బోస్నియా మరియు హెర్జెగొవీనా

వికీపీడియా నుండి
(బోస్నియా & హెర్జ్‌గొవీనియా నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Bosna i Hercegovina
Босна и Херцеговина
బోస్నియా మరియు హెర్జెగొవీనా
Flag of బోస్నియా మరియు హెర్జెగొవీనా బోస్నియా మరియు హెర్జెగొవీనా యొక్క చిహ్నం
జాతీయగీతం
Državna himna Bosne i Hercegovine
The National Anthem of Bosnia and Herzegovina
బోస్నియా మరియు హెర్జెగొవీనా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Coat of arms of Sarajevo.svg en:Sarajevo
43°52′N, 18°25′E
అధికార భాషలు Bosnian, Croatian, Serbian
జాతులు  48% Bosniak
37% Serb
14% Croat
ప్రజానామము Bosnian, Herzegovinian
ప్రభుత్వం Federal democratic republic
 -  High Representative Valentin Inzko4
 -  Presidency members Haris Silajdžić1
Željko Komšić2
Nebojša Radmanović3
 -  Chairman of the
Council of Ministers
en:Nikola Špirić
 -  Constitutional Court President en:Seada Palavrić
స్వాతంత్ర్యం
 -  Mentioned 9వ శతాబ్దం 
 -  Formed ఆగస్టు 29, 1189 
 -  Kingdom established అక్టోబరు 26, 1377 
 -  Independence lost
   to Ottoman Empire
1463 
 -  జాతీయ దినము నవంబరు 25, 1943 
 -  Independence from SFR Yugoslavia మార్చి 1, 1992 
 -  Recognized April 6, 1992 
జనాభా
 -  2007 అంచనా 3,981,239 (126th5)
 -  1991 జన గణన 4,377,053 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $30.419 billion[1] 
 -  తలసరి $7,618[1] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $19.358 billion[1] 
 -  తలసరి $4,848[1] 
Gini? (2007) 56.2 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.802 (high) (75th)
కరెన్సీ Convertible Mark (BAM)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ba
కాలింగ్ కోడ్ +387
1 Current presidency Chair; Serb.
2 Current presidency member; Croat.
3 Current presidency member; Bosniak.
4 Not a government member; The High Representative is an international civilian peace implementation overseer with full authority to dismiss elected and non-elected officials and inaugurate legislation
5 Rank based on 2007 UN estimate of en:de facto population.
Map Bih entities.png

బోస్నియా మరియు హెర్జెగొవీనా (ఆంగ్లం : Bosnia and Herzegovina) ఐరోపా ఖండంలోని బాల్కన్ ద్వీపకల్పంలో గల ఒక దేశం. సంక్షిప్తంగా B & H; బోస్నియాన్ మరియు సెర్బియన్: బోస్నా ఐ హెర్సగోవినా (BiH) / బోస్సా మరియు హెర్సెగోవినా (БиХ), క్రొయేషియన్: Bosna i Hercegovina (BiH) మూస: IPA-sh), కొన్నిసార్లు బోస్నియా-హెర్జెగోవినా అని పిలుస్తారు, మరియు తరచూ అనధికారికంగా బోస్నియా అని కూడా పిలుస్తారు. ఇది బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న ఆగ్నేయ ఐరోపాలో ఒక దేశం. ఇది దాదాపు ఒక భూపరివేష్టిత దేశం, కానీ దీని 26 కి.మీ. ఏడ్రియాటిక్ సముద్ర తీరపు కోస్తా వలన, భూపరివేష్టిత దేశంగా పరిగణింపబడదు. [2][3] బోస్నియా దేశపు దక్షిణాగ్రమున ఓచిన్న ప్రాంతం హెర్జెగొవీనా.

