పి. ఎస్. వైదేహి
Appearance
పి.ఎస్.వైదేహి | |
---|---|
సంగీత శైలి | ప్లేబ్యాక్ గానం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1956–1967 |
పి. ఎస్. వైదేహి దక్షిణ భారతీయ సినిమా నేపథ్య గాయిని.
సినిమా రంగం
[మార్చు]ఈమె 1950వ దశకం చివరలో, 1960వ దశకంలో అనేక తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు నేపథ్యగాయనిగా తన స్వరాన్ని అందించింది. ఎస్.పి.కోదండపాణి, ఘంటసాల వెంకటేశ్వరరావు,పెండ్యాల నాగేశ్వరరావు, మారెళ్ళ రంగారావు, అశ్వత్థామ, పామర్తి, సి.ఎం.రాజు, మల్లేశ్వరరావు, సి.ఎన్.పాండురంగం తదితరుల సంగీత దర్శకత్వంలో పనిచేసింది. పి.సుశీల, లీల, జిక్కి, కె.రాణి, ఎ.పి.కోమల, రావు బాలసరస్వతి దేవి, కౌసల్య, సి.ఎస్.సరోజిని, పద్మ మల్లిక్, జి.కె.రాజం, సౌమిత్రి, జె.వి.రాఘవులు, మాధవపెద్ది సత్యం, పి.బి.శ్రీనివాస్, ఎం.ఎస్.రామారావు, ఘంటసాల తదితరులతో కలిసి పాడింది. సదాశివబ్రహ్మం, మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల రాఘవాచార్య, వడ్డాది, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, శ్రీరామచంద్, సుంకర, వేణుగోపాల్ తదితర గేయకవులు వ్రాసిన పాటలను పాడింది.
డిస్కోగ్రఫీ
[మార్చు]విడుదల సంవత్సరం | సినిమా | దర్శకుడు | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|---|---|
1956 | ముద్దుబిడ్డ | కె.బి.తిలక్ | "పదరా సరదాగ పోదాం పదరా బావా చిందేసుకుంటూ" | పెండ్యాల నాగేశ్వరరావు | ఆరుద్ర | జిక్కి |
సి.ఐ.డి. | ఎం.కృష్ణన్ నాయర్ | "కాలమెల్ల ఉల్లాసంగా సాగాలి " | మల్లేశ్వరరావు | శ్రీశ్రీ | సి.ఎస్.సరోజిని, బి.సుబ్రహ్మణ్యం | |
1957 | భాగ్యరేఖ | బి.ఎన్.రెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | |||
పెద్దరికాలు | తాపీ చాణక్య | "పదవమ్మా మాయమ్మ ఫలియించె " | మాస్టర్ వేణు | కొసరాజు | రావు బాలసరస్వతీ దేవి, పి.సుశీల | |
ప్రేమే దైవం | ఆర్.నాగేంద్రరావు | హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, విజయభాస్కర్ |
జి.కృష్ణమూర్తి | |||
వినాయక చవితి | సముద్రాల రాఘవాచార్య | "చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు మునిరాజులకే గిలిగింతలు " | ఘంటసాల | సముద్రాల రాఘవాచార్య | కె.రాణి, పి.లీల, కె.జమునారాణి, సత్యవతి, సరోజిని, ఘంటసాల | |
"నలుగిడరే నలుగిడరే నలుగిడరారె చెలువగ" | సరోజిని, సత్యవతి | |||||
1958 | చెంచులక్ష్మి | బి.ఎ.సుబ్బారావు | "హే ప్రభో దీనదయళో రక్షింపు" | సాలూరు రాజేశ్వరరావు | ||
మహాదేవి | సుందరరావు నాదకర్ణి | "సింగారముల నిన్నే కన్నార కనగానే సంగీత వీణలు" | ఎం.ఎస్.రాజు, విశ్వనాథన్ - రామమూర్తి |
శ్రీశ్రీ | పి.సుశీల బృందం | |
