ఝంకారధ్వని రాగం
స్వరూపం
(ఝంకారధ్వని నుండి దారిమార్పు చెందింది)
ఝంకారధ్వని రాగం కర్ణాటక సంగీతంలో ఒకరాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో 19వ రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ఝంకారభ్రమరి" రాగం అంటారు.[1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R2 G2 M1 P D1 N1 S')
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S' N1 D1 P M1 G2 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, శుద్ధ నిషాధము. ఇది 55వ మేళకర్త శ్యామలాంగి రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ఉదాహరణలు
[మార్చు]- ఫణిపతి శాయీ - త్యాగరాజు కీర్తన.
- వర్ణం తరుం - కోటీశ్వర అయ్యరు కీర్తన.
- ఝష కేతన పితరం - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