దేశరాజధాని మరియు అతిపెద్ద నగరం సారాజెవో. ఉత్తర సరిహద్దులో క్రొయేషియా మరియు పశ్చిమ మరియు తూర్పుసరిహద్దులో సెర్బియా, ఆగ్నేయసరిహద్దులో మాంటెనెగ్రో, దక్షిణసరిహద్దులో అడ్రియాటిక్ సముద్రం (సముద్ర తీరం సుమారు 20 కిలోమీటర్లు (12 మైళ్ళు) నీయు పట్టణాన్ని చుట్టుముట్టినట్లు ఉంటుంది). భౌగోళికంగా దేశంలోని మధ్య మరియు తూర్పు పర్వత ప్రాంతంగా ఉంటుంది. వాయువ్య ప్రాంతంలో ఇది మధ్యస్థంగా కొండ ప్రాంతంగా ఉంది. ఈశాన్య ప్రధాన భూభాగం విశాలమైన లోతట్టు ప్రాంతం మరియు వేసవికాల ఖండాంతర శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. వేసవికాలాలు మరియు చల్లని మరియు మంచుకురిసే శీతాకాలాలు ఉంటాయి. దేశంలోని దక్షిణ భాగంలో మధ్యధరా వాతావరణం మరియు సాదా స్థలాకృతి ఉంది.

బోస్నియా మరియు హెర్జెగోవినా అనేది నియోలిథిక్ యుగంలో శాశ్వత మానవ స్థిరనివాసంను కలిగి ఉన్న ప్రాంతం. ఈప్రాంతంలో ఆసమయంలో ఆతరువాత అనేక ఇల్లెరియన్ మరియు సెల్టిక్ నాగరికతలకు చెందిన ప్రజలు నివసించారు. సాంస్కృతికంగా, రాజకీయంగా మరియు సాంఘికంగా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. 6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్ధం వరకు ఈప్రాంతంలో మొదటిసారి స్లావిక్ ప్రజలు స్థిరపడ్డారు. 12 వ శతాబ్దంలో బోస్నియా బనాట్ స్థాపించబడింది. 14 వ శతాబ్దంలో బోస్నియా రాజ్యంగా రూపొందించబడి ఆ తరువాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది. ఓట్టమన్ పాలన 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 19 వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఒట్టోమన్లు ​​ఈ ప్రాంతానికి ఇస్లాంను తీసుకువచ్చారు. ముస్లిములు దేశంలోని సాంస్కృతిక మరియు సాంఘిక దృక్పథాన్ని చాలా వరకు మార్చారు. తరువాత ఆస్ట్రో-హంగేరియన్ రాచరికంలో విలీనం చేయబడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. అంతర్యుద్ధ కాలంలో బోస్నియా మరియు హెర్జెగోవినా యుగోస్లేవియా రాజ్యంలో భాగంగా మరియు రెండో ప్రపంచ యుద్ధం తరువాత కొత్తగా పూర్తి రిపబ్లిక్ హోదా ఇవ్వబడింది. యుగోస్లేవియా సామ్యవాద ఫెడరల్ రిపబ్లిక్ ఏర్పడింది. యుగోస్లేవియా రద్దు తరువాత రిపబ్లిక్ 1992 లో స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది బోస్నియా యుద్ధం తరువాత 1995 చివరి వరకు కొనసాగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నత అక్షరాస్యత ఆయుఃప్రమాణ అభివృద్ధి కోసం కృషిచేస్తుంది. ఈ ప్రాంతం చాలా తరచుగా సందర్శించే దేశాల్లో ఒకటిగా ఉంది. [4] 1995 మరియు 2020 మధ్య కాలంలో ప్రపంచంలోని మూడవ అత్యధిక పర్యాటక వృద్ధి శాతం సాధిస్తుందని అంచనా వేయబడింది. [5] బోస్నియా మరియు హెర్జెగోవినా సహజ పర్యావరణం మరియు సాంస్కృతిక వారసత్వానికి ఆరు చారిత్రాత్మక నాగరికతలు, వంటకాలు, శీతాకాల క్రీడలు, ప్రత్యేకమైన సంగీతం, వాస్తుశిల్పం మరియు ఉత్సవాలు ఈప్రాంత వారసత్వంగా ప్రసిద్ధి చెందాయి, వాటిలో కొన్ని దక్షిణ ఐరోపాలో అతిపెద్ద మరియు అత్యంత ప్రముఖమైనవిగా భావించబడుతున్నాయి. [6][7] రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా దేశం మూడు ప్రధాన జాతి సమూహాలకు అధికారికంగా రాజ్యాంగ ప్రజలకు కేంద్రంగా ఉంది. ఆ జాతులే బోస్సియక్స్, సెర్బియాస్ మరియు క్రోయాట్స్. ఈ మూడు జాతి సమూహాలలో బోస్సియక్స్ అతి పెద్ద సమూహంగా ఉన్నారు. బోస్నియా మరియు హెర్జెగోవినాకు చెందిన ఒక స్థానిక జాతి ఆంగ్లంలో బోస్నియన్‌గా గుర్తించబడుతుంది. హెర్జెగోవినియన్ మరియు బోస్సేన్ అనేవి జాతి వివక్షత కంటే కాకుండా ప్రాంతీయంగా నిర్వహించబడుతున్నాయి. హెర్జెగోవినా ప్రాంతం సరిగ్గా నిర్వచించిన సరిహద్దులు లేవు. అంతేకాకుండా 19 వ శతాబ్దం చివరలో ఆస్ట్రో-హంగేరియన్ ఆక్రమణ వరకు దేశం కేవలం "బోస్నియా" అని పిలువబడింది.[8]

