Jump to content

రాగవర్ధిని రాగం

వికీపీడియా నుండి
(రాగవర్ధని రాగము నుండి దారిమార్పు చెందింది)
రాగవర్ధని scale with shadjam at C

రాగవర్థిని భారతీయ సాంప్రదాయ సంగీతంలో రెండు అర్థాలను కలిగి ఉంది.

  • రాగాన్ని ఆలాపించడంలో ప్రధాన భాగం. గాయకుడు రాగాన్ని దశల వారీగా విస్తరణ చేస్తాడు. ప్రతి ప్రధాన నోట్ లేదా స్వరం వద్ద విరామం ఇస్తాడు.
  • రాగవర్ధని రాగము కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 32 వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని రాగచూడామణి అని అంటాడు. [2][3][4]

రాగ లక్షణాలు

[మార్చు]
  • ఆరోహణ: స రిగా మ ప ధని స
S R3 G3 M1 P D1 N2 S
  • అవరోహణ: సని ధ ప మగా రి స
S N2 D1 P M1 G3 R3 S

ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 68 వ మేళకర్త రాగమైన జ్యోతిస్వరూపిణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు

[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • రూపకలుషిత - రగణమఠ్య - వెంకటమఖి
  • శ్వేతగణపతిం వందే - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - ధ్రువ - సుబ్బరామ దీక్షితులు

మూలాలు

[మార్చు]
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  4. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras