గుంటూరు లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 16°18′0″N 80°24′0″E |
గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి గుంటూరు జిల్లాను పరిమితం చేశారు.
చరిత్ర
[మార్చు]2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసారావుపేట లోక్సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో గుంటూరు జిల్లాకు పరిమితమైంది. ఈ లోక్సభ స్థానంలో 18 మండలాలు ఉన్నాయి.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | రాయపాటి సాంబశివరావు | 4,66,221 | 56.75 | +10.83 | |
తెలుగుదేశం పార్టీ | యంపరాల వెంకటేశ్వరరావు | 3,36,429 | 40.95 | -10.13 | |
బహుజన్ సమాజ్ పార్టీ | జూపల్లి హనుమంతరావు గౌడ్ | 9,375 | 1.14 | +1.14 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | గుండి వెంకటేశ్వర్లు | 5,444 | 0.66 | +0.66 | |
స్వతంత్ర రాజకీయ నాయకుడు | మువ్వా వెంకటరావు | 4,009 | 0.49 | +0.46 | |
మెజారిటీ | 1,29,792 | 15.80 | +20.96 | ||
మొత్తం పోలైన ఓట్లు | 8,21,478 | 70.06 | +5.95 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +10.83 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.[4] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు.[5] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | గల్లా జయదేవ్ | 618,417 | 49.68 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వల్లభనేని బాలశౌరి | 549,306 | 44.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | అబ్దుల్ వహిద్ షేక్ | 46,818 | 3.76 | ||
Jai Samaikyandhra Party | మల్లెల వెంకటరావు | 5,608 | 0.45 | ||
BSP | మల్లెల బాబూరావు | 4,223 | 0.34 | ||
AAP | కోట వెంకట భవానీ వీర వరప్రసాద్ | 2,344 | 0.19 | ||
Pyramid Party of India | అబ్బూరి కోటేశ్వరరావు | 1,636 | 0.13 | ||
NOTA | None of the Above | 7,596 | 0.61 | ||
మెజారిటీ | 69,111 | 5.56 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,244,926 | 79.19 | +2.66 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
మూలాలు
[మార్చు]- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
- ↑ EENADU (5 June 2024). "గుంటూరు, నరసరావుపేట లోక్సభ స్థానాల్లోనూ ఘన విజయం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Guntur Loksabha Election Result". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009