శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lankan cricket team ) అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించిన జట్టులలో ఇది 8వది. 1990 దశాబ్దంలో పూర్తిగా క్రిందిస్థాయిలో ఉన్న జట్టు క్రమంగా ఉన్నత స్థానంలోకి చేరినది. 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ సాధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ఒక స్థానాన్ని సంపాదించి అడపాదడపా విజయాలను నమోదుచేస్తూనే ఉంది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ లాంటి బ్యాట్స్‌మెన్లు, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి బౌలర్లు శ్రీలంకకు గత 15 సంవత్సరాలలో పలు విజయాలు అందజేశారు.
అక్టోబర్2007 నాటికి శ్రీలంక 170 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 29.41% విజయాలు సాధించగా, 37.05% పరాజయాలు పొందినది. 33.52% డ్రాగా ముగించింది.
1972కు పూర్వం సిలోన్ అనబడే శ్రీలంక దేశంలో 1926-27లో మొట్టమొదటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పోటీ కొలంబోలోని విక్టోరియా పార్క్‌లో నిర్వహించారు. అందులో శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని పొందినది.[9] శ్రీలంక జట్టుకు తొలి విజయం పటియాలాలోని ధ్రువ్‌పాండవ్ స్టేడియంలో 1932-33లో జరిగిన మ్యాచ్‌లో దక్కినది.[10]
1981లో శ్రీలంక జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడింది. ఈ హోదా పొందిన దేశాలలో ఇది ఎనిమిదవది. 1982లో ఈ జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతకు ముందే 1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొని అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడినది. 1990 దశకంలో ఈ జట్టు శక్తివంతమైన ప్రదర్శన ప్రదర్శించింది. ఇదే ఊపుతో 1996లో భారత ఉపఖండంలో జరిగిన 6వ ప్రపంచ కప్ పోటీలలో విశ్వవిజేతగా నిల్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపర్చింది. 2003లోదక్షిణాఫ్రికాలో నిర్వహించబడిన ప్రపంచ కప్‌లో కూడా సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. 2007లో ఫైనల్ వరకు దూసుకెళ్ళింది.
↑"1996 ODI Rankings". icc-cricket.org. International Cricket Council. 20 March 2013. Archived from the original on 20 మార్చి 2013. Retrieved 13 November 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)