write a honest article about Srebrenica! 20 anniversarier (చర్చ) 03:52, 19 ఏప్రిల్ 2015 (UTC)
- Dear 20 anniversarier, I understand your enthusiasm for translating Fall of Srebrenica and Žepa in Telugu, however this topic is way outside of current Telugu wikipedia scope. Therefore, I don't think our community will be able to spend resources translating it. Regards --వైజాసత్య (చర్చ) 02:12, 7 మే 2015 (UTC)
వాడుకరి:hydkarthik - భారతీయ రైల్వేలు - విన్నపము
[మార్చు]భారతీయ రైల్వేలు లోని తెలుగు వ్యాసములు లోని తెలుగు భాష వాడుక గురించి భారతీయ రైల్వేల అధికారులు, తెలుగు భాషా సంఘం అధికారులు, ఇతర తెలిసిన తెలుగు సంఘాల వారికి, ఎవరు దొరికితే వారికి ఈ వాడుకరి:hydkarthik పని చేస్తున్న కంపెనీ, కుటుంబాలకు ఎవరికయినా, వారికి తన యొక్క తెలుగు భాషా పరి జ్ఞానాన్ని, వాదనలు వంటివి తెలియపరచి, పంపమంటారా ? తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 05:50, 19 ఏప్రిల్ 2015 (UTC)
మీరు చెప్పదలచుకున్నది నాకు అర్థము కాలేదు. దయచేసి విశదీకరించండి. తెలుగు భాషా సంఘం అధికారులు అనునది తప్పుడు ప్రయోగము తెలుగు భాషా సంఘ అధికారులు అని ఉండాలి. దయచేసి సవరించుకోండి.
- నువ్వు నా తప్పులు ఎంచకు. తెలుగు భాషా సంఘం యొక్క అధికారులు అని అర్థం చేసుకో. నేను వ్యాసమునకు పేరు పెట్టి వ్రాయలేదు. నీకు ఏదీ అర్థం కాదు. నువ్వు వ్రాసిన వ్యాసములలోని నీ తెలుగు భాష ముందు సరిచేసుకో. నీ తెలుగు భాష యొక్క బొక్కలు చాలా ఉన్నాయి మరి. ఇది చర్చా పేజీ. మరో సారి చదువుకో. నీ వాదనలు అన్నీ నాకు తెలిసిన అందరికీ నీ గురించి తెలియచెప్పమంటావా అని అర్థం. JVRKPRASAD (చర్చ) 06:24, 19 ఏప్రిల్ 2015 (UTC)
మీరు ఎందులకు ఇటుల బెదిరించుచున్నారో నాకు అర్థముగాక యున్నది.
- నీకు నేను చెబితే అర్థం కావడము లేదు కదా వాళ్ళనే అడిగి, వాళ్ళతోనే నీకు చెప్పిస్తాను. అని అర్థం. ఇందులో బెదిరింపు ఏముంది ? అయినా అంత తేలికగా బెదిరి పోయే మనిషనుకోవడము లేదు. వ్రాశి సంతకము చేస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 06:32, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, పైన మీరు వ్రాసినది బెదిరింపుగానే తోచే అవకాశం ఉన్నది. దీన్ని వాదించుటకు సరైన పద్ధతి ఉన్నది. దయచేసి ఇలాంటి బెదిరింపులు చేయవద్దు. ఇలాంటివి బెదిరింపులు చేస్తారనే చాలామంది తమ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచగోరుతారు. స్వేఛ్ఛా విజ్ఞానసర్వస్వంలో స్వేఛ్ఛలేకపోతే బాగుండదు --వైజాసత్య (చర్చ) 07:41, 19 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య మీరు మొత్తము చదవండి. ఇది బెదిరింపు కాదు. అతను ఫోనులో ఏం మాట్లాడింది మీకు ఎలా తెలుస్తుంది. అతని వాదనులు నిన్నటి నుండివి మొత్తం చదవండి. ఇద్దరి వాదనలు సరి పడనప్పుడు అసలు వారి దగ్గరకు తీసుకు వెళ్ళి పరిష్కారము చేస్తే, ఇటువంటివి ఇక ముందు రావని చెబుతున్నాను. బయట ప్రపంచానికి మన వాదనలు తెలియకూడదంటారా మీరు ? తిరిగి తిరిగి అతను ఏదో వ్రాస్తూ ఉంటే నేను మూసుకును మానుకోమంటారా ? ముందు అతనికి చెప్పండి, అప్పుడు నేను మూసుకుంటాను. అతను అంత బెదిరిపోయే రకము అని ఎలా అనుకుంటున్నారు మీరు ? నన్ను బెదిరించి నాతో ఏదో వాదించాలనుకుంటున్నాడు. కానివ్వండి. JVRKPRASAD (చర్చ) 07:59, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, పైన మీరు వ్రాసినది బెదిరింపుగానే తోచే అవకాశం ఉన్నది. దీన్ని వాదించుటకు సరైన పద్ధతి ఉన్నది. దయచేసి ఇలాంటి బెదిరింపులు చేయవద్దు. ఇలాంటివి బెదిరింపులు చేస్తారనే చాలామంది తమ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచగోరుతారు. స్వేఛ్ఛా విజ్ఞానసర్వస్వంలో స్వేఛ్ఛలేకపోతే బాగుండదు --వైజాసత్య (చర్చ) 07:41, 19 ఏప్రిల్ 2015 (UTC)
- నీకు నేను చెబితే అర్థం కావడము లేదు కదా వాళ్ళనే అడిగి, వాళ్ళతోనే నీకు చెప్పిస్తాను. అని అర్థం. ఇందులో బెదిరింపు ఏముంది ? అయినా అంత తేలికగా బెదిరి పోయే మనిషనుకోవడము లేదు. వ్రాశి సంతకము చేస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 06:32, 19 ఏప్రిల్ 2015 (UTC)
- అలా అని నా ఇంటీ వారికి ఆఫీసులో వారికి ఇవన్నీ చెబుతాననడం ఎంత వరకు సమంజసం?
రైలు పైన కూడా దండు అని వ్రాసి ఉంది. కాబట్టి నేను కూడా కొత్త పేజికి ఆ పేరు పెట్టాను. తప్పేంటి?
- నీ ప్రపంచం లోని వారైనా దండు అని మాట్లాడుతున్నారా అడిగి తెలుసుకుంటే తప్పేంటి ? అడగాలి కూడా.JVRKPRASAD (చర్చ) 08:10, 19 ఏప్రిల్ 2015 (UTC)
- @వాడుకరి:hydkarthik రైలు ఫోటోను ఇప్పుడే చూశాను. కానీ అది సాధారణమైన వాడుకేనా? లేక తెలుగు సరిగా తెలియక చేసిన లిటరల్ అనువాదమా? అన్ని రైళ్ళకి అలాగే ఉన్నదా? మీరు వ్రాసిన వ్యాఖ్యల తర్వాత దిద్దుబాటు పెట్టెలో మూడో ఐకాను నొక్కి సంతకం చేయండి. @JVRKPRASAD గారూ, ఫోనులో ఆయనేం మాట్లాడింది నాకెలాతెలుస్తుందండీ. --వైజాసత్య (చర్చ) 08:14, 19 ఏప్రిల్ 2015 (UTC)
- @వాడుకరి:hydkarthik బెంగుళూరు దండు కంటే బెంగుళూరు కంటోన్మెంట్ సాధారణమైన వాడుకగా తోస్తున్నది. --వైజాసత్య (చర్చ) 08:20, 19 ఏప్రిల్ 2015 (UTC)
- తెలుగు పదము ఉన్నప్పుడు ఆంగ్ల పదము ఎందుకు వాడాలి?నేను వారితో హోనులోమాట్లాడి ఆరు నెలలు అవుతోంది.--Hydkarthik (చర్చ) 08:24, 19 ఏప్రిల్ 2015 (UTC)
- @వాడుకరి:hydkarthik దీనికి సమాధానం పై చర్చలో నా వ్యాఖల్లోనూ, పవన్ సంతోష్ వ్యాఖ్యల్లోనూ ఉందండి. --వైజాసత్య (చర్చ) 08:30, 19 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారు, మీకు తెలియదనే నేను అంటున్నాను. అందుకని ఇతని సంగతి మీరు నాకు వదిలేయండి. వికీకి ఈ చర్చల వలన ఏదైనా సమస్యగా ఉంటే అతన్ని సమాధానములు సరిగా వ్రాయమనండి, లేదా మానుకోమనండి లేదా మీరు ఈ సంగతి వదిలేయండి. నన్ను ఏదో బెదిరించాలని చూస్తున్నాడు. ఎన్నో రకాల వ్యతిరేక సామాజిక భావాలు గల అసాంఘిక వ్యక్తులు జీవితంలో ఎన్నో సందర్భాలలో తారసపడుతూ ఉంటే, భయపడిపోతూ ఉంటే జీవితం ముందుకు వెళ్ళదు. అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. మనిషి పోయేది ఒక్కసారే. ఇంక భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. నాతో వాదనలు వద్దు అని అందరికీ చెబుతూనే ఉన్నాను. ఇతను వినలేదు, వినటం కూడా లేదు. వాదిస్తునే ఉన్నాడు. ఏం చెయ్యమంటారు ? ఆసంగతి మీకు తెలియదు కదా !! JVRKPRASAD (చర్చ) 08:27, 19 ఏప్రిల్ 2015 (UTC)
- తెలుగు పదము ఉన్నప్పుడు ఆంగ్ల పదము ఎందుకు వాడాలి?నేను వారితో హోనులోమాట్లాడి ఆరు నెలలు అవుతోంది.--Hydkarthik (చర్చ) 08:24, 19 ఏప్రిల్ 2015 (UTC)
Hydkarthik చేరిన రోజు
[మార్చు]- ఈ పై వాడుకరి చేరిన రోజు వివరము [3] చేరిన వెంటనే ఎవరూ చర్చలు చేయరు మరియు ఏకవచనం ప్రయోగం చాలాకాలం తదుపరి వారు బాగా తెలిసినా అంత తేలికగా చేయరు ఇక్కడ. ఆరునెలలు అన్నది నిజం కాదు. JVRKPRASAD (చర్చ) 08:33, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ఇది ఏంటో నాకు అర్థము కావట్లేదు. దయచేసి విశదీకరించండి.--Hydkarthik (చర్చ) 08:42, 19 ఏప్రిల్ 2015 (UTC)
- అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెబుతారు. అప్పటి వరకు వేచి ఉండవచ్చు. నేను చెబితే అర్థం కాదు కదా !!!JVRKPRASAD (చర్చ) 08:44, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ఇలాంటి బెదిరింప్పులకు ఎందుకు దిగుతున్నరు?--Hydkarthik (చర్చ) 08:48, 19 ఏప్రిల్ 2015 (UTC)
- నీకు తెలుగు సరిగా అర్థం కావడము లేదు. ఇది బెదిరింపు అవుతుందా ? ఇక్కడకు వచ్చే వాడుకరులు నీకు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెబుతారు అంటే అది బెరింఫు ఎలా అవుతుంది ? నీ బుర్రకి నా బుర్రల్లోంచి వచ్చిన పదాలు అర్థం కావడము లేదు అని చెప్పాను. JVRKPRASAD (చర్చ) 09:06, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, కార్తీక్ గారూ, నామాట విని ఈ వాదన ఇంతటితో ఆపండి సార్. చర్చ సరైన దిశలోకానీ, సరైన ఉద్దేశంతో కానీ సాగట్లేదు. వికిలో నలుగిరి నచ్చని దిద్దుబాట్లు ఎలాగూ దీర్ఘకాలంలో మనలేవు. ఈ రోజు కార్తీక్ గారు దండు అని పేరు పెట్టినా, రేప్పొద్దున దాన్ని మరెవరైనా వచ్చి మారుస్తారు. --వైజాసత్య (చర్చ) 09:12, 19 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారు, మూర్ఖుల మనస్సు రంజింపజేయలేము అనేది నిజం. అతనికి మీరు అయిన కాస్త కొంతయిన అర్థమయ్యేట్లు చెప్పండి. అ వితండవాది ఇంకా నాతో వాదించాలనుకుంటే మీ మీటింగ్ అయ్యాక, అ దురద దూల కోరిక తీర్చుకోమనండి. ఇలాంటి చెత్త చర్చల వాళ్ళ వలన మంచి వ్యాసములు వ్రాసే సమయాన్ని కోల్పోవలసి వస్తోందని ఇంగితం లేని వీళ్ళా గురువులు ? నాకు స్కైపు డైరెక్టు లింకు వీలయితే పంపండి. నాలుగు తరువాత వస్తాను. JVRKPRASAD (చర్చ) 09:39, 19 ఏప్రిల్ 2015 (UTC)
