తిరుమల ఆర్జిత వసంతోత్సవం
తిరుమల ఆర్జిత వసంతోత్సవం తిరుమలలో జరిగే ఒక కార్యక్రమం. ఈ ఆర్జిత వసంతోత్సవానికి నిర్ణీత రుసుమును చెల్లించిన భక్తుల సమక్షంలో వసంతోత్సవం జరుగుతుంది. పాలు, పెరుగు, చందనం, పసుపు మున్నగు అభిషేక ద్రవ్యాలతో కన్నుల పండువగా జరిగే ఈ వసంతోత్సవం వైభవోత్సవ మండపంలో సాయంకాలం 3 - 4 గంటల మధ్యలో నిర్వహించబడుతుంది. ఇది వైభవోత్సవ మండపంలో జరుగుతుంది. [1]
విశేషాలు
[మార్చు]ఈ ఆర్జిత వసంతోత్సవం మలయప్ప స్వమి, శ్రీదేవి,భూదేవిలకు జరుగుతుంది. విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలను లేపనాలను పూస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదపండితులు పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం లను పఠిస్తారు. శ్రీదేవి, భూదేవి సహిత మలయప్ప స్వామికి నీరు, పాలు, పెరుగు, తేన, పసుపు, తో అభిషేకం చేస్తారు. చివరికి దేవతలకు గంధంతో లేపనం చేస్తారు. పూజ చివరలో నీటితో అభిషేకం చేస్తారు.[1]
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం తి.తి.దే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. సుప్రభాత సేవ, ఆర్జితసేవ, అర్చన, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించి టిక్కెట్లు ఆన్ లైన్లో లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. టిక్కెట్ల కోసం భక్తులు నాలుగు రోజుల ముందు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు అందజేస్తారు.[2]
తిరుమల భక్తులు ఇబ్బందులు పడకూడదని సాంకేతికతను ఉపయోగించుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ. తిరుమల భక్తుల కోసం "గోవింద యాప్" రూపొందించింది. గదుల దగ్గర్నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను ఈ యాప్‌లో పొందొచ్చు. గోవింద యాప్‌లో ఏ సేవలు పొందాలన్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.[3]
ప్రసారం
[మార్చు]శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఈ కార్యక్రమాన్ని ప్రతీ రోజూ సాయంకాలం 3 - 4 గంటల మధ్య శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 tirupatitirumalainfo (2016-11-27). "Arjitha Vasanthotsavam Seva". Tirupati Tirumala Info (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-02. Retrieved 2020-06-30.
- ↑ "తిరుమలలో మరో కుంభకోణం... ఆర్జిత సేవా టిక్కెట్లలో మాయ". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2020-07-01. Retrieved 2020-06-30.
- ↑ "Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ..." News18 Telugu. 2019-07-25. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
బాహ్య లంకెలు
[మార్చు]- "Tirumala Arjitha Vasanthotsavam". www.youtube.com. Retrieved 2020-06-30.