వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 7 | పాత చర్చ 8 | పాత చర్చ 9

alt text=2008 డిసెంబరు 22 - 2009 జనవరి 6 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2008 డిసెంబరు 22 - 2009 జనవరి 6

ఇది పాత చర్చలను భద్రపరచిన పేజీ. దయచేసి దీనిని మార్చవద్దు. మీరు ఏమైనా చర్చించాలంటే ఇక్కడ వ్రాయండి.

మొలకలకు మరొక కారణం

[మార్చు]

ఒక సభ్యుడు ఒక వ్యాసం వ్రాసిన తరువాత మరొకరు ఆ వ్యాసాన్ని సరిదిద్దటం సామాన్యం. నేను గమనించినది ఏమంటే, ఆ విధంగా సరిదిద్దేటప్పుడు, కొంతమంది అయిన దానికి కాని దానికి కొన్ని కొన్ని పదాలకు బ్రాకేట్లు తగిలిస్తున్నారు.వాటివల్ల ఆ పదాలు ఎర్రగా కనపడతాయి వ్యాసంలో. మరొక సభ్యుడు ఆ వ్యాసం చదివేటప్పుడు, ఈ ఎర్ర పదాలన్నీ బాగా కనిపిస్తుంటాయి, కొత్త సభ్యులకు టెంప్టింగా ఉంటాయి. ఎవరైనా ఆ ఎర్రపదాలను నొక్కగానే ఒక ఖాళీ పేజీలోకి వెల్తాము. ఎలాగో ఇక్కడకు వచ్చాం కదా అని ఒక వాక్యమో అర వాక్యమో వ్రాయటం, మరొక మొలక జననం!! నేను జయదేవ్ (కార్టూనిస్ట్) గురించి వ్యాసం వ్రాసినప్పుడు, మూలాలలో జయదేవ్ కార్టూన్ల సంపుటి ఉదహరించాను. ఆ తరువాత దిద్దినవారు (పేరు చూడలేదు)జయదేవ్ కార్టూన్లు కు బ్రాకెట్లు తగిలించి ఆ పదాలను ఎర్రగా చేశారు(అంటే మొలకకు మొదటి దశ). అలా దిద్దిన వారి ఉద్దేశ్యం ఏమిటి? జయదేవ్ మీద ఒక వ్యాసం, జయదేవ్ కార్టూన్ల మీద మరొక వ్యాసం వ్రాద్దామనా? అలా వ్రాయటం అవసరమా. ఆయన కార్టూన్ల గురించి ఆయన మీద వ్యాసంలోనే వ్రాయచ్చు గదా! అలాగే, స్టేట్ బాంకు వ్యాసంలో, ఆ బాంకు ప్రస్తుతపు ఛైర్మన్ ఓ పి భట్ పేరును బ్రాకెట్లలో ఇరికించారు. ఆయన మీద ఒక వ్యాసం ఇప్పటికే ఉంటే, అలా బ్రాకెట్లు పెట్టి లింక్ చెయ్యచ్చు. ఇంకా వ్రాయని, వ్రాయబడతాయో లేదొ, వ్రాయటం అవసరమో లేదో కూడ చూడకుండా, ఇలా బ్రాకెట్లు పెట్టుకుంటూ పోతే, మొలకలు పెరుగుతూనే ఉంటాయి. నా సూచన ఏమంటే, ఇప్పటికే ఒక వ్యాసం ఉంటే తప్ప, పదాలకు మరొక వ్యాసం నుంచి లింక్ లు ఇవ్వటం మానేయ్యాలి, అలా లింకులు ఇచ్చేటప్పుడు సందర్భం కూడా చూడాలి. ఉదాహరణకి, బారతదేశంలో బాంకులు అన్న వ్యాక్యాలు వ్యాసంలో ఉన్నప్పుడు బారతదేశం కు బ్రాకెట్ తగిలించాల్సిన పని లేదు. ఇంకేదయినా వ్యాసంలో భారతదేశం పదం ఒక దేశాన్ని సూచించినప్పుడు, బ్రాకెట్ పెట్టి లింక్ ఇవ్వచ్చు. దయచేసి సభ్యులు స్పందించి, వ్యాస దిద్దుబాటుకు కొన్ని మార్గదర్శకాలు ఏర్పడటానికి తోడ్పడాలని నా విన్నపం.--SIVA 05:15, 22 డిసెంబర్ 2008 (UTC)

మంచి observation శివ గారూ! కొంతవరకు ఇది కూడా కారణమని నేను కూడా ఒప్పుకుంటాను. నా అభిప్రాయం కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని పదాలకు లింకులు అవసరం లేదనే. మీకు అలా అనిపిస్తే అలాంటి సాధారణ పదాలకు లింకులన్నీ తీసివేయండి. ఆ సభ్యుడు అభ్యంతరపెడితే చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఆ లింకుకు సంబంధించిన వ్యాసాన్ని కొంత సమయం తీసుకుని సదరు సభ్యుడు విస్తరించేటట్లయితే(మొలక స్థాయిని దాటిన వ్యాసంగా) కనుక సమస్య లేదు. లేకపోతే మీరే సరిదిద్దండి. రవిచంద్ర(చర్చ) 05:38, 22 డిసెంబర్ 2008 (UTC)
దిద్దుబాటులో ఇలా అనవసరపు లింక్లు ఏర్పాటు జరుగకుండా, ఎవరయినా వ్యసంలో పదాలకు బ్రాకెట్లు పెట్టి ఆ దిద్దుబాటును భధ్రపరచే సమయంలో, ఒక హెచ్చరిక లెదా విన్నపం మీరు లింకులు ఏర్పరుస్తునారు, ఈ పేరుతో ఇప్పటికే వ్యాసం ఉన్నదా లేక మీరు కొత్త వ్యాసం సాధ్యమయినంత సమగ్ర సమాచారంతో వ్రాయబోతునారా? ఈ రెండూ కాకపోతే మీరు తగించదలుచుకున్న లింకులు తొలగిస్తే బాగుంటుంది అని వచ్చే ఏర్పాటు చెయ్యగలమా. అలాగనుక చెయ్యగలిగితే కొంత positive restraint గా ఉంటుంది. పరిశీలించగలరు.--SIVA 05:47, 22 డిసెంబర్ 2008 (UTC)


శివాగారు చేస్తున్నవారిలో నేనొకన్ని. ఇకనుంచి పేజీలు లేనివాటికి లింకులివ్వను.ఇది మొలకలను తగ్గించగలిగితే చాలా మంచి జరిగినట్లే.Rajasekhar1961 05:55, 22 డిసెంబర్ 2008 (UTC)


ఎర్ర లింకులు పెట్టడానికి వెనుక ఉన్న ఉద్దేశం అదే గదా! సభ్యులను వీలయినంత టెంప్ట్ చేయాలనే. మరియు ముందు ముందు అలాంటి వ్యాసాలు వచ్చినపుడు లింకులు ఆటోమాటిక్‌గా నీలం రంగులోకి మారుతాయిలే అని. ఒకప్పుడు మూడు, స్తంభం, చీపురు, హుండీ, తెలుగు సినిమా మైలురాళ్ళు లాంటి వ్యాసాలకు తెలుగు వికీ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు ఆ దశను అధిగమించాము అనుకొంటాను. మరి కొంత కాలానికి "నన్నయ ప్రసన్నకధా కలితార్ధయుక్తి" (విశ్వనాధ గారు పుస్తకమే వ్రాశారు), "తెలుగు సినిమాలలో హాస్యం, అపహాస్యం", "చలం రచనలలో స్త్రీ పాత్ర", "ఎన్నికలలో కార్టూనుల వినియోగం", "గల్ఫ్ దేశాలలో తెలుగువారి ఇక్కట్లు", "పరిశ్రమలలో భద్రతా వ్యవస్థ" లాటి పూర్తి స్థాయి వ్యాసాలు రావచ్చును అని ఆశిస్తాను. ఒకప్పుడు నేను పక్కాగా శివా గారు చెప్పిన విధానమే (ఎర్ర లింకులు చాలా పొదుపుగా ఉంచడం) అవలంబించాను కాని ఇప్పుడు కొంత మారాను. ఎటొచ్చీ ప్రస్తుతం మొలకల శాతం మరీ అధికంగా ఉన్నది గనుక మనం ఈ విచికిత్సలో చిక్కుకున్నాము. క్రమంగా ఈ సమస్యను అధిగమిస్తామని భావిస్తాను. - చివరిగా చెప్పేదేమంటే

  • విషయ ప్రాముఖ్యత లేని విషయాలకు, వ్యాసం తయారయ్యే అవకాశం ఎక్కువగ లేని విషయాలకు ఎర్ర లింకులు కూడదు. ఇది నిస్సందేహమైన విషయం. ఇది కనుక ఇతరులు వ్రాసిన లింకులు తొలగించడానికి వెనుకాడవద్దు. అభ్యంతరాలు కూడా పెద్దగా రావని భావిస్తున్నాను.
  • positive restraintను ప్రోగ్రాములో పెట్టడం కష్టం. ఎందుకంటే ఇలాంటి చాలా సూచనలు ఉంటాయి. ఇది అంత టాప్ ప్రయారిటీ కాదు.
  • ఎర్రలింకులు పెట్టడంలో "మధ్యస్త ధోరణి" మంచిది. ప్రతీ మాటకూ తగదు. అలాగని ఎర్రలింకులను నిరుత్సాహ పరచవద్దు. వ్యాసం తయారయ్యే అంచనాను బట్టి ఉంచాలి. ఇది రచయిత అభిప్రాయంపైన, పరిశీలకుని అభిప్రాయం పైన ఆధారపడుతుంది.
  • మొలకలు ఉండడం మరీ అంత అవాంఛనీయం కాదు. ప్రస్తుతం మొలకలు అత్యధిక శాతం కావడమే మన సమస్య.
  • మార్గదర్శకాలు ఉంటే బాగానే ఉంటుంది. ఇంకా ఇలాంటి అనేక విషయాలు పెండింగులో ఉన్నాయి. ప్రస్తుతం సభ్యుల పరిస్థితినిబట్టి అవి సిద్ధమవ్వడానికి చాలా కాలం పడుతుందనిపిస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:56, 22 డిసెంబర్ 2008 (UTC)
తెవికీలో మార్గదర్శకాలన్నీ ఇంగితం ఉపయోగించమని చెప్పేచే. ఈ ఎర్రలింకుల విషయంలో కూడా మార్గదర్శకం ఎక్కడో ఉండాలి. సూక్ష్మంగా అది చెప్పేదేమిటంటే. ఒక వ్యాసాన్ని చదువుతున్నప్పుడు మీకు ఏ పదమ్మీదైతే "అబ్బా ఇక్కడ లింకుంటే బావున్ను దీన్ని నొక్కి మరింత సమాచారం తెలుసుకునేవాన్ని" అని అనిపించిన పదాలకు లింకులు తగిలించాలని --వైజాసత్య 14:34, 22 డిసెంబర్ 2008 (UTC)
ఇదిగో ఆ లింకు వికీపీడియా:పాఠం_(వికీపీడియా_లింకులు) --వైజాసత్య 14:38, 22 డిసెంబర్ 2008 (UTC)
నిజం!నిజం! సత్యా గారూ. ఇక్కడ లింక్ ఉంటే బాగుండును మరి కొంత సమాచారం తెలుసుకోవటానికి అనిపిస్తే, ఎర్ర లింక్ పనికిరాదు నీలి లింక్ కావాలి. అంటే ఇప్పటికే వ్యాసం ఉన్న పదానికి లింక్. వికీ లో లింక్ ల గురించిన మార్గదర్శక సూత్రం ఉన్న విషయాన్ని కనిపెట్టి ఇక్కడకు నీలి లింక్ ఇవ్వటం ఎంతయినా ముదావహం. కృతజ్ఞతలు.--SIVA 02:03, 24 డిసెంబర్ 2008 (UTC)
  • ఎర్రలింకులు ఏర్పడటానికి మరొక ముఖ్య కారణం పదకూర్పు (SPELLINGకు సరైన తెలుగు పదమేనా?)లో తేడాలు. ఇప్పటికే ఆ పదం మీద వ్యాసం ఉన్నప్పటికి, లింక్ చేయబడుతున్న చోట ఆ పద పదకూర్పు అసలు వ్యాసంతో సరిపోకపోతే ఎర్ర లింక్ ఏర్పడుతుంది. ఈ విధమయిన అసహజ ఎర్ర లింక్ అదే పదంమీద మరొక వ్యాసానికి కారణం అవుతున్నది. ఒకే పదంమీద రెండు వ్యాసాలు, కొన్ని రోజుల తరువాత తెలుసుకోవటం, "తరలింపు" "దారిమళ్ళింపు" "అయోమయ నివారణ" చేయవలసి రావటం జరుగుతున్నది. కాబట్టి ఒక లింక్ ఏర్పరుస్తున్నప్పుడు, అదే పదం మీద వ్యాసం ఇప్పటికే ఉన్నదా? ఉంటే, ఆ పదకూర్పు ప్రకారమే ఈ లింక్ ఏర్పరుద్దామనుకునే పదాన్ని వ్రాయటం అనే జాగ్రత్త మరియు బాధ్యత, అటువంటి కొత్త లింక్ ఏర్పరుస్తున్న సభ్యునిది అని నా విన్నపం.--SIVA 03:43, 24 డిసెంబర్ 2008 (UTC)
అలా ఒక వ్యాసం వ్రాసేముందు నామాంతరంతో ఏవైనా వ్యాసాలున్నాయో ఒక సారి చూడమని తెవికీలో ఒక సూచన ఇప్పటికే ఉంది. అయోమయ నివృత్తి పేజీలు, దారిమార్పులు నివారించలేనివి, అనివార్యం కూడానూ. మనం వ్రాసేవాళ్ల సౌలభ్యం, నిర్వహణా సౌలభ్యమే కాకుండా అసలు సమాచారం వెతికే వాళ్ళ దృష్టినుండి కూడా ఆలోచించాలి. ఇంతపెద్ద సమాచారాన్ని పోగుచేసి అందులో కావలసినది వెతుక్కోలేకపోతే, ఎవరూ ఉపయోగించుకోకపోతే శ్రమ దండగన్నట్టే. అందుకే ఈ పేరు ఇంకా ఎన్ని విధాలుగా సమాచారాన్ని వెతికే వాళ్లు వెతికే అవకాశముందని ఒక ప్రశ్న వేసుకొని దారిమార్పు పేజీలో సృష్టిస్తూ ఉండాలి. అందుకే వ్యాసాల పేర్లకు ఒక పద్ధతి పాటించినా వీలైనంత సహజంగా ఉండాలి. ఉదాహరణకు పూతరేకుల గురించి ఏవరైనా సమాచారం వెతుకుతున్నారనుకోండి పూతరేకులు అనో పూతరేకు అనో వెతుకుతారు. ఆంధ్రుల పిండివంటలు - ప అని వెతకరు. కాబట్టి మన సౌలభ్యానికి, పాఠకుల సౌలభ్యానికి కాస్త సమతూకంగా వ్యవహరించాలి. --వైజాసత్య 21:41, 24 డిసెంబర్ 2008 (UTC)

