Jump to content

కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(కాకినాడ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కాకినాడ
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాగోదావరి
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుకాకినాడ
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుమల్లిపూడి మంగపతి పళ్లంరాజు
మొదటి సభ్యులుసి.హెచ్.వి.రామారావు

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.[1] గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు 2009-2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 2014 మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయమును చవిచూసినారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  1. కాకినాడ గ్రామీణ
  2. కాకినాడ పట్టణ
  3. జగ్గంపేట
  4. తుని
  5. పిఠాపురం
  6. పెద్దాపురం
  7. ప్రత్తిపాడు

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,15,092 [2]
  • ఓటర్ల సంఖ్య: 12,42,734
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.31%, 1.47%.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

[మార్చు]
లోక్‌సభ పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 సి.హెచ్.వి.రామారావు సి.పి.ఐ.
రెండవ 1957-62 బి. ఎస్. మూర్తి, మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 తోట గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 తోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 తోట గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ
పదమూడవ 1999-04 ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-2009 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్
15వ 2009-2014 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్
16వ 2014- 2019 తోట నరసింహం తెలుగుదేశం పార్టీ
17వ 2019 - 2024 వంగా గీత వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
18వ 2024 - తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్[3] జనసేన పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నిక ఫలితాలను చూపే "పై" చిత్రం

  మల్లిపూడి పల్లం రాజు (49.38%)
  ముద్రగడ పద్మనాభం (42.5%)
  చంద్రావతి ద్వారంపూడి (3.62%)
  పూగల అప్పారావు (1.97%)
  ఇతరులు (4.43%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కాకినాడ
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ మల్లిపూడి పల్లం రాజు మంగపాటి 410,982 49.38 +9.69
తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభం 353,730 42.50 -11.14
Independent చంద్రావతి ద్వారంపూడి 30,153 3.62
బహుజన సమాజ్ పార్టీ పూగల అప్పారావు 16,373 1.97
కమ్యూనిస్టు పార్టీ పాహ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ నైనాలశెట్టి మూర్తి 9,458 1.13 +0.04
Independent పువ్వుల ఆనందరావు 8,544 1.03
Independent చాగంటి సూర్యనారాయణ మూర్తి 3,044 0.37
మెజారిటీ 57,252 6.88 +21.83
మొత్తం పోలైన ఓట్లు 832,284 68.44 +2.90
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +9.69

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బిక్కిన విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.ఎం.పళ్ళంరాజు పోటీలో ఉన్నాడు.[5]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 23 కాకినాడ జనరల్ ఎం.ఎం.పల్లంరాజు పు కాంగ్రెస్ 323607 చలమలశెట్టి సునీల్ పు ప్ర.రా.పా 289563

2014 ఎన్నికలు

[మార్చు]
సార్వత్రిక ఎన్నికలు, 2014: కాకినాడ [6]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలుగుదేశం పార్టీ తోట నరసింహం 514,402 46.76 +20.04
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సునీల్ కుమార్ చలమలసెట్టి[7] 510,971 46.45
భారత జాతీయ కాంగ్రెస్ మల్లిపూడి మంగపతి పల్లంరాజు 19,754 1.80
RPI (K) మోత శారద 6,836 0.62
CPI(ML)L యేగుపాటి అర్జునరావు 1,495 0.14
BSP ముతాబత్తుల రత్నకుమార్ 2,511 0.23
AAP శ్రీనివాస్ దంగేటి 2,356 0.21
None of the above None of the Above 41,674 3.8
మెజారిటీ 3,431 0.31
మొత్తం పోలైన ఓట్లు 1,099,999 77.59 +1.27
తెదేపా gain from INC Swing

మూలాల విభాగం

[మార్చు]
  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  3. Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  6. "KAKINADA LOK SABHA (GENERAL) ELECTIONS RESULT". Archived from the original on 2016-04-11. Retrieved 2016-05-19.
  7. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.