వనస్పతి రాగము
స్వరూపం
(భానుమతి రాగం నుండి దారిమార్పు చెందింది)
వనస్పతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 4వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో, ఈ రాగాన్ని భానుమతి రాగం అంటారు.[1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M1 P D2 N2 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N2 D2 P M1 G1 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఇది 40 మేళకర్త నవనీతం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.
- పరియాచకమా - త్యాగరాజ స్వామి వారి కీర్తన
- బృహదాంబ - ముత్తుస్వామి దీక్షితార్
జన్య రాగాలు
[మార్చు]వనస్పతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రసాలి రాగం ఒకటి.