మొలకల నివారణ-తగ్గింపుకు కొన్ని సలహాలు, సూచనలు

[మార్చు]
  • ఎర్ర లింక్ లు తగ్గించటం ఒక కనబడని నివారణ ఛర్య. సభ్యులు ఎంత టెంప్ట్ అయ్యి ఎర్రలింక్ పట్టుకుని వ్యాసం మొఅదలు పెట్టినా, ఆ సభ్యుడిదగ్గర ఆ వ్యాసం వ్రాయటానికి కనీసం ఒక 5-10 శాతమైనా సమాచారం లేకపోతే వ్యాసం మొలక కూడ తయారు కాదు. ఒక వ్యాసాన్ని మొలకగా కూడ పిలవటానికి కూడ ఒక కొలమానం ఉండాలి(ఉట్టి పదాల లెక్క కాకుండా).
  • సామెతల పేర్లమీద ఉన్న వ్యాస పేజీలన్ని కలిపి అక్షర క్రమపరంగా కొన్ని పెజీలు ఏర్పరిచి మంచి పని చేశారు.
  • అదేవిధంగా, గ్రామాల పేర్ల మీద ఉన్న ప్రత్యేక పేజీలను కూడ, జిల్లాలవారిగా పేజీలను ఏర్పరిచి, ఆ జిల్లా పేరుగల పేజీలో, ఆ జిల్లాలోని గ్రామాల పేర్లన్ని వ్రాస్తే బాగుంటుంది. ఇప్పటికే పూర్తి పరిధిలో వ్యాసాలు వ్రాయబడ్డ గ్రామాల గురించిన వ్యాసాలు మినహాయించి, వాటికి తత్సంభందిత జిల్లా పుటనుండి లింక్ ఏర్పరిస్తే సరి పోతుంది. సభ్యులెవరైనా ఏదైనా గ్రామం గురించి వ్రాయలనుకున్నప్పుడు, ఆ జిల్లాలోని గ్రామ సబ్ హెడ్డింగ్ కింద వ్రాయటం మొదలు పెట్టవచ్చు.అలా మొదలు పెట్టబడిన వ్యాసం పూర్తి పరిధికి వచ్చినప్పుడు, ప్రత్యేక వ్యాసంగా విడి పుటలో ఉంచి, జిల్లా పుటనుండి లింక్ ఇవ్వచ్చు. జిల్లాలవారిగా గ్రామాల పుటలు తయారు చేస్తే నిడివి పెరుగుతుందనుకుంటే, మండలాల వారిగా అటువంటి పుటలను తయారు చెయ్యాచ్చు.
  • ఇలాగే సినిమాల గురించి: ప్రతి సినిమాకు ఒక పుట ప్రస్తుతానికి అవసరమా! ఎప్పటికి పూర్తి కాను ఆ పేజీలన్నీ. కాలక్రమేణా, ఆ సినిమాలు, నటుల గురించి తెలిసినవారుండరు. ఎవరు వ్రాస్తారు పాత సినిమాల గురించిన వ్యాసాలు. ప్రముఖ వ్యాసకర్త, నటుడు అయిన రావి కొండలరావు గారిని ప్రార్ధించాలి, అయా పాత సినిమాలగురించి వ్యాసాలు వ్రాయమని. అందుకని. సంవత్సరాలవారిగా సినీ పుటలు ఏర్పరిచి, ఆ యా సంవత్సరాలలో విడుదలయిన చిత్రాలను ఆ యా పుటలలో వ్రాసి ఉంచాలి. పూర్తి స్థాయి సినిమా గురించిన వ్యాసాలు విడిగా ఉంచి, ఈ సంవత్సర పుట నుండి లింక్ ఇవ్వచ్చు. మిగిలిన పద్దతి గ్రామాలకు ప్రతిపాదించినట్టె చెయ్యవచ్చును.
  • ఇంటిపేర్లు: వీటికి కూడ సామెతల మాదిరిగా అక్షర క్రమ పుటలు ఏర్పరిస్తే బాగుంటుంది.ఇంటి పేర్ల గురించి కూడ ఎంత వ్రాసినా 10-15 వ్యాక్యాలకు మించి రాదు.

దయచేసి పరిశీలించగలరు.--SIVA 13:49, 22 డిసెంబర్ 2008 (UTC)


శివాగారి సూచనలు సరైనవేనని అంగీకరిస్తున్నాను. కాని....

  • గ్రామాల గురించి మన విధానం, కారణాలు ఒక పేజీలో వ్రాస్తాను. కాని ఇందుకు సమయం పట్టేలా ఉంది. (వచ్చేవారంనుండి నేను సెలవులో ఉంటాను. రెండు నెలలపాటు వికీలో పెద్దగా పాల్గొనలేను). 2009 జూన్ తరువాత ఈ విషయం చర్చించవచ్చును.
  • సినిమాల గురించి - శివా చెప్పిందే సరి అనిపిస్తుంది. ప్రతి సినిమా పేరు "అకారాది జాబితా"లోను, "సంవత్సరం జాబితా"లోను ఉంటే చాలును. తెలుగు వికీ సినిమాల డేటబేస్ కాదు. "వ్యాసం" ఉన్న సినిమాలకే పేజీలు ఉండాలనుకొంటాను. అయితే ఇప్పటికి చాలా శ్రమ ఇందులో వెచ్చించాము. 2009లో మార్చి తరువాత ఈ విధానం చర్చించి ఖరారు చేసుకొందాము.
  • ఇంటిపేర్లు - కొద్ది "వ్యాసాలు" (పేజీలు) మాత్రమే ఉన్నాయి. ఇంటి పేరు గురించి కూడా వ్యాసం వ్రాయవచ్చుననే సూచనగా ఇవి ఉపయోగపడుతాయనుకొంటాను.
  • ప్రస్తుతం 41,937 "వ్యాసాలు" ఉన్నాయి. మనం చేస్తున్న పునర్వ్యవస్థీకరణ వల్ల ఈ సంఖ్యను షుమారు 40,000కు తగ్గించవచ్చుననుకొంటున్నాను. తరువాత పదివేల వ్యాసాలు నాణ్యతను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసుకోవచ్చును అని ఆశిస్తున్నాను.

ఇలా అధిక సమయం సూచించడానికి కారణం నా వీలు మాత్రమే కాదు. సభ్యులు ఈ విషయంపై దృష్టి పెడుతున్నందువలన ఒక నిర్ణయానికి రావడానికి కొంత సమయం వెచ్చిస్తే మంచిదని. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:37, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ నాణ్యత పెంచడానికి ప్రయత్నించుదాము

[మార్చు]

సభ్యులందరికీ ఒక మనవి. "రాశి" కంటే "వాసి" ముఖ్యమని సాధారణంగా అంటుంటాము. కాని అది ఒక ప్రత్యేకమైన కృషిగా యత్నిస్తేనే సాధ్యమౌతుంది. కనుక 2008 డిసెంబరు నెలను తెలుగు వికీ నాణ్యతాభివృద్ధి నెలగా పరిగణించమని, అందుకు చేయూతనివ్వమని సభ్యులను కోరుతున్నాను. ఈ నెల రోజులూ సభ్యులు ఈ పనులు ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది.

  • వీలయినంతవరకు క్రొత్త వ్యాసాలు మొదలు పెట్టొద్దు.
  • పాత వ్యాసాలలో ఈ పనులు చేయవచ్చును.
    • అక్షర దోషాల సవరణ
    • సాధ్యమైనంత విస్తరణ
    • ఫార్మాటింగ్, ఉపోద్ఘాతం వంటి విషయాల సవరణ
    • వికీకరణ
    • మూలాలు లేని చోట్ల నోటీసులు
    • వివాదాస్పదమైన భాగాలు లేదా పూర్తి వ్యాసాలు తొలగింపు. ముఖ్యంగా మతం, కులం, వ్యక్తుల గురించి దూషణలు ఉన్నవి.
  • ఒక వాక్యం వ్యాసాల తొలగింపు (దయ చేసి ఈ రూల్ గ్రామాల వ్యాసాలకు వర్తింపజేయవద్దు. వాటిని సెపరేట్‌గా చర్చించుదాము)
  • విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాల తొలగింపు.


సభ్యుల సూచనలను, సహకారాన్ని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:21, 23 నవంబర్ 2008 (UTC)

కాసుబాబు గారి సూచన సమంజసం నేను దీనితో ఏకీభవించి పాతవ్యాసాల అబివృద్ధి పనులలో పాల్గొనటానికి అంగీకారం తెలియచేస్తున్నాను.--t.sujatha 15:51, 23 నవంబర్ 2008 (UTC)
మంచి ఆలోచన. నా పూర్తి సహకారం అందిస్తాను. గ్రామాల వ్యాసాలు మినహాయిస్తే 15 వేల వ్యాసాలు దాకా ఉంటాయని అంచనా. కానీ మొత్తం రెండు కేబీల పైబడిన వ్యాసాలు 3400 మాత్రమే ఉన్నాయి. నేను మిగిలిన పన్నెండు వేల వ్యాసాల జాబితా తయారుచేయగలను. కృషి మొదలుపెట్టడానికి ఒక స్టార్టింగు పాయింటుగా ఉంటుందని నా అభిప్రాయం --వైజాసత్య 18:50, 23 నవంబర్ 2008 (UTC)


అవును. ఆ 12 వేల జాబితా తయారు చేయండి. వాటిలో షుమారు 2 వేల వ్యాసాలు తేలికగా (పెద్దగా సమాచారం నష్టం కాకుండానే) తొలగించవచ్చునని నా అంచనా. చెత్తను ఏరి పారేయడం నాణ్యత పెంపులో ఒక ముఖ్యమైన భాగం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 03:48, 24 నవంబర్ 2008 (UTC)
చిన్న చిన్న వ్యాసాలను తొలగించేటపుడు ఒక సారి ఆ వ్యాసం చర్చా పేజీ లో రాసి కొద్ది సమయం ఎదురు చూస్తే బాగుంటందని నా ఆలోచన. రవిచంద్ర(చర్చ) 03:56, 24 నవంబర్ 2008 (UTC)

