Jump to content

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
(ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి


15వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2010 సెప్టెంబరు- 2014 ఫిబ్రవరి
ముందు కొణిజేటి రోశయ్య
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం పీలేరు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-09-13) 1960 సెప్టెంబరు 13 (వయసు 64)
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి రాధికారెడ్డి
నివాసం హైద్రాబాద్
మతం హిందూ

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (జ. 1960, సెప్టెంబర్ 13) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే, ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత ఉన్నారు. 2010లో నవంబరు 25న 16వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2014 ఫిబ్రవరి 19 వరకు పదవిలో కొనసాగినారు.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2023 ఏప్రిల్ 07న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కిరణ్ కుమార్ రెడ్డి 1960 సెప్టెంబరు 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులో జన్మించాడు. రమణారెడ్డి కుమార్తె రాధికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె నీహారిక, కుమారుడు నిఖిలేష్ ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈయనకు సహాధ్యాయులు. కిరణ్ కుమార్‌ రెడ్డికి క్రికెట్ అంటే ఇష్టం. హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రాణించాడు. పైపెచ్చు ఎలాంటి వివాదాలకు తావులేని రాజకీయ జీవితం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగత చరిత్ర, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పొచ్చు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత, 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది.

1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994 లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కుడి భుజమైతే కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ఉన్నారు.

రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో సన్నిహితంగా వుండేవాడు. వై.యస్.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా, తర్వాత అతనికి సన్నిహితమయ్యాడు.

ముఖ్యమంత్రిగా

[మార్చు]
  • 2010 సెప్టెంబరు 25 - 2014 ఫిబ్రవరి 19): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పధకాలు.... దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుంది... మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది.

రచ్చబండ

ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది.

విద్యా పక్షోత్సవాలు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్‌ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్‌ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందిర జలప్రభ.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబరు రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పంతో పనిచేసాడు

రూపాయికే కిలో బియ్యం

.రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. స్టేట్‌ మిల్క్‌ మిషన్‌...రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

సాగురైతుల రక్షణకు చట్టం

.కౌలు రైతులకు మేలు చేకూరే విధంగా భూమి లైసెన్సు పొందిన సాగుదారుల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తెచ్చారు. పంట రుణాలకు జీరో వడ్డీ...లక్ష రూపాయల దాకా రుణం తీసుకున్న రైతులు సకాలంలో దాన్ని చెల్లిస్తే జీరో వడ్డీ పథకం వర్తింపజేస్తారు. దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

1,16,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను పూర్తిగా నోటిఫై చేస్తారు. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థ వంటివి ఉద్యోగాలను భర్తీ చేస్తాయి.

స్ర్తీనిధి మహిళా బ్యాంక్‌

మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీతో 24 వాయిదాలలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు..

మూలాలు

[మార్చు]
  1. Sakshi (7 April 2023). "బీజేపీలో చేరిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి". Archived from the original on 7 April 2023. Retrieved 7 April 2023.

బయటి లింకులు

[మార్చు]