బోస్నియా మరియు హెర్జెగోవినాలో ద్విసభలు కలిగిన శాసనసభ ఉంది. ప్రధానమైన ఒక్కొక జాతి సమూహానికి ముగ్గురు సభ్యులను ఎన్నికచేసి ప్రెసిడెన్సీ రూపొందించబడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో అధికారం అధికంగా వికేంద్రీకరించబడింది. రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ సంస్థలను కలిగి ఉంది. బోస్నియా మరియు హెర్జెగోవినా సమాఖ్య మరియు రిపబ్లిక్ సిప్రెస్కా, మూడవ ప్రాంతం, బ్రిస్కో జిల్లా, స్థానిక ప్రభుత్వంతో పాలించబడుతుంది. బోస్నియా మరియు హెర్జెగోవినా సమాఖ్య చాలా క్లిష్టమైనది మరియు ఇందులో 10 భూభాగాలు ఉన్నాయి. ఈ దేశం ఐరోపా సమాఖ్యకు సభ్యత్వం కోసం అభ్యర్థించింది.టాలిన్లో జరిగిన సమావేశంలో సభ్యత్వ కార్యాచరణ ప్రణాళిక తరువాత 2010 ఏప్రెల్ నుండి ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశంగా ఉంది.[9] అంతేకాకుండా 2002 ఏప్రెల్ నుండి యూరోప్ కౌన్సిల్ సభ్యదేశంగా మరియు మధ్యధరా యూనియన్ వ్యవస్థాపక సభ్యదేశంగా (2008 జూలైలో) స్థాపించబడింది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