నేను కూడా ఈ పరిధిలోనే పనిచేస్తాను. చిన్న వ్యాసాలు తయారుచేయడం మానేశాను. 2 కె.బి.దాటిన తర్వాతనే మరో వ్యాసం లీకి వెళుతున్నారు. జీవ విజ్ఞాన శాస్త్రంలో నేను మొదలుపెట్టిన మొలకలను పెద్దవి చేయడానికి ఈ నెలంతా పనిచేస్తాను.Rajasekhar1961 04:05, 24 నవంబర్ 2008 (UTC)

ఆ పన్నెండు వేలలోనూ సినిమా పేజీలు, సంవత్సరాల పేజీలు మినహాయిస్తే మిగిలిన మొలకలు 5560. ఇదిగో వాటి జాబితా వికీపీడియా:మొలకల జాబితా --వైజాసత్య 07:23, 25 నవంబర్ 2008 (UTC)
చిన్న వ్యాసాల గురించి నేను మొదటి నుంచే వ్యతిరేకత చూపుతున్నాను. కనీసం ఇప్పటికైనా సభ్యులు వాటిపై దృష్టి సారించడం సంతోషమే. 2కెబిల సమాచారం లేని వ్యాసాలను వ్యాసంగా పరిగణించలేము. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:22, 29 నవంబర్ 2008 (UTC)
అందరమూ దృష్టి కేంద్రీకరించి పనిచేసేసరికి చూశారా మూడు వారాల్లోనే 1.3% మొలకలని తగ్గించాం. ఇప్పుడు మొలకల శాతం 51.5% ఉన్నది. త్వరలోనే తెవికీలో మొట్టమొదటిసారిగా మొలకల కంటే మొలకలు కానీ వ్యాసాలు ఎక్కువ అయ్యే తరుణం వస్తున్నది --వైజాసత్య 06:05, 14 డిసెంబర్ 2008 (UTC)
మొలకలను ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తున్నారు?. కేవలం పరిమాణాన్ని బట్టేనా? లేక ఇంకా ఏదైనా వివరాలు పరిగణనలోకి తీసుకుంటున్నారా?. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక వ్యాసం మొలక కాదు అనడానికి ఖచ్చితమైన కొలమానం తెలిస్తే, దానిని బట్టి దాని మీద minimal effort పెట్టవచ్చునని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు ఇలా మొలక స్థాయి నుంచి అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలు చాలా ఉన్నాయి. అలాగే మొలకల్లో గ్రామాల వ్యాసాలు.సంవత్సరాల వ్యాసాలు ఉన్నాయా? ़ రవిచంద్ర(చర్చ) 04:42, 17 డిసెంబర్ 2008 (UTC)
వాళ్ళు (వికీమీడియా) 200 అక్షరాల కంటే తక్కువున్న వాటిని మెలక అంటారు అనుకుంటా. ఆ మొలకల్లో వాళ్ళు గ్రామాల పేజీలతో సహా అన్నింటినీ గణిస్తారు. 2008 మే చివరన వ్యాసాలు 40 వేలుంటే 200 అక్షరాల పైనున్నవి 12 వేలు మాత్రమే ఉన్నాయి. కానీ మన మొలకల జాబితాలో గ్రామాల పేజీలను మినహాయించి మిగిలిన వాటిలో రెండు కేబీలకంటే చిన్న వ్యాసాలున్నాయి. ఏది మొలక అన్నదానిపై అంత ఏకాభిప్రాయం లేదు. కాబట్టి రెండు కేబీలకంటే తక్కువున్నవాటిని మొలక అనుకోవటం సరైన పద్ధతి. ప్రస్తుతం తెవికీలో కేవలం 7-8% వ్యాసాలే రెండు కేబీలపైన ఉన్నవి. ఏదేమైనా మొలకల జాబితాలోని ఐదు వేలను సున్నాకు తగ్గించగలిగితే తెవికీ నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. --వైజాసత్య 06:53, 17 డిసెంబర్ 2008 (UTC)

సామెతల పేజీలు

[మార్చు]
ఈ భాగం చర్చ:సామెతలుకు నార్చబడింది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:56, 20 డిసెంబర్ 2008 (UTC)

మినహాయింపులు అవసరం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ భౌగోళిక-రాజకీయాలకు సంబంధించిన లోక్‌సభ, రాజ్యసభ మరియు శాసనసభ నియోజకవర్గాలకు మినహాయింపు కావలెను. ఈ వ్యాసములు 2కిలో బైట్ల తక్కువగా వున్ననూ వీటి అవసర రీత్యా వీటికి ప్రత్యేక మినహాయింపులు అవసరం.

అలాగే సినిమా ప్రాజెక్టులో దాదాపు 70 శాతం కేవల ఒకటి అరా వాక్యాలు మాత్రమేగలవు, వీటి అవసరం వున్నదా లేదా పునస్సమీక్షించాలి. ఇంకా కొన్ని వ్యాసాలు ఉదాహరణకు జుబైద్ ఖాన్, పాకీజా (ఇలాంటివి కోకొల్లలు), వీరు ఒకటీ అరాసినిమాలలో పనిచేసినంత మాత్రాన వీరికి తెవికీలో వ్యాసరూపంలో పీఠం కావలసినదేనా, పునస్సమీక్ష చర్చ జరగాలని సభ్యులను కోరుకుంటున్నాను. నిసార్ అహ్మద్ 10:09, 25 నవంబర్ 2008 (UTC)
తప్పకుండా సమీక్ష జరగాలి. స్పష్టమైన విధానం లేకుండా తొలగించడం సబబు కాదని నా అభిప్రాయం. వికీపీడియా:తొలగింపు విధానం అనే వ్యాసంలో మార్గదర్శకాలను వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:46, 25 నవంబర్ 2008 (UTC)

ఏకవాక్య వ్యాసాలకొరకు నిర్దిష్ఠమైన నియమాలు మరియు విధానాలు అవసరం

[మార్చు]

ఏక వాక్యంతో వున్నటువంటి వ్యాసాలను గుర్తించుటకు వర్గం తో కూడిన ఒక మూసను తయారు చేస్తే వాటిని గుర్తించడం సులభం. తద్వారా వాటికొరకు విధానాలు తయారు చెయ్యవచ్చు. గమనించగోరుతున్నాను నిసార్ అహ్మద్ 11:43, 25 నవంబర్ 2008 (UTC)

అలాంటి పేజీలలో ఉంచడానికి ఈ రెండు మూసలను తయారు చేశాను. పరిశీలించండి. అవుసరమైతే మూసలను మార్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:58, 27 నవంబర్ 2008 (UTC)
సౌమ్యం, మృదుత్వం మరియు విషయప్రాముఖ్యతలతో కూడిన వ్యాఖ్యానాలతో ఈ మూసలు ఆదర్శవంతంగా వున్నవి. దీని 'Further Course of Action' అసలు విషయం. ఉత్సాహంగా చాలా మంది 'తెవికీ సందర్శకులు' తమ అభిమాన నటుడు/నటి/సినిమా/విషయం మొదలు పెట్టేస్తారు, వాటి విషయ ప్రాముఖ్యతలు వారికి అంతగా అవగాహన ఉండక పోవచ్చు. సినిమా ప్రాజెక్టు అంటే, సినిమాలు, నిర్మాతలు, దర్శకులు, ఛాయాగ్రహకులు, నిర్మాణ సంస్థలు, సంగీతకారులు, కవులు మరియు ప్రముఖ నటీనటులు (ప్రముఖులు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది) వరకూ ఉంటే పరవాలేదు. స్పాట్ బాయ్-నుండి సినీగోయర్ వరకు తయారు చేయాలంటే అది అర్థం లేని దవుతుంది. సినిమా స్క్రీన్ పై కనిపించే ప్రతి నటి/నటుని గురించి వ్రాయాలంటే కూడా ఇబ్బందే మరి. ప్రాముఖ్యత యొక్క ప్రామాణికత ముఖ్యం. మన తెవికీలో భయంగొలిపే ఒక విషయం ఏమంటే, 'నిజం' అనే వ్యాసంలోకి ప్రవేశించాలంటే నేరుగా 'నిజం' అనే సినిమా వ్యాసంలోకి పోయే వాళ్ళం, అలాగే భారతీయుడు (భారత పౌరుడు) అనే వ్యాసంలోకి పోవాలంటే నేరుగా 'భారతీయుడు' సినిమా వ్యాసంలోకి పోయేవాళ్ళం, ఆ వ్యాసంలోనూ ఏకవాక్యమే మరి. (ఇప్పుడిప్పుడూ ఈ ఇబ్బంది, "అయోమయ నివృత్తి" మరియు ఆయా నామాలతో వున్న వ్యాసాలు తయారవడం వలన, తగ్గుతూ పోతున్నది, ఈ విషయం తెవికీ కి చాలాముఖ్యం). ఆఖరున కొన్ని నిజాలను గుర్తించాలి, మన తెవికీ అతి పెద్ద వ్యాసాలు సినిమాలవే, హిందూ మతం, భారత దేశం వ్యాసాలకన్నా, సినీతారల వ్యాసాల నిడివే ఎక్కువ. నిసార్ అహ్మద్ 09:33, 27 నవంబర్ 2008 (UTC)
కృజ్ఞతలు. చాలా రోజులనుండి అలాంటి ప్రమాణాలు తయారు చేసి చర్చకు పెట్టాలనుకొంటున్నాను. కాని అది క్లిష్టమైన పని కనుకా, సమయాభావం వలనా ఇంకా చేయలేదు. Arbitrary గా చర్యలు తీసుకోవడానికి నేను ఎప్పుడూ వెనుకాడుతాను. ఎందుకంటే ఒకరికి మహాత్ముడు మరొకరికి పాపాత్ముడు కావచ్చును. ఇలాంటి విషయాలలో నిర్ద్వంద్వమైన నియమాలు సాధ్యం కావు. అయినా గాని ఒక మాదిరి మార్గదర్శకాలు అవుసరం అని నా అభిప్రాయం. అందునా క్రొత్త సభ్యుల ప్రయత్నాలకు మరింత వెసులుబాటు ఉండాలి. అలాంటి మార్గదర్శకాలు చేయడానికి ప్రయత్నిస్తాను (బక్రీదు సెలవుల్లో!). --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:13, 27 నవంబర్ 2008 (UTC)
ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 20:37, 27 నవంబర్ 2008 (UTC)
  • కాసుబాబు గారు తయారుచేసిన రెండు మూసలు మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. మొలక వ్యాసాల విభజనకు ఇవి చాలా ఉపయోగం. అందరికీ కనిపిస్తున్న చిన్న ఒక వాక్యం, పదం వ్యాసాలన్నింటిలోను ఈ మూసల్ని ఉపయోగిస్తే, వాటికి కొంత సమయం ఇచ్చి అభివృద్ధి చేస్తే బాగుంటుంది. సుమారు ఒక పది వాక్యాలైనా లేకపోతే వాటి వలన ఏం ఉపయోగం. అభివృద్ధి చేయలేకపోతే వాటిని తొలగించవచ్చును. తెలుగు సినిమా నటీమణులు లో ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్నింటిలో నేను మూస అతికించాను.Rajasekhar1961 07:22, 29 నవంబర్ 2008 (UTC)

తెలుగు పేరు

[మార్చు]

Landlocked (country) అనే పదానికి తెలుగులో 'భూతాళ' (దేశం) అనవచ్చునా? ఒక సందేహం. నిసార్ అహ్మద్ 10:07, 29 నవంబర్ 2008 (UTC)

హ!హ!హ! - తెలియదు. "సముద్ర తీరం లేని దేశం" అంటే సింపుల్‌గా ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:49, 29 నవంబర్ 2008 (UTC)
తెలుగులో నామవాచకాలు ఎక్కువగా లేవని. ఈ నామవాచకాల మోజుతోనే సంస్కృత, ఆంగ్ల ఇత్వాది బాషల పదాల ఉపయోగించడం జరుగుతుందని ఆచార్య వేల్చేరు నారాయణరావు గారు అన్నట్టు చదువరి ఒకసారి నాకు చెప్పారు! --వైజాసత్య 13:58, 29 నవంబర్ 2008 (UTC)
కనుక "భూభాగావృత దేశం" అంటే పరీక్షల్లో ఇంకో మార్కు ఎక్కువ పడొచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:43, 29 నవంబర్ 2008 (UTC)
ఆఖరుకు రాబట్టాను చూశారా:) "భూభాగావృత దేశం" చక్కగా వున్నది. థ్యాంక్స్. నిసార్ అహ్మద్ 16:41, 29 నవంబర్ 2008 (UTC)
Landlocked (country) పదానికి సరైన భూగోళశాస్త్ర పదం "భూపరివేష్టిత దేశం". పాఠ్యపుస్తకాలలో ఈ విధంగానే ఉంటుంది. ఇదే పదం కొరకు 10 మాసాల క్రితమే నేను ఇక్కడ తెలియజేశాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:28, 29 నవంబర్ 2008 (UTC)

తొలగించడానికి ముందు గమనించండి

[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్న కృషి, చర్చల ఫలితంగా {{ప్రాముఖ్యత లేని విషయం}} , {{చాలా కొద్ది సమాచారం}} అన్న మూసలు చాలా వ్యాసాలలో ఉంచుతున్నారు. ఈ చర్య సరయన దిశలోనే దాగుతున్నదని నా అభిప్రాయం. సభ్యులు, నిర్వాహకులు క్రింది విషయాలు గమనించమని సూచిస్తున్నాను.