రచ్చబండను సమర్ధవంతంగా వాడండి
[మార్చు]ఇటీవల రచ్చబండలో కనబడుతున్న కొన్ని విషయాలకు (ఉదా:#Infrastructure Scholarship Program, #‘‘తెలుగు వికీపీడియా యూజర్ గ్రూప్’’ మొదటి అవగాహాన సదస్సు (14.03.2015),#నిషేధం ఎందుకు విధించకూడదు ? , #వాడుకరి:hydkarthik - భారతీయ రైల్వేలు - విన్నపము లాంటివి) రచ్చబండ సరియైన వేదికకాదు. ప్రాజెక్టు , వ్యాస చర్చాపేజీలను సమర్ధవంతంగా వాడితే సరిపోతుంది.మరిన్ని వివరాలకు పాత గమనిక చూడండి. వ్యాస చర్చాపేజీలను లేక ప్రాజెక్టు చర్చాపేజీలను అవసరమైతే {{ సహాయం కావాలి}} మూస తో వాడి రచ్చబండ ప్రధానపేజీని తెలుగువికీపీడియాని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలకు వాడమని సహ సభ్యులను కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:09, 20 ఏప్రిల్ 2015 (UTC)
- అర్జున గారు, నమస్కారము. మీరు ఇంకా మన పాతకాలంలో ఉన్నారు. ఇక్కడ మాయ కూడా తెలుసుకోవాలి. చెత్తగాళ్ళు, బురదగాళ్ళూ తిరిగి ఏదైనా మీటింగు, ముఖ్యమైన చర్చలు, ఇలాంటి పాలసీ, డబ్బుకు సంబంధించిన సందర్భాలలో కోవర్టులుగా చెత్త, బురద వేయడానికి వీరంగంవేస్తూ ఉంటారు. తిరిగి ఇలాంటి వాళ్ళు అప్పుడే దర్శనమిస్తారు. వీళ్ళు ఉన్న పాతవాళ్ళను భయపెట్టడానికి వస్తారు. అంతా నాటకం.JVRKPRASAD (చర్చ) 04:28, 20 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రాజెక్టు , వ్యాస చర్చాపేజీలను చాలామంది చూసే అవకాశం ఉండడంలేదు కనుక తెలుగు వికీపీడియాకి సంబంధించిన ఏ విషయమైనా, తెవికి కామన్ వేదిక అయిన రచ్చబండలో పెట్టాలని కొంతమంది సభ్యుల సూచనల మేరకు #‘‘తెలుగు వికీపీడియా యూజర్ గ్రూప్’’ మొదటి అవగాహాన సదస్సు (14.03.2015) గురించిన వివరాలు ఇలా రచ్చబండలో పెట్టడం జరిగింది. --Pranayraj1985 (చర్చ) 19:54, 20 ఏప్రిల్ 2015 (UTC)
- JVRKPRASAD, Pranayraj1985 గార్ల స్పందనలకు ధన్యవాదాలు. సదస్సు నివేదికలకు సంబంధిత ప్రాజెక్టు లేక సమావేశ పేజీలో చేర్చి రచ్చబండలో చిన్న వ్యాఖ్యతో లింకు ఇస్తే సరిపోతుంది. లేకపోతే రచ్చబండ పేజీ పరిమాణం విపరీతంగా పెరిగి, ఎక్కువసార్లు చూసేవారికి,పేజీలోడు చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది.ప్రతి విషయాన్ని రచ్చబండలో చేరిస్తే ముఖ్యమైనది, కానిది గుర్తించడంలో సమస్య ఎదురవుతుంది. గమనించండి. --అర్జున (చర్చ) 07:47, 24 ఏప్రిల్ 2015 (UTC)
- అలాగే అర్జున గారు. తప్పకుండా చేస్తాను. --Pranayraj1985 (చర్చ) 08:02, 25 ఏప్రిల్ 2015 (UTC)
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం గురించిన నివేదికపై చర్చ
[మార్చు]19 ఏప్రిల్ 2015న హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో వికీపీడియా సముదాయ సభ్యుల్లోని కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు స్కైపు ద్వారా పాల్గొని వికీ ప్రాజెక్టుల బాగోగుల గురించి చర్చించిన నెలవారీ చర్చాసమావేశానికి సమగ్రమైన ముఖ్యాంశాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇటీవల కాలంలో ఆన్-వికీ జరగాల్సిన చర్చలన్నీ ఆఫ్ వికీ జరిగి నిర్ణయాలు కూడా అక్కడే తీసుకుంటున్నారన్న కొందరు సభ్యుల విలువైన ఆందోళనల నేపథ్యంలో వీలున్నంత సమగ్రంగా వీటిని రూపొందించి చర్చలకు పెడుతున్నాము. ఈ మినిట్స్ పేజీని దాదాపు సర్వసమగ్రంగా తయారుచేశాము. ఎవరైనా పాల్గొన్న సభ్యులు తాము మాట్లాడిన విషయాలు ప్రస్తావన జరగలేదనో, కొంచెం వేరుగా ప్రస్తావితమయ్యాయనో భావిస్తే పేజీలో మార్పులు చేయవచ్చు. ఇక జరిగిన విషయాలను ముఖ్యంగా కార్యక్రమాలకు హాజరుకాలేని వారు చూసి, వాటి గురించి అదే చర్చలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 07:44, 20 ఏప్రిల్ 2015 (UTC)
- నివేదికను సత్వరమే సమగ్రంగా పూర్తిచేసిన పవన్ సంతోష్ , Pranayraj1985 లకు ధన్యవాదాలు. ఇకనుంచి తెవికీలో నాణ్యతకే పెద్దపీట వేయాలని నిర్ణయించడం ముదావహం --వైజాసత్య (చర్చ) 11:02, 21 ఏప్రిల్ 2015 (UTC)
వ్యాసాలలో ఒక వ్యక్తిని విమర్శించడం లేదా పొగడడం చేయవచ్చా ?
[మార్చు]అందరికి నమస్కారం... నేను ప్రతిరోజు ఫేస్ బుక్ లో చరిత్రలో ఈ రోజు పోస్టులు పెడుతుంటాను. 20.04.2015 నాడు నేను పెట్టిన చరిత్రలో ఈ రోజు చూసిన నా స్నేహితుడు తెవికీలోని చంద్రబాబు పేజిని చూసి.. నారా చంద్రబాబునాయుడు పేజిలో ఆయన్ను విమర్శిస్తూ, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేజీలో ఆయన్ను పొగుడుతూ వ్యాసాలు ఉన్నాయి. ఇలా ఉండడం సబబేనా..? అని అడిగాడు. తెవికీ వ్యాసాలలో అలా ఉండడం కరెక్టేనా సభ్యులు తెలియజేయగలరు...--Pranayraj1985 (చర్చ) 20:08, 20 ఏప్రిల్ 2015 (UTC)
- ఆధారాలు (అంటే మూలాలు) ఉంటే ఆయా వ్యాసాలలో విమర్శలు, పొగడ్తలు కొంతవరకు ఉండవచ్చు కాని అవి వ్యాసాలు రచించిన వారి స్వంత భావాలు కానట్లుగా ఉండాలి. అయితే చూసేవారికి తెవికీ సభ్యులు కొన్ని వ్యాసాలలో ఆయా వ్యక్తులపైన పక్షపాతం చూపుతున్నారనే భావనను తీసుకురావద్దు. బాబు పేజీలో విమర్శలున్నాయంటున్నవారు జగన్ పేజీలో ఆధారాలతో సహా విమర్శలు పెట్టవచ్చు. బాబు పేజీలో విమర్శలు ఎక్కువగా అనిపిస్తే చర్చాపేజీలో అభ్యంతరం తెలుపవచ్చు. ఆధారాలు లేని విమర్శలు తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరోవిషయం ఏమిటంటే విమర్శలకు ఆధారాలున్నాయి కదా అని మనకు దినపత్రికలలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్న విమర్శలను తెవికీ వ్యాసాలలో చేరిస్తే వ్యాసంలో అసలు సమాచారం కంటే విమర్శలే అధికమౌతాయి. కుక్క కంటే తోక పెద్దగా ఉండటం సమంజసం కానట్లు దీనికీ ఒక హద్దుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:23, 20 ఏప్రిల్ 2015 (UTC)
- ధన్యవాదాలు సి. చంద్ర కాంత రావు గారు... నారా చంద్రబాబునాయుడు పేజిలో ఈ మధ్యన ఎవరో పేరు లాగిన్ అవకుండా ఐపి అడ్రస్ తో వివాదాలు, విమర్శలు అనే హెడ్డింగ్ తో 09 ఏప్రిల్ 2015 నాడు సాక్షి దినపత్రికలో వచ్చిన పట్టుకెళ్లి చంపేశారు! అనే మూలంతో రాశారు. అంతేకాకుండా 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది అని... 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అని ఉంది. వాటిని ఏంచేయాలంటారు. --Pranayraj1985 (చర్చ) 03:39, 21 ఏప్రిల్ 2015 (UTC)
- వార్తలలో సంచలానాత్మక హెడ్డింగులు, వక్రీభవించిన వర్ణనలు ఉంటాయి. అలాంటి భాషలో కాకుండా, ఆ విమర్షను నిష్పక్షపాతంగా వ్రాయవచ్చు. అందుకే వార్తాపత్రికల్లోని వార్తలు యధాతధంగా వాడుకూడదు. నిజానికి వంద వార్తల సారం పిండితేగానీ ఒక వికీపీడియా వాక్యం పుట్టదు --వైజాసత్య (చర్చ) 10:00, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ధన్యవాదాలు సి. చంద్ర కాంత రావు గారు... నారా చంద్రబాబునాయుడు పేజిలో ఈ మధ్యన ఎవరో పేరు లాగిన్ అవకుండా ఐపి అడ్రస్ తో వివాదాలు, విమర్శలు అనే హెడ్డింగ్ తో 09 ఏప్రిల్ 2015 నాడు సాక్షి దినపత్రికలో వచ్చిన పట్టుకెళ్లి చంపేశారు! అనే మూలంతో రాశారు. అంతేకాకుండా 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది అని... 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అని ఉంది. వాటిని ఏంచేయాలంటారు. --Pranayraj1985 (చర్చ) 03:39, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రణయ్ గారూ విషయాన్ని సముదాయం దృష్టికి తెచ్నిందుకు ధన్యవాదాలు. చంద్రకాంతరావు గారూ, వైజాసత్య గారూ ఈ అంశాన్ని నేను కొంత పరిశీలించి ఇక్కడ నేను నా అభిప్రాయాలు వ్యక్తం చేశాను. రాజకీయ నాయకులపై విమర్శలు పత్రికల్లో వస్తూంటాయి. వాటన్నిటినీ ఇలా రాసుకుపోయేంత ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించదు. ఇవన్నీ దుమ్మెత్తిపోసుకుంటున్నవన్నీ వ్యాసాల్లో చేర్చడమే అవుతోంది. అందుకే దీనిపై త్వరగా తగు నిర్ణయం తీసుకోవాల్సివుంది.--పవన్ సంతోష్ (చర్చ) 10:37, 21 ఏప్రిల్ 2015 (UTC)
తెవికి కి సిగ్గుచేటు
[మార్చు](చర్చ:బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను) లోని అంశం ఈ దిగువనీయబడినది.
