కర్ణాటక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి roboto: en:Karnataka estas artikolo elstara
చి యంత్రము కలుపుతున్నది: wuu:卡纳塔克邦
పంక్తి 89: పంక్తి 89:
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]


[[en:Karnataka]] {{Link FA|en}}
{{Link FA|en}}

[[en:Karnataka]]
[[hi:कर्नाटक]]
[[hi:कर्नाटक]]
[[kn:ಕರ್ನಾಟಕ]]
[[kn:ಕರ್ನಾಟಕ]]
పంక్తి 140: పంక్తి 142:
[[ur:کرناٹک]]
[[ur:کرناٹک]]
[[vi:Karnataka]]
[[vi:Karnataka]]
[[wuu:卡纳塔克邦]]
[[zh:卡纳塔克邦]]
[[zh:卡纳塔克邦]]

16:37, 30 జూలై 2008 నాటి కూర్పు

కర్ణాటక
Map of India with the location of కర్ణాటక highlighted.
Map of India with the location of కర్ణాటక highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
బెంగుళూరు
 - 12°35′N 77°21′E / 12.58°N 77.35°E / 12.58; 77.35
పెద్ద నగరం బెంగుళూరు
జనాభా (2004)
 - జనసాంద్రత
55,868,200 (9వది)
 - 290.98/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
192,000 చ.కి.మీ (8వది)
 - 27
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[కర్ణాటక |గవర్నరు
 - [[కర్ణాటక |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1956-11-01
 - టీ.ఎన్.చతుర్వేది
 - హెచ్.డీ.కుమారస్వామి
 - Bicameral (224 + 75)
అధికార బాష (లు) కన్నడ
పొడిపదం (ISO) IN-KA
వెబ్‌సైటు: www.karnataka.gov.in
దస్త్రం:Karnatakaseal.png

కర్ణాటక రాజముద్ర

కర్ణాటక ( కన్నడ లో ಕರ್ನಾಟಕ) భారతదేశములోని నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడినది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడినది. కర్ణాటక రాజధాని బెంగుళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్లారి మరియు బెల్గాం రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

భౌగోళికము

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రము, వాయువ్యమున గోవా రాష్ట్రము, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున ఆంధ్ర ప్రదేశ్ , తూర్పున మరియు ఆగ్నేయమున తమిళనాడు మరియు నైౠతిన కేరళ రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.

భౌగోళికముగా రాష్ట్రము మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడినది.

  • సన్నని తీర ప్రాంతము, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతము లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
  • పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతము ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతము.
  • దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతములోనే ఉన్నది. ప్రాంతము పొడిగా వర్షాభావముతో సెం-అరిద్ స్థాయిలో ఉన్నది.

కర్ణాటక యొక్క పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చినదని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.

రాష్ట్రములో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్ లో 1918 డిసెంబర్ 16 న నమోదైనది. [1]

జిల్లాలు

కర్ణాటక జిల్లాలు చూడండి భారతదేశ జిల్లాల జాబితా/కర్ణాటక

భాష

కర్ణాటక, భాష ఆధారితముగా యేర్పడిన రాష్ట్రము. అందుకే రాష్ట్రము యొక్క ఉనికిలో ఇది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్రములో అత్యధిక సంఖ్యాకులు అధికార బాష అయిన కన్నడను మాట్లాడతారు. తెలుగు,తమిళము, కొడవ, మరియు తులు ఇతర బాషలు.

ఆర్ధిక రంగము

కర్ణాటక భారతదేశములోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగుళూరు దేశములో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రము. భారతదేశములోని 90% బంగారము ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజము యొక్క వెలికితీత పనులు బళ్ళారి మరియు హోస్పేట జిల్లాలలో ముమ్మరముగా సాగుతున్నాయి.

చరిత్ర

బేలూరులో హొయసల శిల్పకళ.

కర్ణాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు మరియు 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసము చేయుచున్న కాలములో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు అయిన హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతములో నివసించుచుండేవాడు. అశోకుని కాలమునాటి శిలాశాసనములు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.

క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామీ చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలము (609 - 642)నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాదామీ చాళుక్యులు బాదామీ, ఐహోల్ మరియు పట్టడకళ్ లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. ప్రముఖ జైన పండితులు ఎందరో వీరి ఆస్థానములో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు మరియు వీరి సామంతులైన హళిబేడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంధమును రచించిన ప్రముఖ న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సాంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు మరియు బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించినారు మరియు ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా మరియు టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చినది.

మైసూరు ప్యాలెస్

భారత స్వాతంత్రానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారత దేశములో విలీనము చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రముగా అవతరించడముతో, పూర్వపు మహారాజు కొత్తగా యేర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనము తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వము 1975 వరకు భత్యము ఇచ్చినది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యలెస్ లోనే నివసిస్తున్నారు.

రాజ్యోత్సవ దినము (నవంబర్ 1, 1956) న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు మరియు బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్ణాటక అని మార్చబడింది.

పకృతి సిద్ధ ప్రదేశాలు

కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలము. అందులో ముఖ్యమైనవి

ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు అభయారణ్యాలు ఉన్నాయి.

ఇవికూడా చూడండి

బయటి లింకులు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=కర్ణాటక&oldid=326375" నుండి వెలికితీశారు