Jump to content

తిరుమల భూవరాహ స్వామి ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 13°41′05.6″N 79°20′51.9″E / 13.684889°N 79.347750°E / 13.684889; 79.347750
వికీపీడియా నుండి
(వరాహస్వామి దేవాలయం నుండి దారిమార్పు చెందింది)
ఆది వరాహస్వామి ఆలయం, తిరుమల
స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామి (కుడి మూలన), తిరుమల
స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామి (కుడి మూలన), తిరుమల
తిరుమల భూవరాహ స్వామి ఆలయం is located in ఆంధ్రప్రదేశ్
తిరుమల భూవరాహ స్వామి ఆలయం
Location in Andhra Pradesh
భౌగోళికం
భౌగోళికాంశాలు13°41′05.6″N 79°20′51.9″E / 13.684889°N 79.347750°E / 13.684889; 79.347750
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
స్థలంతిరుమల
ఎత్తు853 మీ. (2,799 అ.)
సంస్కృతి
దైవంవరాహస్వామి (విష్ణువు), భూదేవి
ముఖ్యమైన పర్వాలువరాహ జయంతి, వైకుంఠ ఏకాదశి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ వాస్తుశైలి
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
దేవస్థాన కమిటీతిరుమల తిరుపతి దేవస్థానాలు

శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది.[1][2] ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు.[3] అందువల్లనే వేంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

వరాహస్వామి దేవాలయం తిరుమల

వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు.[4]తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.[2]

ఈ ఆలయాన్ని సా.శ. 1535 లో పెద్ద తిరుమలాచార్య పునరుద్ధరించాడు.[5]

పూజలు

[మార్చు]

వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు.[6] వరాహ జయంతిని కూడా జరుపుతారు.[1][2]

బయటి లింకులు

[మార్చు]

తి.తి.దే. సైటు నుండి వరాహస్వామి దేవాలయం గురించి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tirumala Brahmotsavams conclude with 'Chakrasnanam'". The Times of India. 1 September 2011. Retrieved 15 December 2017.
  2. 2.0 2.1 2.2 "'Varaha jayanti' today". The Hindu. 4 September 2016. Retrieved 15 December 2017.
  3. Balaji-Venkateshwara, Lord of Tirumala-Tirupati: An Introduction. Vakils, Feffer, and Simons. 2003.
  4. Flueckiger, Joyce Burkhalter (1 January 2015). Everyday Hinduism. p. 114. ISBN 97-8140-516-0216.
  5. Rao, V. Kameswara (1986). Temples in and Around Tirupati. V. Jayalakshmamma. Retrieved 15 February 2019.
  6. "Tirumala Brahmotsavams conclude with 'Chakrasnanam'". The Hindu. 28 October 2017. Retrieved 15 December 2017.