ఒక కొత్త వాడుకరి ఒక పేరాగ్రాఫ్ మొత్తం ఆంగ్లములోనే ఉన్నదని గమనించినందులకు, ఇది తెవికీకి సిగ్గుచేటు వ్యాఖ్య. 02:31, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, ఈ గత సంవత్సరం నుండి ఈ పోకడ కొనసాగుతుంది. ఎవరూ స్పందించరు. గత సంవత్సరం పోటుగాడు అనే వాడుకరి "రతి భంగిమల" గూర్చి అనేక వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెవికీ కి తెచ్చాడు. ఒక్క శీర్షిక తప్ప ఏ మాత్రం అనువాదం కాని వ్యాసాలు. అలాంటి వాటిని తొలగించాలి. తొలగించకపోతే కొత్తవాడుకరులకు సమాధానము చెప్పలేని స్థితి. వ్యాసంలో కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని <!-- --> ట్యాగ్సు మధ్య ఉంచి హైడ్ చేయాలి. అనువాద మూసను చేర్చాలి. అలా చేయడం లేదు. ఈ మధ్య నిర్వాహకులు కూడా అదే బాటలో వ్యాసాల సంఖ్య పెంచుకొనే నిమిత్తం యధాతధ ఆంగ్ల వ్యాసాలను తెవికీలోని జొప్పిస్తున్నారు. ఒక్కొక్క వ్యాసం అనువాదం చేస్తూ వేరొక వ్యాసం తేవచ్చు కదా! నిర్వాహకులే అలా చేస్తే వాడుకరులు అలానే స్పందిస్తారు. నేను గమనించిన మేరకు {{అనువాదం}} మూస లేని ఆంగ్ల వ్యాసాలు అనేకం ఉన్నాయి. అనువాదం మూస ఉన్న ఏ మాత్రం అనువాదము కాని వ్యాసాలు ఉన్నాయి. వాటిని తొలగించాలని నా అభిప్రాయం. కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని హైడ్ చేస్తే మంచిది.-- కె.వెంకటరమణ⇒✉ 02:57, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, మీరు చెప్పిన విషయాలు తెలిసినవే అయినా, పాత వాడుకరులు అనేక వాటిలో సగం పనిలో పాల్గొనడం, వ్యాసాన్ని వ్రాస్తూ మరో వ్యాస అవసరానికి కొత్తది వ్రాయడం, మరచిపోవడము, ఆరోగ్య, సమయ ఖాళీ, ఏదో విధమైన ఇబ్బంది ఉండవచ్చు. ఎవరికి తోచింది వారు ఎంత వరకు వ్రాయాలో వ్రాస్తారు. మిగతాది వ్రాయగలిగే వారు కూడా వ్రాయవచ్చు. మీరన్నట్లు వ్యాస సంఖ్య పెంచుకోవటము కోసం తాపత్రయము మాత్రము చాలా మందికి ఉండదు. వ్యాసాలు వ్రాసే పద్ధతిలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒక విమర్శ చాలు నా తప్పు సరిదిద్దుకోవడానికి. ఇప్పుడే ఆంగ్ల రూపములో ఉన్న అన్నింటినీ నేను సృష్టించినవి వెను వెంటనే తొలగిస్తాను. బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను అనే వ్యాసములో అది ఎవరి సృష్టి అయినా మీరు తొలగింఛండి. JVRKPRASAD (చర్చ) 03:33, 21 ఏప్రిల్ 2015 (UTC)
- నేను ఈ విషయమై స్పందించలేను ఎందుకంటే ఈ Hydkarthik ఎంత దురుసుగా ప్రవర్తించారో, JVRKPRASAD గారూ అంతే దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరూ ఇక్కడి చర్చా మర్యాదలను ఉల్లంఘించారనటంలో సందేహం లేదు. ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు సంభాషణ వ్యక్తులమీదకి వెళ్ళకూడదు. నేను ఒక వైపు నేను మీవైపే వాదిస్తున్నాని చెప్పిన తర్వాత కూడా ఆపకుండా వ్యక్తిగత విమర్శలు కొనసాగించారు. --వైజాసత్య (చర్చ) 10:43, 21 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారు, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషణలు చేయలేదు. అది మీ జీవితంలో నేనున్నంతకాలం దూషణ అనేది నా నుండి వస్తుందని ఏనాడూ ఆశించకండి. ఇప్పుడు మీరు ఏదో ఒక నిర్ణయ ఆలోచనతో మీ మనసు ఉంది. దానిని అలాగే ఉండనివ్వండి. నా నుండి మీకు నిజంగా దూషణలు తగిలి, మీరు అందుకుంటే సమస్య వచ్చిందని నేనే ఆ పైవాడికి (దేవుడికి) విన్నవిస్తాను. వాడు సరి అయిన తీర్పు త్వరలో ఇస్తాడు. కాస్త ప్రశాంతంగా వేచి ఉండండి. వాడు మాత్రం తప్పుడు తీర్పు ఇవ్వడు. నాకు నమ్మకం చాలా ఉంది. మీకు ఉందో లేదో నాకు తెలియదు. JVRKPRASAD (చర్చ) 11:05, 21 ఏప్రిల్ 2015 (UTC)
- నేను ఈ విషయమై స్పందించలేను ఎందుకంటే ఈ Hydkarthik ఎంత దురుసుగా ప్రవర్తించారో, JVRKPRASAD గారూ అంతే దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరూ ఇక్కడి చర్చా మర్యాదలను ఉల్లంఘించారనటంలో సందేహం లేదు. ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు సంభాషణ వ్యక్తులమీదకి వెళ్ళకూడదు. నేను ఒక వైపు నేను మీవైపే వాదిస్తున్నాని చెప్పిన తర్వాత కూడా ఆపకుండా వ్యక్తిగత విమర్శలు కొనసాగించారు. --వైజాసత్య (చర్చ) 10:43, 21 ఏప్రిల్ 2015 (UTC)
- JVRKPRASAD గారూ, మీరు నన్ను దూషించారనటం లేదండి. వాక్య నిర్మాణంలో పొరపాటుకు క్షమించగలరు --వైజాసత్య (చర్చ) 11:08, 21 ఏప్రిల్ 2015 (UTC)
- సవరించిన వాక్యం "నేను మీవైపే వాదిస్తున్నాని చెప్పిన తర్వాత కూడా ఆపకుండా Hydkarthik పై వ్యక్తిగత విమర్శలు కొనసాగించారు." --వైజాసత్య (చర్చ) 11:12, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, ఈ గత సంవత్సరం నుండి ఈ పోకడ కొనసాగుతుంది. ఎవరూ స్పందించరు. గత సంవత్సరం పోటుగాడు అనే వాడుకరి "రతి భంగిమల" గూర్చి అనేక వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెవికీ కి తెచ్చాడు. ఒక్క శీర్షిక తప్ప ఏ మాత్రం అనువాదం కాని వ్యాసాలు. అలాంటి వాటిని తొలగించాలి. తొలగించకపోతే కొత్తవాడుకరులకు సమాధానము చెప్పలేని స్థితి. వ్యాసంలో కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని <!-- --> ట్యాగ్సు మధ్య ఉంచి హైడ్ చేయాలి. అనువాద మూసను చేర్చాలి. అలా చేయడం లేదు. ఈ మధ్య నిర్వాహకులు కూడా అదే బాటలో వ్యాసాల సంఖ్య పెంచుకొనే నిమిత్తం యధాతధ ఆంగ్ల వ్యాసాలను తెవికీలోని జొప్పిస్తున్నారు. ఒక్కొక్క వ్యాసం అనువాదం చేస్తూ వేరొక వ్యాసం తేవచ్చు కదా! నిర్వాహకులే అలా చేస్తే వాడుకరులు అలానే స్పందిస్తారు. నేను గమనించిన మేరకు {{అనువాదం}} మూస లేని ఆంగ్ల వ్యాసాలు అనేకం ఉన్నాయి. అనువాదం మూస ఉన్న ఏ మాత్రం అనువాదము కాని వ్యాసాలు ఉన్నాయి. వాటిని తొలగించాలని నా అభిప్రాయం. కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని హైడ్ చేస్తే మంచిది.-- కె.వెంకటరమణ⇒✉ 02:57, 21 ఏప్రిల్ 2015 (UTC)
తెవికీ సముదాయమునకు విన్నపం
[మార్చు]నేను సృష్టించిన రైల్వే వ్యాసములు నందు గల ఆంగ్ల పదములకు తెలుగు అనువాదము నేను పూర్తి చేయటము లేదా హైడ్ చేయడము లేదా తొలగించడము గాని చేయగలను. అది మీరు ఇచ్చే సమయమును బట్టి ఆధారపడి ఉంటుంది. మీరందరూ ఈ పని పూర్తి చేయుటకు నాకు కేటాయించే సమయము ఎంతో తెలుపగలరు. ఇదే సమయములో నా ఆంగ్ల వ్యాసాల జాబితా రాబట్ట గలిగితే నాకు చేయగలిగే పని సులువవుతుంది అని నా మనవి. మరో మార్గము కూడా ఉంది, మీరే ఆంగ్ల పదాలున్న వాటిని తప్పకుండా ఇప్పటి నుంచే ఎవరికి వీలయితే వారు తొలగించేయండి. అప్పుడు సృష్టి, స్థితి, లయ, లెక్కలు గురించి విమర్శలు ఉండవు. వీలయినంత త్వరలో నిర్ణయము చేస్తే, సమాధానము పొందు పరచిన వెను వెంటనే త్వరితగతిన పూర్తి చేయగలను. ఎలాగూ ఆఫ్ వికీలో సంప్రదింపులు ఉండనే ఉంటాయి. నాకు నాతోటి తెవికీ లోని వారే నా తప్పులేమిటో తెలియజేస్తే తప్పకుండా చెప్పండి, వింటాను. ఎటువంటి నిర్ణయం మీరు చేయకపోతే మాత్రం నాకు వీలయునప్పుడే అనువదిస్తాను. అంతేకాని నా పని విషయములో ఎటువంటి విమర్శలు అనవసరము. నాకు ఒకరు తెలియజేసిననూ అదే సముదాయపు నిర్ణయముగా భావించి తెలుగు అనువాదము పూర్తి చేయగలను. JVRKPRASAD (చర్చ) 06:24, 21 ఏప్రిల్ 2015 (UTC)
మూస కోసం వ్యాసాలు
[మార్చు]తెవికీలో ఒక మూసను తయారుచేసారు. చాలా సంతోషం. మూసలోని ఉన్న ఒక్కో వ్యాసం తయారుచేసుకుంటూ పోతే మిగిలిన వ్యాసాలను ఎవరైనా సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కానీ అన్ని వ్యాసాలను మూసను తయారుచేసిన వ్యక్తే సృష్టించి దానిలో మూసను జొప్పిస్తున్నారు. వీటిలో ఎటువంటి సమాచారం లేదు. యిది వరకు కూడా అలాంటి వ్యాసాలు కొత్త వాడుకరులూ చేసారు. వాటిలో తొలగింపు మూసను చేర్చాను. స్పందనలు లేవు. సమాచారం లేని వ్యాసాలను కొత్త వాడుకరులు వ్రాసినా, అజ్ఞాత వాడుకరులు వ్రాసినా, చెత్తను చేర్చినా వెంటనే తొలగిస్తున్నాము. సీనియర్ వాడుకరులు చేస్తే చూస్తూ ఊరుకుంటున్నారు. తొలగింపు ట్యాగ్ పెట్టినా సదరు వాడుకరులు స్పందించరు. వాటిని తొలగించాలని మనవి. నిర్వాహకులు కొత్త వాడుకరులకు ఆదర్శంగా ఉండాలి. మనమే యిలా విషయం లేని వ్యాసాలు వ్రాస్తే కొత్తవారు కూడా అదే పని చేస్తారు. ఈ మధ్య 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు వ్యాసాలు విషయం లేకుండా ఉన్నవి.వాటిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 03:09, 21 ఏప్రిల్ 2015 (UTC)