శ్రీకృష్ణ గారడి | వై.వి.రావు | "ఈ మాయ ఏల ఈ పంతమేల రావేలా మాపాలి గోపాల" | పెండ్యాల నాగేశ్వరరావు | తాపీ ధర్మారావు | పద్మ, ఎస్.జానకి | |
1959 | గాంధారి గర్వభంగం | రాజా ఠాగూర్ | "దయరాదేల జయ గోపాల తెలియగ మాతా హృదయబాధ" | పామర్తి | శ్రీశ్రీ | |
రావయ్యా ఐరావత గజరాజా కావించినామయ్యా నేడే నీ పూజ | బృందం | |||||
దైవబలం | పొన్నలూరి వసంతకుమారరెడ్డి | "ఏ కొరనోము నోచితినో ఏ అపరాధము చేసి" (పద్యం) | అశ్వత్థామ | పరశురాం | ||
"నందకిశోరా నవనీత చోరా మురళీలోలా గోపాలా" | ||||||
"పతికి కలిగిన దుర్గతి మది తలంచి" (పద్యం) | ||||||
"బాలు ప్రహ్లాదు మొరవిని యేలినావు ధృవకుమారుని" (పద్యం) | ||||||
"జీవితం ఎంతో హాయీ ఈ యవ్వనమే కనవిందోయి" | అనిశెట్టి | |||||
వచ్చిన కోడలు నచ్చింది | డి.యోగానంద్ | "సునో చిన్నబాబు మనీ ఉన్న సాబూ దేఖో హం గరీబ్" | సుసర్ల దక్షిణామూర్తి | ఆచార్య ఆత్రేయ | ఎస్.జానకి, జె.వి.రాఘవులు బృందం | |
సతీ తులసి | వి.మధుసూదనరావు | "హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజాబంధో" | పామర్తి | తాండ్ర సుబ్రహ్మణ్యం | ఘంటసాల | |
"నన్నే పెండ్లాడవలె నా సామీ నన్నే పెండ్లాడవలె" | ఆరుద్ర | పి.లీల, కె.రాణి | ||||
1960 | కాడెద్దులు ఎకరం నేల | జంపన | "యాడుంటివే పిల్లా యాడుంటివే నీ జాడా జవాబులేక" | సి.ఎం.రాజు | కొసరాజు | జె.వి.రాఘవులు |
జగన్నాటకం | శోభనాద్రిరావు | "ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా" | అశ్వత్థామ | కొసరాజు | ||
"ఫణిరాజమణిహారి పాతాళలోక విహారి కరుణించరా" | శ్రీరామచంద్ | |||||
"మణిమాయ తేజా ఓ నాగరాజా శుభసమయాన ఇటు" | ||||||
"హే జననీ సావిత్ర దయచూడవమ్మా మాపాలి దైవమా" | ||||||
రేణుకాదేవి మహాత్మ్యం | కె.ఎస్.ప్రకాశరావు | "వినువీధి నెలవంక ప్రభవించెరా మనపురమేలు యువరాణి జనియించెరా" | ఎల్. మల్లేశ్వరరావు | ఆరుద్ర | ||
శ్రీ వెంకటేశ్వర మహత్యం | పి.పుల్లయ్య | "కల్యాణ వైభవమీనాడే చెలి కల్యాణ వైభవమీనాడే" | పెండ్యాల నాగేశ్వరరావు | ఆత్రేయ | పి.లీల, జిక్కి, మాధవపెద్ది సత్యం | |
"ఘుమ ఘుమ ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుం" | పి.సుశీల, ఎస్.జానకి | |||||
"వెళ్లిరా మాతల్లి చల్లగా వెయ్యేళ్ళు వర్ధిల్ల" | పి.లీల | |||||
1961 | అమూల్య కానుక | టి.జానకీరామన్ | "మహేశ్వరీ త్రిభువన పాలనీ అమూల్యకానుకను" | సి.ఎన్. పాండురంగం | వేణుగోపాల్ | పి.బి.శ్రీనివాస్ |
జేబు దొంగ | పి.నీలకంఠన్ | "హాయిగ నాట్యమ్మాడుతాం అహ తీయని పాటలు పాడుతాం" | ఎం. ఇబ్రహీం | అనిశెట్టి | పి.బి.శ్రీనివాస్ | |
పాపాల భైరవుడు | జి.ఆర్.నాథన్ | "ఇది రహస్యము రహస్యము ఊహాతీతము" | పామర్తి | వడ్డాది | ||
యోధాన యోధులు | కె.శంకర్ | "కాంతివోలె కళకళగా కపురమటుల ఘుమఘుమగా" | అశ్వత్థామ | శ్రీరామచంద్ | కె.రాణి | |
