Coordinates: 14°08′40″N 79°50′44″E / 14.144566°N 79.845543°E / 14.144566; 79.845543

గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 44: పంక్తి 44:
== '''చరిత్ర''' ==
== '''చరిత్ర''' ==


ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ది చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మరియు [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ది చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు మరియు [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.


== వాణిజ్యం ==
== వాణిజ్యం ==

18:04, 16 ఆగస్టు 2009 నాటి కూర్పు

  ?గూడూరు,నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°08′40″N 79°50′44″E / 14.144566°N 79.845543°E / 14.144566; 79.845543
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
దూరాలు
నెల్లూరు నుండి
తిరుపతి నుండి
చెన్నై నుండి

• 45 కి.మీలు ద (భూమార్గం)
• 95 కి.మీలు ఈ (భూమార్గం)
• 120 కి.మీలు ఉ (భూమార్గం)
ముఖ్య పట్టణం గూడూరు,నెల్లూరు
ప్రాంతం కోస్తా
జిల్లా (లు) నెల్లూరు
గ్రామాలు 23
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,14,356 (2001 నాటికి)
• 56814
• 57542
• 67.48
• 74.77
• 60.31
మునిసిపల్ కమీషనర్
శాసన సభ ప్రతినిధి
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• +08624
• ఎపి-26

గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. గూడూరు పట్టణం నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం(మైకా) ప్రధానమైనవి. గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాబా సుమారు 1,10,000.

చరిత్ర

ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ది చెందినదట. శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మరియు వెంకటగిరి సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.

వాణిజ్యం

నిమ్మకాయలు

దస్త్రం:Gudur lemon.jpg
గూడూరు నిమ్మకాయలు

నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా సాగులో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.

అభ్రకం(మైకా)

కొంతకాలం కింద వరకూ ఇక్కడి మైకా గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో కలవు. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో కలవు. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.

రొయ్యల సాగు

గూడూరు పరిసర ప్రాంతాలలో రొయ్యల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.

రవాణా సౌకర్యాలు

రహదారి మార్గము

గూడూరు పట్టణం చెన్నై - కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై - నెల్లూరు నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, తిరుమల, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

రైలు మార్గము

దస్త్రం:Gudur station.jpg
గూడూరు స్టేషను

గూడూరు జంక్షన్ చెన్నై - విజయవాడ రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతి కి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

శాసనసభ నియోజకవర్గం

ఆలయములు

  • శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం
  • అళగనాధ స్వామి ఆలయం
  • ప్రసన్న వేంకటేశ్వర ఆలయం
  • శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయం
  • కోదండరామాలయం
  • చెన్నకేశవ స్వామి ఆలయం
  • మూలస్థానేశ్వర ఆలయం
  • వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం
  • షిర్డి సాయిబాబా ఆలయం
  • జైన దేవాలయం


విద్యాలయాలు

గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు కలవు.నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కలవు అవి. శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల, శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల, ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల, విద్యాలయ ఢిగ్రీ కళాశాల.

పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు కలవు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల. ఇవి కాకుండా అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు ,పాఠశాలలు కలవు.

మండలంలోని పట్టణాలు

దస్త్రం:Nellore mandals outline32.png
నెల్లూరు జిల్లాలో గూడూరు మండలం

గ్రామాలు