- 108 దివ్యదేశాలు గురించిన కొన్ని వ్యాసాలు (సుమారు 30) నేను తయారుచేశాను. మిగిలిన వాటి గురించి నాకు సందేహాలున్నాయి. ఆంగ్ల వికీపీడియాలో వాటి గురించిన వ్యాసాలున్నాయి. వికీసోర్స్ లో వాటి గురించిన దివ్యదేశా వైభవ ప్రకాశికా అనే పుస్తకంలో సమాచారం అందుబాటులో ఉన్నది. ఆ పుస్తకం పూర్తయింది కూడా. ఈ విషయాన్ని చెన్నై లో ఉంటున్న సుజాత గారికి తెలియజేశాను. తన సహాయం కోరాను. వారు. మొత్తం దివ్యదేశాలన్నింటికి కలిపి మూసను తయారుచేశారు. దివ్యదేశాలు వ్యాసాలు వ్యాసంలో ఆంగ్ల వ్యాసాలకు లింకులిచ్చారు. ఇక్కడితో ఆపేస్తే సరిపోయేది. కానీ ఒక అడుగు ముందుకు వేసి అన్ని దివ్యదేశాలకు ప్రత్యేక ఖాళీ పేజీలను సృష్టించారు. ఇదీ జరిగిన విషయం నేను ఈ వ్యాసాలు తయారుచేయాలనుకొంటున్నాను. కానీ కొంత సమయం పడుతుంది. కావున ఈ ఖాళీ వ్యాసాలను తొలగించినా కూడా నాకేమీ అభ్యంతరం లేదు.--Rajasekhar1961 (చర్చ) 04:01, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ తెవికీలో ఇప్పటి వరకూ అలా వ్యాసాల సంఖ్య, మార్పుల సంఖ్య పెంచుకొనే క్రమం కొనసాగింది. దాని వలనా తెవికీ నాణ్యత మరీ దిగజారిపోతున్నది. సంఖ్యాపరంగా తెవికీ చార్టులలో పైన కనిపించవచ్చునేమో గాని వాసి పరంగా తెవికీ విమర్శలపాలయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మీలాంటి వారు అలాంటి తొలగింపు మూస పెట్టినా స్పందించని మొలక వ్యాసాలను కొన్నిటినైనా తీసేయాలి. అవేకాక కొన్ని అసంబద్దంగా ఉన్న కాళీ విభాగాలను కూడా తొలగించాలి. అపుడే తెవికీ ఏ స్థితిలో ఉందో సరిగ్గా అంచనా వేయగలం...--విశ్వనాధ్ (చర్చ) 04:29, 21 ఏప్రిల్ 2015 (UTC)
- 108 దివ్యదేశాలు వ్యాసాల కొరకు Rajasekhar1961 గారి కోరిక మీదట నాకున్న ప్రత్యేక పనిని ఆపి మూసను సృష్టించాను. వ్యాసాలు వ్రాయడానికే పేజీలు సృష్టించబడ్డాయి. వికీ సౌర్సులో వ్యాసానికి అవసరమైన మూలాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు త్వరలో నేనుగాని రాజశేఖర్ గారు కాని పూర్తిచేస్తాము. మూసకోసం వ్యాసాలు సృష్టించడం, గణాంకాకాలు, దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకోవడం కోసం వ్యాసాలను సృషిచను. వ్యాసం ఆరంభించానన్న పేరు కొరకు అసలు పనిచేయను. నేను సృష్టించిన వ్యాసాలలో తొలగింపు మూసలు పెట్టవలసిన అవసరం ఉండదు. భాషాభిమానంతో తెవికీలో పనిచేయాలనుకుంటున్న నా లాంటి వారిని ఇలాంటి విమర్శలతో ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏమిటి? మాలాంటి వారిని మనశ్శాంతిగా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. నేను ఆరంభించిన పని పూర్తి చేయడానికి తగిన సమయం తీసుకుంటాను. నా పని తెవికీ అభివృద్ధికి నాణ్యతకూ ఎటువంటి లోటూ కలిగించదని విశ్వసిస్తున్నాను. --t.sujatha (చర్చ) 06:05, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ సుజాత గారు మెదలుపెట్టిన అన్ని వ్యాసాలు విస్తరించారు. కాబట్టి ఈ దివ్యదేశాలు కూడా విస్తరించి తెవికీకి చక్కని వ్యాసాలందిస్తారనటంలో సందేహం లేదు. తెవికీలో అతితక్కువ మొలకలున్న వాడుకరుల్లో సుజాత గారు ముందుంటారు. నేను వాడుకరుల ప్రకారం తయారుచేసిన మొలకలజాబితాలో సుజాత గారు ప్రారంభించినవి 25 ఉంటే, నేను ప్రారంభించినవి 250 ఉన్నాయి. సుజాత గారూ, రమణ గారు చెప్పినట్టు ఎప్పటికి కావాలసిన వ్యాసాలు అప్పుడే ప్రారంభిస్తే కొత్తవాళ్ళు మిమ్మల్ని సాకుగా పెట్టుకొని ఆంగ్లవ్యాసాలు ఇక్కడ అంటించకుండా నివారించవచ్చని అంటున్నారు. అన్యధా భావించవవద్దు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న దివ్యదేశాలు, ఆంగ్లపాఠ్యంతో ఉన్న వ్యాసాలు తీసేద్దాం. ఆ తర్వాత ప్రారంభానికి రెడీగా ఉన్నప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించుకోవచ్చు. ఆంగ్ల పాఠ్యం యధాతథంగా అంటించడం కొత్తలో అందరూ చేసినవాళ్ళే. కావాలంటే ఇవి చూడండి. [4] [5] --వైజాసత్య (చర్చ) 10:34, 21 ఏప్రిల్ 2015 (UTC)
- t.sujatha గారూ పైన నేను చెప్పిన దానిని మీరు అపార్ధం చేసుకొన్నట్టూన్నారు. ఎవరిపని వారు చేసుకు వెళ్ళడం అందరికీ మంచిదే. మీ నిబద్దత గురించి విమర్శలు చేయగలవారు వికీలో ఎవరూ లేరు. నేను చెప్పినది. వికీ నాణ్యతపై విమర్శలు ఎక్కువవుతున్న నేపద్యంలో, నేను వెళ్ళీన ప్రతిచోటా ఎవరో ఒకరు వికీ వ్యాసాలపై విమర్శలు కురిపిస్తున్నారు. మీరు మీ పని చేసుకువెళ్ళేవారు కనుక బహుశాఇలాంటి విమర్శలు ఎదుర్కొని ఉండకపోవచ్చు.. అలాటి సందర్భాలలో జవాబులు ఇవ్వడానికి నాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. అందుకే అలా కాళీ విభాగాలను, మొలక వ్యాసాలను తొలగించాలనేది. వికీలో శుద్ది చాలా అవసరం, దాని ద్వారా వికీ నాణ్యత పెరిగితే మంచిదేగా...--విశ్వనాధ్ (చర్చ) 13:15, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ సుజాత గారు మెదలుపెట్టిన అన్ని వ్యాసాలు విస్తరించారు. కాబట్టి ఈ దివ్యదేశాలు కూడా విస్తరించి తెవికీకి చక్కని వ్యాసాలందిస్తారనటంలో సందేహం లేదు. తెవికీలో అతితక్కువ మొలకలున్న వాడుకరుల్లో సుజాత గారు ముందుంటారు. నేను వాడుకరుల ప్రకారం తయారుచేసిన మొలకలజాబితాలో సుజాత గారు ప్రారంభించినవి 25 ఉంటే, నేను ప్రారంభించినవి 250 ఉన్నాయి. సుజాత గారూ, రమణ గారు చెప్పినట్టు ఎప్పటికి కావాలసిన వ్యాసాలు అప్పుడే ప్రారంభిస్తే కొత్తవాళ్ళు మిమ్మల్ని సాకుగా పెట్టుకొని ఆంగ్లవ్యాసాలు ఇక్కడ అంటించకుండా నివారించవచ్చని అంటున్నారు. అన్యధా భావించవవద్దు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న దివ్యదేశాలు, ఆంగ్లపాఠ్యంతో ఉన్న వ్యాసాలు తీసేద్దాం. ఆ తర్వాత ప్రారంభానికి రెడీగా ఉన్నప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించుకోవచ్చు. ఆంగ్ల పాఠ్యం యధాతథంగా అంటించడం కొత్తలో అందరూ చేసినవాళ్ళే. కావాలంటే ఇవి చూడండి. [4] [5] --వైజాసత్య (చర్చ) 10:34, 21 ఏప్రిల్ 2015 (UTC)
- నేను ఎవ్వరికీ వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. వ్రాసే వారికి ప్రోత్సహించే తత్వం నాది. ఈ మధ్య బెంగళూరు దండు రైల్వే స్టేషను పై చర్చ వాడుకరుల మధ్య చాలా ఎక్కువగా సాగింది. వారు చర్చలతో కాలం గడుపుతూ ఉంటే నేను పూర్తిగా అనువాదం చేసి విస్తరించాను. తెవికీలో వ్యాసాలు భవిష్యత్ తరాల వారికోసం మనం వ్రాస్తున్నాము. వారికి అర్థం కాని భాష ఎందుకు మనం వాడాలి. దానికి కొత్తవాడుకరి ససేమిరా ఒప్పికోలేదు. ఆ వాడుకరి అనవసర చర్చలకు కేటాయించిన సమయాన్ని కొత్తవ్యాసాలకు వినియోగిస్తే మరికొన్ని మంచి వ్యాసాలు తెవికీకి వస్తాయి. ఆ తరువాత "సప్తగిరి వడిబండి" అని వ్యాసం వ్రాసాడు. నేను సప్తగిరి ఎక్స్‌ప్రెస్ గా తరలిస్తే కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ వాడుకరి కావాలనే చర్చలు కొనసాగిస్తూ ఆంగ్ల వ్యాసాల చేరికపై విమర్శలు చేసాడు. తెవికీలో శైశవ వికీపీడియనుగా ఉన్నప్పుడు అందరూ ఖాళీ వ్యాసాలు వ్రాయడం, ఆంగ్ల వ్యాసాలు తథాతథంగా అంటించడం సహజమైన విషయం. బాల్య వికీపీడియనుగా పరిణితి చెందినపుడు కొంత సమాచారాన్ని చేర్చడం, కొన్ని వ్యాసాలకు అనువాదాలు చేయడం పరిపాటి. పరిణితి చెందిన వికీపీడియనుగా శైశవస్థాయిలో చేసిన తప్పులను చేయరాదని తెలియజేసానంతే. మూసలో ఉన్న వ్యాసాలను సుజాత గారు 100 శాతం విస్తరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఎర్ర లింకులుంటే మా లాంటి వారు కొన్ని వ్యాసాలు సృష్టించి విస్తరించరా! ఆ మూసలో వ్యాసాలు అందరూ తలో వ్యాసం తయారు చేస్తే సమిష్టి కృషి అవుతుంది. ఒకే సారి అన్ని వ్యాసాలకు మూసని అతికించితే అవి ఏకవాక్య వ్యాసాలు కూడా కాని ఖాళీ వ్యాసాలు. మూసలో ఒక్కొక్క వ్యాసాన్ని విస్తరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ⇒✉ 14:49, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ' గారూ ! మీరు సంమనం పాటిస్తారు. మొలక వ్యాసాలను విస్తరించారు. నేను నా పనిలో భాగంగా ఆగ్ల వ్యాసాలను దిగుమతి చేసుకుని అనువదిస్తున్నాను.