  • ఇలాంటి వ్యాసాలు తొలగించడానికి ముందు షుమారు ఒక 20-30 రోజులు ఆగండి. ఎందుకంటే సదరు రచయితలు వికీవైపు చూసి స్పందించే అవకాశం ఉంటుంది.
  • విలీనం చేయడానికి మాత్రం వేచి చూడనక్కరలేదు.
  • కొన్ని సబ్జక్టు పరమైన పరంపరలోని వ్యాసాలు - ఉదాహరణకు రసాయన మూలకాలు, భారతదేశం జిల్లాలు, భారతరత్న గ్రహీతలు, ప్రపంచ దేశాలు, పురాతన కవులు - ఇలాంటి వ్యాసాలను తప్పక విస్తరించాల్సిన అవుసరం ఉంది. కనుక చిన్నవైనా అలాంటి వ్యాసాలలో {{చాలా కొద్ది సమాచారం}} అనే మూస ఉంచవద్దు. వాటికి {{మొలక}} లేదా {{విస్తరణ}} సరైన మూసలు.
  • ఏదైనా వ్యాసం తొలగించడానికి ముందు "ఇక్కడికి లింకున్న పేజీలు" ఒకసాఱి తప్పక పరిశీలించండి.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:22, 30 నవంబర్ 2008 (UTC)

నేను తొలిగించిన వ్యాసాలు పైవాటికి సంబంధం లేదు. నిర్వహణలో భాగంగా ఎప్పుడూ తొలిగించే పద్దతిలోనే తొలిగించాను. అందులో చాలా కొద్ది సమాచారం మూస ఉన్న ఒక వ్యాసం యాదృచ్ఛికంగా వచ్చి ఉంటుంది. నా అభిప్రాయాలకు విలువ ఇవ్వనప్పుడు ఇతరుల అభిప్రాయాలకనుగుణంగా నేను పనిచేయాల్సిన అవసరం లేదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:43, 1 డిసెంబర్ 2008 (UTC)
కాసుబాబు గారు, సాధారణంగా అందరికీ ఉపయోగపడతాయనుకున్న కొన్ని సూచనలు ఇచ్చినట్టున్నారు. అవి ప్రతేకించి ఏ ఒక్క సభ్యున్ని ఉద్దేశించి చేసినవి కావని నా అభిప్రాయం. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవలసిన అవసరం లేదు. --వైజాసత్య 21:32, 1 డిసెంబర్ 2008 (UTC)


నిస్సందేహంగా. అసలు చంద్రకాంతరావుగారు ఏ వ్యాసాలు తొలగించారో నేను గమనించలేదు. చంద్రకాంత్ గారూ! మిమ్ములను ఉద్దేశించి చెప్పాలిసింది ఉంటే నేరుగా మీ చర్చా పేజీలోనే వ్రాస్తాను.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:35, 2 డిసెంబర్ 2008 (UTC)

చంద్రకాంతరావు గారూ! కొంచెం విశాల హృదయంతో ఆలోచించండి. మీరు చేసిన పనులను వ్యక్తిగతంగా ఎవరూ తప్పు పట్టడంలేదు. కొంచెం పాజిటివ్‌గా ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది. ఎవరు ఏ పనిచేసినా వికీపీడియా అభివృద్ధికేనని గమనించండి. రవిచంద్ర(చర్చ) 04:45, 2 డిసెంబర్ 2008 (UTC)

అనువాదం కావలసిన వ్యాసాలు

[మార్చు]

అనువాదాలు ప్రాజెక్టులో దాదాపు ఓ వంద వ్యాసాలు మూల్గుతున్నాయి. ఉత్సాహవంతులైన సభ్యులు (వారిలో నేనూ ఒకడిని) వ్యాసాలు సృష్టించేశారు. తీరా తర్జుమా చేద్దామనే తలంపుతో వ్యాసాలను పరికిస్తే "ఓ పెద్ద గుదిబండ"లా వున్నాయి. అవసరరీత్యా తర్జుమాలు తక్షణం చేపట్టాలి, తరువాత మాత్రమే కొత్త వ్యాసాలకు పోవాలి. ప్రాముఖ్యత లేని వ్యాసాలను, వ్యాసభాగాలను తొలగిస్తే సబబుగా వుంటుంది. సభ్యులు తగు నిర్ణయం గైకొంటారని ఆశిస్తున్నాను. తక్షణమే అనువాదాల తెవికీ "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమం చేపడతారని విశ్వసిస్తున్నాను. నిసార్ అహ్మద్ 20:02, 2 డిసెంబర్ 2008 (UTC)

ఇలాంటివి అనువదించడానికి చాలా సమయం పడుతుందని, కష్టమైన పని అని నాకు అనుభవంలో తెలిసి వచ్చింది. మీకు వీలయిన భాగాలే అనువదించండి. చాలా కాలంగా (3 నెలల మించి) అలా ఆంగ్లంలో ఉంచిన భాగాలు, లేదా పూర్తి వ్యాసాలు నిస్సందేహంగా తొలగించెయ్యండి. మరొక విధానం ఏమంటే పరిచయ భాగాన్ని మాత్రం అనువదించి మిగిలిన భాగాన్ని తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 2 డిసెంబర్ 2008 (UTC)
చాలా కాలం నుంచి అనువాదం చేయకుండా ఉన్న ఆంగ్ల భాగాలను వెంటనే తొలిగించాలి. చరిత్ర లాంటి విషయాలు తప్ప మిగితా చాలా అంశాలు తరుచుగా మార్పు చెందుతుంటాయి. ఎప్పుడో ఆంగ్ల వికీ నుండి కాపీ చేసిన భాగం ఇప్పుడు అనువాదం చేస్తే తాజాగా మార్పులకు లోనైనా అంశాలు తప్పిపోతాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:30, 2 డిసెంబర్ 2008 (UTC)
చంద్రకాంత్ గారు చెప్పిన సమస్య నేను భారతదేశం రాష్ట్రాలు వ్యాసాలు అనువదిస్తున్నపుడు గమనించాను. అనువాదం చేసేముందు ఆంగ్లవికీనుండి మళ్ళీ కాపీ చేసి అనువదించాను. అనువాదం చేసే వారు ఇది గమనించగలరు. ఏతావతా చెప్పాల్సింది ఏమంటే - అనువాదం కాకుండా చాలా కాలం ఉండిపోయిన భాగాలను నిస్సంకోచంగా తొలగించివేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:34, 4 డిసెంబర్ 2008 (UTC)
పరిచయ భాగాన్ని మాత్రం అనువదించి, కొన్ని ముఖ్యమైన లింకులు చేర్చి మిగతా భాగాన్ని తొలగిస్తే సరిపోతుంది.Rajasekhar1961 06:24, 3 డిసెంబర్ 2008 (UTC)

ICD-10 అధ్యాయాలు అవసరమా?

[మార్చు]

అనువాదాలు ప్రాజెక్టులో ICD-10 అధ్యాయాలు, ఈ వ్యాసాలు పూర్తిగా వైద్యం, వ్యాధులు లక్షణాలతో కూడి వున్నవి. వీటిని తర్జుమా చేయడం అంత సులువైనది కానే కాదు. వైద్య శాస్త్ర అధ్యయనాలన్నీ 'ఆంగ్లం'లో సాగుతున్నకాలమిది. తెలుగు మీడియంలో "వైద్య శాస్త్రం" అధ్యయనం నిజంగా చాలా మంచి యోచనే కాని, ఇది సంభవమేనా? అన్న్దదే ప్రశ్న. ఈ అధ్యాయాలు చాలా "డీపర్ సైన్సెస్" తో కూడినవి, మరీ ముఖ్యంగా దీని "టెర్మినాలజీ" మరియు "వొకాబులరీ" తెలుగులో సాధ్యమా? అరకొర, మిడిమిడి జ్ఞానంతో మనం ఇలాంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టలేం. ఈ వ్యాసాలకు "పరిచయం" మరియు లింకులు (ఇవికీ లింకులు) ఇవ్వడమే మంచిది. నిసార్ అహ్మద్ 07:37, 3 డిసెంబర్ 2008 (UTC)

ICD-10 అధ్యాయాలు, అనువదించవలసిన వ్యాసాల జాబితాలో ఇవి వున్నవి. తెవికీలో వీటి అవసరం వున్నదా లేదా? సభ్యులు వీటిని వీక్షించి తమ అభిప్రాయాలు తెలుపండి. నిసార్ అహ్మద్ 06:09, 4 డిసెంబర్ 2008 (UTC)
అసలు ఇన్ని రకాల వ్యాధి విభజనలు ఉంటాయని, వాటిని ఇలా వర్గీకరిస్తారని ఇవి చూసినాకే నాకు తెలిసింది. అంటే విజ్ఞానదాయకమైన విషయమే గనుక సూత్ర ప్రాయంగా ఉండవచ్చును అనుకొంటాను. అయితే వీటిని అనువదించడం నిపుణులకు మాత్రమే సాధ్యం. అంటే డా. రాజశేఖర్ లాంటివారికి అన్నమాట. ఆయనొక్కడే ఎంత పని చేయగలరు?. కనుక అనువాదం అనువాదం కొరకు పేరుకుపోయిన వ్యాసంగా భావించి తొలగించవచ్చును. చర్చ ఇప్పుడే మొదలయ్యింది గనుక కొంతకాలం (ఒక నెల) ఆగుదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:29, 4 డిసెంబర్ 2008 (UTC)
ఇవి ఉంచితే అన్నీ ఉంచాలి. తొలగిస్తే అన్నీ తొలగించాలి. అన్ని వ్యాధుల సమాచారపెట్టెలు ఈ వర్గీకరణపై ఆధారపడతాయి. అందునా ఇది వికీసభ్యులు చేసిన వర్గీకరణ కాదు. అంతర్జాతీయంగా ఆమోదింపబడినది మరియు రాజశేఖర్ గారు ఇప్పటికే వీటిపై కొంత కృషిచేసి ఉన్నారు కనుక ఇవి ఇలాగే ఉంచాలని నా అభిప్రాయం --వైజాసత్య 06:33, 5 డిసెంబర్ 2008 (UTC)
  • మీరు చెప్పినట్లు ఇది సులువైన పని కాదు. వ్యాసాలు తయారౌతున్న కొద్ది వాటి అనువాదం జరుగుతుంది. కానీ ఈ వర్గీకరణ వైద్య శాస్త్ర రీత్యా చాలా అవసరం. ఎందుకంటే అంతర్జాతీయంగా అంగీకరించబడిన వర్గీకరణ విధానం ఇది. కానీ అనువాదానికి సమయం పడుతుంది. అలా ఉంచితేనే మంచిది. దయచేసి తొలగించవద్దు.Rajasekhar1961 06:41, 5 డిసెంబర్ 2008 (UTC)
శుభం, నా ఆశయమూ, విజ్ఞాన భాండాగారాన్ని, తెలుగులో అనువదించి రాబోయే తరాలకు (సమయం పట్టినా పరవాలేదు, కొద్ది కొద్దిగా అనువదించుకోవచ్చు) తియ్యటి తెలుగు భాష, సంస్కృతి, సభ్యతనూ అందించాల్సిందే. నిసార్ అహ్మద్ 06:41, 5 డిసెంబర్ 2008 (UTC)

మతాలపై విమర్శల వ్యాసాలు

[మార్చు]

నిర్వాహకులకు, సభ్యులకు ఒక మనవి. గత కొన్ని రోజులుగా కొందరు సభ్యులు (ఒకరు అజ్ఞాతం) మతాలపై విమర్శలు బుదద జల్లడాలూ చేస్తున్నారు. వీరి మనోభావాలు ఏమిటో వారి రాతలే చెబుతున్నాయి. ఒక సూటిప్రశ్న, తెవికీ ఒక విజ్ఞానపు వేదికయా లేక మతాలపై బురదజల్లే వేదికయా?

