ఎం. ఎస్. విశ్వనాథన్

వికీపీడియా నుండి
(ఎమ్మెస్. విశ్వనాధన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


ఎమ్మెస్ విశ్వనాథన్
எம். எஸ். விஸ்வநாதன்
എം.എസ്. വിശ്വനാഥന്‍
ఎమ్మెస్ విశ్వనాథన్
జననం
మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్

(1928-06-24)1928 జూన్ 24
మరణం2015 జూలై 14(2015-07-14) (వయసు 87)
చెన్నై, భారతదేశం
మరణ కారణంమూత్రపిండాల కాన్సర్
ఇతర పేర్లుM.S.V
వృత్తిసంగీత దర్శకుడు; నటుడు; గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1945–2015
తల్లిదండ్రులు
  • సుబ్రమణియన్
  • నారాయణి
[1]
సంగీత ప్రస్థానం
వాయిద్యాలుVocals (playback singing), keyboard/harmonium/piano
ముఖ్యమైన సాధనాలు
Vocals, హార్మోనియం

ఎమ్మెస్ విశ్వనాథన్ (జూన్ 24, 1928 - జూలై 14, 2015) దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[2]

బాల్యం

[మార్చు]

విశ్వనాథన్ కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ తాలూకాలో ఎలప్పళి గ్రామంలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు జూన్ 24, 1928 తేదీన జన్మించాడు. మూడేళ్ల వయసులోనే తండ్రి, సుబ్రమణియణ్ చనిపోతే, దక్షిణ కణ్ణనూరులో ఉన్న తాతగారి వద్ద పెరిగాడు. తాతగారు ఆ ఊళ్లో జైలు వార్డెన్. నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నాడు. పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందాడు. జైలు డే రోజు ఖైదీలతో "హరిశ్చంద్ర" నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశాడు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించు అని ప్రోత్సహించారు.

సినీ జీవితం

[మార్చు]

అది 1941వ సంవత్సరం. ఆ రోజు విజయదశమి, మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశాడు. న్యూటోన్ స్టూడియాలో మెకప్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నీవు పనికిరావు, మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్లిపోయారు. అదే నిర్మాతలను కలిసి, అక్కడే ఆఫీస్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఓ పక్క ఆఫీస్ బాయ్ గా చేస్తూనే మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన "కుబేర కుచేల" సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశాడు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలొనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థ ఉంది. అక్కడ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశాడు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్నారు మహాదేవన్ గారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించారు మహాదేవన్. నువ్వు సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళ్లు అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకునిగా ఉన్నారు. ఆ ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరాడు. అక్కడే "రామమూర్తి" (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది. అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు ఇద్దరు.. సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు.

ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా "జనోవా" అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేశాడు. అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడదని అనుకున్న వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని. అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ - రామమూర్తిలు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు "జగమే మాయ బ్రతుకే మాయ", బాలసరస్వతి పాడిన "ఇంత తెలిసియుండి" అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. 1965 లో కొన్ని కారణాల రీత్యా ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 ఏళ్లు ఇద్దరూ కలుసుకోలేదు. ఆ తర్వాత విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం - 3, తెలుగులో 70) పైగా స్వర సారథ్యం వహించారు.

సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు

[మార్చు]
  1. చండీరాణి (1953) (సి.ఆర్.సుబ్బురామన్ తో)
  2. మా గోపి (1954)
  3. సంతోషం (1955)
  4. తెనాలి రామకృష్ణ (1956)
  5. భక్త మార్కండేయ (1956)
  6. ఇంటికి దీపం ఇల్లాలే (1961)
  7. పెళ్లి తాంబూలం (1962)
  8. కర్ణ (1963)
  9. ఆడబ్రతుకు (1965)
  10. ఆశాజీవులు
  11. కన్నెపిల్ల (1966)
  12. మనసే మందిరం (1966; remake of Nenjil Oru Alayam)
  13. లేత మనసులు (1966)
  14. సర్వర్ సుందరం (1966)
  15. కాలచక్రం (1967)
  16. నువ్వే (1967) (పామర్తితో)
  17. హంతకుని హత్య (1967) (పామర్తితో)
  18. భలే కోడళ్ళు (1968)
  19. సత్తెకాలపు సత్తెయ్య (1969)
  20. సిపాయి చిన్నయ్య (1969)
  21. తిండిపోతు రాముడు (1971)
  22. రిక్షా రాముడు' (1972)
  23. లోకం మారాలి (1973) (పామర్తితో)
  24. మేమూ మనుషులమే (1973)
  25. అనుభవించు రాజా అనుభవించు (1974)
  26. ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)
  27. శృంగార లీల (1976)
  28. అంతులేని కథ (1976)
  29. చిలకమ్మ చెప్పింది (1977)
  30. లక్ష్మి నిర్దోషి (1977)
  31. మొరటోడు (1977)
  32. సింహబలుడు (1978)
  33. నాలాగ ఎందరో (1978)
  34. మరో చరిత్ర (1978)
  35. అందమైన అనుభవం (1979)
  36. ఇది కథ కాదు (1979)
  37. గుప్పెడు మనసు (1979)
  38. కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
  39. మహాదేవి
  40. చుట్టాలొస్తున్నారు జాగ్రత్త (1980)
  41. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
  42. త్రిలోక సుందరి (1980)
  43. ఆకలి రాజ్యం (1981)
  44. ఊరికిచ్చిన మాట (1981)
  45. రామ దండు (1981)
  46. తొలికోడి కూసింది (1981)
  47. 47 రోజులు (1981)
  48. పెళ్లీడు పిల్లలు (1982)
  49. మీసం కోసం (1982)
  50. ప్రేమ నక్షత్రం (1982)
  51. ఓ ఆడది ఓ మగాడు (1982)
  52. సీతాదేవి (1982)
  53. కోకిలమ్మ (1983)
  54. నిజం చెబితే నేరమా (1983)
  55. భామా రుక్మిణి (1983)
  56. మానసవీణ (1984)
  57. సీతాలు (1984)
  58. భాగ్యలక్ష్మి (1984)
  59. సూపర్ బయ్ 3డి (1985)
  60. స్వామి అయ్యప్ప దర్శనం (1986)
  61. అగ్ని పుష్పం (1987)
  62. సంకెళ్లు (1988)
  63. లైలా (1989)
  64. సామ్రాట్ అశోక్ (1992)
  65. అన్నా వదిన (1993)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mellisai Mannar M S Viswanathan". Lakshman Sruthi. Archived from the original on 27 సెప్టెంబరు 2013. Retrieved 13 March 2012.
  2. "ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూత". ఆంధ్రజ్యోతి. 14 జూలై 2015. Archived from the original on 16 జూలై 2015. Retrieved 14 July 2015.

బయటి లింకులు

[మార్చు]