పను సులువుగా త్వరితంగా జరగడానికి ఒకే సారి ఆంగ్ల వ్యాసాలను ఒకే సారి దిగుమతి చేసాను. అవి పూర్తిచేయడానికి కొంత సమయం పడుతుంది. బాధ్యతా రహితంగా దిగుమతి చేసి వాటిని వదిలే వ్యాసాలలో అనువదించడం లేక తొలగించడం మూసలు ఉంచండి. వ్యక్తిగతంగా కూడా సదరు సభ్యులకు వారి చర్చా పేజీలలో బాధ్యత గుర్తి చేయండి. అయినప్పటికీ వ్యాసం ఆరంభించిన మూడు లేక ఆరుమాసాల తరువాత వ్యాసాలలో మార్పు లేకపోతే అలాంటి పని చేయవచ్చు. పని జరుగుతున్న సమయంలో మూసలు పెట్టడం వాటిని చర్చా పేజీలో ఉంచడం కొంత ఇబ్బంది కరంగా ఉంది. ప్రణాళికా బద్ధంగా పని జరుగుతున్న సనయంలో పేజీలు సృష్టించకుండా పని ముందుకు సాగదు ఒకరు సృష్టించిన పేజీలో వ్రాయకూడదు అనుకోవడం వికీ సంప్రదాయం కాదు. వికీ వ్యాసాలు ఏ ఒక్కరి స్వంతం కాదు. అందుకనే నా పేజీలో నేను పనిచేసిన వ్యాసాలు అనే శీర్షికలో వ్యాసాలకు లింకులు ఉంటాయి. నేను వ్రాసిన వ్యాసాలు అని ఉండవు. నేను ఇప్పటి వరకు ఇతరులు ఆరంభించిన అనేక వ్యాలను విస్తరించాను. వికీ సంప్రదాయానికి విరుద్ధంగా ఒకరు ఆరంభించిన వ్యాసాలను మరొకరు వ్రాయకూడదు అన్న వాదనను సమర్ధంచలేను. రాజశేఖర్ గారి అభ్యర్ధన మీద ప్రణాళికా బద్ధంగా ఆరంభించిన వ్యాసాలను తొగించడం మూసలు ఉంచడం ఎంత వరకు ఉచితం. ఈ వాదన కారణంగా లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో వ్యాసాలు 60కి పైగా వ్యాసాలలో నేనే పనిచేసాను. వ్యాసాలు ఆరంభించి వాటిని అభివృద్ధి చేయడానికి అవసరమైన పి.డి.ఎఫ్ ఫైలు లింకులు ఉంచడానికి వ్యాసాలను ఆరంభించవలసిన అవసరం ఉంది. పి.డి.ఎఫ్ లింకులు చేర్చడం అందరికీ సాధ్యం కాదు కనుక అలాచేసాను. అదే వాదన 108 దివ్యదేశాలు ప్రాజెక్టులో కొనసాగుతుంది. అందువలన ఇలాంటి సంప్రదాయానికి ముగింపు తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. ఇలాంటి అభ్యంతరాలు ఉంటే ప్రాజెక్టు పనులు సజావుగా కొనసాగవు. నాలాంటి వారు ప్రాజెక్టు పనులు చేయలేరు. ఇతరులు ఆరంభించిన వ్యాసాలలో పనిచేయడానికి నాకు అభ్యతరం లేదు. అభ్యంతరాలు ఉన్నవారు కొత్తగా ఆరభించి వ్యాసాలు వ్రాయండి. వీకీలో సభ్యులకు అలాంటి స్వాతంత్రం ఉండనే ఉంది. ఎలా చేసినా తెవికీ అభివృద్ధి ముఖ్యం. --t.sujatha (చర్చ) 18:00, 21 ఏప్రిల్ 2015 (UTC)
- సుజాత గారూ, వెంకటరమణ గారూ ఈ విషయాన్ని బయట నుంచి చాన్నాళ్ళుగా పరిశీలిస్తున్నవాడిగా నాదొక చిన్న సలహా. గత వారం, రెండు వారాల నుంచి నిర్వాహకత్వ బాధ్యతలు చేపడుతున్నవారు తొలగింపు మూసలు చేర్చి నిరుత్సాహపరుస్తున్నారన్న వ్యాఖ్యలు నేను వ్యాసకర్తల నుంచి వింటూనేవున్నాను. (అదేమిటి వ్యాసకర్తలు వేరూ, నిర్వాహకత్వ బాధ్యతలు చేస్తున్నవారు వేరూనా అంటే అందరూ మన సముదాయం వారే. కాకుంటే కొందరికి నిర్వాహకత్వ బాధ్యతలపై ఆసక్తి ఎక్కువ, మరికొందరికి వ్యాసాలను తయారుచేసి, అభివృద్ధి చేయడంలో మొగ్గు ఎక్కువ, రెండూ ఇష్టపడి పనిచేసేవారు అరుదు. ఎంత రెంటిలోనూ పనిచేస్తున్నా మౌలికమైన ఆసక్తి భేదిస్తుంది.) ఇప్పుడు జరుగుతున్న స్పర్థ కూడా ఆ క్రమంలోనిదేననుకుంటాను. ఈ విషయం గత సమావేశంలో చర్చకు వచ్చింది. చర్చకుపెట్టినవారు భాస్కరనాయుడు గారు, విశ్వనాధ్ గారూను. దానిపై స్పందిస్తూ నేనూ, రాజశేఖర్ గారూ, వైజాసత్య గారూ చేసిన సూచనలు ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. వ్యాసకర్తలు(అంటే ఇక్కడ సుజాత గారు) తాము ప్రణాళికాయుతంగా అభివృద్ది చేస్తున్న పేజీల్లో పేజీ అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని సూచించే మూస చేరిస్తే సమస్య ఉండదని ప్రస్తావనకు వచ్చింది. అలానే నిర్వహణ బాధ్యతలు చేపట్టేవారు మొలకలను డిలీషన్ మూసలు పెట్టి గుర్తించకపోతే అవి భవిష్యత్తులో గుర్తించకుండా వదిలివేసిన వ్యాసాలై తలనొప్పి కలిగించవచ్చని ఈ పని చేస్తూండవచ్చు. మీరే అభివృద్ధి చెందుతోందన్న మూస పెడితే అవి వర్గీకరింపబడివుంటాయి కనుక సమస్య ఉండదు అన్నది సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు. అలానే కొత్తవాడుకరులకు ఈ విషయాలు తెలియకపోవచ్చు కనుక డిలీషన్ మూస వంటి హార్ష్ మూసలు కాకుండా కొంత వారిని అభినందిస్తున్నట్టుండే అభినందన మూస తయారుచేసి, ఫలానా వ్యాసం చేసినందుకు ధన్యవాదాలు.. దీనిలో సమాచారం తక్కువ ఉంది. మీరు ఫలానా సమయంలోపుగా దీన్ని అభివృద్ధి చేయలేకుంటే మేము డిలీషన్ మూస తగిలించి ముందుకువెళ్ళాల్సివుంటుందన్న సమాచారంతో కూడిన ఆ మూసను కొత్త సభ్యుల చర్చపేజీల్లో చేరిస్తే ఎలావుంటుందో పరిశీలించమనీ చర్చలో వచ్చింది. ప్రస్తుతం అందరూ సదుద్దేశంతోనే వికీ అభివృద్ధికే కృషిచేస్తున్న చేపట్టిన పనుల్లో, విధానాల్లో భేదం వల్ల వివాదం మొదలై చివరికి ముదిరి పాకాన పడుతుండడంతో ఈ విషయాలు మీకు తెలిపాను. మీరు దీనిపై చర్చించి మీకు కూడా ఈ సూచనలు బావుంటే ముందుకువెళ్ళండి.--పవన్ సంతోష్ (చర్చ) 19:49, 21 ఏప్రిల్ 2015 (UTC)
పి.ఎస్.: నిర్వహణ పనులు కూడా తెవికీకి అవసరమే, అలాగని వ్యాసాలు తయారుచేయడమూ ముఖ్యం కాదనట్లేదు రెండు రకాల పనులూ విభేదించుకోవడం, వాటిలో సమస్యలు తలెత్తడం జరుగుతూనేవుంటుందన్న విషయం ఇలాంటి విషయాల్లో అతి కఠినంగా వ్యవహరించే ఆంగ్లవికీలో చూస్తూంటాము. అలానే తెవికీలోనూ అప్పుడప్పుడూ తలెత్తడమేమీ అసహజం కాదని, కాకుంటే రెండు పనులకూ మౌలికంగా ఉన్న విభేదమే ఈ సమస్యలు తెచ్చిపెడుతుందన్న విషయం అర్థం చేసుకుంటే చాలు. ఇటీవల నాకు వ్యక్తిగతంగా సంప్రదించి నాగబాబు అరవ గారు కూడా ఇదే విషయాన్ని అడిగారు-ఎందుకు నేను తయారుచేసిన వ్యాసాల్లో డిలీషన్ మూసలు పెడుతున్నారని ఆయనకి విషయం వివరించాను. ఆ క్రమంలో ఇది చాలా సహజమని అర్థం చేసుకున్నాను. ఇన్ని చూస్తున్నాను కనుకనే మీకు చెప్పే సాహసం చేశాను. మరోలా తీసుకోకండి.--పవన్ సంతోష్ (చర్చ) 19:55, 21 ఏప్రిల్ 2015 (UTC)
- నిర్వాహకత్వ భాద్యతలో భాగంగా నేను తెవికీలోకి ప్రవేశించిన ప్రతి వ్యాసాన్ని పరిశీలిస్తాను. ప్రాజెక్టులో భాగమైన మొలకల లోలికి పోను. గ్రామ వ్యాసాలలో తక్కువ సమాచారమున్నా వాటిలో ఎటువంటి మూసలు ఉంచడం లేదు. చెత్త రాతలతో వికీలోకి చేరే వ్యాసాన్ని వెంటనే తొలగించాలి. దానికి తొలగింపు మూస కూడా అవసరం లేదని నా భావన. వ్యక్తిగత వివరాలతో కూడుకున్న వ్యాసాలు, అజ్ఞాత వాడుకరులు రాసిన చెత్త వ్యాసాలను వెంటనే డిలీట్ చేసినా తప్పులేదు. అదే అనుభవం ఉన్న వాడుకరి ఏదైనా వ్యాసం ఏక వాక్యంతో సృష్టించినా, చెత్తరాతలు చేర్చినా మనం సరియైన మూసను చేర్చడంలో తప్పులేదు. ఆ మూసను నిర్వాహకులే చేర్చనవసరంలేదు. సాధారణ వాడుకరికీ ఆ భాద్యత ఉన్నది. ఆ మూసలో తమ అభిప్రాయాలను తెలియజేయమని ఉంది కదా. చర్చ జరిగిన తరువాత సముదాయం అభిప్రాయం మేరకు తొలగించాలా? ఉంచాలా? అనే నిర్ణయం జరుగుతుంది. కానీ డిలీట్ మూసను చేర్చవద్దు అని అనడం భావ్యంకాదు. ఆంగ్ల వ్యాసాలను తెవికీలోకి తెచ్చి అనువాదం చేయాలనుకుంటే {{అనువాదం}} మూసను వ్యాసం సృష్టించిన వ్యక్తి ఉంచితే మంచిది. ఒక వ్యాసం పని జరుగుతోంది. వేరొకరు సదరు వ్యాసవిస్తరణలో వెంటనే చేరకుండా కొంత వ్యవధి కోరుకున్నప్పుడు {{in use}} అనే మూసను ఆ వ్యాస సృష్టికర్త ఆ వ్యాసంలో అతికించాలి. అపుడు ఆ వ్యాసం జోలికి ఎవరూ పోరు. అది కొంత సమయం వరకే అప్పటికీ ఆ వ్యాసం విస్తరణ కానీ జరుగక పోతే {{విస్తరణ}} మూసను గానీ {{మొలక}} మూసను కానీ చేర్చడం మంచిది. పవన్ సంతోష్ గారు చెప్పినట్లు కొత్త వాడుకరులు ఏక వాక్య వ్యాసాలను సదుద్దేశంతో చేర్చుతున్నప్పుడు వారికి ప్రోత్సహించే మూస అవసరం ఉంది. -- కె.వెంకటరమణ⇒✉ 20:56, 21 ఏప్రిల్ 2015 (UTC)
పవన్ సంతోష్ గారూ, పైన మీరు తెలిపిన విషయంలో కొంతమందికి వ్యాసాలు రాయడం ఆసక్తి, కొందరికి నిర్వాహకత్వం పై ఆసక్తి. మరికొందరికి రెంటిలొనూ. అందులో భాగంగా ఈ స్పర్థ అనుకుంటాను. అని వ్రాసారు. తెవికీలో అనేక మంది అజ్ఞాత వాడుకరులు వ్రాసిన ఏక వాక్యాలను కూడా విస్తరించిన సందర్భాలున్నాయి. ప్రతి వ్యాసం పరిశీలించి అందులో మూలాలు చేర్చడం, విస్తరించడం, సరియైన ట్యాగ్సు, వికీకరణ చేయడం, లింకులు చేర్చడం, సరియైన మూసలను చేర్చడం ప్రతి వికీపీడియను భాద్యత. నిర్వాహకునిపై ఆ భాద్యత ఎక్కువ ఉంటుంది. నిర్వాహణ భాద్యతలు చూస్తూ వ్యాసాలు వ్రాయడం కష్టమే. ఆదర్శ వికీపీడియను ఎవరైనా వ్యాసాల నాణ్యతకు ప్రాధాన్యతనిస్తారు. గానీ వ్యాసాల సంఖ్యకు కాదని నా అభిప్రాయం. వ్యక్తిగత కారణాల మూలంగా వ్యాసాలు ప్రస్తుతం వ్రాయలేక పోవుచున్నాను కానీ నాకు వ్యాసాలు వ్రాయడమంటె ఆసక్తి ఎక్కువ. అలా అని ఎవరైనా ఎక్కువ వ్యాసాలు రాస్తే నాకు స్పర్థ ఎందుకు? తెవికీ అభివృద్ధి నాకు ముఖ్యం. వ్యాసాలు వ్రాయాలంటే అంతకంటే ఎక్కువ వ్యాసాలు నేను రాయగలను. డిలీట్ మూస ఉంచుతున్నామని ఎవరో అడిగారని అన్నారు. డిలీట్ మూస ఏ వ్యాసానికి ఉపయోగించాలి? తెవికీలో అజ్ఞాత వాడుకరి నుండి అధికారి వరకు ఒకే నియమాలు ఉంటాయని మీకు తెలుసు. ఖాళీ వ్యాసాన్ని ఒక అజ్ఞాత వాడుకరి సృష్టిస్తే ఒక గంట. సాధారణ వాడుకరి అయితే మూడు గంటలు, నిర్వాహకుడు సృష్టిస్తే మూడు నెలలు, అధికారి సృష్టిస్తే ఒక సంవత్సరం వేచి చూడాలా? అందరికీ ఒకే నియమాలు ఉంటాయి. వ్యాస సృష్టి కర్త ఏ ప్రణాళికతో వ్రాస్తున్నారో మాకెలా తెలుస్తుంది. డిలీట్ మూసను ఉంచినపుడు చర్చాపేజీలో వ్రాస్తే మాకు తెలుస్తుంది. మూసలు కొంతమందికి చేర్చి మరి కొంతమందికి చేర్చరాదనడంలో అర్థం లేదని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ⇒✉ 21:40, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ నేను సరిగా చెప్పలేదో ఏమో గానీ మీకు నా మాటలు వేరేగా అర్థమైనట్టున్నాయి. నా ఉద్దేశం మరో మారు చెప్తున్నాను. వ్యాసాలు సృష్టించడం, వాటిని అభివృద్ధి చేయడం వైపు దృష్టి పెట్టినవాళ్ళు నిర్వాహకత్వ వ్యవహారాలు వహించినవారి సాధకబాధకాలు మరిచినారన్నది నా ఉద్దేశం. ఐతే ఇక్కడ ప్రతివారూ వ్యాసాలు సృష్టించినవారే, సృష్టించే సామర్థ్యం ఉన్నవారే, కానీ నిర్వహణ ప్రాధాన్యత తెలిసి కొందరు అటువెళ్ళారన్న విషయం నాకు తెలియక కాదు. కాకుంటే నిర్వహణ అనే పనిలో పలువురికి అప్రియమైనా తెవికీ మేలు కోరి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలుంటాయి. కాబట్టి వ్యాసాలు సృష్టించి, అభివృద్ధి చేసేవారికి నిర్వహణ విషయంలో కృషి చేసేవారికి ఈ కఠిన నిర్ణయాలు, అప్రియమైన సత్యాల వల్లనే స్పర్థ వస్తుంది. కాదంటారా? నేను పైన చెప్పిందీ అదే. ఒకవేళ నేను ఈ వివరణ చేశాకా కూడా నా వాదన తప్పే అనుకుంటే క్షమించండి. ఇక నేను చేసిన మరో సూచన విషయంలో రెండు కోణాలున్నాయి. అనుభవం ఉన్న వాడుకరులు కొత్త మొలకలు సృష్టించి అభివృద్ధి చేస్తూన్నామనుకున్నప్పుడు ఆ విషయాన్ని వివరించే మూస వారి వ్యాసాల్లో వారే పెట్టాలి. ఎందుకంటే వారే ఉద్దేశంతో సృష్టించారో అవతలివారికి అర్థంకాదు కాబట్టి. ఇక ఈ విషయం కొత్తవారికి తెలియదు కాబట్టి వారితో ఎడిట్-అ-థాన్ వంటివి చేస్తూ ఎవరైనా తయారుచేయిస్తుంటే ఆ అనుభవం కల సభ్యులే పైన చెప్పినలాంటీ మూస చేర్చాలి. ఇక ఈ రెండూ కానిపక్షంలో ఎవరైనా ఉత్సాహంతో ముందుకువచ్చి మంచి వ్యాసాన్ని మొలకగా సృష్టించివుంటే వారి విషయంలో అభినందన లాంటివేవైనా చేరిస్తే బావుంటుందన్నది నా భావన. అందరూ సమానులే, నియమం అందరికీ సమానంగానే వర్తిస్తుందన్నది మౌలిక సూత్రం, కానీ స్థితిగతులు, ఉద్దేశాలు వేరైనప్పుడు వేర్వేరు విషయాల్లో వేర్వేరు నియమాలు వర్తించడం సహజమే కదా.