కెమోఫోబియా, హైడ్రోఫోబియా లాంటి పేర్లు విన్నాముగాని, ఈ ఇస్లామోఫోబియా ఏమిటండి! వీరు ఇలాగే 'ఫోబియా' తోకలు ప్రతి మతానికి తగిలించి, హిందోఫోబియా, క్రిస్టియానోఫోబియా లాంటి వ్యాసాలు తయారుచేసేస్తారేమో. అప్రమత్తంగా వుండడం మంచిది. వీరికి ఇంకా ఏమీ సబ్జెక్టులు తెలియవా? తెలిసుండీ ఇలాంటివి మాత్రమే వ్రాయడానికి కారణమేమిటి? వీరిది అతివాదమా తీవ్రవాదమా? ఒక సారి ఇస్లామోఫోబియా, చర్చ:ఇస్లామోఫోబియా, చర్చ:భారతదేశంలో ఇస్లాం చూడండి. వీరి విషపూరిత మనోభావాలు తెలుస్తాయి. వీరు తమ మనోభావాలను ప్రకటించేసి, వాటికి మూలాలు 'కురాన్' గానే ప్రకటించేస్తున్నారు, మరియు ఇలాంటి స్టేట్‌మెంట్లకు గౌరవించాలనీ సెలవిచ్చేస్తున్నారు (వీరు వ్రాసిన వ్యాసాలలో ఓమతం పట్ల వ్యతిరేక 'వాసన'లే కానవస్తాయి.) ఇవి భావ్యమా!.

మానవాళికి సేవ చేసిన వేలకొద్దీ మహానుభావులు హిందూమతంలోనూ, క్రైస్తవమతంలోనూ, ఇస్లాంమతంలోనూ వున్నారు. వారిగురించి వ్రాసి, రాబోయే తరాలకు మంచి మార్గం చూపించ వచ్చును గదా! క్రైస్తవ ఛాందసవాదం వ్యాసంలో తలాతోకాలేని విషయాలు వ్రాస్తే నిర్వాహకులు కొద్దిగా స్పందించి కొద్దిగా సరిదిద్ది మంచి పనిచేశారు. ఈ వ్యాసాలకూ ఇలాగే స్పందించి సరిదిద్దాలని మనవి. లేనియెడల విజ్ఞానదాయకమైన ఓమంచి తెవికీ ప్లాట్‌ఫామ్ గందరగోళమయే ప్రమాదమువున్నది. నిసార్ అహ్మద్ 05:12, 5 డిసెంబర్ 2008 (UTC)

నిసార్ గారూ! ఇప్పుడే అలాంటి వాక్యాలు చూస్తున్నాను. కొన్ని తొలగించాను కూడా. ఇలాంటి వ్యాసాలను ఎంతమాత్రం సహించేది లేదు. కొంచెం ఓపిక పట్టండి మొత్తం దారికి వస్తుంది. రవిచంద్ర(చర్చ) 05:23, 5 డిసెంబర్ 2008 (UTC)

వీరిని బ్లాక్ చేయండి

[మార్చు]

ఈ వ్యాసాలు తొలగించడమేగాదు, ఈ సభ్యులనూ 'బ్లాక్' చేయండి, వీరేదన్నా హోటల్లో కూర్చొని మాట్లాడుకోమని చెప్పండి. వీరి సోది వినడానికి ఇక్కడ "డైనింగ్ హాల్" లేదు. ప్రపంచాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్న తీవ్రవాదులకూ ఉగ్రవాదులకూ వీరికీ తేడా ఏమిటో చెప్పండి. భారత్ లోని ప్రజలకు మనోభావాలకూ గాయాలయ్యాయి, వాటినుండి కోలుకోవడానికి మందు పూయాలిగాని, ఇలా ఇంకా గాయం చేయడం భావ్యమా? వీరు మారరు, వీరిని మార్చడం తరం గాదు. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే "ఎలిమెంట్స్" వీరు. వీరిని పూర్తిగా 'బ్లాక్' మరియు 'బ్యాన్' చేయాలని, ఆదర్శప్రాయులైన తెవికీ నిర్వాహకులకు వినమ్రంగా మనవి చేస్తున్నాను. నిసార్ అహ్మద్ 05:57, 5 డిసెంబర్ 2008 (UTC)

అసలే అరకొరగా ఉన్న తెవికీ మానవవనరులను అనసర విషయాలతో వృధా చేస్తున్నందున ఈ సభ్యునిపై నిషేధం విధించాలనుకుంటున్నాను --వైజాసత్య 06:00, 5 డిసెంబర్ 2008 (UTC)
నిషేధించండి. చాలా చెప్పి చూశాం. సదరు సభ్యునికి సదుద్దేశం లేనపుడు ఇంతకంటే వేరే మార్గం లేదు. రవిచంద్ర(చర్చ) 06:03, 5 డిసెంబర్ 2008 (UTC)
ఆలస్యంగా అయినా చర్య తీసుకోవాలనుకోవడం అభినందనీయం. --Svrangarao 06:06, 5 డిసెంబర్ 2008 (UTC)
అవును. నిషేధించండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:12, 5 డిసెంబర్ 2008 (UTC)
    • నిషేధించడం సమంజసమైన చర్య. లేకపోతే తెవికీ తీవ్రవాదానికి మరొక కేంద్రంగా తయారౌతుంది. అభినందనలు.Rajasekhar1961 06:16, 5 డిసెంబర్ 2008 (UTC)

మనవి

[మార్చు]

అలాగే ఈ సభ్యుడు ఎక్కడెక్కడైతే వివాదాస్పద/ ఒక వర్గాన్ని, మతాన్ని కించపరిచే విధంగా సమాచారం చేర్చాడో అవి ఎత్తి చూపి సరిదిద్దాలని క్రియాశీలక సభ్యులకు మనవి. రవిచంద్ర(చర్చ) 06:09, 5 డిసెంబర్ 2008 (UTC)

సబ్యులు 'కుమార్ రావు'కు కొంచెం ఉపదేశించండి, ఆయనా వినకపోతే, ఆయననూ ఓ మూడు రోజులు బ్లాక్ చేయండి, ఒక మతంపై విషపూరితంగా వ్రాయడం ఆయనకు మహదానందం, కానీ ఇలాంటి విషయాలు, రాబోయే తరాలకు చాలా హాని చేస్తాయి. దయవుంచి వీరికీ వార్నింగ్ ఇవ్వండి, ఆయన అగ్గిపై ఎప్పుడూ పెట్రోల్ పోసేరకం. నా వ్యాఖ్యలకు గౌరవనీయులైన నిర్వాహకులు సభ్యులు సహృదయంతో అర్థం చేసుకుంటారని, 'దూరదృష్టి'తో సరైన చర్యలు గైకొంటారని ఆశిస్తున్నాను. నిసార్ అహ్మద్ 06:11, 5 డిసెంబర్ 2008 (UTC)

నిసార్ అహ్మద్ గారూ కాస్త సంయమనం పాటించండి. ఇప్పుడే కాస్త తేరుకుంటున్నాం. అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకండి. --వైజాసత్య 06:14, 5 డిసెంబర్ 2008 (UTC)

పైజాసత్యగారూ, నాకు ఏ సభ్యుని పట్ల ద్వేషం లేదు, వీరువ్రాసే రాతల పట్ల విచారం మాత్రం ఉన్నది. నాకు బాధల్లా ఒకటే, ఒకరి మనసులో ఉన్న విద్వేషాన్ని 'తలా కొంచెం' పంచడం భావ్యమా! సదరు సభ్యులు వ్రాసిన అనేక వ్యాసాలలో ఇలాంటి విషపూరిత భావనలే వున్నవి. ఉదహరించడానికి, వీరు వ్రాసిన (ఓ మతం తో 'టచ్' వున్న) వ్యాసాలను ఓసారి పరికించండి, నావి వ్యక్తిగత వ్యాఖ్యలు కావని, సామూహిక ప్రయోజనా వ్యాఖ్యలు అని అర్థం అవుతుంది. సదరు సభ్యులు, ఇలాంటి విషయాలపై పుస్తకాలు వ్రాసి ప్రజలలోకి వెళ్ళవచ్చు, నేను కాదనను, అలా చేయడం ఉత్తమమైనది. కాని తెవికీలో ఇలాంటివి జొప్పించడం భావ్యమంటారా! దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. సోదరుడు నిసార్ అహ్మద్ 06:28, 5 డిసెంబర్ 2008 (UTC)

ఒకరి భావాలు వ్యక్తపరచడానికి ఇది వేదికకాదు. కానీ తటస్థంగా లేని వ్యాఖ్యలు కుమారరావు గారు వ్రాసిన వ్యాసాలలో ఎక్కడైనా దొర్లితే అవి పరిశీలించి సరిచేయగలను. (మీరు ఎలాంటి వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తున్నారో నాకు అర్ధం అయ్యింది). ఒక విషయం గురించి మంచి అనో, చెడు అనో వికీ సంపాదకులు నిర్ణయించరు. కేవలం తెలిసిన విషయాలు చెప్పి తీర్పును చదువరులకే వదిలేస్తారు. కానీ అది సాధించడం కొంత కష్టమైన పనే. ఇక్కడ అందరూ నేర్చుకుంటున్నవాళ్ళే. --వైజాసత్య 06:41, 5 డిసెంబర్ 2008 (UTC)
కుమారరావు గారు తమ వ్యాసాలలో అతిశయోక్తి, పొగడ్తలు తరచుగా ఉపయోగించారు. ఈ శైలిని కాస్త మార్చాలి కానీ వ్యాసాలలోని విషయ పరంగా చాలామటుకు మూలాలను ఉదహరిస్తూనే వ్రాశారు. తైమూర్ లంగ్ వ్యాసం మాత్రం కాస్త సమత్యులం కోల్పోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా భారతీయకోణం నుంచి, భారతీయ మూలాల ఆధారంగా వ్యాసాన్ని వ్రాశారు. వ్యాసం తైమూర్ యొక్క భారత దండయాత్రను చర్చిస్తుందే తప్ప సమగ్రంగా తైమూర్ జీవితాన్ని చిత్రీకరించలేదు. ఇందులోని అతిశయోక్తులను తొలగించి, తైమూర్ జీవితానికి చెందిన ఇతర పార్శ్వాలను కూడా చేర్చి సమగ్రంగా తీర్చిదిద్దుదాం. --వైజాసత్య 07:01, 5 డిసెంబర్ 2008 (UTC)
హిందువులపై అకృత్యాలు తొలగించండి. గత కొద్ది రోజులుగా వికీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఇలాంటి వ్యాసాల మూలంగా ఇంకొక మతానికి చెందిన వ్యాసాలు వెలువడేలా అనిపిస్తున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి అక్షర సత్యమయినా సరే, వివాదాస్పదం (లేదా) నమ్మకాలను నొప్పించే వ్యాసాలను వెంటనే తొలగించాలి. నిర్వాహకులకు - దాదాపు నెలరొజుల క్రితమే సూచించాను వివాదాస్పద వ్యాసాలను మొగ్గలోనే తృంచివేయాలి అని. మరో సారి అదే పునరావృతం కాకుండా ఈ వ్యాసాన్ని, ఇలాంటి మిగతా వ్యాసాలను తక్షణం తొలగించ ప్రార్థన. --Svrangarao 13:36, 5 డిసెంబర్ 2008 (UTC)
మతాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యాసాలను తొలిగించాలని నెల రోజుల క్రితమే చర్చ తీస్తే వాటిపై ఏ విధమైన చర్య తీసుకొనకపోవడం బాధాకరం. ముందు వాటిపని పట్టాలి. ఆ తరువాతే మిగితావి. తమదాకా వచ్చే వరకు సమస్య అర్థం కాదంటారు. నిజమేనేమో! -- C.Chandra Kanth Rao(చర్చ) 14:18, 5 డిసెంబర్ 2008 (UTC)
ఓహో! అసలు చర్చ హిందువులపై అకృత్యాలు గురించా నేనీ వ్యాసం చూడనే లేదు. తెవికీ వ్యాసానికి జ్ఞానం మాత్రమే ప్రయోజనం ఇంకే ప్రయోజనమూ ఉండదు. (అందుకే వ్యాపార ప్రకటనల్లాంటి వ్యాసాలు, ప్రాపంగాండా వ్యాసాలు తొలగిస్తారు) తటస్థత మరియు మూలాలతో వికీపీడియా శైలిలో వ్రాసిన ఏ వ్యాసాన్నైనా ఎందుకు తొలగించాలో. అవి లోపిస్తే సరిదిద్దాలి కానీ ఉండకూడదు అని గిరిగీసుకుని కూర్చోలేము. కూర్చోకూడదు కూడా. అయితే వికీ సమాజం అంగీకరిస్తే కొన్నాళ్ళు స్వయం ప్రకటిత మారటోరియం విధించుకోవచ్చు. కులాలు వ్యాసాల విషయంలో చేసినట్టు. ఆ సభ్యున్ని నిషేధించింది వివాదాస్పద వ్యాసాలు వ్రాసినందుకు కాదు. తటస్థత మరియు శైలి పాటించకుండా, ఎంతచెప్పినా వినకుండా, మొండిగా సమయం వృధా చేస్తున్నందుకు. --వైజాసత్య 15:21, 5 డిసెంబర్ 2008 (UTC)--వైజాసత్య 15:21, 5 డిసెంబర్ 2008 (UTC)
గౌరవనీయులైన వికీ సభ్యులకు, నేను తెలుగు వికీలో వ్రాయుట మొదలుపెట్టిన తదుపరి రచ్చబండను చూడడము ఇదే తొలిసారి. నా పై సభ్యుల వ్యాఖ్యలు చూశాను. కొందరితో ఏకీభవిస్తాను. కొందరితో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యముగా చారిత్రక సత్యాలను పూర్తిగా మరుగుపరచిన భారతదేశంలో ఇస్లాం వ్యాసకర్త వ్యాఖ్యలు ఆతని మతమౌఢ్యానికి పరకాష్ఠ. నా చారిత్రక దృక్పథమును ప్రశ్నించిన అతనిపై, ఆ సభ్యుని నిజ స్వరూపముపై చాల సందేహాలున్నాయి అని చెప్పడానికి సాహసిస్తున్నాను. ఇంతకుముందు ఈ వ్యాసములో నేను చేయాలనుకున్న మార్పులు కొందరి సలహాపై చేయకుండా వెనక్కు తగ్గాను. ఇప్పుడు ఆధారాలతో సహా మార్పులు చేయ తలపెట్టుతున్నాను. ఆంగ్ల వికీ లోని వ్యాసము హిందువులపై అకృత్యాలు అనువదిస్తుంటే ఏ ప్రాతిపదికపై తొలగిస్తారు? తెలుగు వికీ పాక్షిక సత్యాలకు మాత్రమే వేదికా? నాకు సమాధానము కావాలి.Kumarrao 16:16, 5 డిసెంబర్ 2008 (UTC)

