కె.ఎస్.ఆర్.దాస్

వికీపీడియా నుండి
(కె. ఎస్. ఆర్. దాస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొండా సుబ్బరామ దాస్
ప్రముఖ భారత దర్శకుడు స్వర్గీయ కె. ఎస్. ఆర్. దాస్
జననం(1936-01-05)1936 జనవరి 5 1936, జనవరి 5
మరణం2012 జూన్ 8(2012-06-08) (వయసు 76)
వృత్తిదర్శకుడు, సినీ ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1966–2000

కె.ఎస్.ఆర్.దాస్ జనవరి 5, 1936 - జూన్ 8, 2012[1] తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్, క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

నేపధ్యము

[మార్చు]

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనవరి 5, 1936లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌ వివాహం 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు.[2] 1966లో ఆయన లోగుట్టు పెరుమాళ్ళకెరుక తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. రజనీకాంత్, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, దాసరి నారాయణరావు, అట్లూరి పూర్ణచంద్ర రావు... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.

పురస్కారములు

[మార్చు]

ఇతనికి కర్ణాటక ప్రభుత్వం తరపున ప్రతిష్ఠాత్మక పుట్టణ్ణ కనగాల్ పురస్కారం లభించింది.

మరణము

[మార్చు]

గుండెపోటుతో బాధపడుతూ 2012, జూన్ 8 వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]

సినీ జాబితా దర్శకుడిగా , సహాయ దర్శకుడిగా

[మార్చు]

తెలుగు సినిమాలు

[మార్చు]
క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 1966 లోగుట్టు పెరుమాళ్ళకెరుక
2 1968 రాజయోగం
3 1969 రాజసింహ
4 1969 గండర గండడు
5 1969 టక్కరి దొంగ చక్కని చుక్క
6 1970 రౌడీరాణి
7 1971 బంగారు కుటుంబం
8 1971 సి.ఐ.డి. రాజు
9 1971 జేమ్స్ బాండ్ 777
10 1971 కత్తికి కంకణం
11 1971 మోసగాళ్ళకు మోసగాడు
12 1971 ప్రేమ జీవులు
13 1971 రౌడీలకి రౌడీలు
14 1972 అదృష్ట దేవత
15 1972 హంతకులు దేవాంతకులు
16 1972 కత్తుల రత్తయ్య
17 1972 పిల్లా? పిడుగా?
18 1972 ఊరికి ఉపకారి
19 1973 మంచివాళ్ళకు మంచివాడు
20 1975 మా ఊరి గంగ
21 1976 భలేదొంగలు
22 1976 దొరలు దొంగలు
23 1976 కే.డి.రౌడి
24 1977 దేవుడున్నాడు జాగ్రత్త
25 1977 దొంగలకు దొంగ
26 1977 ఈనాటి బంధం ఏనాటిదో
27 1978 ఏజెంట్ గోపి
28 1978 అన్నదమ్ముల సవాల్
29 1978 దొంగల వేట
30 1979 ఇద్దరూ అసాధ్యులే
31 1979 ఎవడబ్బ సొమ్ము
32 1979 బంగారు గుడి
33 1979 కెప్టెన్ కృష్ణ
34 1979 దొంగలకు సవాల్
35 1979 యుగంధర్
36 1980 చేసిన బాసలు
37 1980 దేవుడిచ్చిన కొడుకు
38 1980 మిస్టర్ రజనికాంత్
39 1980 మామా అల్లుళ్ళ సవాల్
40 1980 శ్రీ వెంకటేశ్వర మహత్యం
41 1981 రహస్య గూఢచారి
42 1981 గిరిజా కళ్యాణం
43 1981 మాయదారి అల్లుడు
44 1982 తల్లీకొడుకుల అనుబంధం
45 1982 బంగారు కొడుకు
46 1982 షంషేర్ శంకర్
47 1983 రోషగాడు
48 1983 పులి బెబ్బులి
49 1983 ఆడదాని సవాల్
50 1983 అగ్నిసమాధి
51 1983 పులిదెబ్బ
52 1983 సిరిపురం మొనగాడు
53 1984 భలే రాముడు
54 1984 దొంగలు బాబోయ్ దొంగలు
55 1984 నాయకులకు సవాల్
56 1985 ఇదేనా చట్టం
57 1985 నేరస్థుడు
58 1986 కౌబాయ్ నెం.1
59 1986 ఖైదీరాణి
60 1986 కుట్ర
61 1987 ముద్దాయి
62 1988 దొరకని దొంగ
63 1989 పార్థుడు
64 1990 ధర్మ
65 1990 ఇన్స్‌పెక్టర్ రుద్ర
66 2000 నాగులమ్మ

కన్నడ సినిమాలు

[మార్చు]
క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 1975 కళ్ళ కుళ్ళ
2 1976 బంగారద గుడి
3 1977 లక్ష్మీనివాస
4 1977 సహోదరర సవాల్
5 1978 కిలాడి కిట్టు
6 1981 స్నేహితర సవాల్
7 1981 జీవక్కే జీవ
8 1982 కార్మిక కళ్ళనల్ల
9 1983 తిరుగు బాణ
10 1983 చిన్నదంత మగ
11 1984 ఖైదీ
12 1985 కర్తవ్య
13 1985 నన్న ప్రతిజ్ఞె
14 1987 సత్యం శివం సుందరం
15 1989 ఒందాగి బాళు
16 1989 రుద్ర
17 1992 శివ నాగ
18 1992 నన్న శతృ
19 1995 స్టేట్ రౌడీ
20 2000 బిల్లా రంగా

తమిళ సినిమాలు

[మార్చు]
క్ర.సం. విడుదల సం. సినిమా పేరు
1 1972 పెన్నింగ్ సవాల్
2 1983 నాన్ నినైథల్
3 2000 నాగతమ్మన్

మలయాళ సినిమాలు

[మార్చు]
క్ర.సం విడుదల సం. సినిమా పేరు
1 1976 కళ్ళనం కుళ్ళనం

హిందీ సినిమాలు

[మార్చు]
క్ర.సం. విడుదల సం. సినిమాపేరు
1 1972 రాణీ మేరా నామ్
2 1972 పిస్తోల్‌వాలీ
3 1973 అప్నా ఫర్జ్
4 1973 బహద్దూర్ ఖిలాడియోఁ
5 1973 హిఫాజత్
6 1973 రాణీ ఔర్ జానీ
7 1978 చోర్ కా భాయ్ చోర్
8 1979 దిలేర్
9 1981 బ్లాక్ కోబ్రా
10 1984 తాకత్‌వాలా
11 1988 ముల్జిమ్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-11. Retrieved 2008-08-14.
  2. సాక్షి, ఫ్యామిలీ (5 January 2015). "ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!". డా. పురాణపండ వైజయంతి. Archived from the original on 20 February 2019. Retrieved 20 February 2019.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-18. Retrieved 2014-09-15.

బయటి లింకులు

[మార్చు]

ఐ.ఎం.డి.బి.లో కె.ఎస్.ఆర్.దాస్ పేజీ