(మీకు తెలియనిదేముంది బాగా దుశ్చర్యలు జరిగే వ్యాసాలకు, ఓ స్థాయికి అభివృద్ధి చెందిన వ్యాసాలకు సెమీ ప్రొటెక్టివ్ చేసే సంప్రదాయం ఉంది, అంతమాత్రాన అదేమీ అజ్ఞాత వ్యక్తుల పట్ల వ్యతిరేకతతో చేసేది కాదు కదా). ఇంతే తప్ప అనుభవం, సభ్యత్వం ఆధారంగా నిచ్చెనమెట్ల వ్యవస్థ ఏదీ మనం తయారుచేసుకోవట్లేదు. ఇంతకీ నేనిప్పుడు చెప్పిన ప్రతిపాదన ఎలా ఉంది? ఇక్కడ వేర్వేరు రూపాల్లో వాడుకలో ఉన్నవే తప్ప కొత్తవేవీ చెప్పలేదు నేను.--పవన్ సంతోష్ (చర్చ) 07:58, 22 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ మీరు సాహిత్య ప్రక్రియలు తెలిసినవారు. మీ భాషను నేను సరిగా అర్థం చేసుకోలేక పోయినందులకు క్షంతవ్యుడను. మీరు తెలియజేసినట్లు కొత్తవారు వ్యాసం కొద్ది విషయం ప్రారంభిస్తే వారికి "ప్రోత్సహించే మూస" ను తయారుచేస్తే బాగుంటుంది. దానికి కొంత కాలపరిమితి యివ్వాలి. అప్పటిలోగా విస్తరించకపోతే ఎవరైనా విస్తరించవచ్చు. లేదా తొలగింపు మూసను చేర్చవచ్చు. పాత వాడుకరులు మొలక వ్యాసం ప్రారంభిస్తే వారి ఉద్దేశ్యాన్ని, వ్యాస విస్తరణా కాలం మొదలగు అంశాలను తెలియజేసే మూసను కూడా చేర్చితే బాగుంటుంది.ఆ వ్యాసాల జోలికి ఎవరూ పోరు. కొత్త వ్యాసం ప్రారంభించునపుడు వెంటనే ఆ వ్యాసంలోనికి ఎవరూ ప్రవేశించకుండా ఉపయోగించే {{in use}} మూస ఎలాగూ ఉన్నది. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 10:25, 22 ఏప్రిల్ 2015 (UTC)
This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.
Greetings,
I am pleased to announce that nominations are now being accepted for the 2015 Wikimedia Foundation Elections. This year the Board and the FDC Staff are looking for a diverse set of candidates from regions and projects that are traditionally under-represented on the board and in the movement as well as candidates with experience in technology, product or finance. To this end they have published letters describing what they think is needed and, recognizing that those who know the community the best are the community themselves, the election committee is accepting nominations for community members you think should run and will reach out to those nominated to provide them with information about the job and the election process.
This year, elections are being held for the following roles:
Board of Trustees
The Board of Trustees is the decision-making body that is ultimately responsible for the long term sustainability of the Foundation, so we value wide input into its selection. There are three positions being filled. More information about this role can be found at the board elections page.
Funds Dissemination Committee (FDC)
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions being filled. More information about this role can be found at the FDC elections page.
Funds Dissemination Committee (FDC) Ombud
The FDC Ombud receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled. More information about this role can be found at the FDC Ombudsperson elections page.
The candidacy submission phase lasts from 00:00 UTC April 20 to 23:59 UTC May 5 for the Board and from 00:00 UTCApril 20 to 23:59 UTC April 30 for the FDC and FDC Ombudsperson. This year, we are accepting both self-nominations and nominations of others. More information on this election and the nomination process can be found on the 2015 Wikimedia elections page on Meta-Wiki.
Please feel free to post a note about the election on your project's village pump. Any questions related to the election can be posted on the talk page on Meta, or sent to the election committee's mailing list, board-elections -at- wikimedia.org
On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee
Posted by the MediaWiki message delivery on behalf of the 2015 Wikimedia Foundation Elections Committee, 05:03, 21 April 2015 (UTC) • Translate • Get help
తెవికీలో ఆంగ్ల వ్యాసాలు - తొలగింపు ప్రతిపాదన
[మార్చు]గత కొన్నేళ్ళుగా తెవికీలో ఆంగ్ల వ్యాసాలు ప్రవేశిస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాసాలలో ఏమాత్రం అనువాదం కాని వ్యాసాలు అనేకం ఉన్నాయి. అవి సంవత్సరాల తరబడి అనువాదాన్ని కోరుకుంటున్నాయి. గత సంవత్సర కాలంగా రచ్చబండలో వాటి అనువాదం కోసం సహాయం కోరినప్పటికీ ఏ వ్యాసం అనువాదానికి నోచుకోలేదు. కనుక అటువంటి వ్యాసాలను గుర్తించి వెంటనే తొలగించాలి. ఎవరైనా తనకు కావలసిన వ్యాసం తెలికీలో చూసినపుడు ఆంగ్ల వ్యాసం దర్శనమిస్తుంది. ఈ విధాన్ం తెవికీకి అపఖ్యాతిని తెచ్చిపెడతాయని నా అభిప్రాయం. అందువల్ల అటువంటి వ్యాసాలను తొలగించాలి. కొన్ని వ్యాసాలలో కొంతభాగం అనువాదం జరిగిన వ్యాసాలను గుర్తించి అనువాదం చేయబడని భాగాన్ని హైడ్ చేయాలి. తొలగింపు వద్దు అనుకున్నప్పుడు మొలక స్థాయి దాటినంత వరకైనా దానిని విస్తరించే భాద్యతను అందరూ స్వీకరించాలి. అటువంటి వ్యాసాల జాబితా "వర్గం:అనువాదం కోరబడుచున్న వ్యాసాలు" ఉన్ననూ, అనువాద మూస లేకుండా ఉన్నవి కూడా ఉన్నవి. వాటిని వైజాసత్య వంటి వారు జాబితా తయారుచేయాలని మనవి. ఈ వ్యాసాలను ఏం చేస్తే బాగుంటుందో సముదాయం చర్చించవససినదిగా కోరుచున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 22:28, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ విషయమై విధివిధానాలు తయారుచేసుకోవటానికిది చక్కని సమయం. ఏదో ఒకటి వ్రాస్తే చాలు అనే పసికందు దశనుండి మన వికీ ఎదిగినందున, ఇంకా పూర్తి ఆంగ్ల పాఠ్యంతో వ్యాసాలుండటం (కనీసం ప్రధాన నేంస్పేసులో) సమంజసం కాదు. ఒకవేళ అనువాదం చెయ్యటానికే ఆంగ్లం నుండి తెచ్చుకొని ఉంటే అనువాదం జరుగుతున్నది అని ఒక మూస చేర్చి, తేదీ వ్రాస్తే ఆ వ్యాసాన్ని తర్జుమా చెయ్యటానికి కొంత సమయం ఇవ్వవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:35, 22 ఏప్రిల్ 2015 (UTC)
- పూర్తిగా ఆంగ్లంలో ఉన్న వ్యాసాల్ని తొలగిస్తేనే మంచిది. ఇంక కొంత అనువదించబడి కొంతభాగం ఆంగ్లంలో ఉంటే తెలుగు భాగాన్ని ఉంచి; ఆంగ్లభాగాన్ని తొలగించకుండా కనుమరుగు చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 12:03, 22 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రధాన పేరుబరిలోనివ్యాసాలలో ఆంగ్లభాష కనబడడం వాంఛనీయము కాదు. ఆంగ్లభాష స్థాయిని బట్టి, దాచడమో, లేక వ్యాసాన్ని తొలగించడమో చేయడం మంచిది.--అర్జున (చర్చ) 04:38, 27 ఏప్రిల్ 2015 (UTC)
Please test VisualEditor in your language!
[మార్చు]It is very important to us at the Editing Department that VisualEditor works in every language, for every user.
VisualEditor's editing environment is a browser ContentEditable element. This means that your input method editor (IME) should already know how to work with it. However, to make VisualEditor correctly edit wiki pages, we have to stop browsers in lots of ways from breaking the page.
Sometimes this can interfere with IMEs. To make sure we work in your IME, we need your help: please see wikimedia.github.io/VisualEditor/demos/ve/desktop-dist.html#!pages/simple.html. This is the core system inside VisualEditor which lets you write and edit. It is different from the full editor, and some of the tools you are used to will be missing.
We're interested in particular in whether you can write text at all, what happens when you select different candidate texts, and how VisualEditor behaves in general.
More details, and some early test results, are provided here: mediawiki.org/wiki/VisualEditor/IME_Testing#What_to_test.
We would love to hear from every language, and especially languages which use IMEs, like Japanese, Korean, Indic languages, Arabic and others. Thank you for your help.