తెవికీ ప్రస్తుత పరిస్థితి

[మార్చు]
మతాల వ్యతిరేక వ్యాసాలు వస్తున్నాయని. ఎవరో అనామక సభ్యులు ఏదో చేస్తున్నారని గగ్గోలు పడవద్దు. అందరు నిర్వాహకులకూ నిషేధించే హక్కు ఉన్నది. ఈ సభ్యుడు మళ్ళీ తిరిగివస్తే తప్పకుండా నిషేధించండి. అసలు మూల నిర్ణయం చేయాల్సినది విషయాలు ఇవి.
  1. మొదటి మార్గం
  • తెవికీ విస్తృతి కేవలం తెలుగుకు సంబంధించిన వ్యాసాలకు మాత్రమే పరిమితం చేయడం. తెలుగు ధృక్పథంతో వ్రాయటం.
  • ఎవరినైనా నొప్పిస్తాయనుకున్న వ్యాసాలను తొలగించడం.
  1. రెండవ మార్గం
  • విస్తృతిని అడ్డుకోకుండా తటస్థమైన ధృకపథంతో వ్రాయడం.
  • ఒక వర్గానికి ఇబ్బందికరంగా ఉన్నా వికీపీడియా శైలిని, తటస్థతను అనుసరించినంతవరకూ ఆ వ్యాసాన్ని ఉంచడం.

తెవికీ వ్యాసానికి జ్ఞానం తప్ప మరే ప్రయోజనం లేదని ఘట్టిగా నమ్మినవాన్ని. విస్తృతిని తుంచడం, కేవలం తెలుగు ధృక్పథంతోనే (ఎలాగు కొంత తెలుగు bias ఉంటుంది) వ్రాయటం వికీపీడియా మూలసూత్రాలకే వ్యతిరేకం అని నా అభిప్రాయం. నేను నాలుగు రోజులు ఊర్లో ఉండట్లేదు. తిరిగివచ్చేదాకా ప్రతిస్పందించకపోవచ్చు--వైజాసత్య 15:51, 5 డిసెంబర్ 2008 (UTC)

మారటోరియం

[మార్చు]

తాత్కాలికంగా ఒక వారం రోజులపాటు మతం, మతసంబంధ విషయాలు, మతంపై చర్చలు చేయవద్దని సభ్యులకు మనవి. మనం చేయాల్సిన పని చాలా ఉన్నది వికీపీడియా:మొలకల జాబితా పై దృష్టి కేంద్రీకరిద్దాం --వైజాసత్య 16:02, 5 డిసెంబర్ 2008 (UTC)

నేను వ్రాయాలనుకొన్నది కూడా ఇదే. సమస్య పరిష్కారం చేసుకోవచ్చును. కాని వాతావరణం వేడిగా ఉంది. చర్చలు సరైన దిశలేకుండా సాగుతున్నాయి. దయ చేసి కొంతకాలం ఈ చర్చలు ఆపమని అందరికీ మనవి చేస్తున్నాను. స్పష్టమైన చర్చా పరిధిలో తప్పకుండా తరువాత ఈ సమస్యను పునఃపరిశిలించుదాం. ఒక పది రోజుల తరువాత నేనే చర్చను పునఃప్రారంభిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:29, 5 డిసెంబర్ 2008 (UTC)
ఇది మంచి సూచన కాని పరిస్థితి చేయి దాటి పోయింది. దుశ్చర్యలకు పాల్బడే అజ్ఞాత సభ్యులు చర్చా పేజీలలో మత విమర్శలు వ్రాస్తుంటే మిగితా సభ్యులు చూస్తూ ఊరకుండరు. కాబట్టి ముందు అజ్ఞాత సభ్యుల ఐ.పి.అడ్రస్‌లన్నీ నిరోధించాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:48, 5 డిసెంబర్ 2008 (UTC)
ముఖ్యమైన చర్చా పేజీలను కూడా లాక్ చేస్తే బాగుంటుంది. అలా చేయడము పద్దతి కాదేమో కాని ప్రస్తుత పరిస్థితులకు అదే పరిష్కారం అని నా అభిప్రాయం. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:54, 5 డిసెంబర్ 2008 (UTC)
మారటోరియంనకు నిబద్ధుడనై ఉండువాడను. హిందువులపై అకృత్యాలు వ్యాసము తొలగించుటకు మాత్రము బద్ధ వ్యతిరేకిని.Kumarrao 11:15, 6 డిసెంబర్ 2008 (UTC)


పహరాకాసే దళసభ్యులకు ఓ చిన్న పని

[మార్చు]

వాడుకరి:203.190.131.30 నంబరుకు తమ పరిధిలో తీసుకోండి, ఇతను (చేసిన) చేస్తున్న మార్పులకు కొద్దిగా గమనించండి.నిసార్ అహ్మద్ 09:59, 14 డిసెంబర్ 2008 (UTC)

వివాదాస్పద వ్యాసాలపై ప్రత్యేక కట్టుబాట్లు

[మార్చు]

వివాదాస్పద వ్యాసాలుగా గుర్తించిన వ్యాసాలను కేవలం నమోదు చేసుకున్న సభ్యులే దిద్దుబాట్లు చేసేట్టు కట్టుబాటు చెయ్యాలని ప్రతిపాదిస్తున్నాను. సభ్యుల సమయం వృధా కాకుండ ఇది కొంతవరకు కాపాడగలదని భావిస్తున్నాను. ఇలా చెయ్యటం అవసరం లేదు కానీ మనకున్న వనరుల దృష్ట్యా ఇది అనివార్యం అనిపించింది. వివాదాస్పద వ్యాసాలు నమోదు చేసేటప్పుడు కాస్త సావధానంగా ఆలోచించి ఏది వివాదాస్పద వ్యాసమో గుర్తిస్తే బాగుంటుంది. --వైజాసత్య 12:36, 14 డిసెంబర్ 2008 (UTC)

"అకృత్యాల" తోకలుగల వ్యాసాల సృష్టి కూడా ఒక "అకృత్యమే".

పైజాసత్య గారన్నది అక్షరాలానిజం, అనవసరంగా సభ్యుల సమయం వృధా. వీటివల్ల "కన్‌స్ట్రక్టివ్ రిజల్ట్"కూడా లేవు. ఇలాంటి వ్యాసాలవల్ల, కోపోద్రేకాలు పెరుగుతాయి తప్ప ఇంకేమీలేదు. "అకృత్యాల" తోకలుగల వ్యాసాల సృష్టి కూడా ఒక "అకృత్యమే". ఇవి అలజడి సృష్టించేవ్యాసాలు. ఆలోచనాత్మక దృక్ఫదాల వ్యాసాలు ఎంతమాత్రమూ కావు, విషపూరిత దృక్ఫదాల క్రోడీకృతాలే.

ఇలాంటి వ్యాసాలు సృష్టించేబదులు, 1947 లో జరిగిన దేశ విభజన వ్యాసం వ్రాసి, కొందరు నికృష్టుల వలన మన అవిభాజ్యదేశం ఎలా ముక్కలైందో, ఆ సమయాన హిందూ, ముస్లిం, సిక్కులు, అమాయక ప్రజలు దారుణంగా వధింపబడ్డారో, నేటికీ కాందిశీకులుగా, వలసలు చేసి దుర్భర జీవితాలు గడిపారో గడుపుతున్నారో వ్రాసి, దేశ ప్రజల కళ్ళు తెరిపించాలి. కాశ్మీర్ కాష్టం రగిల్చి, అమాయకుల ప్రాణాలు తీసి, నేటికీ 'కాశ్మీర్ పుండు' ఆరకుండా వుంచి, దేశాన్ని అతలాకుతలం చేసి, అశాంతిని రేకెత్తిస్తున్నవారి అసలు రంగును బయటపెట్టి, ప్రజలను చైతన్యవంతులను చేయుట అతిముఖ్యం.

హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు, వారి అవలంబీకుల మధ్య సామరస్యం సాధించడానికి కావలసిన కృషి, చేపట్టవలసిన పనుల గూర్చియూ వ్యాసాలు వ్రాయండి. వ్యాసాల సంఖ్యా పెరుగుతుంది, శాంతియుత వాతావరణమూ ఏర్పడుతుంది. నిసార్ అహ్మద్ 12:49, 14 డిసెంబర్ 2008 (UTC)

మంచి తెలుగు సినిమాలు

[మార్చు]

సుమారు 100 మంచి తెలుగు సినిమాలను రెండు విధాలుగా సేకరించాను. ఒకటి నాటి 101 చిత్రాలు పుస్తకంలోనివి జాబితాగా వివరించాను. రెండు నంది ఉత్తమ చిత్రాలు గా ప్రభుత్వంచే ఎన్నికచేయబడిన చిత్రాలు. ఇవి కూడా సుమారు 100 ఉన్నాయి. వీటిని ఉత్సాహం గల సభ్యులు అభివృద్ధి చేయమని మనవి.Rajasekhar1961 14:28, 15 డిసెంబర్ 2008 (UTC)


వేలాదిగా ఉన్న సినిమా పేజీలలో ప్రత్యేకంగా విస్తరించడానికి తగినవి ఏవో తెలుసుకోవడానికి ఈ రెండు జాబితాలు మంచి సూచిక. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:05, 18 డిసెంబర్ 2008 (UTC)
కాసుబాబు గారు, ఈ ముఖ్యమైన సినిమా వ్యాసాలలో సినిమా మూసలో పెద్దదాన్ని ఉంచగలరా. నా దగ్గరున్న వివరాలు మెల్లగా చేరుస్తాను.Rajasekhar1961 15:11, 18 డిసెంబర్ 2008 (UTC)
అలాగే చేరుస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:03, 19 డిసెంబర్ 2008 (UTC)

చర్చా పేజీలు ప్రాపంచిక విషయాలు

[మార్చు]

చర్చాపేజీలు ఆయా వ్యాసంను తీర్చిదిద్దటానికే ఉపయోగించాలి కానీ ఆ వ్యాసంలోని విషయం మంచిదా, చెడ్డదా? సమాజశ్రేయస్సుకోసం అవసరమా అన్న విషయాలు అనవసరం. ఉదాహారణకు ఇస్లాం శాంతియుత మతమా కాదా? అసలు మతం అవసరమా? కాదా? దేవుడు ఉన్నాడా? లేడా? చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి మంచిపని చేశాడా లేదా? ఇలాంటి విషయాలన్నమాట. కొందరు కొత్తసభ్యులు అలాంటి చర్చలకు దారితీసే వ్యాఖ్యలు వ్రాసినా మిగిలిన సభ్యులు స్పందించవద్దని మనవి. అలా చేస్తే అవతలి వ్యక్తిని ప్రోత్సహించినట్టే అవతుంది. వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మాత్రం వెంటనే ఖండించి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ తిరిగి ఆ వ్యక్తిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా సంయమనం వహించాలి. --వైజాసత్య 04:34, 16 డిసెంబర్ 2008 (UTC)

న్యాయ శాస్త్ర సంబంధిత వ్యాసాలు

[మార్చు]

శివగారు, న్యాయశాస్త్ర పట్టభద్రులైన మీరు కొన్ని సామాన్య ప్రజల కోసం మంచి వ్యాసాలు రచిస్తే బాగుంటుందని అభ్యర్ధన.Rajasekhar1961 15:08, 18 డిసెంబర్ 2008 (UTC) మీ సూచనకు ధన్యవాదాలు రాజశేఖర్ గారూ! దయ చేసి వికీపీడియాలో వ్రాయదగ్గ న్యాయ శాస్త్ర విషయాలను సూచించండి. "సాక్ష్యము", "ఒప్పందము" ఇలా రాసుకుంటూ పోతే చాలా అవుతాయి. మౌలికమయిన విషయాల మీద వ్రాద్దామా లేక కొన్ని కొని న్యాయ సంబంధమయిన మాటలు (legal vocabulary)గురించి వ్రాద్దామా?? అలోచించి ఒకసారి సూచిచండి, ఇతర సభ్యుల అభిప్రాయం కూడ తీసుకుంటే బాగుంటుంది. తప్పకుండా వ్రాయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.