"గతము నేరవో గతులు మారెనో అభయదానమే లేదో" | ||||||
"మేఘం శపించెనమ్మా విధి పగచూపెనమ్మా విలయం జలప్రళయం" | ||||||
"చిలిపివి రారాజా బంగారు మా రాజా" | వరప్రసాద్ | నిర్మల | ||||
"మహిత మహాపవిత్రమానిత ఘనకీర్తి కాంతికళా" | సుంకర | జి.కె.రాజం | ||||
విప్లవస్త్రీ | ఎం.ఎ.తిరుముగం | "ఓ లలనా ఎన్ని వేసములున్నా పల్కులెన్ని పల్కినా కథ దాగదు" | పామర్తి | సముద్రాల జూనియర్ | ఘంటసాల | |
శ్రీకృష్ణ కుచేల | చిత్రపు నారాయణమూర్తి | "బృందావిహార నవనీరద నీలదేహ గోవర్ధనోద్ధరణ" (శ్లోకం) | ఘంటసాల | |||
"మూడులోకాల నీ బొజ్జలో నిడుకున్న ముద్దుబాలా వేగ రావయ్యా" | పాలగుమ్మి పద్మరాజు | బృందం | ||||
"కనుల కునుకు లేదు తినగ మనసు రాదు" | ||||||
1962 | ఆదర్శ వీరులు | జి.విశ్వనాథం | "కైలాసనాథా కారుణ్యసాగరా కాలకంఠా శివా" | మారెళ్ళ రంగారావు | అనిశెట్టి | కౌసల్య |
కలిమిలేములు | గుత్తా రామినీడు | "నొసట వ్రాసిన వ్రాలు తప్పదులే చెరిపివేసిన" | అశ్వత్థామ | కొసరాజు | బృందం | |
టైగర్ రాముడు | సి.ఎస్.రావు | "బాలా నువ్వూ ఎవ్వరే మరుని ములుకోలా నువ్వూ ఎవ్వరే" | ఘంటసాల | సముద్రాల జూనియర్ | మాధవపెద్ది సత్యం | |
1963 | లక్షాధికారి | వి.మధుసూదనరావు | "అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే పిచ్చయ్యను చూడ చూడ ముచ్చటాయెనే" | తాతినేని చలపతిరావు | కొసరాజు | స్వర్ణలత, కె.రాణి |
లవకుశ | సి.పుల్లయ్య, సి.యస్.రావు |
"జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే" | ఘంటసాల | సముద్రాల సీనియర్ | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, పద్మ మల్లిక్ | |
"శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ" | సదాశివబ్రహ్మం | జె.వి.రాఘవులు, ఎ.పి.కోమల, సౌమిత్రి | ||||
1964 | అద్దాలమేడ | స్వామి మహేష్ | "మారు మాట చెప్పజాలనే బాల మల్లడియైనవి వెల్లువగా ఆశలే " | మారెళ్ళ రంగారావు | శ్రీశ్రీ | |
బంగారు తిమ్మరాజు | జి.విశ్వనాథం | "వెంకటేశ్వర సుప్రభాతం" | ఎస్.పి.కోదండపాణి | పి.బి.శ్రీనివాస్ | ||
1966 | పాదుకా పట్టాభిషేకం | పొన్నలూరి వసంతకుమారరెడ్డి | "వినరయ్యా రామగాధ కనరయ్యా రామలీల" | ఘంటసాల | వడ్డాది | సౌమిత్రి |
"శ్రీరామచంద్రుడు రాజౌనట మన సీతమ్మతల్లి " | పిఠాపురం | |||||
శకుంతల | కమలాకర కామేశ్వరరావు | "చెలులారా శకుంతలా సీమంతము సేయరే సుదతులారా చూలాలికి మీ దీవెనలీయరే" | ఘంటసాల | సముద్రాల సీనియర్ | పి.లీల | |
1967 | రహస్యం | వేదాంతం రాఘవయ్య | "గిరిజా కల్యాణం" | ఘంటసాల | సదాశివబ్రహ్మం | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, ఎ.పి.కోమల, పద్మ మల్లిక్, మాధవపెద్ది |
"లలితభావ నిలయ నవరసానంద హృదయా" | మల్లాది రామకృష్ణశాస్త్రి |