Yours,
పాత (పెద్ద) వాళ్ళని భయపెట్టకండి
[మార్చు]పాత (పెద్ద) వాళ్ళని భయపెట్టకండి అని మాత్రమే ఉండాలి అనుకోవాల్సి పస్తోంది. ఎవరో అనామకులు లేదా పాత వాళ్ళే కొత్త రూపుగా వచ్చి, వాళ్ళకు తోచిన విధముగా చెత్త రాతలు, పెంట పోయడము, ఇలాంటి అనేకం చేస్తూ చెలరేగి పోతూ ఉంటే, దానికి మనవాళ్ళు తగినంత అండగా నిలబడటము. వాళ్ళు ఇదంతా చేస్తుంటే మనవాళ్ళ ఆలోచనలు అసలు ఎటు పోతున్నాయి అనిపిస్తుంది. అనామకులు పోసిన దరిద్రం ఎత్తుకుని శుభ్రం చేసుకోవటం, పెంట శుభ్రం చేసుకోవడానికి ఇదే మంచి సమయము, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అని మరొకరి ఆలోచన, సలహాలు. అనామకులు పెంట పోస్తే గాని మనకు శుభ్రం చేసుకునే సమయము అసలు ఉండదా ? మనవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటే, ఎవరో ఒక బకరాని ఎన్నుకుని లేదా ఎవరి మీద దాడి చేయాలని ఉందో వారిని ఎంచుకుని, ఇదే మంగలం వేయడం అనే అలవాటు ప్రతిసారి జరుగుతునే ఉంటుంది. కొత్త వాళ్ళు దాష్టీకం చేస్తూ ఉంటే వాళ్ళకే మనవాళ్ళు వంత పాడుతూ ఉంటే, భవిష్యత్తులో ఇక్కడ, పాత (పెద్ద) వాళ్ళని భయపెట్టకండి అని మొత్తుకోవాలి మనము. JVRKPRASAD (చర్చ) 00:18, 23 ఏప్రిల్ 2015 (UTC)
మారుపేరు - వ్యాసము - అవసరము
[మార్చు]మారుపేరుతో వ్యాసము లేదా వికీలో అత్యంత అవసరము అయితేనే వాడండి. మీరు చేసేది మంచి పని అయినప్పుడు మారుపేరుతో చేయడము అవసరమా అని ఒకసారి ఆలోచించండి. మీరు చేసే మంచి అంతా మారుపేరుకి వెడుతుందని గుర్తు తెచ్చుకోండి. తదుపరి మీరు కొంతకాలనికి అసలు పేరు చెప్పినా, మారుపేరుతో వచ్చిన మంచి అంతా ఆ పేరుకే నిలబడుతుంది, కాని అసలు పేరు తెలియజేసినా దానికి చెందటానికి చాలా మంది ఇష్టపడక, మారుపేరు మీరు ఉంచుకోండి, అదే మాకు అలవాటు అయ్యింది అని అంటారు. మీరు చేసిన మంచి పనుల ఫలితాలు రెండు పేర్లకు వెడతాయి. ఆవిధముగానే కొనసాగించవలసి వస్తుందేమో అని ఒకసారి ఆలోచించండి. అసలు పేరు ఉండగా మారుపేరు ఎందుకు దండగ అని అనుకోండి ఒకసారి. ఇంక మీ ఇష్టం. JVRKPRASAD (చర్చ) 04:26, 24 ఏప్రిల్ 2015 (UTC)
- ఇంతకీ ఎవరు మారుపేరుతో వస్తున్నారని? --వైజాసత్య (చర్చ) 04:49, 24 ఏప్రిల్ 2015 (UTC)
- కొందరు తెలుగు వికీపీడియా వాడుకరులండి. JVRKPRASAD (చర్చ) 05:50, 24 ఏప్రిల్ 2015 (UTC)
విశేష వ్యాసాల పునస్సమీక్ష
[మార్చు]వికీలోని అత్యుత్తమ నాణ్యతతో వున్న విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు విశేషవ్యాసాలు. వికీలో ఉన్న వెయ్యివ్యాసాలకొక్కటే విశేష వ్యాసం లక్షణాలను సంతృప్తిపరిచి విశేష వ్యాసం అవుతుందంటే దాని విశిష్టత తెలుసుకోవచ్చు. బయటివారు వికీని సందర్శించినప్పుడు విశేష వ్యాసాలను పరిశీలిస్తే ఆ వికీ నాణ్యత ఏమిటో అంచనా కట్టవచ్చు. ఆంగ్లవికీలో పనిచేసినవారికి విశేషవ్యాసాన్ని రూపుదిద్దాను అని ఎవరైనా అంటే అదెంత గౌరవప్రదమైన విషయమో తెలుస్తుంది. విశేషవ్యాసాన్ని రూపొందించేందుకు ఒక మంచి వికీపీడియన్ కంకణం కట్టుకని కృషి చేసినా నెలలు పడుతుంది, ఆపైన ప్రతిపాదన చేసినాకా రివ్యూ ప్రాసెస్ మళ్లీ నెలరోజులకు తక్కువపట్టదు. శైలి, తటస్థత, సమగ్రత, మూలాల చేర్పు వంటి విషయాల్లో అత్యుత్తమ నాణ్యత, స్థిరత్వం కనబరిస్తేనే విశేష వ్యాసాలు రూపుదిద్దుకుంటాయి.
అయితే తెవికీలో ఇప్పటికవరకూ స్థిరమైన, సమగ్రమైన విశేషవ్యాసాల ఎంపిక విధానం రూపుదిద్దుకోలేదు. కానీ కొన్ని వ్యాసాలను విశేషవ్యాసాలుగా గుర్తించడం మాత్రం జరిగింది. ఈ ప్రమాణాలను బట్టి పరిశీలిస్తే వాటిలో కొన్ని విభాగాల ఏర్పాటే సరిగా లేదని, మరికొన్నిటిలో అనవసరమైన పొడవు ఉందనీ, కొన్ని పూర్తిగా అనువదించని స్థితిలో ఉన్నాయి, ఒక్కో వ్యాసానికి ఒకటికి మించి మూలాలే లేవంటే ఆశ్చర్యకరమైన విషయమే.
ఈ వ్యాసాలను గుర్తించే విషయంలో జరిగిన కృషి పరిశీలిస్తే ఆదిశంకరాచార్యుడు వ్యాసం చర్చలో ఈ మేరకు కొంత కృషి జరిగింది. అత్యంత ముఖ్యమైన విషయాలకు సంబంధించి కూడా కనీసం వ్యాసాలు తయారైలేని ఆ దశలో వారు చాలా చక్కని కృషి చేసినట్లే. పైగా ఆ వ్యాసం అత్యుత్తమ నాణ్యతతో లేదని వారు గుర్తించి విశేష వ్యాసంగా ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఇటీవలి కృషి విషయానికి వస్తే అహ్మద్ నిసార్ గారు చొరవతీసుకుని 2014లో కొన్ని వ్యాసాలను విశేష వ్యాసాలుగా గుర్తించారు. కానీ ఈ ఎంపిక ప్రక్రియ ప్రామాణికమైనది కాదు. ఆయన కొన్ని వ్యాసాలను జాబితా వేసి వాటిని గురించి ఓటింగ్‌కు వెళ్ళారు. కానీ జరగవలసినది ఏమిటంటే ఎవరైనా ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రతిపాదించడమూ, అవగాహన కలిగిన సహసభ్యుడు సోదర సమీక్ష(పీర్ రివ్యూ) విధానంలో రివ్యూ చేయడమూ, ఆపైన ప్రతిపాదన ముందుకుతీసుకువెళ్ళి అది విశిష్టమైనదేనని నిర్ధారితమైతే విశేషవ్యాసంగా చేయడమూను. అంతే తప్ప ఓటింగ్ విధానంలో చేయడం సరికాదు.
ప్రస్తుతం తెవికీ నాణ్యత విషయంలో పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. తెవికీ శైశవదశ నుంచి కొంత యుక్తవయసుకు వచ్చినట్టే భావిస్తున్నారు చాలామంది వికీపీడియన్లు. వికీపీడియాలోని ప్రస్తుతం ఉన్న విశేష వ్యాసాలను పునస్సమీక్షించుకుని, ఒకవేళ ఎవరైనా ముందుకువస్తే వాటిని ప్రస్తుతం ఏర్పరుచుకునే ప్రమాణాల స్థాయికి తీసుకువెళ్ళి వాటి స్థానాన్ని నిలబెట్టడమో, లేక ఎవరూ అభివృద్ధి చేయలేనప్పుడు వాటికి నిజంగా ఉన్న స్థాయికి (మంచి అయ్యే వ్యాసంగా రేట్ చేయవచ్చు) దించివేయడమో చేయాలి. ఆపైన ప్రస్తుతం ఉన్నవ్యాసాల్లో ఉత్తమమైన వ్యాసాలను ప్రతిపాదించి వాటిని పైన సూచించిన పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయాలి. దీనిపై సహ వికీపీడియన్లను వ్యాఖ్యానించమని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:47, 24 ఏప్రిల్ 2015 (UTC)
- @పవన్ సంతోష్ , చక్కని ప్రతిపాదన. ప్రస్తుతం విశేష వ్యాసాలుగా ఉన్నవాటన్నిటినీ ఆ స్థాయి నుండి తీసెయ్యాలి. ప్రారంభంలో మొదటి పేజీలో ప్రదర్శించిన వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించాము. ఆ తర్వాత ఆ రెంటినీ విడదీయటం జరిగింది. ఇప్పుడు విశేష వ్యాసాలతో సంబంధం లేకుండా మొదటి పేజీలో ప్రదర్శించే వ్యాసాలు అన్న ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రమాణాలు తయారుచేసుకొని నిజమైన విశేషవ్యాసాలు తయారు చేయటం ప్రారంభించాలి. --వైజాసత్య (చర్చ) 11:41, 26 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. పక్కన చూస్తే మాజీ విశేష వ్యాసం చిహ్నం కనిపిస్తుంది. ఒకప్పుడు విశేష వ్యాసాలుగా గుర్తించినవాటిని వికీపీడియా అనేది నిరంతర ప్రవాహం కనుక కొత్త సమాచారం చేరినాకా దాని నిర్మాణరీతి మారినా, లేదా ఒకప్పుడు చేసిన రివ్యూ సరిగా లేకున్నా ఎవరో ఒకరు పున:ప్రతిపాదన చేసి వాటిని ఆ స్థానం నుంచి తొలగించి మాజీ విశేషవ్యాసంగా చేయడం ఆంగ్లవికీలో జరుగుతోంది. ఉదాహరణ కోసం ఇంట్రడక్షన్ టు ఎవల్యూషన్ ఆ స్థాయిని ఎలా కోల్పోయిందో ఇక్కడ చూడవచ్చు. అలా చేసేందుకు ప్రాసెస్ ప్రారంభించి, మరోచేత్తో నిజంగా మంచి నాణ్యత ఉన్న వ్యాసాలను ప్రతిపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభిద్దాం. దీనికి వైజాసత్యగారూ, నేనూ ఎలానూ ముందుకువచ్చాం కనుక రాజశేఖర్ గారూ, చంద్రకాంతరావు గారూ, అర్జున గారూ, టి.సుజాత గారూ, భాస్కరనాయుడు గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ, కె.వెంకటరమణ గారూ, స్వరలాసిక గారూ ఇంకా నేను ప్రస్తావించడం మరిచిపోయిన ఇతర ముఖ్యులు వచ్చి ప్రతిపాదనల్లోనో, సోదరసమీక్షలోనో, లేక సమీక్షలోనో, పున:సమీక్షలోనో తమ కొద్ది సమయాన్ని వెచ్చించమని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 12:47, 26 ఏప్రిల్ 2015 (UTC)
- నాకు ఇందులో భాగం పంచుకోవాలని ఉన్నది. సమయాన్ని బట్టి నా సహాయాన్ని అందిస్తాను. ఆలోచక బాగుంది. ఇలాంటివారి కృషితో కొన్నయినా తెలుగు వికీపీడియాలో విశేషవ్యాసాలు తయారౌతాయని కాంక్షిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 16:42, 26 ఏప్రిల్ 2015 (UTC)