బోస్నియా గురించి మొట్టమొదటి సంరక్షించబడిన చారిత్రక ఆధారాలలో 10 వ శతాబ్దం మధ్యలో (948 మరియు 952 మధ్య) "చిన్న భూమి" (గ్రీకులో) లో వివరించిన బైజాంటైన్ చక్రవర్తి ఏడవ కాన్స్టాన్టైన్‌చే వ్రాయబడిన ఒక రాజకీయ-భౌగోళిక పుస్తకంలో "బోసోనా" (వివోస్). [10] బోస్నియా నడిబొడ్డున ప్రవహిస్తున్న బోస్నా నది ద్వారా ఈప్రాంతానికి ఈ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు.భాషాశాస్త్రవేత్త అంటోన్ మేయర్ అభిప్రాయం ఆధారంగా బోస్నా అనే పేరు ఇల్లియన్యన్ "బాస్-ఎ-యాస్" నుండి తీసుకోబడింది), ఇది ప్రోటో-ఇండో-యురోపియన్ రూట్ "బోస్" లేదా "బోగ్" - "నడపబడే నీరు" నుండి పుట్టింది. ఇంగ్లీష్ మధ్యయుగవాద విలియం మిల్లెర్ అభిప్రామ్యం ఆధారంగా బోస్నియాలోని స్లావిక్ నివాసులు "లాటిన్ హోదాను స్వీకరించారు. తరువాత వారు తమ జాతిని బాసంటే బోస్నా మరియు తాన్ బోస్సియక్స్ " అని చెప్పుకున్నారు. [11]హెర్జెగోవినా ("హెర్జోగ్ అంటే భూమి అని అర్ధం") జర్మన్ పదం "డ్యూక్" నుండి [12] బోస్నియన్ మాగ్నట్ స్టీఫెన్ వుకిచిక్ కోసికా (బిరుదు) "హమ్ అండ్ హౌజ్ ఆఫ్ హంజ్ అండ్ ది కోస్ట్" (1448) నుండి ఉద్భవించింది. [13] గతంలో హమ్ జహమ్ల్జ్ ఉన్న ప్రజలు 14 వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో బోస్నేట్ చేత జయించబడ్డారు. 1830 లో స్వల్ప-కాలిక హెర్జెగోవినా ఐలెట్ ఏర్పడే వరకు ఈ ప్రాంతం ఒట్టోమన్స్ హెర్జెగోవినా (హెర్సెక్) సంజక్ ఆఫ్ హెర్జ్గోవినా (హర్స్క్) గా వ్యవహరించబడింది. ఇది 1850 లలో పునరుద్ధరించబడిన తరువాత ఈ సంస్థ సాధారణంగా బోస్నియా మరియు హెర్జెగోవినా అయింది.1992 లో స్వాతంత్ర్యం ప్రకటించబడింది. దేశం అధికారిక పేరు బోస్నియా మరియు హెర్జెగోవినా రిపబ్లిక్గా ఉండేది. కానీ 1995 డేటన్ ఒప్పందం తరువాత మరియు కొత్త రాజ్యాంగం ఇది అధికారికంగా బోస్నియా మరియు హెర్జెగోవినాకు మార్చబడింది.

భౌగోళికం[మార్చు]

బోస్నియా ఉత్తర మరియు పశ్చిమసరిహద్దులో క్రొయేషియా (932 km లేదా 579 మైళ్ళు), తూర్పుసరిహద్దులో సెర్బియా (302 కి.మీ. లేదా 188 mi) మరియు ఆగ్నేయ ప్రాంతానికి మాంటెనెగ్రో (225 కి.మీ లేదా 140 మై) నైరుతీ సరిహద్దులో ఉంది. ఇది నీమ్ నగరం చుట్టూ 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది.[2][14] ఇది 42 ° నుండి 46 ° ఉత్తర అక్షాంశం మరియు 15 ° నుండి 20 ° తూర్పురేఖాంశంలో ఉంది.

బోస్నియా మరియు హెర్జెగోవినా స్థలాకృతి మ్యాప్
బోస్నా నది, ఇలిడేజా

దేశం పేరు బోస్నియా మరియు హెర్జెగోవినా అనే రెండు ప్రాంతాల నుండి వచ్చింది. ఇది స్పష్టంగా నిర్వచించబడిన సరిహద్దుతో వేరు చేయబడింది. బోస్నియా ఉత్తర ప్రాంతాలను ఆక్రమించి మొత్తం దేశంలో సుమారు నాలుగు వంతుల ఆధిపత్యాన్ని కలిగి ఉంది. హెర్జెగోవినా దేశంలోని మిగిలిన దక్షిణ భాగాలను ఆక్రమించింది.

దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో కేంద్ర దినరిక్ ఆల్ప్స్ ఉన్నాయి. ఈశాన్య భాగాలు పన్నోనియన్ మైదానానికి చేరుకున్నాయి. దక్షిణాన అడ్రియాటిక్ సరిహద్దులో ఉంది. సాధారణంగా ఆగ్నేయ-వాయువ్య దిశలో దినారిక్ ఆల్ప్స్ ఉన్నాయి. దక్షిణాన అధిక ఎత్తును కలిగి ఉంటుంది. మోంటెనెగ్రిన్ సరిహద్దప్రాంతంలో ఉన్న 2,386 మీటర్లు (7,828.1 అడుగులు) మాగ్లిక్ శిఖరం దేశం అత్యధిక స్థానంగా గుర్తించబడుతుంది. ప్రధాన పర్వతాలలో కొజారా, గ్రెమేక్, వ్లాసిక్, చెర్ర్స్నిక, ప్రెంజ్, రోమానియా, జాహినిన, బ్జేలేస్నికా మరియు ట్రెస్కావికా ఉన్నాయి.

మొత్తంమీద బోస్నియా మరియు హెర్జెగోవినాలో దాదాపు 50% వరకు అటవీప్రాంతం ఉంది. చాలా అటవీ ప్రాంతాలు బోస్నియా మధ్య తూర్పు మరియు పశ్చిమ భాగాలలో ఉన్నాయి. హెర్జెగోవినాలో మధ్యధరా వాతావరణం ఉంటుంది. ఇది ప్రధానమైన కార్స్ట్ టోపోగ్రఫీ కలిగి ఉంది. నార్త బోస్నియా (పోసావినా) సావా నది వెంట చాలా సారవంతమైన వ్యవసాయ భూమిని కలిగి ఉంది. సంబంధిత ప్రాంతం భారీగా సాగుచేయబడుతుంది. ఈ వ్యవసాయ భూమి పొరుగు క్రొయేషియా మరియు సెర్బియా ప్రాంతాలలో పన్నోనియన్ మైదానంలో భాగంగా ఉంది. ఈ దేశం కేవలం 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) తీరాన్ని కలిగి ఉంది.హెర్జెగోవినా-నరేట్వా ఖండంలోని నీయు పట్టణం[2][15] క్రొయేషియన్ ద్వీపకల్పాలతో ఈ నగరం చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ అంతర్జాతీయ చట్టం ప్రకారం బోస్నియా మరియు హెర్జెగోవినా బాహ్య సముద్రంకు వెళ్ళే హక్కును కలిగి ఉంది.

సారాజెవో రాజధాని [16] మరియు అతిపెద్ద నగరం. [17][17] ఇతర ప్రధాన నగరాలు వాయువ్య ప్రాంతంలో బోసన్స్కా క్రాజానా, బిజెల్జినా మరియు తుస్లా, బోనియ మరియు మోస్టర్ల మధ్య భాగంలో ఈశాన్యంలో జెనికా మరియు దోబోజ్ హెర్జ్గోవినాలోని అతిపెద్ద నగరాలుగా పిలువబడేవి.బోస్నియా మరియు హెర్జెగోవినాలో ఏడు అతిపెద్ద నదులు ఉన్నాయి: [18]

 • సావా దేశంలోని అతి పెద్ద నదీ మరియు క్రొయేషియాతో దాని ఉత్తర సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది. ఇది దేశం భూభాగంలో 76% వ్యవసాజలాలను అందించి నల్లసముద్రంలో సంగమిస్తుంది.[18] బోస్నియా మరియు హెర్జెగోవినా డానుబే నదిని రక్షించే అంతర్జాతీయ కమిషన్ (ఐ.సి.పి.డి.ఆర్)లో సభ్యదేశంగా ఉంది.
 • సావా నదికి యునా, సనా మరియు వర్బాస్ ఉపనదులు ఉన్నాయి. అవి బోసాన్స్కా క్రాజిన వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి.

బోస్నా నది దాని పేరును దేశానికి ఇచ్చింది. ఇది దేశంలో అతి పొడవైన నదిగా గుర్తించబడుతుంది. ఇది ఉత్తర బోస్టయా సారాజెవో సమీపంలోని సావాలో లన్మించింది.

