Jump to content

గౌరీమనోహరి రాగము

వికీపీడియా నుండి
(గౌరిమనోహరి నుండి దారిమార్పు చెందింది)
Gourimanohari scale with Shadjam at C

గౌరీమనోహరి లేదా గౌరీమనోహరి కర్ణాటక సంగీతంలో ఒక రాగం (దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క సంగీత స్థాయి). కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగంలో ఇది 23వ మేళకర్త రాగం. ముత్తుస్వామి దీక్షితార్ సంగీత పాఠశాల ప్రకారం 23వ మేళకర్త రాగం గౌరీవేలావళి.[1]

రాగ లక్షణాలు

[మార్చు]
S R2 G2 M1 P D2 N3 S
S N3 D2 P M1 G2 R2 S

ఈ రాగంలోని స్వరాలు : షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 59 వ మేళకర్త రాగమైన ధర్మవతి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు

[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • గురిలేక ఎటువంటి - త్యాగరాజు కీర్తన
  • సరస సమ మృదు పాద - స్వాతి తిరునాళ్
  • మైసూర్ వాసుదేవాచార్య రచించిన వరలక్ష్మీ నమోస్తుతే
  • స్వాతి తిరునాళ్ రామ వర్మ రచించిన సరస సమ మృదు పదం
  • కరూర్ దేవుడు అయ్యర్ రచించిన బ్రోవ సమయంమీద రామయ్య
  • శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ రచించిన గంగాధర శివ
  • పాపనాశం శివన్ రచించిన గౌరీ మనోహర

జన్య రాగాలు

[మార్చు]

గౌరీమనోహరి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్