- చాలా మంచి ప్రయత్నం. కొత్త వ్యాసాలకు అవకాశం కూడా కలుగుతుంది. తప్పకుండా నా వంతు సలహ, సహాయమందించ గలను. JVRKPRASAD (చర్చ) 16:54, 26 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారికి. మంచి ఆలోచన. అయితే తెవికీ ప్రస్తుత పరిస్థితిలో సాధ్యాసాధ్యాలను గురించి నా అభిప్రాయాన్ని తెలియచేస్తాను. ఇది చాలా పెద్దకృషి జరగవలసిన ప్రాజెక్టు. ఇప్పటికే నడుస్తున్న మరియు ప్రతిపాదించిన ప్రాజెక్టులను చూస్తే, ఇది విజయవంతం మవటానికి, ఇద్దరో, ముగ్గురో పనిచేస్తే సరిపోదు.నాణ్యతపై అవగాహన, ధ్యాస వున్న చాలా సభ్యులు సహకరించాలి.చాలామందికి ఆసక్తిగల వ్యాసాలు ఎంపిక చేయాలి. వీటికి వికీట్రెండ్స్ గణాంకాలు ఉపయోగపడవచ్చు. ప్రస్తుత విశేష వ్యాస మూసని ప్రదర్శిత వ్యాసం గా మార్చి, వ్యాసాల అభివృద్ధి క్రమంలో వ్యాస నాణ్యతపై ప్రత్యేక ధ్యాసపెట్టాలి. ఇక సాధ్యమైనంతవరకు శాశ్వత/వెబ్ మూలాలు వాడే వారు ఎక్కువకావాలి.గతంలో చేసిన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ మలి విడత ప్రారంభించి, సోదర సమీక్ష అవసరమయ్యే కనీసస్థాయి మంచి వ్యాసం లక్ష్యంగా ఒక మూడు నెలలు కృషి చేసి ఆ తరువాత విడతలో కొన్నిటిని విశేష స్థాయి కి చేర్చడానికి కృషి చేయడం మంచి ఫలితాలనివ్వవచ్చు.మీరు డిఎల్ఐ ప్రాజెక్టు ని చక్కగా నిర్వహించారు కాబట్టి, మీ రు దీనికి నాయకత్వం సమన్వయత్వం సరిగా చేయగలుగుతారు.నాకు వీలునిబట్టి నేను సహకరిస్తాను--అర్జున (చర్చ) 04:11, 27 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ఇప్పటికే ఉన్న విశేష వ్యాసాల జాబితా ఇవ్వగలరా..--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:04, 29 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. పక్కన చూస్తే మాజీ విశేష వ్యాసం చిహ్నం కనిపిస్తుంది. ఒకప్పుడు విశేష వ్యాసాలుగా గుర్తించినవాటిని వికీపీడియా అనేది నిరంతర ప్రవాహం కనుక కొత్త సమాచారం చేరినాకా దాని నిర్మాణరీతి మారినా, లేదా ఒకప్పుడు చేసిన రివ్యూ సరిగా లేకున్నా ఎవరో ఒకరు పున:ప్రతిపాదన చేసి వాటిని ఆ స్థానం నుంచి తొలగించి మాజీ విశేషవ్యాసంగా చేయడం ఆంగ్లవికీలో జరుగుతోంది. ఉదాహరణ కోసం ఇంట్రడక్షన్ టు ఎవల్యూషన్ ఆ స్థాయిని ఎలా కోల్పోయిందో ఇక్కడ చూడవచ్చు. అలా చేసేందుకు ప్రాసెస్ ప్రారంభించి, మరోచేత్తో నిజంగా మంచి నాణ్యత ఉన్న వ్యాసాలను ప్రతిపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభిద్దాం. దీనికి వైజాసత్యగారూ, నేనూ ఎలానూ ముందుకువచ్చాం కనుక రాజశేఖర్ గారూ, చంద్రకాంతరావు గారూ, అర్జున గారూ, టి.సుజాత గారూ, భాస్కరనాయుడు గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ, కె.వెంకటరమణ గారూ, స్వరలాసిక గారూ ఇంకా నేను ప్రస్తావించడం మరిచిపోయిన ఇతర ముఖ్యులు వచ్చి ప్రతిపాదనల్లోనో, సోదరసమీక్షలోనో, లేక సమీక్షలోనో, పున:సమీక్షలోనో తమ కొద్ది సమయాన్ని వెచ్చించమని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 12:47, 26 ఏప్రిల్ 2015 (UTC)
- రాజశేఖర్ గారూ, ప్రసాద్ గారూ ధన్యవాదాలు, మీ సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకుంటాను. అర్జున గారూ ధన్యవాదాలు, మీ సూచనలు బావున్నాయి. మూలాల వాడకాన్ని, నాణ్యతనీ పెంచుతూ వ్యాసాలను అభివృద్ధి చేద్దాం. మీరన్నట్టుగా విశేష వ్యాసం అన్నది చాలా పెద్ద విషయం, కనుక ప్రస్తుతానికి మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో విశేషవ్యాసాలు తయారుచేద్దాం. ఈ కృషిని ప్రాజెక్టు రూపంలో సమన్వయం చేయమన్న మీ సలహా కూడా చాలా బావుంది. నాణ్యతాభివృద్ధి అన్న పేరు కూడా తగినదే. నాణ్యతాభివృద్ధిలో మీరు వేసిన అడుగు మొదటిది అనుకుంటే ఈ రెండో అడుగుకు పేరు నాణ్యతాభివృద్ధి 2 అని వుండవచ్చు. కానీ మొదటి దశలో వికీట్రెండ్స్ పై మొత్తం దృష్టిని కేంద్రీకరించాము. ఇప్పుడు కూడా వికీట్రెండ్స్ లో మొదటి పదిస్థానాల్లో ఉన్న వ్యాసాలను స్వీకరించవచ్చు. కానీ కేవలం అది మాత్రమే ప్రాతిపదికగా పెట్టుకోకుండా, కొంత విస్తరించే ఆలోచన ఉంది కనుక వికీప్రాజెక్టు-నాణ్యతాభివృద్ధి మంచివ్యాసాలు-2 అన్న పేరుతో చేయవచ్చు. అంటే సీరీస్ పేరు నాణ్యతాభివృద్ధి, ఈ దఫా పేరు మంచివ్యాసాలు, సంఖ్య 2 అన్నమాట. ఇదెలా వుందో పరిశీలించండి. సుల్తాన్ ఖాదర్ గారూ ఇక్కడ చూడండి, ఇది ఆ వ్యాసాలను వర్గీకరించిన వర్గం లింకు. వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 11:44, 29 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు ఇచ్చిన లింకు పనిచేయడం లేదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:38, 29 ఏప్రిల్ 2015 (UTC)
- విశేషవ్యాసాలపై దృష్టిసారించడం చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. విజ్ఞానసర్వస్వంలోని వ్యాసాలు ఒక ఎత్తయితే విశేషవ్యాసాలు మరోఎత్తు. అయితే విశేషవ్యాసం తయారుచేయడం అనేది ఆషామాషీ పని కాదు. విజ్ఞానపరంగా చూసిననూ, తెవికీ నియమాల పరంగా చూసిననూ ఇలాంటి వ్యాసాలకు ఏ లోటు ఉండరాదు. రోం నగరాన్ని ఒక్కరోజులో నిర్మించలేరన్నట్లు విశేష వ్యాసాన్నీ ఒక్కరోజులో రూపుదిద్దలేము. కొత్తవ్యాసాలనే కాకుండా ఉన్న వ్యాసాలను కొన్నింటిని ప్రాధాన్యత ప్రకారం ఎంపిక చేసుకొని క్రమక్రమంగా మెరుగులు దిద్దుతూ, నాణ్యతను మరియు పరిమాణాన్ని పెంచుకుంటూ విశేషవ్యాసంగా చేయడం కొంత కష్టమైన పనే కాని అసాధ్యమైన పని మాత్రం కాదు. వాక్యనిర్మాణం, భాషా, శైలి, తాజాకరణలతో పాటు మెరుగైన బొమ్మలు, మూలాలు లాంటి విషయాలలో కూడా చాలా ఆచీచూచి నిర్ణయం తీసుకోవాలి. కాపీహక్కులు కల బొమ్మలు వాడకుండా, కాపీ సమాచారం చేర్చకుండా, ప్రామాణిక గ్రంథాలనే (వీలైతే తెలుగు గ్రంథాలనే) ఉపయోగిస్తూ వ్యాసాన్ని పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఇదివరకు నేను ఇలా సాధ్యమైనంతవరకు విశేషవ్యాసాలను తయారుచేయాలని సంకల్పించిననూ తర్వాత తెవికీలో జరిగిన పరిణామాలు నా ప్రణాళికకు అడ్డుకట్టవేశాయి. ఇప్పటికైనా మించిపోయేదేమీ లేదు, ముందుగా తెవికీని ఊబిలోంచి బయటకు తీసి, చక్కదిద్ది, సంస్కరించి, తెవికీ గాయాలకు మందుపూసి, మళ్ళీ తెవికీని పరుగులందుకునేట్టు చేయగలిగితే విశేషవ్యాసాలు వృద్ధిచెందడానికి అవకాశం తప్పకుండా ఉంది. అలాగే మాజీ విశేషవ్యాసం చిహ్నం అవసరం లేదనుకుంటాను. ఇదివరకు కొందరు సభ్యులు తమకు ఇష్టమైన కొన్ని వ్యాసాలను ఏకపక్షంగా విశేషవ్యాసం వర్గంలో చేర్చారు కాని వాటికి చర్చల ద్వారా ఆ స్థాయికి చేర్చలేరు. అసలు ఆ వర్గంలో లేని చాలా వ్యాసాలు వీటి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:11, 29 ఏప్రిల్ 2015 (UTC)
- పవన్ సంతోష్ గారికి, ప్రాజెక్టు పేరు క్లుప్తంగా మరియు లక్ష్యాన్ని, ప్రధాన పరిమితిని సూచించేదిగా వుంటే బాగుంటుంది. పరిమితులో కొద్ది మార్పులున్నందున ప్రాజెక్టు పేరు మార్చవలసినపనిలేదు. ఇప్పటికే వున్న ప్రాజెక్టుపేరుకి సంఖ్య ఉపసర్గ(Suffix) చేసి వాడుకుంటే నిర్వహణ కొంత సులువవుతుంది. మూసలు తయారీ చేసేపని వుండదు. కొత్త గణాంకాల స్క్రిప్టులు రాయవలసినపనివుండదు . నాణ్యత పెంచడం ఏ ప్రాజెక్టులో నైనా చేయవచ్చు.వికీట్రెండ్స్ అనేది మన వికీసభ్యుల పరిమాణం తక్కువ కావున ఎక్కువమంది చేరడానికి ఎప్పటికప్పుడు తాజా అయ్యే గణాంకాల ద్వారా అవకాశం ప్రోత్సాహాన్ని కల్పించే ఏకైక అవకాశం మాత్రమే .--అర్జున (చర్చ) 05:13, 30 ఏప్రిల్ 2015 (UTC)
- @సుల్తాన్ ఖాదర్ ఇదిగోండి లింకు వర్గం:విశేషవ్యాసాలు
- వాసికావాలంటే మొదట రాశి కావాలి ఉన్న ఉద్దేశంతో, వికీపీడియా:1000 విశేష వ్యాసాల ప్రగతి ప్రారంభించబడింది. వెయ్యి విశేష వ్యాసాలు కావాలంటే కనీసం మొదట పదివేల బైట్లకు పైబడిన పేజీలు కావాలన్నది అప్పటి ఆలోచన. గూగుల్ అనువాద వ్యాసాలతో పదివేల బైట్లకు పైగా ఉన్నా వ్యాసాలు చాలానే వచ్చిపడ్డాయి. అయితే చాలామటుకు గూగుల్ అనువాద వ్యాసాలు ఆంగ్ల పాఠకులకు ఆసక్తి కలిగించే విషయాలపై ఉన్నాయి. అప్పట్లో ఆంగ్ల వికీ వాళ్ళు ప్రతి వికీపీడియాలో ఉండవలసిన వెయ్యి వ్యాసాలు అనే జాబితా (వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు తయారు చేశారు. దాన్ని అనుసరించి కొన్నాళ్ళు వివిధ వ్యాసాలు ప్రారంభించాం. కానీ కాసుబాబు గారు అది స్థానిక ప్రాధమ్యాలకు తగినట్టులేదు అని ఆయనే స్వయంగా ఈ జాబితా కూర్చారు. (వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు). వీటితో పాటు అర్జున గారన్నట్టు వికీట్రెండ్సును పరిగణనలోకి తీసుకొని తెలుగు సంస్కృతి, ప్రాధమ్యాలకు తగ్గట్టు కొన్ని వ్యాసాలు ఎంపికచేసుకొని కృషిచెయ్యాలి --వైజాసత్య (చర్చ) 06:13, 30 ఏప్రిల్ 2015 (UTC)
తెవికీ సభ్యుని అకాల మరణం
[మార్చు]నాటకరంగ ప్రముఖుడు పందిళ్ళ శేఖర్‌బాబు మన తెలుగు వికీపీడియా సభ్యుడు కూడా. ఇతడు నాటకరంగానికి చెందిన కొన్ని వ్యాసాలను మనకు అందించాడు. కొన్ని నెలవారీ సమావేశాలకు హైదరాబాదులో హాజరయ్యాడు. ఇతడు 24 తేదీన అకాలంలోనే పరమపదించినట్లు తెలిసింది. అందుకు మనమందరం సంతాపం తెలియజేయడం బాధ్యతగా భావించాలి.--Rajasekhar1961 (చర్చ) 16:40, 26 ఏప్రిల్ 2015 (UTC)
- వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు ఈ కష్టం నుండి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని అర్ధిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 16:46, 26 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానుPalagiri (చర్చ) 03:08, 27 ఏప్రిల్ 2015 (UTC)
- Rajasekhar1961 గారి సందేశానికి ధన్యవాదాలు. సంతాప సందేశాలు,వాడుకరి చర్చాపేజీలో చేర్చవలసినదిగా కోరడమైనది. ఇప్పడికే ఇక్కడ చేర్చిన సందేశాలను అక్కడ నకలు చేస్తాను.--అర్జున (చర్చ) 03:27, 27 ఏప్రిల్ 2015 (UTC)
- నాప్రగాడసంతాపాన్ని వ్యక్తంచేస్తున్నాను.----గుళ్ళపల్లి 04:19, 27 ఏప్రిల్ 2015 (UTC)
- పందిళ్ళ శేఖర్ బాబు అకాల మరణానికి నా ప్రఘాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయనను గురించి తెలియజేసి బాధ్యత గుర్తుచేసినందుకు రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 08:15, 27 ఏప్రిల్ 2015 (UTC)
- శేఖర్ బాబు అకాల మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 01:26, 28 ఏప్రిల్ 2015 (UTC)
- శేఖర్ బాబు అకాల మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని అసిస్తున్నాను. భాస్కరనాయుడు (చర్చ) 11:02, 28 ఏప్రిల్ 2015 (UTC)