 • డ్రినా బోస్నియా తూర్పు భాగంలో ప్రవహిస్తుంది. చాలా భాగం ఇది సెర్బియాతో సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది.
 • నెరెత్వా హెర్జోగోవినా ప్రధాన నది మరియు దక్షిణాన ప్రవహిస్తున్న ఏకైక ప్రధాన నది ఇది అడ్రియాటిక్ సముద్రంలో సంగమిస్తుంది.

ఫైటోగ్యోగ్రాఫికల్ బోస్నియా మరియు హెర్జెగోవినా బోరేల్ కింగ్డంకు చెందినది మరియు మధ్యధరా ప్రాంతం అగ్రియారియల్ ప్రావిన్స్ అలైరియెయన్ ప్రావిన్స్ మరియు అద్రియాటిక్ ప్రావింస్‌లను పంచుకుంది. నేచర్ వరల్డ్ వైడ్ ఫండ్ ప్రకారం బోస్నియా మరియు హెర్జెగోవినా భూభాగాలను మూడు పర్యావరణ ప్రాంతాలుగా విభజించవచ్చు: పన్నోనియన్ మిశ్రమ అడవులు, దినారిక్ పర్వతాలు మిశ్రమ అడవులు మరియు ఇల్ల్రియన్ ఆకురాల్చు అడవులు.

View towards Neum, Bosnia and Herzegovina's 20 km (12 mi) of coastline access to the Adriatic Sea, summer 2010

మూలాలు[మార్చు]


 1. 1.0 1.1 1.2 1.3 "Bosnia and Herzegovina". International Monetary Fund. Retrieved 2008-10-09. 
 2. 2.0 2.1 2.2 Field Listing - Coastline, The World Factbook, 2006-08-22 ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "coastline" defined multiple times with different content
 3. Bosnia and Herzegovina: I: Introduction, Encarta, 2006
 4. "Lonely Planet's Bosnia and Herzegovina Tourism Profile". Lonely Planet. Retrieved 2016-02-12. 
 5. Bosnia's newfound tourism Archived 24 December 2007 at the Wayback Machine., Reuters.
 6. "About the Sarajevo Film Festival". Sarajevo Film Festival Official Website. Archived from the original on 4 November 2012. 
 7. "Inside Film's Guide to Film Festivals in". Inside Film. Retrieved 2016-02-12. 
 8. "The Language Situation in Post-Dayton Bosnia and Herzegovina". Toronto Slavic Quarterly. Archived from the original on 3 July 2012. 
 9. "Membership Action Plan (MAP)". www.nato.int. NATO. Archived from the original on 18 April 2015. Retrieved 6 April 2015. In April 2010, NATO Foreign Ministers at their meeting in Tallinn, reviewed progress in Bosnia and Herzegovina’s reform efforts and invited the country to join the Membership Action Plan. 
 10. Constantine VII Porphyrogenitus (1993). De Administrando Imperio (Moravcsik, Gyula ed.). Washington D.C.: Dumbarton Oaks Center for Byzantine Studies. pp. 153–155. 
 11. William Miller (1921). Essays on the Latin Orient. Cambridge. p. 464. 
 12. Malcolm 2002.
 13. Fine 1994, p. 578.
 14. "Bosnia and Herzegovina: I: Introduction". Encarta. 2006. Archived from the original on 31 October 2009. Retrieved 12 February 2009. 
 15. Bosnia-and-Herzegovina Neum britannica.com, britannica.com, 9 September 2015
 16. "Constitution of Bosnia and Herzegovina" (PDF). Retrieved 6 March 2015. 
 17. CIA.
 18. 18.0 18.1 Izet Čengić, Azra Čabaravdić. "Watershed Management in Mountain Regions in Bosnia and Herzegovina" (PDF). FAO. p. 113. Retrieved 16 June 2011. 

బయటి లింకులు[మార్చు]