వ్రాసుకుంటే పోతే చాలా అయితే ఫర్వాలేదండి. మీరు వ్రాయటమే తరువాయి --వైజాసత్య 15:27, 18 డిసెంబర్ 2008 (UTC)
  • సాధారణమైనవి, ముఖ్యమైనవి, అతిముఖ్యమైనవి, అనే ప్రయారిటీలతో, సభ్యులు చొరవగా తగిన వర్గీకరణలతో న్యాయవాద పదజాలము ("లీగల్ వొకాబులరీ") లో వ్రాయండి. తరువాత ఒక బృహత్-కార్యక్రమమం చేపట్టవచ్చు. నిసార్ అహ్మద్ 16:43, 18 డిసెంబర్ 2008 (UTC)

ఇంటి పేర్ల వ్యాసాలు

[మార్చు]

ఇంటి పేర్ల వ్యాసాలకు కూడా సామెతల వ్యాసాలకు ప్రతిపాదించిన వ్యూహాన్ని అనుసరించాలనుకుంటున్నాను. ఏమంటారు? వీటిని కూడా విక్షనరీకి చేర్చి ఇక్కడ మాత్రం అక్షరం వారిగా తెలుగు ఇంటిపేర్లు అ, తెలుగు ఇంటిపేర్లు ఆ అని వ్యాసాలు సృష్టిస్తే బాగుంటుందేమో --వైజాసత్య 23:02, 18 డిసెంబర్ 2008 (UTC)

విక్షనరీ లో ఉంచేవి సామాన్యంగా భాషకు సంబంధించినవిగా ఉంటాయి. ఇవి పేరు కు సంబంధించినవి. ఇదెందుకో సరికాదని అనిపిస్తుంది. ఇవి చంద్రకాంతరావు గారు ముందు చెప్పినట్లుగా దారిమార్పు పేజీలుగానే మిగిలిపోతాయి. కొన్ని మాత్రం వ్యాసాలుగా అభివృద్ధిచెందే అవకాశం ఉన్నది. సామెతలు ఇవి ఒకటి కాదు.Rajasekhar1961 03:12, 19 డిసెంబర్ 2008 (UTC)
అవును. ఇంటిపేర్లు విక్షనరీకి చెందవు. కాకుంటే ఇకముందు ఒకటి రెండు వ్యక్తులకోసం ఇంటిపేరుమీద వ్యాసం మొదలుపెట్టవద్దు అని సూచిస్తున్నాను. ఒక ఇంటి పేరు మీద ఒకమాదిరి సమాచారం ఉంటే వ్యాసం వ్రాయడం తప్పక ప్రోత్సహించాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:06, 19 డిసెంబర్ 2008 (UTC)
అలాగే --వైజాసత్య 20:41, 19 డిసెంబర్ 2008 (UTC)
ప్రముఖుల ఇంటి పేర్ల వ్యాసాలు ఉంటే పర్వాలేదు. దాన్ని ఒక దశకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కొందరు కొత్త సభ్యులు వారి ఇంటి పేర్ల వ్యాసాలు కూడా సృష్టించి చిన్న వ్యాసాల "వృద్ధి "కి తోడ్పడ్డారు. ఇలాంటి చిన్న వ్యాసాలను తొలిగించవచ్చు. ఇంటిపేరు వ్యాసాలలో కేవలం ఆ ఇంటిపేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల పేర్లనే కాకుండా ఆ ఇంటిపేరు ఎలా వచ్చింది (ఉదా: నెహ్రూ ఇంటి పేరు నెహర్ నది మీదుగా వచ్చింది, ఇలా), ఆ ఇంటి పేరు కలవారు ఏయే ప్రాంతాలలోఆధికంగా నివశిస్తున్నారు. వారు ఏయే రంగాలలో అభివృద్ధిసాధించారు వారి వంశవృక్షం మొదలగు అంశాలు వ్రాయవచ్చు. కాని ఇంత సమాచారం సేకరించడానికి అన్ని ఇంటి పేర్లకు సాధ్యం కాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:09, 20 డిసెంబర్ 2008 (UTC)
ఇంటి పేర్లు సామెతల వ్యాసాలకు ప్రతిపాదించిన వ్యూహం సరైనదే సత్యా గారూ. నేను సత్యాగారి అలోచనను సమర్ధిస్తున్నాను. తరువాత, ఇంటి పేర్ల మీద వ్యాసలు మొదలు పెట్టినప్పుడే అలోచించి ఉండాలి ఇక్కడ వ్యాసం వ్రాసేంత మటీరియల్‌ ఉంటుండా అని. 1990లలో అనుకుంటాను ఆంధ్ర జ్యోతి వారపత్రికలో ఒకాయన ఇంటి పేర్ల మీద వారం వారం అక్షర మాల ప్రకారం చక్కగా వ్రాశారు. ఆ పాత ప్రతులు సంపాయించగలిగితే, ఇంటిపేర్ల వ్యాసాలన్నిటికి మోక్షం వచ్చినట్టే. ఏది ఏమైనా, ఇంటి పేర్లకు సామెతల వ్యాసాల పద్ధతిలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విక్షనరీ కాకపోతే, మామూలు వ్యాస పరంపరలోనే.--SIVA 18:52, 28 డిసెంబర్ 2008 (UTC)

కిలో లేదా మెగాబైట్ల సమాచారం మరియు సభ్యులు

[మార్చు]

దిద్దుబాట్ల సంఖ్యవారిగా వికీపీడియనుల గురించి తెలుసుకోవాలంటే వికీపీడియా:దిద్దుబాట్ల సంఖ్య వారిగా వికీపీడియన్ల జాబితా ద్వారా తెలుసుకోవచ్చని తెలుసుకున్నాను. అలాగే ఏ సభ్యుడు, ఎన్ని కిలోబైట్ల, లేదా మెగాబైట్ల సమాచారాన్ని తెవికీ కు కాంట్రిబ్యూట్ చేశాడు, అని తెలుసుకోవాలంటే ఎలాగో కొంచెం తెలుపగలరు. నిసార్ అహ్మద్ 11:34, 22 డిసెంబర్ 2008 (UTC)

అలాంటి సమాచారం ప్రస్తుతానికి తెలుసుకొనే సులభమైన మార్గమేదీ లేదు --వైజాసత్య 14:44, 22 డిసెంబర్ 2008 (UTC)
గత 30 రోజుల సమాచారం నుండి అయితే ఇటువంటి గణాంకాలను సేకరించడం కొంత వరకూ తేలికే, అంతకంటే ఎక్కువయితే సేకరించడం చాలా కష్టం, పైగా వికీ సర్వర్లపై చాలా భారం పడుతుంది. వికీపీడియా:తెలుగు వికీపీడియా సభ్యుల కృషి పేజీలో అలాంటి వివరాలను(గత 30 రోజులవి) సేకరించి పెట్టాను. చూడండి.

దూరదర్శిని

[మార్చు]

టెలివిజన్, టెలిస్కోపు రెండింటికీ తెలుగు పదాలు సుమారు ఒకేలాగా దూరదర్శిని సరైనది కాదు. అసలైన తెలుగు పేర్లు ఏమిటో నిర్ణయిస్తే సంబంధించిన పేజీలలో మార్పులు చేయవచ్చును. సభ్యులు సరైన సూచనలందించగలరు.Rajasekhar1961 05:15, 26 డిసెంబర్ 2008 (UTC)

1980లలో తెలుగు టింకిల్(Tinkle)లో టెలిస్కోపును "దూరదర్శిని" అనే పేర్కొన్నట్టు గుర్తు. "దుర్భిణి" ఎలా ఉంటుందంటారు? ఐతే, దుర్భిణి అనే పేరును మంత్రగాళ్ళు వాడే పరికరాలకు (అంజనం గట్రా వేయడానికి) కూడా వాడతారు. --Gurubrahma 11:32, 28 డిసెంబర్ 2008 (UTC)
టెలిస్కోపుకు ఖగోళదర్శిని అని వాడితే సరి. నేను చాలా తెలుగు పుస్తకాలలో ఈ పదమే చూశాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:48, 28 డిసెంబర్ 2008 (UTC)
"దుర్భిణి" అనే పదాన్నే ఇదివరకు చదివాను. కాని అది భూమిమీద ధూరంగా చూసే విషయంలో. "ఖగోళ దర్శిని" వాడేయవచ్చును. కాని వ్యాసం పేరుగా "టెలిస్కోపు" ఉంచడమే మంచిదనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:52, 28 డిసెంబర్ 2008 (UTC)
  • దూర (దూరంగా వుండే వస్తువులను) దర్శిని (దర్శించేది) = దూరదర్శిని; దూర + వీక్షిణి = దూరవీక్షిణి; దూర్+భిణి ('బీని' = ఉర్దూలో వీక్షించుట) అన్నీ ఒకే అర్థాలిచ్చా పదాలు. ఆంగ్లపదాలైన టెలీ+విజన్; టెలీ+స్కోప్; టెలీ+ఫోన్ (దూరవాణి), వీటిలో ప్రీఫిక్స్ లు "టెలీ", మూలపదాలు విజన్, స్కోప్ మరియు ఫోన్. విజన్=దర్శిని, వీక్షిణి, భిణి (బీనీ) సరిపోతాయి, ఫోన్=వాణి సరిపోతుంది, మరియు స్కోప్=? ఈ స్కోప్ అనే మూల పదానికి తెలుగు పదం సరిగా కూర్చగలిగితే టెలీస్కోప్ కు తెలుగులో ఓ కొత్తపదం కనిపెట్టవచ్చు. లేదా ఖగోళ దర్శిని సరిపోతుంది. కానీ నేటి విద్యార్థిలోకం ఈ పరికరాన్ని "టెలీస్కోప్" తోనే సరిగ్గా గ్రహించగలుగుతారు. దూరదర్శిని, దుర్భిణి మరియు టెలీస్కోప్ అంటే తెలుగు విద్యార్థులకు వెంటనే స్ఫురించేది "టెలీస్కోప్". టెలివిజన్ కు టెలివిజన్ పేరుతోనే గ్రహించేవారి శాతం బహు ఎక్కువ. నిసార్ అహ్మద్ 19:14, 28 డిసెంబర్ 2008 (UTC)
  • టెలిస్కోపు అని 'తెలుగు చేసేస్తే' సరిపోతుంది. ఈ మాట ఇప్పటికే తెలుగు మాటయ్యిపోయింది. దీనికి ఇంకేదో విచిత్ర శబ్దం ప్రయోగించటం మొదలు పెడితే గందరగోళం అవుతుంది.--SIVA 19:54, 28 డిసెంబర్ 2008 (UTC)
  • ఖగోళ దర్శిని అనే పదమే బాగుంది. రవిచంద్ర(చర్చ) 05:02, 29 డిసెంబర్ 2008 (UTC)
  • శివగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను - ఐతే, వ్యాసంలో మిగిలిన తెలుగు పేర్లు కూడా తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆంగ్లంలో భూమిపైన దూరాన ఉన్న వస్తువులని చూడటానికి కూడా టెలిస్కోప్ అనే పదాన్ని వాడతారు కదా - ఖగోళదర్శినితో పాటు దుర్భిణి కూడా వాడచ్చు. అలాగే బైనాకులర్స్ కు తెలుగు ఏమిటో ఎవరైనా తెలియజేయగలరా? --Gurubrahma 07:56, 29 డిసెంబర్ 2008 (UTC)
మోనాకులర్ = ఏకకటకదర్శిని; బైనాకులర్ = ద్వికటకదర్శిని. :-) నిసార్ అహ్మద్ 08:01, 29 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

[మార్చు]

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:00, 28 డిసెంబర్ 2008 (UTC)

  • వైజాసత్యగారి కృషి మనందరికి మార్గదర్శకం. వీరి అభిప్రాయాలు నిరభ్యంతరంగా బయాస్ లేకుండా ఉంటాయి. వికీ నిర్వహణలో వీరు అద్వితీయులు. కొందరు విమర్శకుల మాటల్ని మనం పట్టించుకోనవసరం లేదు. తప్పుచేస్తే కఠినమైన శిక్ష ఒక్కటే మార్గం. ఇప్పుడు చేస్తున్నట్లుగానే మాట వినని సభ్యుల్ని నిషేధించడం తప్పనిసరి. వైజాసత్యగారు ఇలా నిషేధించడం సరైన పనిగా నేను భావిస్తున్నారు. లేకపోతే తెవికీ ఒక యుద్ధ భూమిగా మారుతుంది. అభివృద్ధి కుంటుపడుతుంది.Rajasekhar1961 08:28, 29 డిసెంబర్ 2008 (UTC)

వైజాసత్య గారు

[మార్చు]

ఈ మధ్య తెవికీకి ఓ జాడ్యం దాపురించింది, ఈ జాడ్యాన్ని దూరం చేయుటకు, తెవికీ సభ్యులు చేపట్టిన పనులు అపూర్వం. ప్రత్యేకంగా 'పైజాసత్య'గారు, మహాభారత యుద్ధంలో అర్జునునిలా కృషి చేస్తున్నారు. వీరికి మన॰పూర్వక అభినందనలు. తెవికీ సభ్యులంతా వీరివెంట ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. పైజాసత్యగారూ, మీరు నిర్భయంగా అప్రతిహతంగా మీ నిర్వాహక కార్యక్రమాలు నిర్వహించండి. మీవెంట మేమున్నాం. నిసార్ అహ్మద్ 09:11, 28 డిసెంబర్ 2008 (UTC)

తెవికీని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకునే వారిని అరికట్టడంలో వైజాసత్యగారు, ఇతర నిర్వాహకులు చూపిస్తున్న శ్రమ ప్రశంసనీయం. నిసార్ గారూ, శీర్షిక పేరును "పైజాసత్య గారు" నుండి "వైజాసత్య గారు"కు మారుస్తున్నాను, అప్పుతచ్చు దొర్లింది. --Gurubrahma 17:10, 28 డిసెంబర్ 2008 (UTC)
చాలా ధన్యవాదాలు గురుబ్రహ్మ గారు. నేను దాదాపు 13 నెలలనుండి సభ్యుడిని. వైజాసత్యగారికి, పైజాసత్యగారుగానే భావిస్తూవచ్చాను (వైజాసత్య గారూ క్షంతవ్యుడిని). స్థానంలో అనే భావిస్తూ వచ్చాను. ఇప్పుడే నిశితంగా పరిశీలించి వైజాసత్య అని గ్రహించాను. నా తప్పును సరిదిద్దినందుకు ఇంకోమారు ధన్యవాదాలు. నిసార్ అహ్మద్ 17:33, 28 డిసెంబర్ 2008 (UTC)

అనామక సభ్యుని ధోరణి

[మార్చు]
  • అనామక సభ్యుడి "బేలన్స్ లేని" ప్రవర్తన, తెవికీ వృద్ధికి తీవ్రవిఘాతం కలిగించే దిశలోవున్నది. ఎవరైనా హుందాగా, విజ్ఞాన విషయాలతో కూడిన వ్యాసాలు (అవి విమర్శాత్మక వ్యాసాలైనా సరే) వ్రాయవచ్చు. దానికీ ఒక తటస్థత వుంటుంది. ఇతను మాటిమాటికీ చెప్పే డైలాగ్-అదేదో సినిమాలో విలన్ అంటాడు "చరిత్ర అడక్కు-చెప్పింది విను". ఈ వ్యాఖ్య సరిగ్గా ఇతడికే సరిపోతుంది. ఇతడికి చరిత్ర అక్కరలేదు, ఇతరులు చెప్పేది వినడు, తన ధోరణిలోనే ఇతడి వాదాన్ని, ఇతరులపై రుద్దే పిడివాది. ఇతని వాదాన్ని వినని వారికి, "బుకాయించొద్దు" అని బుకాయిస్తాడు. ఇతడు ఇతరులపై "స్ట్రెస్" మరియు "కన్ఫ్యూజన్" కల్పించి, హేతువాద డాలుతో తప్పించుకో జూస్తాడు. ఇతడికి ఏకోశానా, "వికాస బుద్ధి" లేదు. ఇన్ని ఐ.పి. అడ్రస్సులు సృష్టించగలుగుతున్నాడంటే, ఇతడు ఎంత "ఆరితేరినవాడో" అర్థమౌతుంది. ఇతడిది ఏ లక్షణమో అర్థం కాదు, నిర్వాహకులు ఎన్నిసార్లు 'బ్లాక్' చేసినా తిరిగీ ప్రవేశిస్తాడు. హుందాగా అన్ని సబ్జెక్టులపై వ్యాసాలు వ్రాయవచ్చు. హేతువాదం చాలాచక్కటి సబ్జెక్ట్, మొదట్లో ఇతడిని ఓ సారి, పైజాసత్యగారు, కాసుబాబు గారు, రహ్మతుల్లాగారూ మరియు రవిచంద్రగారూ మెచ్చుకుంటూ, అభిమాన వ్యాఖ్యలు కూడా వ్రాశారు. అయినా ఇతనికి ఇతని మొండిమూర్ఖత్వం, ఇతడి జ్ఞానాన్ని సదుపయోగంచేసే దిశలోకి తీసుకుపోవడంలేదు. దీనిని గుర్తించలేని వాడితడు. నిసార్ అహ్మద్ 17:42, 28 డిసెంబర్ 2008 (UTC)
తప్పులు సరిదిద్దుకోనంతవరకూ అతను అనామకుడిగానే మిగిలిపోతాడు. :) --Gurubrahma 18:03, 28 డిసెంబర్ 2008 (UTC)
ఒక అనామకుడి గురించి ఇంతగా మీరు ఆలోచించి ఇతర సభ్యులను కూడా ఎందుకు ఆలోచించేలా చేస్తారు. తెవికీ సభ్యుల సమయం చాలా విలువైనది. అనామకులకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. అతన్ని ఇగ్నోర్ చెయ్యండి. మీ సమయాన్ని, ఇతర సభ్యుల సమయాన్ని వృధా చెయ్యవద్దని మనవి. δευ దేవా 11:30, 29 డిసెంబర్ 2008 (UTC)

యువరాజు పేజీ చర్చ

[మార్చు]

యువరాజు చర్చాపేజీలో యువరాజు (1982 సినిమా) చర్చ యున్నది. నిర్వాహకులు సరిచేయవలెను. నిసార్ అహ్మద్ 17:29, 30 డిసెంబర్ 2008 (UTC)

నేను సరిచేశాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:23, 30 డిసెంబర్ 2008 (UTC)

2008 ప్రగతి

[మార్చు]

తెలుగు వికీపీడియా 2008 సంవత్సరంలో జరిపిన ప్రగతిని కొన్ని ప్రమాణికల ఆధారంగా విశ్లేషించవలసిందిగా పెద్దలను అభ్యర్ధిస్తున్నాను. ఇవి మనం చేస్తున్న పనికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. వ్యాసాల సంఖ్య, మొత్తం పరిమాణం, విశేష వ్యాసాలు, మొలకలు, అభివృద్ధి చేస్తున్న రంగాలు మొదలైనవి. వీటి ఆధారంగా 2009 సంవత్సరానికి లక్ష్యాలను మనం అందరం కలసి నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది.Rajasekhar1961 09:55, 31 డిసెంబర్ 2008 (UTC)

2008 సంవత్సరపు తెవికీ ప్రగతిని విశ్లేషించడానికి నేను ప్రయత్నిస్తాను. తెవికీ ప్రగతిపై చర్చ తీయడం బాగుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:08, 31 డిసెంబర్ 2008 (UTC)

నూతన సంవత్సర శుభాకాంక్షలు

[మార్చు]

సభ్యులందరికీ 2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిసార్ అహ్మద్ 19:23, 31 డిసెంబర్ 2008 (UTC)

కృతజ్ఞతలు. సభ్యులందరూ నూతన సంవత్సరములో వ్యాసాల నాణ్యత, పెద్ద వ్యాసాల పురోభివృద్ధికి కృషిచేసి తెవికీకి మంచి గుర్తింపు కల్పిస్తారని ఆశిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:02, 31 డిసెంబర్ 2008 (UTC)
  • తెవికీ సభ్యులు మరియు నిర్వాహకులకు నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2009. ఈ సంవత్సరం మనం అందరం ఐకమత్యంగా తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి కృషిచేస్తామని అభిలాషిస్తూ...Rajasekhar1961 08:09, 1 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పంచాయతి పేజీ చర్చ

[మార్చు]

పంచాయతి వ్యాసం చర్చాపేజీలో పంచాయితీ (సినిమా) చర్చ యున్నది. నిర్వాహకులు సరిచేయవలెను. నిసార్ అహ్మద్ 17:48, 1 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సరి చేసాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:03, 1 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో ఈ వ్యాసం ఉందా?

[మార్చు]

en:Chicacole. ఉంటే తెలుపగలరు. --Gurubrahma 12:51, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

దీనికి ప్రత్యేక వ్యాసం అవసరం లేదనుకుంటా శ్రీకాకుళం వ్యాసంలోనే వ్రాస్తే సరిపోతుంది. చికాకోల్ ను దారిమార్పు పేజీగా చెయ్యవచ్చు --వైజాసత్య 14:26, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

భామాకలాపం

[మార్చు]

భామాకలాపం తెలుగునాట జానపద కళ, కానీ ఈ పేజీ భామాకలాపం (సినిమా) కు దారిమళ్ళింపు పేజీగా యున్నది. ఈ పేజీ సృష్టించి, ఈ కళ గూర్చి వ్రాయవచ్చును. నిర్వాహకులు సరిచేయగలరు. నిసార్ అహ్మద్ 06:05, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు, దారి మార్పుపేజీలకు దారిమార్పులను తొలిగించి ఆ పేజీలలో కొత్త వ్యాసం వ్రాయడానికి నిర్వాహకులకే కాకుండా అందరికీ అవకాశముంది. పేజీని తుడిచివేసే అవసరం కూడా లేదు. ఇప్పటికి నేను పేజీ తొలిగించాను. ఆ పేరుతో మీరు మళ్ళీ పేజీ ప్రారంభించి వ్యాసం వ్రాయగలరు.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:59, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దీనికి నిర్వాహకుల అవసరం లేదు. దారి మళ్ళింపు జరిగిన తర్వాత పైన చిన్నగా బ్రాకెట్లలో కనిపించే మొదటి పేజీ పేరుపై క్లిక్‌చేసి కొత్త వ్యాసం మొదలుపెట్టచ్చు. --Gurubrahma 17:17, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

చలనచిత్రీకరణ

[మార్చు]

చలనచిత్రీకరణ కు సంబంధించిన క్రింది వ్యాసాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటిని అన్నింటిని కలిపి కెమెరా, యానిమేషన్, సినిమాటోగ్రఫీ, ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసాలలో తయారుచేస్తే బాగుంటుంది. వీటిలో సమాచారం లేకుండా ఖాళీ విభాగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విభాగాల్ని తొలగించవచ్చును.

వీటన్నింటికీ వికీకరణ అవసరం.Rajasekhar1961 13:02, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవన్నీ వాసుగారు మొదలుపెట్టి కొంత వరకు వ్రాశారు. కాని ఆయనకు తీరిక లేనట్లుంది. వ్యాసాలు ముందుకు వెళ్ళడం లేదు. వీటిని పునర్వ్యవస్థీకరించడానికి నిపుణులు అవుసరం. తొలగించడానికి కొంత కాలం ఆగడం మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:13, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]